జావెద్ జాఫ్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జావేద్ జాఫ్రీ
జననం {{{birthdate}}}
పిల్లలు Mizaan Jaffrey ,Rayyan Jaffrey

జావెద్ జాఫ్రీ (హిందీ: जावेद जाफ़री, జననం: 4 డిసంబర్ 1963, ముంబై, ఇండియాలో) ఒక భారతీయ నటుడు మరియు హాస్యనటుడు. ఇతను పలు బాలీవుడ్ చలనచిత్రాలలో మరియు భారత టెలివిజన్ కార్యక్రమాలలో నటించాడు.భారత దేశములో బ్రేక్ డాన్స్ ను ప్రవేశపెట్టింది ఇతనే[ఆధారం చూపాలి].ఇతను సయ్యద్ జవహేర్ అలీ జాఫ్రీ (రంగస్థల పేరు: జగ్దీప్) అనే హాస్యనటుడు యొక్క కుమారుడు మరియు సోని టెలివిజన్ లో 'బూగీ వూగీ' అనే రియాలిటీ షో యొక్క సృష్టికర్త మరియు దర్శకుడు అయిన నవెద్ జాఫ్రీ యొక్క అన్నయ్య.

జావేద్ ముంబై లోని సెయింట్. తేరేసాస్ పాఠశాలలో చదివాడు. ముంబై లోని బాంద్రా ప్రాంతాములో నివాసం ఉంటున్నాడు. అతనికి ముగ్గురు సంతానం. అలవియా అనే కూతురు మరియు మిజాన్, అబ్బాస్ అనే ఇద్దరు కొడుకులు.

వృత్తి జీవితం[మార్చు]

బాంబే లోని పేట రౌడిలైన 'తపోరిస్' పాత్రను హిందీ చిత్రాలలో అద్బుదంగా హాస్యాప్రతంగా ప్రదర్శించాడు. ముఖ్యంగా బొంబాయి బాయ్స్ అనే చిత్రములో స్థానిక రౌడి పాత్రను పోషించి అందరి ప్రసంసలు పొందాడు. ఈ చిత్రములోనే ఐ యాం ముంభై అనే ప్రసిద్ధ పాట ఉంది. హిందీ చిత్రాలలో మరియు భారత టెలివిజన్ లలో విభిన్న పాత్రలు పోషించడమే కాకుండా, మాగి టొమాటో కెచప్ ప్రకటనలో అతని హాస్యాత్మక నటన మరియు పోగొ TVలో ప్రసారమైన తకేషిస్ కేసిల్ అనే ప్రసిద్ధ జపనీస్ గేం షోలో అతని వర్ణన చాలా ప్రసిద్ధి.

సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ లో బూగీ వూగీ అనే అత్యంత ప్రసిద్ధమైన నృత్య షోను అతను 1996 నుంచి నిర్మిస్తూ మరియు నటిస్తూ ఉన్నాడు.

చిత్ర పూర్వారంగం[మార్చు]

1985లో విడుదలైన మేరి జంగ్ అనే చిత్రం అతనికి ఒక ప్రతినాయుకుడు పాత్రలో నటించడానికి మరియు అతని నృత్య ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చింది. 1990లలో హాస్యంలో అతని నైపుణ్యాన్ని మరియు అతని అద్భుతమైన శక్తిని టెలివిజన్ ప్రదర్శించి అతని కీర్తిని మరింత పెంచింది. కేబుల్ టీవీ ప్రారంభం కావడం, ముఖ్యంగా చానల్ [V] మరియు ఆ చానల్ లో హాస్యానికి ఇవ్వబడిన స్వేచ్ఛ, అతని శైలిలో హాస్యాన్ని ప్రదర్శించడానికి అవకాశం కల్పించింది.

"వీడియోకాన్ ఫ్లాష్బ్యాక్" అనే కార్య్రమాన్ని తనదైన శైలిలో అతను నడిపించాడు. భావాలు చూపని అతను ముకభావాలు, ద్వంత భాషలలో పదాలను చమత్కారంగా వాడడం వలన అతనికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఒక ఉదాహరణ: హిందీలో యాదోన్ కి బరాత్ ని అతను "రొమ్ముల ఊరేహింపు" అని అనువాదం చేసాడు. అతని అనువాదం, "మెమరి" అనే పదాన్ని భారతదేశములో కొందరు ఏ విధంగా పలుకుతారు అనేదాన్ని బట్టి ఉంది. అదే కాక, ఆ చిత్రములో నటించిన జీనత్ అమన్ మరియు నీటు సింగ్ అనే ఇద్దరు ప్రసిద్ధ నటీమణులు పెద్ద రోమ్ములకు ప్రసిద్ధి. అందువలన "రొమ్ముల ఊరేహింపు" అనే అనువాదించాడు.

జేవెద్ జాఫ్రీ యొక్క మరొక ప్రసిద్ధ కార్యక్రమం, టైమెక్స్ టైంపాస్. దీంట్లో అతను పలు పాత్రల లాగ వేషాలు వేసేవాడు.

2006లో అతను తన మొదటి IIFA పురస్కారాన్ని సలాం నమస్తే చిత్రంలో ఉత్తమ హాస్య నటిగా అందుకునాడు. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ ఆసియాలో బూగీ వూగీ అనే నృత్య పోటీ కార్యక్రమాన్ని సోదరడు నవెద్ జేఫరి మరియు మిత్రుడు రవి బెహల్ లతో కలిసి నిర్వహిస్తున్నాడు.

నటించిన చిత్రాలు[మార్చు]

నటుడు[మార్చు]

 • లాఖాన్ (13 ఏప్రిల్ 1979)
 • మేరి జుంగ్ (1985) .... విక్రం థక్రాల్ aka వికి
 • 7 సాల్ బాద్ (1987) .... రవి
 • జునూన్ TV సెరీస్ (???
 • వో ఫిర్ ఆయేగీ (1988)
 • లష్కర్ (1989)
 • జవని జిందాబాద్ (1990) .... రవి వెర్మ
 • సామ & మీ (1991) .... జేవియర్
 • 100 డేస్ (1991) .... సునీల్
 • జీనా మర్నా తేరే సంగ్ (1992)
 • కర్మ యోధ (1992)
 • జాఖ్మి రూ (1993) .... శేఖర్
 • తీస్రా కౌన్? (1994) .... పంకజ్ నిగం/సంజయ్ చోప్రా
 • ఓ డార్లింగ్! ఎహీ హై ఇండియా (1995) .... ప్రిన్స్ అఫ్ డాన్
 • రాక్ డాన్సర్ (1995)
 • ఫైర్ (1996) .... జతిన్
 • దూన్డ్టే ఱెహ్ జాఒగే! (1998) .... సలీం
 • ఎర్త్ (1947)
 • హనుమాన్ (1998) .... అశోక్
 • గ్యాంగ్ (2000) .... గారి రోజారియో
 • అమన్ కే ఫరిష్టేయ్ (2003)
 • జజంతరం మమంతరం (2003) .... ఆదిత్య పండిట్
 • బూం (2003) .... బూం శంకర్ aka బూం బూం
 • సంధ్య (2003)
 • హమ్ హైన్ లజవాబ్ ఆనిమేటడ్ చిత్రం (2004) .... సంకిమన్ (స్వరం)
 • కాబూమ్ TV సెరీస్ (2005-2006) .... అతనే
 • సలాం నమస్తే (2005) .... జగ్గు {విశేష పాత్ర}
 • ది ఫారెస్ట్ (2006) .... అభిషేక్
 • త ర రమ్ పమ్ (2007) ... హారి
 • ధమాల్ (2007)... మానవ్ శ్రివస్తావ్
 • విక్టోరియా నం. 203 (2007)
 • షుర్య * (2007) .... మేజ్. ఆకాశ కపూర్
 • సింగ్ ఇస్ కిన్న్గ్ * (2008)....మికా సింగ్
 • రోడ్ సైడ్ రోమియో * (2008)...చార్లీ అన్న
 • సీసంస్ గ్రీటింగ్స్ (2009 చిత్రం) * (2009)
 • 8 x 10 తస్వీర్ (2009)...హపిబుల్లః "హప్పి" పాషా
 • కంబక్త్ ఇష్క్ (2009)...కేస్వని
 • పేయింగ్ గస్ట్స్ * (2009)....పరాగ్ మేల్వని
 • ది ఫారెస్ట్ (2009)...ఎబిషేక్
 • డాడీ కూల్ (2009)....కార్లోస్
 • 3 ఇడియట్స్ (2009)...రంచోద్దాస్ శామల్దాస్ చంచాద్ {విశేష పాత్ర}
 • సిటీ అఫ్ లైఫ్ (2010)...సురేష్ ఖాన్

నృత్య దర్శకుడిగా[మార్చు]

 • విక్టోరియా నం. 203 (2007)

అతిథిపాత్రలో[మార్చు]

 • మై ప్రేమ్ కి దివానీ హూ (2003) ...

సలాం నమస్తే (2005)

గాయకుడు గా[మార్చు]

 • విక్టోరియా నం. 203 (2007)

ప్రత్యేక పాత్రలో నటిగా[మార్చు]

 • 3 ఇడియట్స్ (2009)

భారత దేశములో అత్యదిక కాలంగా నడుస్తున్నబూగీ ఊగీ టివి నృత్య కార్యక్రమంలో అతను సాసవతంగా ఒక ప్రసిద్ధ న్యాయనిర్ణేత.

పురస్కారాలు మరియు నామినేషన్లు[మార్చు]

గెలిచిన IIFA పురస్కారాలు

 • 2006: IIFA ఉత్తమ హాస్యనటుడు పురస్కారం,సలాం నమస్తే కొరకు
 • 2006: ఫిలింఫేర్ పురస్కారం, ఉత్తమ హాస్య పాత్ర పోషించినందుకు: సలాం నమస్తే : ప్రతిపాదన [1]

సూచనలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]