జాహ్నవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎవరెస్ట్ పర్వతం, 1975 కి ముందు నైరుతి ముఖంలో ఎక్కే మార్గాలు

చిన్న వయసులో ఎత్తయిన శిఖరాలను అధిరోహించేందుకు సాధన చేస్తున్న బాలిక జాహ్నవి. ఈ బాలిక వయస్సు 12 సంవత్సరాలు. జాహ్నవి విశాఖపట్నానికి చెందిన వాసి. జాహ్నవి తండ్రి కృష్ణారావు, ఆయన వైద్యుడు, మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యుడు. జాహ్నవి ప్రపంచంలో ఎత్తయిన ఎవరెస్టు శిఖరంతో పాటు మరో ఆరు ఎత్తయిన శిఖరాలను అధిరోహించేందుకు కృషి చేస్తోంది. ప్రపంచంలోని ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించేందుకు జాహ్నవి చేస్తున్న సాధనలో భాగంగా ఆగస్టు 2న హిమాచల్‌ప్రదేశ్ లడఖ్ ప్రాంతంలోని లే మౌంటైన్ వద్ద 15 రోజుల శిక్షణ పొందనుంది. 20,080 అడుగుల ఎత్తైన లే మౌంటైన్ ఎక్కడంతో తన పలు ఎతైన శిఖరాధిరోహణల ప్రయత్నం ప్రారంభమవుతుంది. జాహ్నవి 10 సంవత్సరాల వయసులో తన స్నేహితులతో కలిసి మొదటిసారి అనంతగిరి కొండలు ఎక్కింది, తరువాత యూత్‌హాస్టల్ సహాయంతో హిమాలయాల్లో ఉన్న కొండలు ఎక్కింది. జాతీయ స్థాయిలో తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్‌లోని రూప్‌మాల్ (16 వేల అడుగులు) శిఖరాన్ని తన స్నేహితులతో కలిసి అధిరోహించింది.

అనుమతి[మార్చు]

ప్రపంచంలోని ఏడు ఎత్తయిన శిఖరాలను అధిరోహించేందుకు "మౌంట్ ఎవరెస్ట్ ట్రైనింగ్ అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్" నుంచి జాహ్నవి అనుమతి పొందింది. 2015 జనవరిలో ఎవరెస్ట్ అధిరోహించనున్న జాహ్నవి రోజూ 25 కిలోల బరువును మోస్తూ 5 గంటల పాటు సాధన చేస్తుంది.

అభిరుచులు[మార్చు]

జాహ్నవికి పెయింటింగ్, భరతనాట్యం అంటే ఇష్టం. ట్రైకింగ్‌పై చిన్నప్పటి నుంచే శిక్షణ పొందింది.

మూలాలు[మార్చు]

  • సాక్షి దినపత్రిక - 15-07-2014 - రాష్ట్రీయం 9వ పేజి

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జాహ్నవి&oldid=3878319" నుండి వెలికితీశారు