జింకు అయోడైడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జింకు అయోడైడ్
ZnI2structure.jpg
పేర్లు
IUPAC నామము
Zinc iodide
ఇతర పేర్లు
Zinc(II) iodide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [10139-47-6]
పబ్ కెమ్ 66278
SMILES I[Zn]I
ధర్మములు
ZnI2
మోలార్ ద్రవ్యరాశి 319.22 g/mol
స్వరూపం white solid
సాంద్రత 4.74 g/cm3
ద్రవీభవన స్థానం 446 °C (835 °F; 719 K)
బాష్పీభవన స్థానం 1,150 °C (2,100 °F; 1,420 K) decomposes
450 g/100mL (20 °C)
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Tetragonal, tI96
I41/acd, No. 142
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రము External MSDS
జ్వలన స్థానం {{{value}}}
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Cadmium iodide
Mercury(I) iodide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☑Y verify (what is ☑Y☒N ?)
Infobox references

జింకు అయోడైడ్ ఒక రసాయన సంయోగ పదార్థము.ఇది ఒక అకర్బన సమ్మేళన పదార్థం.జింకు/యశదం మరియు అయోడిన్ మూలకాల సమ్మేళనం వలన ఈ సంయోగ పదార్థం ఏర్పడినది.ఒక అణువు జింకు అయోడైడ్ లో ఒక పరమాణువు జింకు, రెండు పరమాణువుల అయోడిన్ ఉండును. జింకు అయోడైడ్ యొక్క రసాయన సాంకేతిక పదం ZnI2.

ఉత్పత్తి[మార్చు]

జింకు మరియు అయోడిన్ లను నేరుగా రిప్లక్సింగ్ ఈథర్ లో రసాయన చర్య నొందించడం ద్వారా ఉత్పత్తి చెయ్యవచ్చును[1].సజల ద్రావణ స్థితిలో జింకును అయోడిన్‌తో చర్య జరిపించడం వలన కూడా జింకు అయోడైడ్ సంయోగ పదార్థాన్ని ఉత్పత్తి చెయ్యవచ్చును[2].

Zn + I2→ ZnI2

భౌతిక లక్షణాలు[మార్చు]

జింకు అయోడైడ్ తెల్లని ఘనపదార్థం. ఇది ఆర్ద్రతాకర్షణ (hydroscopic) సంయోగపదార్థం.అందువలన అనార్ద్ర (anhydrous ) పదార్థం గాలిలోని చెమ్మను త్వరగా గ్రహించి ఆర్ద్ర రూపాన్ని సంతరించు కుంటుంది. జింకు అయోడైడ్ యొక్క అణుభారం 319.22 గ్రాములు/మోల్. సాధారణ ఉష్ణోగ్రత వద్ద జింకు అయోడైడ్ సాంద్రత 4.74 గ్రాములు/ సెం.మీ3[3]. జింకు అయోడైడ్ సంయోగ పదార్థం యొక్క ద్రవీభవన స్థానం 446 °C(835 °F;719 K).జింకు అయోడైడ్ సమ్మేళనపదార్థం బాష్పీభవన స్థానం 1,150 °C (2,100 °F; 1,420K).అయితే బాష్పీభవన ఉష్ణోగ్రత వద్ద ఈ రసాయన పదార్థం వియోగం చెందును.జింకు అయోడైడ్ నీటిలో కరుగుతుంది.20 °C వద్ద 100 మి.లీ నీటిలో 450 గ్రాముల జింకు అయోడైడ్ కరుగుతుంది. జింకు అయోడైడ్ యొక్క ఫ్లాష్ పాయింట్ 625 °C (1,157 °F; 898K) [4]

రసాయన చర్యలు[మార్చు]

1150 °C వద్ద జింకు అయోడైడ్ ఆవిరులు(vapours) జింకు మరియు అయోడిన్ గా విఘటన చెందును.

నిర్మాణం[మార్చు]

సజల ద్రవణులలో అష్ట భుజ సౌష్టవమున్న Zn(H2O)62+, [ZnI(H2O)5]+ ను, మరియు చతుర్భుజ సౌష్టవమున్న ZnI2(H2O)2, ZnI3(H2O) −and ZnI42−.లను గుర్తించారు.

వినియోగం[మార్చు]

  • ఇండస్ట్రీయల్ రేడియోగ్రఫిలో తరచుగా ఎక్సు-రే ఒపక్యు పెనేట్రాంట్(opaque penetrant) గా జింకు అయోడైడ్ ను ఉపయోగిస్తారు.
  • ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిలో ఒస్మియం టెట్రాక్సైడ్ తో కలిపి జింకు అయోడైడ్ ను స్టైన్(stain) గా ఉపయోగిస్తారు.

ఇవికూడా చూడండి[మార్చు]

అధారాలు/మూలాలు[మార్చు]

  1. Eagleson, M. (1994). Concise Encyclopedia Chemistry. Walter de Gruyter. ISBN 3-11-011451-8.
  2. DeMeo, S. (1995). "Synthesis and Decomposition of Zinc Iodide: Model Reactions for Investigating Chemical Change in the Introductory Laboratory". Journal of Chemical Education. 72 (9): 836. doi:10.1021/ed072p836.
  3. "Zinc iodide". sigmaaldrich.com. http://www.sigmaaldrich.com/catalog/product/aldrich/466360?lang=en&region=IN. Retrieved 17-02-2016. 
  4. Wells, A. F. (1984). Structural Inorganic Chemistry (5th సంపాదకులు.). Oxford Science Publications. ISBN 0-19-855370-6.