Jump to content

జితేంద్ర ముఖియా

వికీపీడియా నుండి
జితేంద్ర ముఖియా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జితేంద్ర కుమార్ ముఖియా
పుట్టిన తేదీ (1992-11-22) 1992 నవంబర్ 22 (వయసు: 33)
రౌతాహత్ , నేపాల్
ఎత్తు5 ft 7 in (1.70 m)
బ్యాటింగుకుడిచేతి
బౌలింగుకుడిచేతి వాటం మీడియం-ఫాస్ట్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి T20I (క్యాప్ 7)2014 మార్చి 16 - హాంకాంగ్ తో
చివరి T20I2022 ఫిబ్రవరి 22 - యుఎఇ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.65
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2014–2015నేపాల్ ఆర్మీ(నేషనల్ లీగ్)
2014–2014పంచకన్య తేజ్ (ఎన్.పి.ఎల్)
కెరీర్ గణాంకాలు
పోటీ టీ20ఐ లిస్ట్ ఎ టీ20
మ్యాచ్‌లు 4 3 15
చేసిన పరుగులు 0 4 6
బ్యాటింగు సగటు 2.00
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 0* 4 6*
వేసిన బంతులు 60 126 260
వికెట్లు 4 2 15
బౌలింగు సగటు 14.00 83.00 20.20
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/18 2/58 3/18
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 0/– 1/–
మూలం: క్రికెట్ ఆర్కైవ్, 2022 ఫిబ్రవరి 22

జితేంద్ర కుమార్ ముఖియా ( నేపాలీ: जितेन्द्र मुखिया ; జననం 22 నవంబర్ 1992) నేపాల్ దేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. ఆయన కుడిచేతి బ్యాట్స్‌మన్, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్.[1] జితేంద్ర నవంబర్ 2013లో డెన్మార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ తరపున అరంగేట్రం చేశాడు.[2]

జితేంద్ర కుమార్ ముఖియా నేషనల్ లీగ్‌లో నేపాల్ ఆర్మీ క్లబ్, నేపాల్ ప్రీమియర్ లీగ్ పంచకన్య తేజ్, ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్‌లో ఖాట్మండు జికింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు.

క్రీడా జీవితం

[మార్చు]

నేపాలీ జట్టులో అనుభవజ్ఞులైన సీమర్ల కంటే ముందు కొత్త ఫాస్ట్ బౌలింగ్ ప్రతిభ కోసం అన్వేషణలో కోచ్ పుబుడు దస్సనాయకే జితేంద్ర ముఖియాను మొదట ఎంపిక చేశాడు . ఆయనను ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ కప్ 2013 కోసం జట్టుతో ప్రాక్టీస్ చేయడానికి సింగపూర్‌కు పంపబడినప్పటికీ తుది జట్టులో ఎంపికలో కాలేదు. ఆయన దేశీయ సర్క్యూట్‌లో నిరంతరం మంచి ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా యూఏఈలో జరిగిన 2013 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫైయర్ కి జట్టులోకి ఎంపికయ్యాడు.

జితేంద్ర ముఖియా జాతీయ జట్టులోని అనేక మంది ఇతర ఆటగాళ్ల మాదిరిగా కాకుండా నేపాల్ తరఫున ఏ వయసు గ్రూపు జట్లలో భాగం కాలేదు, కానీ అతని విజయం దీనితోనే పరిమితం కాలేదు. తన దేశం తరపున తన మొదటి టోర్నమెంట్ ఆడుతూ మొత్తం 11 వికెట్లు పడగొట్టి జట్టులో స్ట్రైక్ బౌలర్‌గా తన సత్తా చాటాడు. ఆయన 2013 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫైయర్‌లో కీలకమైన మ్యాచ్‌లలో హాంకాంగ్, బెర్ముడాపై 3 చొప్పున, డెన్మార్క్ & కెన్యాపై 2 చొప్పున వికేతాలను తీశాడు.

జితేంద్ర ముఖియా 2014 ఐసిసి వరల్డ్ ట్వంటీ20లో 4 వికెట్లు తీసి, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 ముఖ్యమైన వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Jitendra Mukhiya". ESPNcricinfo.
  2. "3rd Match, Group B: Denmark v Nepal at Dubai (CA2), Nov 15, 2013 – Cricket Scorecard – ESPN Cricinfo". ESPNcricinfo.
  3. "9th Match, First Round Group A: Afghanistan v Nepal at Chittagong, Mar 20, 2014 – Cricket Scorecard – ESPN Cricinfo". ESPNcricinfo.