జిలానీ బానో
| జిలానీ బానో | |
|---|---|
| జననం | జిలానీ బానో 1936 జులై 14 |
| వృత్తి | రచయిత్రి |
| ప్రసిద్ధి | జిలానీ బానో |
| పదవి పేరు | ప్రముఖ ఉర్దూ కవయిత్రి |
| మతం | ఇస్లాం |
| తండ్రి | హైరత్ బదయూని |
జిలానీ బాను ప్రముఖ ఉర్దూ రచయిత్రి.[1][2][3][4] ఆమె 2001 లో భారతదేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీని అందుకున్నారు.[5] ఆమె 2016 ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు.[6]
జీవిత విశేషాలు
[మార్చు]
ఆమె జూలై 14 1936లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బదాయున్[4]లో ప్రముఖ ఉర్దూ రచయిత[2] అయిన హైరాత్ బదాయుని [7]కి జన్మించారు. పాఠశాల విద్య పూర్తి చెసిన తరువాత ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇస్లామిక్ స్టడీస్ లో విభాగాధిపతి, ప్రఖ్యాత కవి అయిన అన్వర్ మొయజ్జంను వివాహమాడి, హైదరాబాదుకు వచ్చారు. అచట ఇంటర్మీడియట్ విద్యనభ్యసించారు.[8] ఆమె తన విద్యను కొనసాగించి ఎం.ఎ. (ఉర్దూ) పూర్తిచేసారు.[3][4] తన ఎనిమిదేళ్ళ ప్రాయం నుండి రచనలు ప్రారంభించారు.[8] తన మొదటికథ "ఏక్ నజర్ ఇధర్ భీ" 1952లో ప్రచురితమైనది.[2] ఆమె రాసిన 22 పుస్తకాలు ప్రాముఖ్యం పొందాయి. వాటిలో "రోషిణి కే మీనార్", "ఐవాన్-ఎ-గజల్" కూడా ఉన్నాయి. ఆమె రాసిన పుస్తకాలలో ఆమె స్వీయ చరిత్ర "అఫ్జానా" కూడా ఉంది.[9] ఇతర రచయితలతో చేసిన చేసిన ఉత్తర ప్రత్యుత్తరాల సేకరణతో కూడిన నవల "దూర్ కీ ఆవాజే" అనే పుస్తకం కూడా వ్రాసింది.[2][8][10] హైదరాబాద్ పరిసరాలు, పరిస్థితుల నేపథ్యంతో ‘నర్సయ్యకీ బౌడీ’ అనే టెలీప్లే రాశారు. దాన్నే శ్యాం బెనెగళ్ ‘వెల్‌డన్ అబ్బా’ పేరుతో సినిమా తీశాడు.[8][11] ఆమె రాసిన అనేక పుస్తకాలు అనేక ఇతర భాషలలోకి అనువాదమయ్యాయి.[3][8][12][13][14]
ఆమెకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 1960 లోనూ, 1985 లో సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు లభించాయి.[2][3] ఆమెకు ఖౌమీ హాలి అవార్డు 1989 లో హర్యానా ఉర్దూ అకాడమీ నుండి లభించింది.[2][3] భారత ప్రభుత్వం ఆమెకు 2001లో పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి సత్కరించింది. 2014 సంవత్సరానికి త్రిపురనేని గోపీచంద్ జాతీయ పురస్కారాన్ని జిలానీబానోకు ప్రకటించారు.
ఆమె మహిళా హక్కులకోసం పాటుపడుతున్న ప్రభుత్వేతర సంస్థ "ఆస్మిత"కు చైర్ పర్సన్ గా పనిచేసారు.[8] ఆమె హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నివాసముంటున్నారు.[2][4]
మరణం
[మార్చు]జిలానీ బానో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 2026 మార్చి 1న తన స్వగృహంలో మరణించింది.[15][16]
రచనలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Profile on IMDB". IMDB. 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: January 12, 2015.
- 1 2 3 4 5 6 7 "Yalaburi". Yalaburi. 2014. the original నుండి 2016-03-04 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: January 12, 2015.
- 1 2 3 4 5 "Muse India". Muse India. 2014. the original నుండి 2016-03-04 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: January 12, 2015.
- 1 2 3 4 "Urdu Youth Forum". Urdu Youth Forum. 2014. the original నుండి 2016-05-15 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: January 12, 2015.
- ↑ "Padma Awards" (PDF). Padma Awards. 2014. the original (PDF) నుండి 2014-11-15 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: November 11, 2014.
- ↑ ఉర్దూ రచయిత్రి జిలానీ బానుకు ఎన్టీఆర్ పురస్కారం, namasthetelangaana, MON,MAY 16, 2016[permanent dead link]
- ↑ Rashīduddīn (1979). Allamah Hairat Badayuni : hayat aur adabi khidmat. Adabi Markaz. p. 125.
- 1 2 3 4 5 6 "The Hindu". The Hindu. 19 January 2012. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: January 12, 2015.
- ↑ "Autobiography". Urdu Youth Forum. 2014. the original నుండి 2016-03-18 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: January 12, 2015.
- ↑ "Listing on Amazon". Amazon. 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: January 12, 2015.
- ↑ "Well Done Abba". IMDB. 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: January 12, 2015.
- ↑ Jeelani Bano (2004). The Alien Home and Other Stories. 154: National Book Trust. ASIN B003DRJGAC.
{{cite book}}: CS1 maint: location (link) - ↑ Jeelani Bano (1988). A Hail of Stones. Sterling Publishers. ISBN 978-8120718371.
- ↑ "తెలంగాణ హృదయంలో ఓ మౌన గానం!". Andhrajyothy. 3 March 2026. the original నుండి 3 March 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 March 2026.
- ↑ "ప్రముఖ ఉర్దూ రచయిత్రి జిలానీ బానో కన్నుమూత". Andhrajyothy. 2 March 2026. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 March 2026.
- ↑ "Renowned Urdu writer Jeelani Bano passes away at 90". The Hindu. 4 March 2026. the original నుండి 4 March 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 March 2026.
ఇతర లింకులు
[మార్చు]- "Profile on IMDB". IMDB. 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: January 12, 2015.
- "Listing on Amazon". Amazon. 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: January 12, 2015.
- హైదరాబాద్ సంస్కృతి అంటే ప్రాణం
- Articles with dead external links from జూలై 2021
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- ఉర్దూ రచయిత్రులు
- 1936 జననాలు
- పద్మశ్రీ పురస్కార గ్రహీతలు
- భారతీయ రచయితలు
- ఉర్దూ కవులు
- భారతీయ కవయిత్రులు
- భారతీయ ముస్లింలు
- ఉత్తర ప్రదేశ్ వ్యక్తులు
- జీవిస్తున్న ప్రజలు