Jump to content

జిల్లేడు కుటుంబము

వికీపీడియా నుండి
జిల్లేడు మొక్క కుటుంబము
పూలతో జిల్లేడు చెట్టు

జిల్లేడు మొక్క బీడుగా నున్న అన్ని ప్రదేశములందును పెరుగు చున్నది. అది చిన్న గుబురు మొక్క ఆకుల పైనను కొమ్మల పైనను తెల్లని బూడిద గలదు. మొక్క నిండ పాలు గలవు.

ఆకులు
అభిముఖ చేరిక, లఘు పత్రములు, నిడివి చౌక పాకారము. సమాంచలము విషమ రేఖ పత్రములు. ఆకులు దట్టముగ నుండును.
పుష్ప మంజరం
కొమ్మ చివరల నుండి మధ్యారంభము మఝ్జరులులగు గుత్తులు పువ్వులు సరాళము. సంపూర్ణము. తెల్లగాగా నుండును.
బొమ్మ
1. కొమ్మ. 2. పుష్పము. 3. కిరీటము 4. అండ కోశము.
పుష్ప కోశము
సంయుక్తము 5 తమ్మెలు గలవు. నీచము.
దళవలయము
సంయుక్తము కాని మొదటి వరకు చీలి యున్నది. తమ్మెలైదు తమ్మెల లోపల వైపున మెత్తని రోమములు గలవు.

కింజల్కములు: ఇతర పుష్పములందున్నట్లు కింజల్కములు కాన రావు. కాని కిరీటము నంటి ఒకటి ఉంది. 5 చులుకల వంటివి కలసి యున్నవి. ఒక్కొక్క చిలుక, ఒక కింజల్కము నుండి వచ్చింది. ఇక వేరే కాడలు లేవు.

పుప్పొడి తిత్తులును మారి యున్నవి. ఆచిలుకల పైన గుండ్రముగ ఐదు పలకలది యొకటున్నది. దాని మీదనే పుప్పొడి తిత్తులు గలవు. ఒక పుప్పొడి తిత్తి యొక్క రెండు గదులు గలసి లేవు. పుప్పొడి ఇతర పుష్పములలో నున్నట్లు రేణువులవలె లేదు. అంతయు కలసి ఒక ముద్ద వలె నున్నది. అట్టి ముద్ద గది కొకటి యున్నది.

ఒక పుప్పొడి తిత్తి యొక్క ఒక గదిలోని ముద్ద ప్రక్కన వున్న పుప్పొడి తిత్తి గదిలోని ముద్దతో కలసి యున్నది. వీనిని రెండింటిని గలుపుచు నల్లని చుక్క వంటిది వాని మధ్యన గలదు. ఇట్టి ఐదు మూలలను ఐదు గలవు. ఈ పుష్పములో పుప్పొడి ముద్దలు క్రిందకు, వీనిని గలుపు నల్లని చుక్కలు పైకి ఉన్నాయి.

అండ కోశము
అండాశయము ఉచ్చము రెండు గలవు. ఇవి రెండును కిరీటములులో మధ్య మరుగుగు పడి ఉన్నాయి. కీలము ఒకటియే. కీలాగ్రము గుండ్రము. ఇది పుప్పొడి తిత్తుల మధ్య నున్నది. రెండు కాయలు కాచును. ఏకదారుణ ఫలము గింజలు చాల గలవు. అవి పలుచగ నుండును. మరియూ వాని చివర తెల్లరోమములు గలవు. వీని మూలమున గింజలు గాలికెగిరి దూర దూరముగ బోగలవు.
సుగంధి తీగె.
సుగంధి
తీగె హిందూస్థానమున విశేషముగ పెరుగు చున్నది. దీని నులు తీగెలు లేవు.
ఆకులు
అభిముఖ చేరిక. లఘు పత్రములు. అన్ని ఆకులు ఒక తీరున వుండవు. విషమ రేఖ పత్రము సమాంచలము. అడుగు వైపున మెత్తని రోమములు గలవు.
పుష్ప మంజరి
వృంతములు పొట్టివి. కణుపు సందుల నుండి మధ్యా రంభ మంజరులు పువ్వులు చిన్నవి. కొంచమాకు పచ్చగ నుండును., సరాళము సంపూర్ణము.
పుష్ప కోశము
అసంయుక్తము. 5. 5 రక్షక పత్రములు. కొన సన్నముగా వుండును. నీచము.
దళ వలయము
సంయుక్తము తమ్మెలు దట్టముగా వుండును. అవి అయిదు ఒక దాని నొకటి మొగ్గలో తాకు చుండును. రెండేసి తమ్మెల మధ్య దళవలయము నంటుకొని 5 పాలుసులు గలవు.
కింజల్కములు
కాడలు విడివిడిగానే ఉన్నాయి. కాని పుప్పొడి తిత్తులు గలసి యున్నవి. ఒక్కొక్క గది యందు నాలుగేసి జతల పుప్పొడి ముద్దలు గలవు.
అండ కోశము
అండాశయము ఉచ్చము. రెండు స్త్రీ పత్రములు రెండు విడిగా వుండును. కీలము ఒకటి. గింజలు చాల గలవు.

ఇది పెద్ద కుటుంబమే. ఈ కుటుంబములోని మొక్కలు మనదేశములో చాల గలవు. వీనిలో విస్తారము తీగెలే. అన్నిటిలోను పాలు గలవు. ఆకులు అభి ముఖ చేరిక, లఘు పత్రములు. సమాంచలము. పుష్పములు. మధ్యారంబ మంజరులు. 5 రక్షక పత్రములు, 5 ఆకర్షణ పత్రములు . ( ఇవి కలసి యుండును) 5 కింజల్కములు గలవు. సాధారణముగ పొలసులు వుండును. ఇవి విడి విడిగా నైనను, అన్నియు కలిసి యైనను దళ వలయము నంటి యైనను, కింజల్కముల నంటి యైనను వుండును. అండ కోశములో రెండు విడివిడిగ నున్న స్త్రీ పత్రములు గలవు. గింజలకు సాధారణముగ రోమములుండును.

జిల్లేడు మొక్కలలో రెండు రకములు గలవు. కొన్నిటి పువ్వులు తెల్లగానుండును. మరి కొ9న్నిటివి కొంచెము నీలి రంగుగానుండును. ఇదియే నల్ల జిల్లేడు అని అంటారు. ఈ మొక్క వాయు దేవునకు ప్రతి యనియు రుద్రునకు ప్రీతి యనియు కొందరును, వారి వారి దేవులకు ప్రీతి యని అరబ్బీలును, మహమ్మదీయులును దీని పుష్పములతో పూజ చేసే వారు. జిల్లేడు మొక్క ఉపయోగకర మగునదియే కాని దానిని అశ్రద్ధ చేస్తున్నారు.

ఈ మొక్కల నుండి మంచి నార తీయ వచ్చును. ఈ నారతో వలలు అల్లినచో చిర కాలము చీకి పోకుండ వుండును. నది మెరయుచును ఎత్తగా నుండుటచే చాల పనులకు పయోగించును. కొన్ని ద్రావకములలో బెట్టి శుభ్ర పర్చిన యెడల పట్టు వలెనే గనబడును. ఇన్ని యుపయోగములు వున్నను ఉపేక్ష చేయుటకు నార తీయుట కష్టగుటయే కారణము. మొక్కలను నీళ్ళలో నాన బెట్టితిమా అవి కుళ్ళి పోవును. కాన నాన బెట్టకుండ యంత్ర సహాయమున దీయ వలయును. కాని, దీనికి తగు యంత్రము లున్నట్లు గాన వచ్చుట లేదు. నార తీయగ మిగిలి పోవు మెత్తని పదార్థము కాగితములు చేయుటకు బాగుండును. జెల్లేడు దూది మిక్కిలి మృథువుగాను మెరయుచు పట్టు వలె వుండును. కాని నూలు పనికి వచ్చు చున్నట్లు ఇది పనికి రాదు. నూలు నేసి నంత తేలికగా దీనిని నేయ లేము. ఇది మిక్కిలి తేలికగను సన్నము గాను వుండుట చే దీనితో నెట్టి పనులైన చేయుట కష్టమే కాని కొన్ని కొన్ని చోట్ల ఓపికతో నేసినవి పట్టు వాని కంటే బాగుగ నున్నవి. ఈ దూదిని మనము పరుపులలోను, తల గడలలోను నదురుగ వాడుదుము. ఈ దూది పరుపులు మిక్కిలి మెత్తగా వుండును. ఇది చలువ చేయు నందురు.దీని పాల నుండి కూడా రబ్బరు వంటి పదార్థమొకటి చేయ వచ్చును గాని పాలను దీయుట కష్టము. ఈ మొక్క ఔష ధములో కూడా పనికి వచ్చును. వేళ్ళ బెరడు నుండి జిగట్ విరేచనములకు మందు చేయుదురు. ఆకులు కాచి నొప్పులకు పట్టు వేయుదురు. జిల్లేడు రసమూ దాల్చిన వేళ్ళు కాల్చిన బొగ్గు బాగుండును.

సుగంధి తీగెకు ముండ్లు గలవు. దీని వేరు ఔషధములలో వాడుదురు. అది సన్నముగను పొడవుగను వుండి సువాసన గల బెరడు కలిగి యుండును. వేళ్ళు దేహమునకు బలము కలుగ జేయును. వేళ్ళే గాక, ఎండుటాకులను రెమ్మలను కూడా వాడుదురు.

మంచి మాడు తీగె
దొంకల వద్ద మొలచును. ఆకులు మిక్కిలి దట్టముగా నుండును. పువ్వులు కొంచ మాకు పచ్చగను, కొంచె ఊదాగను నుండును. దీని కాడలను వేళ్ళను కూడా కొందరు వండుకొని తిందురు.
కొమ్ము మాడు
వేళ్ళు అంతకంటే లావుగ నుండును. వీని నంతగా దినరు.
తీగె జెముడు
డొంకల నల్లుకొని యుండును. దీనికి ఆకులు లేవు. దీని చిన్న తెల్లని పువ్వులు మంచి వాసన వేయును.
కాకిపాల తీగ
ఇసుక నేలలందు బాగుగ పెరుగును. కొమ్మల చివరల నున్న ఆకులు చిన్నవి. ఆకుల అడుగుపైపున రోమములు గలవు. వీనితో జిగట విరేచనములకు మందు చేయుదురు. వేరు బెరడు నరుగ దీసి ఇచ్చిన డోకులు వచ్చును.
పూలపాల తీగె
వర్షాకాలములో పుష్పించును. దీని ఆకులు కూడా చాల దట్టముగ నుండును.
దొడ్డి పాల తీగె పెద్దది
వర్షాకాలములో పుష్పించును. దీని ఆకులు కూడా చాల దట్టముగ నుండును.
దొడ్డి పాల తీగె పెద్దది
దీని ప్రకాండము లావుగ నుండును. పువ్వులాకు పచ్చగ నుండును.
పాలగర్జి తీగె
కొండ ప్రదేశములలో మొలచును. అకులు రెండు వైపుల రోమములు గలవు. ఈనెలు ఎరుపు. పువ్వులు ఎరుపు. తెలుపు, ఆకు పసుపు గలిసి యుండును.
పాల శిఖండి
పలు చోట్ల పెరుగును. లేత కొమ్మల మీద ఆకులు సన్నముగాను ముదురు వాని మీద వెడల్పుగాను వుండును. వేళ్ళు బెరడు పొడుము చేసి వెన్నతో నిచ్చిన ఉబ్బసపు దగ్గులు తగ్గు నందురు.
చిరుపాల తీగె
కాలువల గట్ల మీద పెరుగును. దీని ఆకులు పెద్దవి. పువ్వులు కొంచెము తెల్లగాను గులాబి రంగుగను అందముగా వుండును.

జటతీగె కూడా డొంకల మీద పెరుగును. ఆకులపై వత్తుగ రోమములు గలవు. దీని పువ్వులు మంచి వాసన వేయును.