జి.ఎం.సి.బాలయోగి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గంటి మోహనచంద్ర బాలయోగి
G.M.C BALAYOGI.jpg
జి.ఎం.సి.బాలయోగి
జననం జి.ఎం.సి.బాలయోగి
1945 అక్టోబర్ 1
తూర్పు గోదావరి జిల్లా యెదురులంక
మరణం 2002 మార్చి 3
కృష్ణా జిల్లా కువ్వడలంక
మరణ కారణము హెలికాప్టరు ప్రమాదం
సాధించిన విజయాలు పార్లమెంట్ సభ్యుడు
పదవీ కాలము మార్చి 24 - 2002 మార్చి 3 లోక్‌సభ స్పీకర్
భార్య / భర్త విజయకుమారి
పిల్లలు ముగ్గురు కుమార్తెలు
గంటి మోహనచంద్ర బాలయోగి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మరియు తొలి దళిత లోక్‌సభ స్పీకర్.

బాలయోగి 1945 అక్టోబర్ 1తూర్పు గోదావరి జిల్లా యెదురుగన్నయ్య మరియు సత్యమ్మ లంక గ్రామములో గంటి దంపతులకు ఒక దళిత రైతు కుటుంబములో జన్మించాడు. ఈయన ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుండి లా డిగ్రీలతో పట్టభద్రుడయ్యాడు. 1982 ఏప్రిల్ 16 న విజయకుమారిని వివాహము చేసుకున్నాడు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు.

2002 మార్చి 3 న భీమవరము నుండి తిరిగివస్తుండగా సాంకేతిక లోపము వలన హెలికాప్టరు ఒక కొబ్బరి చెట్టుకు తగిలి కృష్ణా జిల్లా కువ్వడలంక గ్రామము సమీపములోని ఒక చేపల చెరువులో కూలిపోయి, ఆ ప్రమాదములో బాలయోగి మరణించాడు.

నిర్వహించిన పదవులు[మార్చు]

వేమగిరి(తూ.గో.జిల్లా)లో జి.ఎం.సి.బాలయోగి విగ్రహం
  • 1987 - 1991 తూర్పు గోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షుడు
  • 1991 10వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.
  • 1996 - 1998 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు, ఉన్నత విద్యా శాఖా మంత్రి
  • 1998 12వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.
  • 1998 మార్చి 24 - 2002 మార్చి 3 లోక్‌సభ స్పీకర్
  • 1999 13వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

Preceded by
పి.ఎ.సంగ్మా
భారత లోక్‌సభ స్పీకర్లు
1998–2002
Succeeded by
మనోహర్ జోషి