జి.ఎన్.సాయిబాబా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి.ఎన్.సాయిబాబా
వృత్తిమానవ హక్కుల ఉద్యమకారుడు, ప్రొఫెసర్, రచయిత .
భాషతెలుగు, ఆంగ్లం, హిందీ
జాతీయతభారతీయుడు
పూర్వవిద్యార్థి
  • ఎస్.కె.బి.ఆర్ కళాశాల (బి.ఎ)
  • హైదరాబాదు విశ్వవిద్యాలయం (ఎం.ఎ)
  • ఢిల్లీ విశ్వవిద్యాలయం (పి.హెచ్.డి)
జీవిత భాగస్వామివసంతకుమారి [1][2]

జి.ఎన్. సాయిబాబా భారతీయ పండితుడు, రచయిత, మానవ హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్. అతను డిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆనంద్ కళాశాలలో ఇంగ్లిష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు.[3]

జీవిత విశేషాలు[మార్చు]

గోకరకొండ నాగ సాయిబాబా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అమలాపురంలో పేద రైతు కుటుంబంలో జన్మించాడు. తన భార్య తెలిపిన విషయాల ప్రకారం వారి గృహానికి విద్యుత్ సౌకర్యం కూడా లేదు.[4] ఐదేళ్ల వయసులోనే పోలియో సోకి రెండు కాళ్లూ పూర్తిగా దెబ్బతిన్నాయి. స్థానికంగా విద్యాభ్యాసం చేసిన తరువాత అమలాపురం లోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేసాడు. [5] హైదరాబాదు విశ్వవిద్యాలయం నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చేసాడు. [6] అతను సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ లో కూడా విద్యాభ్యాసం పూర్తి చేసాడు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆనంద్ కళాశాలలో ఆంగ్ల విభాగంలో అధ్యాపకునిగా చేరాడు. [7] 2013లో పీహెచ్‌డీ పూర్తిచేశాడు. [8]

ఉద్యమ జీవితం[మార్చు]

అమలాపురంలో గ్రాడ్యుయేషన్ చేసున్న కాలంలోనే అతను వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యాడు. ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్ (ఏఐఆర్‌పీఎఫ్) లో చేరాడు. 1992లో హైదరాబాదు విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు ఆ ఫోరమ్ ఆంధ్రప్రదేశ్ కమిటీకి కార్యదర్శి అయ్యాడు. 1995 నాటికి ఆ సంస్థకు ఇండియా ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఆ తర్వాత అతను ఆర్‌డీఎఫ్ అనే సంస్థలో పని చేశాడు. పోలీసులు, హోంశాఖ అధికారుల ప్రకారం అతను పనిచేసిన సంస్థలన్నీ మావోయిస్టు అనుబంధ సంస్థలు. అతనికి మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయనే అరోపణతో 2014లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసారు. ఈ కేసు విచారణలో కోర్టు అతనికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అతను నాగ్‌పూర్ జైలులోని ’అండా సెల్‌‘లో ఏకాంతచెరలో ఉన్నాడు.

మావోయిస్టులతో సంబంధమున్న కేసులో ముంబాయి హైకోర్టు మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాను నిర్దోషిగా తీర్పు ఇవ్వడంతో ఆయన 2024 మార్చి 8న నాగ్‌పూర్‌ జైలు నుంచి ముంబాయి హైకోర్టు తీర్పు ఇచ్చిన రెండు రోజుల అనంతరం విడుదలయ్యాడు.[9][10]

మూలాలు[మార్చు]

  1. "Five years on, no relief for jailed Delhi University professor Saibaba". The Hindu (in ఇంగ్లీష్). 2019-05-09. Retrieved 2020-12-19.
  2. "Court relied on deposition of semi-literate witness: Saibaba's wife". The Hindu (in ఇంగ్లీష్). 2017-04-04. Retrieved 2020-12-19.
  3. "GN Saibaba: The revolutionary in Delhi University". Times of India (in ఇంగ్లీష్). 2013-09-23. Retrieved 2020-12-19.
  4. "GN Saibaba: The revolutionary in Delhi University". Times of India (in ఇంగ్లీష్). 2013-09-23. Retrieved 2020-12-19.
  5. "GN Saibaba: The revolutionary in Delhi University". Times of India (in ఇంగ్లీష్). 2013-09-23. Retrieved 2020-12-19.
  6. "Pages smuggled out of Nagpur's central prison to be published as Saibaba's latest book". The New Indian Express (in ఇంగ్లీష్). 2016-05-26. Retrieved 2020-12-19.
  7. "Delhi University professor Saibaba, arrested for Maoist links, gets bail". India Today (in ఇంగ్లీష్). 2016-04-04. Retrieved 2020-12-19.
  8. "ఈ చలికాలం దాటి బతకలేనేమో!". BBC News తెలుగు. Retrieved 2020-12-19.
  9. Andhrajyothy (8 March 2024). "స్వేచ్ఛా ప్రపంచంలోకి సాయిబాబ". Archived from the original on 9 March 2024. Retrieved 9 March 2024.
  10. BBC News తెలుగు (5 March 2024). "ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన బాంబే హైకోర్టు, ఈ కేసు పూర్తి వివరాలివీ..." Archived from the original on 9 March 2024. Retrieved 9 March 2024.