జి.ఎస్.ధిల్లాన్
Gurdial Singh Dhillon | |||
పదవీ కాలం 12 May 1986 – 14 February 1988[1] | |||
ప్రధాన మంత్రి | Rajiv Gandhi | ||
---|---|---|---|
పదవీ కాలం 8 August 1969 – 19 March 1971[2] | |||
[[డిప్యూటీ 5th Speaker of Lok Sabha|డిప్యూటీ]] | G.G. Swell | ||
ముందు | Neelam Sanjiva Reddy | ||
తరువాత | himself | ||
పదవీ కాలం 22 March 1971 – 1 December 1975[2] | |||
డిప్యూటీ | G.G. Swell | ||
ముందు | himself | ||
తరువాత | Bali Ram Bhagat | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | Amritsar, Punjab, British India | 1915 ఆగస్టు 6||
మరణం | 1992 మార్చి 23 New Delhi, India | (వయసు 76)||
రాజకీయ పార్టీ | Indian National Congress | ||
పూర్వ విద్యార్థి | Punjab University Law College | ||
వృత్తి | Politician Diplomat |
గుర్డియాల్ సింగ్ ధిల్లాన్, (1915 ఆగష్టు 6 - 1992 మార్చి 23) భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన భారత రాజకీయ నాయకుడు. అతను రెండుసార్లు లోక్‌సభ స్పీకర్‌గా, ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడిగా (1973–76) [3] కెనడాలో భారతీయ హైకమిషనర్‌గా (1980–82) పనిచేశాడు.
జీవితం తొలిదశ
[మార్చు]1915 ఆగష్టు 6న, గుర్డియాల్ సింగ్ ధిల్లాన్ పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరానికి పశ్చిమాన 20 కి.మీ. దూరంలో ఉన్న పంజ్వార్‌లో ధిల్లాన్ జాట్ కుటుంబంలో జన్మించాడు. అతను భంగి మిస్ల్ పాలకుల వారసులకు చెందివాడు. అతను చదివింది అమృత్‌సర్ ఖల్సా కళాశాల, లాహోర్ లోని ప్రభుత్వ కళాశాల నుంచి న్యాయ పట్టభద్రులుగా పట్టాపొందాడు. న్యాయవిద్యకు ముందు పంజాబ్ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల, లాహోర్ లోచదివాడు. [4] అతను 1947లో హర్సే చిన మోఘా మోర్చా తిరుగుబాటులో క్రియాశీల పాత్ర పోషించాడు
రాజకీయ జీవితం
[మార్చు]ధిల్లాన్ పంజాబ్ శాసనసభలో సభ్యుడు (1952-1967). అతను పంజాబ్ శాసనసభ ఉప సభాపతిగా 1952 నుండి 1954 వరకు, సభాపతిగా 1954 నుండి 1962 వరకు వ్యవహరించాడు. [5] 1967లో అతను టార్న్ తరణ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభకు తొలిసారిగా ఎన్నికయ్యాడు. [6] అతను 1985లో ఫిరోజ్‌పూర్ నుండి ఎన్నికయ్యాడు [4]
ధిల్లాన్ రెండు పర్యాయాలు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు (1969–71, 1971–75) భారత ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు (1986–1988).[8]
ఆయన పార్లమెంటులో గడిపిన సమయానికి సంబంధించి, లోక్‌సభ వెబ్‌సైట్‌లో ఆయన జీవిత చరిత్ర ఈ క్రింది విధంగా వ్యక్తీకరించబడింది:
రాజీలేని సూత్రాల వ్యక్తి, అతను పార్లమెంటు సంస్థను ప్రజాస్వామ్య దేవాలయంగా భావించాడు.సభ, దాని సంప్రదాయాలు, సమావేశాలపై గొప్ప గౌరవాన్ని కలిగి ఉన్నాడు. సభ మానసిక స్థితిని త్వరగా అంచనా వేయగల అరుదైన సామర్థ్యం, ఆచరణాత్మకమైన విధానం లోక్‌సభ స్పీకర్ కార్యాలయం గురుతర బాధ్యతను గౌరవప్రదంగా నిర్వహించడంలో అతనికి సహాయపడింది. ఇంటర్-పార్లమెంటరీ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా ధిల్లాన్ ఎన్నిక కావడం తనకు, భారత ప్రజలకు, పార్లమెంటుకు కూడా గొప్ప గౌరవం.[1]
కర్తార్ సింగ్‌తో కలిసి, అతను 1970ల ప్రారంభంలో 'స్టోరీస్ ఫ్రమ్ సిక్కు హిస్టరీ' పేరుతో ఎనిమిది పిల్లల పుస్తకాల శ్రేణిని రచించాడు. [7]గుండె బైపాస్ సర్జరీ చేయించుకున్న ధిల్లాన్ 1992 మార్చి 23న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, న్యూ ఢిల్లీలో గుండెపోటుతో మరణించాడు. [8]
ఇది కూడ చూడు
[మార్చు]- ↑ The Office of Speaker Lok Sabha
- ↑ 2.0 2.1 The Office of Speaker Lok Sabha
- ↑ International Organizations. worldstatesmen.org.
- ↑ 4.0 4.1 "Biography of G.S Dhillon". Winentrance (in అమెరికన్ ఇంగ్లీష్). 2011-03-19. Archived from the original on 2020-01-26. Retrieved 2020-01-26.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-07-28. Retrieved 2021-11-12.
- ↑ http://www.eci.gov.in/SR_KeyHighLights/LS_1967/Vol_I_LS_67.pdf
- ↑ Stories from Sikh History - Kartar Singh, Gurdial S. Dhillon - Google Boeken
- ↑ http://parliamentofindia.nic.in/lsdeb/ls10/ses3/0124039201.htm