జి.కిషన్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంగపురం కిషన్ రెడ్డి
జి.కిషన్ రెడ్డి


కేంద్ర సహాయక హోంమంత్రి
పదవీ కాలము
2019 మే 30 – ప్రస్తుతం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ
పదవీ కాలము
మే 2019 – ప్రస్తుతం
ముందు బండారు దత్తాత్రేయ
నియోజకవర్గం సికింద్రాబాదు

శాసనసభ్యుడు
పదవీ కాలము
2004 – 2009
ముందు శ్రీకృష్ణ యాదవ్
తరువాత లేరు
నియోజకవర్గం హిమాయత్ నగర్

శాసనసభ్యుడు
పదవీ కాలము
2009 – 2019
ముందు లేరు
తరువాత కాలేరు వెంకటేశ్‌
నియోజకవర్గం అంబర్‌పేట

అధ్యక్షుడు, భారతీయ జనతా యువమోర్చా
పదవీ కాలము
2002 – 2005
ముందు శివరాజ్ సింగ్ చౌహాన్
తరువాత ధర్మేంద్ర ప్రదాన్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-05-15) 1964 మే 15 (వయస్సు: 55  సంవత్సరాలు)
తిమ్మాపూర్ గ్రామం, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి కావ్య
సంతానము వైష్ణవి, తన్మయి రెడ్డి
నివాసము హైదరాబాదు
మతం హిందూ
వెబ్‌సైటు Official site

జి.కిషన్ రెడ్డి (G.Kishan Reddy) భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత. . 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మార్చి 6, 2010న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[1] 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2009లో అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికై [2] వరుసగా రెండోపర్యాయం రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు. 2012 జనవరి 19న మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజులపాటు తెలంగాణ ప్రాతంలో కొనసాగే భారతీయ జనతా పార్టీ పోరుయాత్ర ప్రారంభించాడు. 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

1964, మే 15న జి.స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో కిషన్ రెడ్డి జన్మించాడు. టూల్ డిజైనింగ్‌లో డిప్లోమా చేసిన కిషన్ రెడ్డి 1995లో కావ్యను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం (వైష్ణవి, తన్మయ్).[3]

రాజకీయ జీవితం[మార్చు]

1977లో జనతాపార్టీలో యువనాయకుడిగా ప్రవేశించి, 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున తన సేవలు అందిస్తున్నాడు. 1980లోనే రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్ పదవి చేపట్టాడు. 1983 నాటికి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి, 1984లో ప్రధాన కార్యదర్శి, 1985లో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. 1992లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శి, 1992లో ఉపాధ్యక్షపదవి, 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను పొందినాడు. 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవులను పొందినాడు. 2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టగా, 2009 ఎన్నికలలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 27000 పైగా ఓట్ల మెజారిటీతో [4] గెలుపొంది వరుసగా రెండోసారి శాసనసభలో ప్రవేశించాడు. శాసనసభలో భారతీయ జనతా పార్టీ పక్షనాయకుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. 2010, మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై బండారు దత్తాత్రేయ నుండి పార్టీ పగ్గాలు స్వీకరించాడు.2014 ఎన్నికలలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 62598 ఓట్ల మెజారిటీతో వరుసగా మూదొసారి శాసనసభలో ప్రవేశించాడు.అ తారువాత 2014 లో మరల తెలంగన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన్నరు.

భారతీయ జనతా పార్టీ పోరుయాత్ర[మార్చు]

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున జీ.కిషన్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండలం కృష్ణా గ్రామం నుంచి జనవరి 19, 2012న భారతీయ జనతా పార్టీ పోరుయాత్ర ప్రారంభించాడు.[5] ఈ యాత్ర 22 రోజులపాటు తెలంగాణ జిల్లాల్లో కొనసాగీంది[6] పోరుయాత్ర ప్రారంభం రోజు కృష్ణా గ్రామంలో జరిగిన సమావేశానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరి హాజరయ్యాడు.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 07-03-2010
  2. సూర్య దినపత్రిక, తేది 17-05-2009
  3. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2009-08-08 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-03-07. Cite web requires |website= (help)
  4. సాక్షి దినపత్రిక, తేది 17-05-2009
  5. ఈనాడు దినపత్రిక, తేది 20-01-2010
  6. సాక్షి దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 20-01-2012