జి.వి.రాఘవులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి.వి.రాఘవులు

జి.వి.రాఘవులు సీపీఐ (ఎంఎల్) ప్రజాశక్తి జాతీయ కార్యదర్శి, విప్లవోద్యమ నాయకుడు.[1][2][3]

జీవిత విశేషాలు[మార్చు]

తెలంగాణ సాయుధ పోరాటంలో, ఆంధ్ర మహాసభ ఉద్యమంలో పాల్గొన్నారు. 1946లో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ఆయన. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరారు. తెలంగాణ సాయుధ పోరాటంపై పాలకవర్గాలు ఉక్కపాదం మోపినప్పుడు 1950లో అజ్ఞాతంలోకి వెళ్లారు. మద్రాసు కుట్ర కేసును ఎదుర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీల చీలిక - సమయంలో చండ్ర పుల్లారెడ్డి నేతృత్వంలోని విప్లవ పార్టీ వైపు మొగుచూపారు. జనశక్తి పార్టీలో పలుపదవులు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల గిరిజన ప్రాంతాల్లో మైదాన ప్రాంతంలో భూస్వాముల - దౌర్జన్యాలు, పేదలకు భూపంపిణీ, ఇళ్ల స్థలాలు 1/10 యాక్ట్ అమలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. 2015లో ఏడాది విప్లవ పార్టీలను ఏకంచేసే దిశగా ప్లీనరీ నిర్వహించి సీపీ ఐంఎల్ ప్రజాశక్తి పార్టీని ఏర్పాటు చేశారు.[1]

ఆయన పూర్వపు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రితో సీపీఐ (ఎంఎల్) ప్రజాశక్తి పార్టీ తరపున చర్చలలో పాల్గొన్నారు.[4]

మరణం[మార్చు]

ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు శివారు ఉప్పరగూడెంలోని తన స్వగృహంలో 2016, జూన్ 7న మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగురు కుమార్తెలు ఉన్నారు. పదేళ్ల కిందటే భార్య శకుంతల మరణించారు. ఏడు దశాబ్దాల పాటు ఆయన కమ్యూనిస్టు పార్టీల్లో పనిచేశారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక జూన్ 8, 2015, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్, 43వ పేజీ
  2. భూములు లాక్కుంటే ఊరుకోం వామపక్షాల హెచ్చరిక[permanent dead link]
  3. Janasakti calls for united movement
  4. Janashakti faction emissaries

ఇతర లింకులు[మార్చు]