జి.వి. పూర్ణచందు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరైన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
| డా|| జి వి పూర్ణచందు Dr. G V Purnachand | |
|---|---|
డా|| జి వి పూర్ణచందు | |
| జననం | గంగరాజు వెంకట పూర్ణచందు 23-04-1957 కృష్ణా జిల్లా,కంకిపాడు |
| నివాస ప్రాంతం | విజయవాడ |
| వృత్తి | ఆయుర్వేద వైద్యం |
| వెబ్‌సైటు | |
| http://drgvpurnachand.blogspot.com | |
డా. జి.వి. పూర్ణచందు. విజయవాడ వాస్తవ్యులు, ఆయుర్వేద వైద్యులు, సాహితీవేత్త, పరిశోధకుడు, 156 గ్రంథాల రచయిత.
బాల్యం
[మార్చు]డా. జి.వి. పూర్ణచందు 23 ఏప్రిల్ 1957 ఏప్రియల్ 23 న కృష్ణా జిల్లా కంకిపాడులో పుట్టారు. సత్యప్రసూన, జి.వి.జి.కె. చంద్రమౌళీశ్వరరావులు వీరి తల్లిదండ్రులు.
చదువు
[మార్చు]కృష్ణాజిల్లాలోని వివిధ గ్రామాలలో ఉన్నత పాఠశాల విద్య, విజయవాడ శాతవాహన కళాశాలలో (1973-75) ఇంటర్మీడియేట్, విజయవాడ డా॥నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో B.A.M.S. డిగ్రీ చదివారు.
వృత్తి, ప్రవృత్తి
[మార్చు]- సుశ్రుత ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, బకింగ్`హాం పేట పోష్టాఫీసు ఎదురు, విజయవాడ-520 002 కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ఫిజీషియన్ గా పనిచేస్తున్నారు.
- కృష్ణాజిల్లా రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శి 1983 నుండి పనిచేస్తున్నారు.[1]
- ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి
- నేషనల్ మెడికల్ అసోషియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు,
- తన్నీరు కృష్ణమూర్తి విద్యాధర లయన్స్ ఐ హాస్పిటల్ వ్యవస్థాపక చైర్మన్
సాహితీ జీవితంలో ముఖ్యాంశాలు
[మార్చు]- డా. జి. వి. పూర్ణచందు తెలుగు భాషోద్యమ ప్రముఖుడు, మినీకవితా ఉద్యమ సారధి, శతాధిక గ్రంథకర్త, కవి, కథానవలా రచయిత, వైఙ్ఞానిక సాహితీవేత్త, తెలుగుభాష మూలాలను తవ్వి తీసిన పరిశోధకుడు, తెలుగు వారి ఆహార చరిత్రవేత్త, కాలమిష్టు, సంపాదకుడు, విమర్శకుడు, వ్యాఖ్యాత, అంతకు మించిన సాహితీ కార్యకర్త కూడా!
- రాష్ట్రంలో ప్రసిద్ధిపొందిన ఆయుర్వేద వైద్యుడు, చిత్రకారుడు, తెలుగు భాష మూలాల్ని తవ్వి తీసిన పరిశోధకుడు, భాషోద్యమ ప్రముఖుడు, ఆరు పర్యాయాలు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు బాధ్యతలు వహించిన మహాకార్యదర్శి, భాషాసాహిత్య పరిరక్షణలో బహుముఖీనమైన పాత్ర నిర్వహిస్తూ, ఉభయ రాష్ట్రాల్లోనూ పరిచయం అవసరంలేని సాహితీవేత్తగా చిరపరిచితుడు
- రచయితగా 52 యేళ్ల సాహితీ ప్రస్థానంలో, గ్రంథరచయితగా 47 ఏళ్ళ కాలంలో మొత్తం 150కి పైగా పుస్తకాలు వెలువరించి సాహితీ స్వర్ణోత్సవం జరుపుకున్న సాహితీమూర్తి డా|| జివిపూర్ణచందు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం ఇంకా... యువభారతి, వంశీ ఇంటర్నేషనల్, ప్రపంచ తెలుగు సమాఖ్య, శ్రీకళాసుధ చెన్నై, సద్గురు శివానంద సనాతనధర్మ చారిటబుల్ ట్రస్టు రాష్టేతర తెలుగు సమాఖ్య లాంటి ప్రసిద్ధ సంస్థల పురస్కారాలు, సత్కార గౌరవాలు 70కి పైగా అందుకొని, రచయితగా తాను అత్యంత సంతృప్త జీవినని ప్రకటించుకున్న సాహితీ పరిపూర్ణజీవి డా॥ జివి పూర్ణచందు.
- తెలుగువారి ఆహార చరిత్ర వేత్తగా ఖ్యాతి పొందారు. ఆరేళ్ళుగా ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో తినరామైమరచి శీర్షిక గొప్ప జనాదరణ పొందింది. ఆహార వేదం, తరతరాల తెలుగు రుచులు, ఆహార సంహిత విశేషఖ్యాతి పొందిన ఆహార వైద్యగ్రంథాలు.
- మరుగునపడిన తెలుగు పదాలను వెలుగులోకి తెచ్చి విశ్లేషిస్తున్నారు. చిన్నయసూరి ప్రయోగించిన అపురూప పదాల విశ్లేషణను విశాలాక్షి, అమ్మనుడి, ఆంధ్రప్రభలలో వ్రాస్తున్నారు. సొగసైన తెలుగు గ్రంథం వీరికి మంచి పేరు తెచ్చింది.
- తెలుగు భాష ప్రాచీనత నిరూపణ కోసం తెలుగే ప్రాచీనం (ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం ప్రచురణ-2008) నైలూ నుండి కృష్ణ దాకా (ద్రవిడ విశ్వవిద్యాలయం ప్రచురణ-2008), ‘తెలుగుకోసం’ (ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత, సంస్కృతి సమితి ప్రచురణ), తెలుగులో అతిథిపదాలు (గుత్తికొండ రామరత్నం చారిటబుల్ ట్రష్టు ప్రచురణ.) లాంటి పరిశోధనాగ్రంథాలు వెలువరించారు. ఆం. ప్ర ఆర్కయివ్స్ వారి `ఇతిహాస్ జర్నల్`, వీరి భాషా చరిత్ర పరిశోధనా వ్యాసాన్ని ప్రచురించింది.
- తెలుగే ప్రాచీనం, నైలూ నుండి కృష్ణ దాకా, తెలుగుకోసం, భువనవిజయం, ఆంధ్రగీతి లాంటి విశేష పరిశోధనా గ్రంథాల రచయిత. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 6 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు. 25 బృహత్తర పరిశోధనా గ్రంథాలకు సంపాదకత్వం వహించారు
- మినీకవితా ఉద్యమసారధ్యం: 1979-80లలో ప్రారంభమైన మినీకవితా ఉద్యమంలో డా|| రావిరంగారావుతో కలిసి, సారధ్యం వహించారు. ఊరూరా మినీకవితా ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఆ ప్రక్రియకు ఉద్యమరూపం సంతరింపచేశారు. కవిత్వానికి ప్రదర్శన అనే ఆలోచన పూర్ణచందుగారిదే!
- తెలుగు భాషోద్యమ సారధి: 2003లో ‘మాటముచ్చట్లు’ పుస్తకం ద్వారా తెలుగు భాషోద్యమ ప్రవేశం చేశారు. 2004లో కృష్ణాజిల్లా రచయితల సంఘం పునర్వ్య్తవస్థీకరించి ఉద్యమ ప్రచారం చేశారు. సంఘం పక్షాన మచిలీపట్టణం నుండి నెల్లూరు వరకు ‘రచయితల పాదయాత్ర’ సహా వందలాది కార్యక్రమాలు, జాతీయ అంతర్జాతీయ సదస్సులు నిర్వహించారు. 6 పర్యాయాలు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించారు. అనేక ప్రాంతాల్లో భాషోద్యమ సదస్సులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘంతో కలిసి తెలుగు భాషకు క్లాసికహోదా రావటానికి అడ్డంకిగా ఉన్న మద్రాస్ హైకోర్టులోని కేసుని కొట్టేయవలసిందిగా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. 2004 నుండీ తెలుగే ప్రాచీనం లాంటి తెలుగు భాష ప్రాముఖ్యతను చాటే 50కి పైగా గ్రంథాలను వెలువరించారు. 30కి పైగా పరిశోధనా బృహద్గ్రంథాలకు సంపాదకత్వం/సహ సంపాదకత్వం వహించారు
- భాష, చరిత్ర, పరిశోధకుడు: పూర్ణచందుగారి పరిశోధనలు కొత్త దృష్టికోణాన్ని ఆవిష్కరించేవిగా ఉంటాయి. తెలుగు భాషా సంస్కృతుల మూలాలు వెలికితీసి "తెలుగే ప్రాచీనం" (ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం ప్రచురణ); "నైలు నుండి కృష్ణదాకా” (ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రచురణ) గ్రంథాల ద్వారా భాషోద్యమ దీప్తి కలిగించారు. తెలుగులో అతిథిపదాలు, తెలుగు కోసం, మాతృభాష-మహాత్ముడి బాటలాంటి పరిశోధనా గ్రంథాలు భాషోద్యమ దీప్తిని కలిగించాయి. తెలుగు సంస్కృతి మూలాలను తరచి తరచి చూసిన విశ్లేషకుడు పూర్ణచందుగారు.
- మాటల ముచ్చట్లు, తెలుగు కోసం, తెలుగులో అతిథిపదాలు, మాతృభాష-మహాత్ముడి బాట, తాంబూలం: ఆరోగ్యం ఆనందం, మరో 100 విశేషాలు, సొంపైన తెలుగు (తెలుగు నుడుల సంచికట్టు) లాంటి గ్రంథాలు ఆయన పరిశోధన, పరిశీలనాస్క్తులను చాటే గ్రంథాలు.
- తెలుగు పసిడి, వజ్రభారతి, కృష్ణాజిల్లా సర్వస్వం, తెలుగు పున్నమి, తెలుగు వ్యాసమండలి, కృష్ణాజిల్లా సర్వస్వం, కృష్ణాతీరం, దేశభాషలందు తెలుగు లెస్స లాంటి 25 బృహత్తర ఆకర గ్రంథాలకు సంపాదకత్వం వహించారు.
- కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటుకోసం, అందులో తెలుగు శాఖ ఏర్పాటు కోసం పోరాడిన వారిలో ఒకరు.
- తెలుగువారి తొలి ఆహారచరిత్ర రూపకర్త: తెలుగు వారి ఆహార చరిత్రకు తొలి రూపకర్త పూర్ణచందుగారే! లండన్ నగరంలో జరిగిన తొలి ప్రపంచ తెలుగు చరిత్ర మహాసభల్లో తెలుగువారి ఆహారచరిత్రపైన పత్ర సమర్పణ చేశారు. అనేక విశ్వవిద్యాలయాల జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం చేశారు. వివిధ "యూ ట్యూబు ఛానల్స్ ద్వారా మెడికల్ ఇంటర్వ్యూలు, ప్రసంగాలు లక్షల సంఖ్యలో తెలుగు వీక్షకుల సందర్శనాన్ని పొందాయి దేశవిదేశాల్లో వీరి వీడియోలకు అభిమాన సందోహం ఉంది. ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో మన ఆహారసంస్కృతి మూలాల్ని తవ్వి తీస్తూ "తినరా మైమరచి" శీర్షికన ఆయన వ్రాసే వ్యాసాలు విశేషప్రాచుర్యాన్ని పొందాయి. తల్లి వైద్యం, వంటిల్లే వైద్యశాల, భోజన భోగం, అలనాటి ఆహారాలు, ఆరు రుచులతో ఆరోగ్యం, ఆయుర్వేదంలో పథ్యాలు - అపథ్యాలు, తరతరాల తెలుగు రుచులు, మన ఆహారం, ఆహారవేదం ఆహార సంహిత గ్రంథాలు ఆయనను ఆహార ఆరోగ్య పథికుడిగా నిలబెట్టాయి. ఆయన శ్రీమతి గంగరాజు అరుణాదేవితో కలిసి నలుడుయ్ వ్రాసిన పాకదర్పణం, క్షేమశర్మ వ్రాసిన క్షేమకుతూహలం, రఘునాథశర్మ వ్రాసిన భోజన కుతూహలంణ్ గ్రంథాలను తెలుగులోకి అనువదించారు.
- కవిగా, నవలాకారుడిగా : పూర్ణచందుగారు ఎంతటి కార్యకర్తో అంతటి కవి! 1990లలో వెలువడిన కాంతిస్వప్న వీరి కవితా పటిమకు తార్కాణంగా నిలిచింది. 7భాషలలోకి అనువదించి రెండు సంపుటాలుగా వెలువడిన ముక్కాలు కవితా సంపుటాలు వీరి ప్రతిభకు గీటురాళ్లు. తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాలు, దాని చరిత్ర, దాని ప్రశస్తి, తెలుగులో మాండలికాల పరిరక్షణ, సైన్సు రచనలు, సాంకేయిక పారిభాషిక పదాలు, అధికార భాషగా తెలుగు అమలు లాంటి అంశాలను తొలిసారిగా కవిత్వీకరించి వ్రాసిన ఆంధ్రగీతి తెలుగు భాషాజాగృత కావ్యం అజరామరమై నిలిచేదిగా రూపొందింది. సప్తసింధు, తెలుగుధీర, చిగురులు వేసిన కలలు నవలలు ఆయన కీర్తిని ఇనుమడింపచేశాయి. ఈ నవలలలను అనేక యూ ట్యూబులవారు చదివి రికార్డు చేశారు. అవి బహుళ ప్రాచుర్యం పొందాయి.
- 30కి పైగా కాలమ్స్ వ్రాసిన అపురూప రచయిత: తెలుగులో అత్యధికంగా ఫీచర్లు/కాలమ్స్ నిర్వహించిన ఖ్యాతి పూర్ణచందు గారికే దక్కుతుంది ఒక దశలో ఒకేసారి 9 పత్రికలకు కాలమ్స్ వ్రాశారాయన. 1979లోనే సౌజన్య వారపత్రికలో ప్రేమ-పెళ్లి శృంగారం అనే ఫీచర్, ఇదీ సంగతి అపేరుతో రాజకీయ వ్యాఖ్య కాలమ్ నిర్వహించారు. ఒక వంక వైద్య వృత్తి, మరొక వంక గ్రంథ రచనా వ్యాసంగం ఇంకో వైపు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వంటి భారీ కార్యక్రమాల నిర్వహణలో నిమగ్నమై ఉంటూ వీక్లీ ఫీచర్లు వ్రాయటం, అవి కూడా పరిశోధ్జనాత్మక రచనలు చేయటం విశేషం. ఆంధ్రప్రభ, అమ్మనుడి, విశాలాక్షి, Neo Science Hub, 'సంచిక' వెబ్ పత్రిక ఇంకా అనేక దినపత్రికల్లో, వారపత్రికల్లో, మాసపత్రికల్లో వ్రాస్తున్న వ్యాసాలు మన భాష పట్ల, మన చరిత్ర పట్ల పూర్ణచందు నిబద్ధతను చాటుతాయి, ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో "తినరా! మైమరచి" శీర్షిక ఆహార చరిత్రను చాటుతూ అత్యంత ప్రాచుర్యం పొందిం ది. ఆంధ్రజ్యోతి శనివారం నవ్య పేజీలో భోజన కుతూహలం ధారావాహిక తన శ్రీమతి గంగరాజు అరుణాదేవితో కలిసి వ్రాస్తున్నారు. విశాలాక్షి మాసపత్రికలొ సొగసైన తెలుగు, నియో సైన్స్ హబ్ ఆంగ్ల పత్రికలొ ‘ది టేష్ట్ ఆఫ్ ట్రెడిషన్’ శీర్షికలు జనాదరణ పొందాయి.
- 40 బృహద్గ్రంథాలకు సంపాదకుడుగా: తెలుగు పసిడి, వజ్రభారతి, కృష్ణాజిల్లా సర్వస్వం, దేశభాషలందు తెలుగు లెస్స, తెలుగు వ్యాసమండలి, తెలుగు మణిదీపాలు లాంటి బృహద్ పరిశోధనాగ్రంథాలకు సంపాదకుడుగా సహ సంపాదకుడిగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ పక్షాన అనేక గ్రంత్ర్హాలకు సంపాదకత్వం వహించారు. తెలుగు వ్యాసమండలి, దేశభాషలందు తెలుగు లెస్స లాంటి గ్రంథాలలో తెలుగు భాషకు సంబంధించి ప్రముఖరచయితల అపురూప వ్యాసాలను సేకరించటం ద్వారా భావి పరిశోధకులకు ఆకర గ్రంథాలుగా వెలువరించారు. మహాకార్యదర్శిగా: కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధానకార్యదర్శిగా, ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా అనితర సాధ్యమైన రీతిలో 6 పర్యాలు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, ఒక పర్యాయం జాతీయ తెలుగు రచయితల మహాసభలతో పాటు ప్రధమ ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు అలాగే, తెలుగగే ప్రాచీనం ప్రధమ తెలుగు భాషా ప్రాచీనతా సదస్సు, సింధుకృష్ణలోయల నాగరికతల అధ్యయన సదస్సు, తెలుగులో న్యాయపాలన సదస్సు, సాంకేతిక తెలుగు జాతీయ సదస్సు లాంటి సదస్సుల నిర్వహణ ద్వారా భాష ఆధునీకరణకు కావలసిన ఆలోచనలు కలిగించారు. పాతికకు పైగా బృహద్గ్రంధాలను ప్రచురించారు.
- లయన్స్ సేవాసంస్థలో 40 యేళ్లుగా: గత 40 యేళ్లుగా లయన్స్ అంతర్జాతీయ సేవాసంస్థలో సభ్యుడిగా వివిధ పదవులను పురస్కారాలను పొందారు. లయనిజం కార్యక్రమాలలో తెలుగు పరివ్యాప్తికి పూర్ణచందు ప్రధాన కారకుడు. లయనిజం విధి విధానాల గురించి 8 పుస్తకాలు ప్రచురించారు. తన్నీరు కృష్ణమూర్తి విద్యాధరా లయన్స్ కంటి ఆసుపత్రి ఏర్పరచి, వ్యవస్థాపక చైర్మన్ గ ఔన్నారు. 200-2001 సంవత్సరంలో క్యాబినెట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. నేషనల్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా: సంయుక్త ఆంధ్రప్రదేశ్ లోని ఆయుర్వేద పట్టభద్ర వైద్యులందరినీ ఒక త్రాటిమీదకు తెచ్చి నేషనల్ మెడికల్ అసోసియేషన్ వ్యవస్థాపనలో ముఖ్య పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. విజయవాడలోని డా|| నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పరిరక్షణకు కృషి చేశారు. పూర్వపు ఆంధ్రప్రదేశ్ సాహిత్యకాడెమీలో సభ్యత్వం: పూర్వపు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీకి 1984లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర-నాగార్జున విశ్వవిద్యాలయాల సాహితీ సంస్థల నియోజకవర్గం నుండి తన 26వ యేట సభ్యునిగా ఎన్నికయ్యారు. యన్ టి రామారావు గారి ప్రభుత్వం అన్ని అకాడెమీలను రద్దు చేసి వాటి స్థానే తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన సమయంలో ఉన్న జెనరల్ బాడీలో పూర్ణచందుగారుకూడా సభ్యులుగా ఉన్నారు. ఆ తరువాత అకాడెమీల పునర్నిర్మాణం కోసం పోరాడారాయన, పదవ తరగతిలోనే మేఘమాల పత్రిక సంపాదకుడు: పూర్ణచందుగారికి చిన్ననాటి నుండే ప్రసిద్ధ రచయితల పరిచయ భాగ్యం కలిగింది. దుర్గానంద్, యమ్వీయల్ రామసూరి, చివుకుల సుబ్బావధాన్లు గారి లాంటి పెద్దలతో పరిచయ ప్రభావం ఆయన్ని సాహిత్యంలోకి ఆకర్షించింది. తోటి విద్యార్థులతో కలిసి తను సంపాదకుడిగా మేఘమాల అనే లిఖిత పత్రికని వెలువరించారు.
- ఇంకా... వివిధపత్రికల్లో 8,000 పైబడిన వ్యాసాలు వ్రాశారు కవితలు, కథలు, నవలలు, రేడియో నాటికలతోపాటు, విమర్శనా వ్యాసాలు, పరిశోధనా వ్యాసాలు, జీవిత చరిత్రలు కూడా వ్రాశారు. తెలుగు భాష, సంస్కృతుల ప్రాచీనతను నిరూపిస్తూ అనేక గ్రంథాలు వ్రాశారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటులోనూ, దానిలో తెలుగు శాఖ ప్రారంభించటంలోనూ విశేష కృషిచేశారు. తన స్వంత గ్రంథాలయం నుండి 1500 పుస్తకాల్ని అలాగే కృష్ణాజిల్లా రచయితల సంఘం పక్షాన 6 బీరువాల్ని తెలుగు శాఖకు అందించారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ పక్షాన కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో కృష్ణదేవరాయ మహోత్సవాల నిర్వహణలో ముఖ్యపాత్ర వహించారు. పద్యకవితా బ్రహ్మోత్సవాలు, తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు, జానపద సాహిత్య వైభవ సదస్సులకు సంచాలకుడిగా వ్యవహరించారు. 2008లో ఆచార్య శరజ్యోత్సారాణి జ్యోత్స్నకళాపీఠం పురస్కారాన్ని పూర్ణచందుకి అందించిన సభలో సినారె ప్రసంగిస్తూ, “తెలుగు ప్రాచీనుడు మన పూర్ణచందు" అన్నారు బుద్ధప్రసాద్, లక్ష్మీప్రసాద్, గుత్తికొండసుబ్బారావు, పూర్ణచందు ఈ నలుగురూ భాషోద్యమానికి నాలుగు స్తంభాలని సినారె అనేక సభలలో వ్యాఖ్యానించారు సినారె ప్రశంసే అన్నింటికన్నా పెద్ద పురస్మారంగా భావిస్తారు పూర్ణచందు. వారణాసిలో కుమారుని ఇంట కొన్ని రోజులున్నప్పుడు గంగరాజు ఇంటి పేరుగా కలిగిన పూర్ణచందుగారు తన ఇంట గంగమ్మ ఉండన్న స్పృహతో గంగమ్మ తల్లి (తెలుగు-గంగ పద అనుబంధాలు) అనే పుస్తకాన్ని వారణాసిలోనే వ్రాయగా వారణాసి విశ్వవిద్యాలయం తెలుగు శాఖవారు ఉగాది రోజున అతిథిగా ఆహ్వానించి ఆచార్య మాడభూషి శ్రీధర్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది తాంబూలం అందరమూ వేసుకుంటాము. కానీ తాంబూలం: ఆరోగ్యం ఆనందం, మరో 100 విశేషాలు పేరుతో 100 పుటల పుస్తకం వ్రాశారాయన. జాగృతి మాసపత్రిక ధారావాహికగా ప్రచురించిందీ గ్రంథాన్ని!
- పూర్ణచందుగారంటే మౌలికంగా పుస్తక రచయితే! గత పాతికేళ్ళ కాలంలో తెలుగు నాట సంబంవించిన అనేక పరిణామాల పైన వ్యాసాలు కాదు పుస్తకాలే వ్రాసి వెలుగులోకి తెచ్చారు. కాలచక్ర తంత్రం, బుద్ధ దేవునికథ, జస్టిస్ శ్రీకృష్నకమిటీ నివేదిఒక ఏం చెప్పింది? ఎందుకు చెప్పింది? లాంటి పుస్తకాలు ఇలా సందర్భానుసారం వెలువడ్డవే! 2016లో అప్పటి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చట్త సభలలఓ బ్నైతిక విలువ;లు అనే అంశంపైన సదస్సులు నిర్వహించిన సందర్భంలో పూర్ణచందుగారు భారతీయ సభామర్యాదలు పుస్తకం వెలువరించారు. తెలుగు భాష ప్రాచీనతా హోదా పోరాటం ముమ్మరంగ అసాగుతున్నప్పుడు తెలుగే ప్రాచీనం, నైలు నుండి కృశ్నదాకా పుస్తకాలు తెచ్చారు. ద్రావిడ విశ్వవిద్యాలయం, అధికార భాషాసంఘం లాంటి సంస్థలు వీరి ఈ రచనలను ప్రచురించాయి.
- దాదాపు 15 విశ్వవిద్యాలయాలలోని తెలుగు శాఖలు వీరిని సత్కరించాయి. వందకు పైగా జాతీయ అంతర్జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణ చేశారు.
- వివిధ దిన, వార మాసపత్రికలలో రమారమి 35 శీర్షికలు నిర్వహించారు. ప్రస్తుతం 9 దిన వార మాసపత్రికలలో వీరి శీర్షికలు వెలువడుతున్నాయి.
- లండన్ బ్రిటిష్ మ్యూజియంలో జరిగిన తొలి ప్రపంచ తెలుగు చరిత్ర మహాసభలలో తెలుగువారి ఆహారచరిత్ర పైన పరిశోధనాపత్ర సమర్పణ చేశారు.అక్కడి బ్రౌన్ సమాధి సందర్శించారు.
కుటుంబం
[మార్చు]భార్య గంగరాజు అరుణాదేవి. ఆమె కూడా రచయిత్రి, నలుడి 'పాకదర్పణం, క్షేమశర్మ క్షేమకుతూహలం, రఘునాథ సూరి ‘భోజన కుతూహలం’ గ్రంథాలకు వ్యాఖ్యానం వ్రాయటానికి పూర్ణచందుకు సహరచయిత్రిగా ఉన్నారు. భజనచేసే విధము తెలియండి గ్రంథాన్ని కూడా వెలువరించారు
కుమార్తె లక్షీ చేతన, అల్లుడు చక్కిలం శివరామ్ మల్లిక్ న్యూజెర్సీలో ఇద్దరూ సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేస్తున్నారు మనుమరాలు శ్రీ సాత్విక, మనుమడు సమన్యు
కుమారుడు డా॥ మనో కార్తీక్ చెన్నై ఐఐటిలో పిహెచ్ డి, (గోల్డ్ మెడల్) దక్షిణ కొరియాలో పోస్ట్ డాక్టరేట్ చేశారు వారణాసి ఐఐటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు కోడలు సౌమ్య మనుమరాలు పూర్ణసంహిత
బిరుదులు
[మార్చు]సాహితీ సింధు, సాహితీ దీప్తి, వైద్యశిరోమణి, వైద్యవిజ్ఞాన శౌరి, భాషాభిజ్ఞ, సభాసరస్వతి, తెలుగుపసిడి మొదలైన బిరుదు సత్కారాలు పొందారు. ప్రసిద్ధ సాహితీ సంస్థల సత్కారాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాలు పొందారు.
2000 గుర్రం జాషువా మిలీనియం విశిష్ట పురస్కారం, అంబేద్కర్ జాతీయ యువజన సమితి, విజయవాడ,
2002 ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం 'భాషాభిజ్ఞ' పురస్కారం, హైదరాబాదు
2005 నార్ల వెంకటేశ్వరరావు విశిష్ట సాహితీ సేవా పురస్కారం, హైదరాబాదు
2008 డా|| ద్వానా శాస్త్రి విశిష్ట సాహితీ పురస్కారం, హైదరాబాదు
2010 జ్యోత్స్న కళాపీఠం తెలుగు భాషా పురస్కారం, హైదరాబాదు
2010 తెలుగు విశ్వవిద్యాలయం పరిశోధనారంగంలో తిక్కవరపు రామిరెడ్డి కీర్తి పురస్కారం
2012 ఆచార్య పొన్నపల్లి వెంకట కృష్ణయ్య సాహితీ పురస్కారం, విజయవాడ
2008 సర్వధారి ఉగాది విశిష్ట పురస్కారం- శ్రీ విష్ణు సాయి జ్ఞానజ్యోతి ఆధ్యాత్మిక సాహితీసేవా సంస్థ విజయవాడ
2008 కీశేనండూరి సారంగపాణి ఆచార్య స్మారక విశిష్ట సాహితీ పురస్కారం, ఆంధ్ర సారస్వత సమితి మచిలీపట్నం
2008 కాశీనాథుని నాగేశ్వరరావు ఫౌండేషన్- విశ్వదాత విశిష్ట సాహితీ పురస్కారం, యలకుర్రు
2008 కృష్ణా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వారి విశిష్ట సత్కారం, విజయవాడ
2008 యువభారతి, హైదరాబాదు సహృదయ పురస్కారం, హైదరాబాదు
2008 ఆంప్ర సాంస్కృతిక శాఖ, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ విశిష్ట సత్కారం, హైదరాబాదు
2008 ఆంధ్ర సారస్వత పరిషత్ హైదరాబాద్ వారి సత్కారం
2009 ఆం. ప్ర. అధికార భాషా సంఘం తెలుగు భాషా పురస్కారం, హైదరాబాదు
2009 కొనకళ్ళ వెంకటరత్నం శతజయంతి సాహితీ పురస్కారం, పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం
2009 నేషనల్ మెడికల్ అసోసియేషన్ విశిష్ట పురస్కారం
2009 వైజ్'మెన్ ఇంటర్నేషనల్ బిరుదు సత్కారం
2009 ఘంటసాల బౌద్ధ స్తూప ప్రారంభ సభలో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి సత్కారం
2010 గిడుగు రామ్మూర్తి భాషోద్యమ శతజయంతి పురస్కారం, తెలుగురథం, హైదరాబాదు
2010 ఆరుద్ర సాహితీ ప్రతిభా పురస్కారం, పోలవరపు కోటేశ్వరరావు సాహితీ పీఠం, ఆంప్ర సాంస్కృతీ సమాఖ్య,
2010 ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ సత్కారం, విజయవాడ
2011 ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ శత జయంత్యుత్సవ సత్కారం
2012 కృష్ణాజిల్లా కలెక్టర్'చే కృష్ణాజిల్లా సాంస్కృతిక మండలి సత్కారం, మచిలీపట్టణం
2012- పంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయ సత్కారం
2012 ఆకాశవాణి విజయవాడ వారి స్వర్ణోత్సవ సత్కారం
2012 లలితకళాసమితి మచిలీపట్టణం వారి సత్కారం
2013 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది విశిష్ట సాహితీ పురస్కారం, హైదరాబాదు
2013 ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కృష్ణా అర్బన్) సత్కారం, విజయవాడ
2013 రోటరీ క్లబ్ విజయవాడ వారి సాహితీ సత్కారం
2014 సరసభారతి, ఉయ్యూరు వారి ఉగాది పురస్కారం
2014 రూట్స్ హెల్త్ ఫౌండేషన్, విజయవాడ వారి ప్రతిభా పురస్కారం
2014 ప్రపంచ తెలుగు సమాఖ్య సత్కారం, విజయవాడ
2014 ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాల రాజమండ్రి వారి సాహితీ సత్కారం
2014 శ్రీకళాసుధ చెన్నై వారి జాతీయ పురస్కారం
2014 వేటూరి ప్రభాకరశాస్త్రి పీఠం, టిటిడి వారి సత్కారం,
2016 ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ గిడుగు రామమూర్తి తెలుగు భాషా పురస్కారం
2017 రాష్టేతర తెలుగు సమాఖ్య బొంబాయి జీవనసాఫల్య పురస్కారం
2018 ఆంప్ర గ్రంథాలయ సంఘం కృష్ణాజిల్లా వారి పుస్తకపఠన ప్రోత్సాహక పురస్కారం, మొత్తం రచనల ప్రదర్శన,
2018 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హంస (కళారత్న) పురస్కారం
2018 పుట్టి వెంకటేశ్వరరావు సాహితీ సేవా సంస్థ, గుడివాడ 'తెలుగు పసిడి' బిరుదు సత్కారం
2019 సద్గురు శివానంద సనాతనధర్మ చారిటబుల్ ట్రస్టు వారి శ్రీరామనవమి ప్రతిభాపురస్కారం
2019 యర్రమిల్లి నరసింహారావు స్మారక విశిష్ట రచనా పురస్కారం
2019 పరవస్తు చిన్నయసూరి పీఠం వారి తెలుగు భాషా పురస్కారం
2020 శ్రీ మండలి వెంకట కృష్ణారావు సాహితీ పురస్కారం
2021 లత సాహతీ స్వర్ణవంశీ శుభోదయం జీవిత సాఫల్య పురస్కారం-వంశీ ఇంటర్నేషనల్ వారి అవార్డ్
2021 రోటరీ క్లబ్ విజయవాడ సెంట్రల్ వారి 'ఒకేషనల్ ఎక్స్'లెన్స్ అవార్డ్'
2022 సృజన సాహితీ సంస్థ - అద్దంకి వారి ఆత్మీయ ప్రతిభా పురస్కారం
2022 అఖిలభారత తెలుగు అకాడమీ ఎన్టీ రామారావు శతజయంతి పురస్కారం
2022 ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, గిడుగు రామమూర్తి తెలుగు భాషా పురస్కారం
2022 కళారత్న కె వి సత్యనారాయణ సాహిత్య పురస్కారం
2022 సాహితీ పీఠం కడప సాహిత్య సేవా పురస్కారం
2022 హిందూ యువజన సంఘం రాజరాజ నరేంద్ర పట్టాభిషేక మహోత్సవ సందర్భంగా విశిష్ట సాహితీ సత్కారం రాజమండ్రి
2023 ఆంధ్ర వాఙ్ఞ్మయ పూర్ణకుంభ పురస్కారం, ఆంధ్రసారస్వత పరిషత్ భీమవరం
2023 డాక్టర్ కోనాడ అశోక్ సూర్య విశిష్ట వైద్య సేవ పురస్కారం
2024 మధునాపంతుల సూరయ్య శాస్త్రి శతజయంతి ప్రతిభామూర్తి పురస్కారం, పల్లిపాలెం
2024 జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి విశిష్ట సత్కారం
2024 భారత వికాస్ పరిషత్ ప్రతిభాపురస్కారం
2024 భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ జాతీయ సాహితీ ప్రతిభా పురస్కారం
2024 పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ సాహిత్య పురస్కారం అద్దంకి
2024 సంస్కార భారతి విజయవాడ గురుసత్కారం
2024 తంగిరాల కృష్ణ ప్రసాద్ స్మారక రంగస్థలం పురస్కారం విజయవాడ
2025 అఖిల భారతీయ విద్వత్ సభలు నరసరావుపేట, `సాహితీ సింధు' బిరుదు పురస్కారం
2025 శ్రీమతి పుట్టి నాగలక్ష్మి సాహిత్య సేవా పురస్కారం కృష్ణ ఆర్ట్స్ అండ్ కల్చర్ అసోసియేషన్ గుడివాడ
2025: శ్రీ రామకృష్ణ నాట్యమండలి స్వర్ణోత్సవాల సందర్భంగా సాహిత్య దీప్తి బిరుదు ప్రధానం
2025 అఖిల భారతీయ భాషా సమ్మేళనం భోపాల్, సరస్వతీ సమ్మాన్
2025 నీలం సంజీవరెడ్డి రాష్ట్ర పురస్కారం వైద్య శిరోమణి బిరుదు ప్రధానం
2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పద్మభూషణ్ బోయి భీమన్న జయంతి 2లక్షల నగదు పురస్కారం.
2025: పశ్చిమగోదావరి జిల్లా రచయితలసంఘం వారిచే ఆరుద్ర సాహితీ పురస్కారం
రచనలు
[మార్చు],డా. జి వి పూర్ణచందు 150కి పైగా పుస్తకాలు రాశారు. వీటిలో సుమారు నలభై పుస్తకాలు సామాన్యులకు వైద్య రహస్యాలను వివరిస్తాయి.
35 సంపాదకత్వం/సహసంపాదకత్వం వహించారు. తెలుగు భాషాసంస్కృతుల పరివ్యాప్తికి, మూలాలను త్రవ్వి తీసేందుకు దోహద పడే బృహద్గ్రంథాలుగా ఇవి
ప్రసిద్ధి పొందాయి.
- సంపాదకులు/సహసంపాదకులుగా- 38
- వైఙ్ఞానిక గ్రంథాలు - 5
- కవితాసంపుటాలు - 6
- నవలలు - 3
- సాహిత్య విమర్శ - 10
- చరిత్ర గ్రంథాలు - 10
- భాషాసంస్కృతులు- 8
- జీవిత చరిత్ర గ్రంథాలు - 10
- వైద్యగ్రంథాలు - 24
- ఆహార చరిత్ర/ ఆరోగ్యప్రభావం - 22
- సామాజిక రచనలు - 10
- ఇతర భాషల్లోకి అనువాదిత రచనలు- 4
- Archives.orgలో ఉన్న గ్రంథాలు-7
- వివిధ పత్రికల్లో శీర్షికలు - 37
పురస్కారాలు
[మార్చు]- 2000 గుర్రం జాషువా మిలీనియం విశిష్ట పురస్కారం, అంబేద్కర్ జాతీయ యువజన సమితి, విజయవాడ;
- 2002 ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం - 'భాషాభిజ్ఞ' పురస్కారం, హైదరాబాదు;
- 2005 నార్ల వెంకటేశ్వరరావు విశిష్ట సాహితీ సేవా పురస్కారం, హైదరాబాదు;
- 2008 సర్వధారి నామ ఉగాది విశిష్ట పురస్కారం- శ్రీ విష్ణు సాయి జ్ఞానజ్యోతి ఆధ్యాత్మిక సాహితీసేవా సంస్థ విజయవాడ;
- 2008 కీ.శే.నండూరి సారంగపాణి ఆచార్య స్మారక విశిష్ట సాహితీ పురస్కారం, ఆంధ్ర సారస్వత సమితి మచిలీపట్నం;
- 2008 కాశీనాథుని నాగేశ్వరరావు ఫౌండేషన్-విశ్వదాత విశిష్ట సాహితీ పురస్కారం, యలకుర్రు;
- 2008 డా. ద్వా. నా శాస్త్రి విశిష్ట సాహితీ పురస్కారం, హైదరాబాదు;
- 2008 కృష్ణా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వారి విశిష్ట సత్కారం, విజయవాడ;
- 2008 యువభారతి, హైదరాబాదు సహృదయ అభినందన పురస్కారం, హైదరాబాదు;
- 2008 ఆం.ప్ర. సాంస్కృతిక శాఖ, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ విశిష్ట సత్కారం, హైదరాబాదు;
- 2008 ఆంధ్ర సారస్వత పరిషత్ హైదరాబాద్ వారి సత్కారం
- 2009 ఆం. ప్ర. అధికార భాషా సంఘం తెలుగు భాషా పురస్కారం, హైదరాబాదు;
- 2009 ఆకాశవాణి విజయవాడ కేంద్ర స్వర్ణోత్సవ సత్కారం;
- 2009 కొనకళ్ళ వెంకటరత్నం శతజయంతి సాహితీ పురస్కారం, పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం;
- 2009 నేషనల్ మెడికల్ అసోసియేషన్ విశిష్ట పురస్కారం;
- 2009 కొమరగిరి వెంకట సత్యనారాయణ (బుచ్చినాయన) విశిష్ట సాహితీ పురస్కారం;
- 2009 వైజ్`మెన్ ఇంటర్నేషనల్ ప్రతిభా పురస్కారం;
- 2009 ఘంటసాల బౌద్ధ స్తూప ప్రారంభ సభలో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి సత్కారం
- 2010 గిడుగు రామ్మూర్తి భాషోద్యమ శతజయంతి పురస్కారం, తెలుగురథం, హైదరాబాదు;
- 2010 జ్యోత్స్న కళాపీఠం తెలుగు భాషా పురస్కారం, హైదరాబాదు;
- 2010 తెలుగు విశ్వవిద్యాలయం తిక్కవరపు రామిరెడ్డి కీర్తి పురస్కారం;
- 2010 ఆరుద్ర సాహితీ ప్రతిభా పురస్కారం, పోలవరపు కోటేశ్వరరావు సాహితీ పీఠం, ఆం.ప్ర సాంస్కృతీ సమాఖ్య, విజయవాడ;
- 2010 ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ సత్కారం, విజయవాడ;
- 2011 ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ శత జయంత్యుత్సవ సత్కారం;
- 2012 కృష్ణాజిల్లా కలెక్టర్`చే కృష్ణాజిల్లా సాంస్కృతిక మండలి సత్కారం, మచిలీపట్టణం;
- 2012 4వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయ సత్కారం;
- 2012 ఆచార్య పొన్నపల్లి వెంకట కృష్ణయ్య సాహితీ సత్కారం, విజయవాడ;
- 2012 ఆకాశవాణి విజయవాడ వారి స్వర్ణోత్సవ సత్కారం
- 2012 లలితకళాసమితి మచిలీపట్టణం వారి సత్కారం
- 2013 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది విశిష్ట సాహితీ పురస్కారం, హైదరాబాదు;
- 2013 ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కృష్ణా అర్బన్) సత్కారం, విజయవాడ;
- 2013 రోటరీ క్లబ్ విజయవాడ వారి సాహితీ సత్కారం;
- 2014 సరసభారతి, ఉయ్యూరు వారి ఉగాది పురస్కారం;
- 2014 రూట్స్ హెల్త్ ఫౌండేషన్, విజయవాడ వారి ప్రతిభా పురస్కారం;
- 2014 ప్రపంచ తెలుగు సమాఖ్య సత్కారం, విజయవాడ;
- 2014 ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాల రాజమండ్రి వారి సాహితీ సత్కారం;
- 2014 శ్రీకళాసుధ చెన్నై వారి జాతీయ పురస్కారం.
- 2014 వేటూరి ప్రభాకరశాస్త్రి పీఠం, టి టి డి వారి సత్కారం,
- 2016 ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ గిడుగు రామమూర్తి తెలుగు భాషా పురస్కారం
- 2017 రాష్ట్రేతర తెలుగు సమాఖ్య బొంబాయి జీవనసాఫల్య పురస్కారం
- 2018 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హంస (కళారత్న) పురస్కారం
- 2018 పుట్టి వెంకటేశ్వర రావు "తెలుగు పసిడి" బిరుదు సత్కారం
- 2018 ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం వారిచే పుస్తకపఠన ప్రోత్సాహక పురస్కారం,
- 2019 సద్గురు శివానంద సనాతనధర్మ చారిటబుల్ ట్రష్టు వారి శ్రీరామనవమి ప్రతిభాపురస్కారం
- 2019 యర్రమిల్లి నరసింహారావు స్మారక విశిష్ట రచనా పురస్కారం.
- 2019 పరవస్తు చిన్నయసూరి పీఠం వారి తెలుగు భాషాపురస్కారం
- 2020 అజోవిభో వారి సత్కారం
మూలాలు
[మార్చు]- ↑ "శ్రీ జి.వి.పూర్ణచందు గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు". www.acchamgatelugu.com. Retrieved 2020-05-28.[permanent dead link]