జి. సాయన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి. సాయన్న
జి. సాయన్న


పదవీ కాలం
  1994 - 2009, 2014 - 2018, 2018- ప్రస్తుతం
నియోజకవర్గం సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం మార్చి 5, 1951
చిక్కడపల్లి, హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు సాయన్న - భూదేవి
జీవిత భాగస్వామి గీత
సంతానం ముగ్గరు కుమారులు
నివాసం సికింద్రాబాద్, తెలంగాణ

జి. సాయన్న, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]

జననం, విద్య[మార్చు]

సాయన్న 1951, మార్చి 5న సాయన్న - భూదేవి దంపతులకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని చిక్కడపల్లిలో జన్మించాడు. 1981లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ (బిఎస్సీ), 1984లో ఎల్.ఎల్.బి. పూర్తిచేశాడు.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

సాయన్నకు గీతతో వివాహం జరిగింది. వారికి ముగ్గరు కుమారులు ఉన్నారు.

రాజకీయ విశేషాలు[మార్చు]

సాయన్న తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 నుండి 2009 వరకు మూడుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గజ్జెల నగేష్ పై 3275 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు. తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 37,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[3]

హోదాలు[మార్చు]

  1. ఆరుసార్లు హుడా (హర్యానా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) డైరెక్టర్‌
  2. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వీధి బాలల పునరావాసంపై హౌస్ కమిటీ చైర్మన్
  3. హెచ్‌సి చైల్డ్ ట్రాఫికింగ్ ఆంధ్రప్రదేశ్

ఇతర వివరాలు[మార్చు]

చైనా, హాంకాంగ్, మలేషియా, సింగపూర్, దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు దేశాలు సందర్శించాడు.

మూలాలు[మార్చు]

  1. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-13.
  2. "G. Sayanna | MLA | TRS | Secunderabad Cantt | Hyderabad | Telangana". the Leaders Page (in ఇంగ్లీష్). 2020-05-03. Retrieved 2021-09-13.
  3. https://telanganatoday.com/sayanna-retains-secunderabad-cantonment/amp