జీఎస్‌ఎల్‌వి మార్క్ III-డి2
జీఎస్‌ఎల్‌వి మార్క్ III-డి2 ఉపగ్రహ నౌక బారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతయారు చేసినది.2017 జూన్ లో భారతీయ దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో జీఎస్‌ఎల్‌వి సీరీస్ లో మార్క్ -3 డీ 1 ఉపగ్రహాన్ని ప్రయోగాత్మకంగా విజయవంతంగా ప్రయోగించారు. ఇప్పుడు జీఎస్‌ఎల్‌వి మార్క్ III-డి2 ఉపగ్రహ వాహకనౌక ద్వారా జీశాట్ -29,అనే సమాచార ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో, శ్రీహరికోటలో వున్న సతీశ్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం(SDSC) నుండి 2018,నవంబరు ,14 వతేదీ బుధవారం సాయంత్రం 5:08 గంటలకు ప్రయోగించారు.జీశాట్ -29 ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వి మార్క్ III-డి2, అనుకున్న విధంగా విజయవంతంగా భూబదిలీ కక్ష్యలో ప్రవేశ పెట్టినది.[1]
శ్రీహరికోట రేంజి(SHAR) లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని రెండవ ప్రయోగ వేదిక నుండి ఈ వాహక నౌకను ప్రయోగించారు. పిఎస్‌ఎల్వి రాకెట్‌లద్వారా కేవలం 1700 నుండి 2000 కిలోల బరువు వున్న ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టవచ్చు. జీఎస్‌ఎల్‌వి మార్క్ III వాహక నౌక ద్వారా 4000 కిలో గ్రాముల బరువు వున్న ఉపగ్రహాలను భూస్థిర కక్ష్యలో అంతరిక్షానికి పంపవచ్చును. ఈ ప్రయోగం సఫలం కావడం వలన బరువైన ఉపగ్రహాలను ప్రయోగించు దేశాల సరసన భారత దేశం చేరినది.ఇప్పుడు ప్రయోగించిన జీశాట్ -29 ఉపగ్రహం బరువు 3423 కిలోలు. ఇంత బరువు వున్న ఉపగ్రహాన్ని భారతీయ గడ్డపై నుండి మొదటి సారిగా విజయవంతంగా ప్రయోగించి ఐస్రో తన అంతరిక్ష పరిశోధన పయనంలో మరో మైలు రాయిదాటినది.ప్రయోగించిన 16.43 నిమిషాల్లో ఉపగ్రహాన్ని విజయ వంతంగా కక్షలో ప్రవేశపెట్టినది.
జీఎస్‌ఎల్‌వి మార్క్ III-డి2 ఉపగ్రహ నౌక
[మార్చు]పిఎస్‌ఎల్వి సీరీస్ రాకెట్‌లలో నాలుగు దశలు వుండి మొదటి, మూడో దశల్లో ఘన ఇంధనాన్ని,రెండవ, చివరి నాల్గవ దశలో ద్రవ ఇంధనాన్ని రాకేట్ లో ఉపయీగిస్తారు.కానీ జీఎస్‌ఎల్‌వి మార్క్ రాకెట్‌లలో కేవలం మూడు దశలు మాత్రమే వుండును.మొదటి దశలో ఘన ఇంధనాన్ని,రెండవ దశలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. మూడో చివరి దశను క్రయోజనిక్ దశ అంటారు.ఇందులో మైనస్ సెంటిగ్రేడ్ డిగ్రీల వద్ద ద్రవ స్థితిలో వుంచిన ఆక్సిజన్, హైడ్రోజన్లను ఇంధనంగా ఉపయోగిస్తారు.ఇది అత్యంత క్లిష్టమైన దశ. జీఎస్‌ఎల్‌వి మొదటి ప్రయోగాలకు మొదట రష్యా నుండి దిగుమతి చేసుకుని ఉపయోగించారు.తరువాత ఇస్రో దేశీయ సాంకేతికతతో క్రయో జనిక్ ఇంజనులను రూపకల్పన చేసి ,వాటి నిర్మాణంలో పరిణితి చెందినది.దేశియ పరిజ్ఞానంతో సమర్థవంతమైన క్రయోజనిక్ ఇంజను ను రూపొందించుతకు రెండు దశాబ్దాల కాలం పట్టింది.
జీఎస్‌ఎల్‌వి రాకెట్‌లోని మొదటి దశను S-200,రెండవ దశను L- 100,మూడవ దశను C-25 అంటారు.మొదటిదశ రెండు స్ట్రాపన్ బూస్టరులరూపంలొ వుండి ఒక్కొక్కటి 200టన్నుల ఘనైంధనాన్ని కల్గి వుండును.ఈ రెంటిని రెండవ ద్రవఇంధన దశకు పై భాగన బిగించబడి వుండును.L -110 దశలో 110 టన్నుల ద్రవఇంధనం వుండును.ఇకా చివరి దశ C-25 లో 25 టన్నుల క్రయోజనిక్ఇంధనం(ద్రవస్థితిలో వున్న ఆక్సిజన్, హైడ్రోజన్ లు )వుండును.గతంలో ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వి నౌకలలో క్రయీజనిక్ దశలో 12.5 టన్నుల క్రయోజనిక్ ఇందనాన్ని వాడగా ఈ నౌకలో 25 టన్నుల ఇంధనాన్ని ఉపయోగించారు.
ఉపగ్రహం ఎత్తు 43.43 మీటర్లు.వాహక నౌక వ్యాసం 4.0 మీటర్లు,హీట్ షీల్డ్(ఉష్ణ కవచం)వ్య్సాం 5.0 మీటర్లు.వాహక నౌక మొత్తం బరువు 640 టన్నులు.[2]
ఎస్-200 ఘన ఇంధన బూస్టరులు
[మార్చు]రెండు బూస్టరులను కలిగి వుండి రెండవడశ కోర్ ఎల్-110 ద్రవ అంచేపి భాగాన ఇరుపక్కల బిగింపబడి వుండును.ఈ బూస్టరులను విక్రం సారాభాయి స్పేస్ సెంటరులో తయారు చేసారు.వీటి ఎత్తు 25 మీటర్లు.వీటి వ్యాసం 3.2 మీటర్లు. ఇందులో ఉపయోగించే ఘన ఇంధనం HTBP (హైడ్రాక్సిల్ టర్మినేటెడ్ పాలీ బ్యుటాడయీన్).[2]
ఎల్ -110 కోర్ స్టేజి/దశ
[మార్చు]ఈ దశ పొడవు 21 మీటర్లు, వ్యాసం 3 మీటర్లు. ఇందులో రెండు వికాస్ ఇంజన్లు ఉంటాయి. ఇందులో ద్రవ ఇంధనం వాడుతారు. ఇంధనంగా UDMH (అన్‌సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజీన్), N2O4 (డైనైట్రోజెన్ టెట్రాక్సైడ్) లను ఉపయోగిస్తారు. ఇంధనం బరువు 110 టన్నులు. [2]
సి-25 క్రయోజనిక్ అప్పర్ స్టేజి (మూడవ దశ)
[మార్చు]సి-25 క్రయోజనిక్ అప్పర్ స్టేజిలో CE-20 ఇంజను వాడుతారు. ఈ దశలో 25 టన్నుల ద్రవ హైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్‌లను ఇంధనం, ఆక్సీకరణులుగా వాడుతారు. ఈ దశ ఎత్తు 13.5 మీటర్లు, వ్యాసం 4.0 మీటర్లు[2]
జీఎస్‌ఎల్‌వి మార్క్ III-డి2 ఉపగ్రహ నౌక ప్రయోగ వివరాలు
[మార్చు]13వతేది,2018 మంగళవారం ప్రాంభమైన 27 గంటల కౌంట్‌డౌన్ ముగియగానే, ఒక్కోదానిలో 200 టన్నుల ఘన ఇంధనం వున్న మొదటి దశలోని రెండుబూస్టరులు మండటంతో రాకెట్ పయనం మొదలైనది.1.54 నిమిషాలకు రెండో దశలోని ద్రవ ఇంధనాన్ని మండించారు.తరువాత 2.19 నిమిషాలకు మొదటి దశలోని ఎస్-200 బూస్టర్లను వేరుచేశారు. ఎల్-200 దశ 5.18 నిమిషాలకు రెండోదశ దహనక్రియను పూర్తి చేసింది.తరువాత మూడో దశ క్రయోజనిక్ దశ మండటం మొదలై 16.28 నిమిషాలకు ముగిసినది.క్రయోజనిక్ దశ దహనం ముగిసినతరువాత 16.43 నిమిషాలకు పైభాగాన అమర్చిన 3423 కిలోల జీశాట్ -29 ఉపగ్రహం కక్షలో ప్రవేశించినది.[3]
బయటిలింకుల వీడియోలు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Isro's GSLV-MkIII-D2 rocket places GSAT-29 in orbit". timesofindia.indiatimes.com. Archived from the original on 2018-11-15. Retrieved 2018-11-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 2.0 2.1 2.2 2.3 "GSLV Mk III". isro.gov.in. Archived from the original on 2018-09-20. Retrieved 2018-11-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ సాక్షి దినపత్రిక,15 నవంబరు,2018.నెల్లూరు జిల్లా ఏడిసన్,మెయిన్ ఎడిసన్