Jump to content

జీడిగుంట సత్యనారాయణ

వికీపీడియా నుండి
జీడిగుంట సత్యనారాయణ
రెండవ ఛైర్మన్, భారత విసిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ
In office
8 సెప్టెంబర్ 2016  15 ఏప్రిల్ 2019
అంతకు ముందు వారునందన్ నిలకేని
తరువాత వారునీలకంఠ మిశ్రా [1]
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఈ -గవర్నన్స్, ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారుడు ,
In office
14 జూన్ 2014  3 సెప్టెంబర్ 2016
కార్యదర్శి,
In office
14 మార్చి 2012  31 ఏప్రిల్ 2014
వ్యక్తిగత వివరాలు
జననం16 ఏప్రిల్ 1954
గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్
జాతీయత భారతీయుడు
వృత్తివిశ్రాంత ఐ ఏ స్ అధికారి

జె. సత్యనారాయణ (IAST: J. సత్యనారాయణ, జననం 1954 ఏప్రిల్ 16) ఈయన ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన, 1977 బ్యాచ్ , ఇండియన్ ఎడ్మినిస్ట్రేటివ్ సర్విస్ అధికారి. సత్యనారాయణ ఆధార్ అమలు చేయడానికి భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) కి రెండవ ఛైర్మన్ గా పని చేశారు. ఆయన పదవీ విరమణ చేయ బోయే ముందు కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యదర్శి గా కూడా పనిచేశారు.

విద్య.

[మార్చు]

జె. సత్యనారాయణ గ్రాడ్యుయేట్ డిగ్రీ (బిఎస్సి) లో గుంటూరు హిందూ కళాశాల నుండి గణితం, భౌతిక శాస్త్రము, రసాయిన శాస్త్రము లతో చేశారు .[2] ఆయన భౌతిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎంఎస్సి) డిగ్రీ 1975 లో ఆంధ్ర యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యూయేట్ సెంటర్ నుండి చేశారు .[3][4] ఆయన , పదవి కాలంలో లుబ్లియానా విశ్వవిద్యాలaయం నుండి ఎంబీఏ పూర్తి చేశారు.. [3][4][4]

వృత్తి

[మార్చు]

ఐఏఎస్ అధికారిగా

[మార్చు]

సత్యనారాయణ ఐఏఎస్ అధికారిగా, ఆంధ్రప్రదేశ్ లోనూ , కేంద్ర ప్రభుత్వం లోనూ ఎన్నో కీలక పదవుల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమయిన పదవులు :

  • చీఫ్ కమిషనర్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ (సిసిఎల్ఎ),
  • ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (rఆరోగ్యం, వైద్య ,కుటుంబ సంక్షేమం)
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,
  • ప్రిన్సిపల్ సెక్రటరీ (కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)
  • ప్రిన్సిపల్ సెక్రెటరీ (సాంఘిక సంక్షేమ కమిషనర్
  • ఇన్స్పెక్టర్ జనరల్ (రిజిస్ట్రేషన్) డిస్టిలరీలు
  • బ్రూవరీస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్,
  • ప్రభుత్వ ఆర్థిక శాఖకు ప్రత్యేక కార్యదర్శి
  • జిల్లా మెజిస్ట్రేట్ & కలక్టర్ : అనంతపూర్, కరీంనగర్ , కర్నూలు .,
  • ఛైర్మన్ : తిరుమల తిరుపతి దేవస్థానం సాధికారిక మండలి [5]
  • కేంద్ర ప్రభుత్వంలో
  • సి ఈ ఒ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నన్స్.
  • కేంద్ర ప్రభుత్వం లో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యదర్శి.[3][4]

జె. సత్యనారాయణ ప్రధమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ (ఎన్ఐఎస్జి) లో , పనిచేశారు. ఆ సంస్థ భారత దేశంలో అనేక రాష్ట్రాలలో ఈ గవర్నెన్స ప్రొజెక్టులు చేపట్టింది. [3][6]

భారత దేశ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యదర్శి

[మార్చు]
కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా అండ్ జస్టిస్ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ న్యూఢిల్లీలో యుఐడిఎఐ పార్ట్ టైమ్ ఛైర్మన్ శ్రీ జె. సత్యనారాయణ్ తో గోప్యత, పదవి ప్రమాణ స్వీకారం చేయించారు.

కేబినెట్ నియామకాల కమిటీ ద్వారా యూనియన్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీగా నియమితులైన జె. సత్యనారాయణ, 2012 మార్చి 14న పదవీ బాధ్యతలు స్వీకరించారు, 2014 ఏప్రిల్ 31న పదవీ కాలం అయిపోయే దాకా అక్కడే పని చేశారు.[3][4][3][7]

పదవీ విరమణ తరువాత

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారు

[మార్చు]

పదవీ విరమణ అయిన వెంటనే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం , ఆయన అనుభవాన్ని గుర్తించి, ఈ -గవర్నన్స్, ఎలక్ట్రానిక్స్, , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయాలలో సలహాదారుడిగా నియమించింది. ఈ పోస్ట్ లో ఆయనకు కేబినెట్ మంత్రి హోదా లభించింది. [8] ఆ పదవిలో ఆయన 03 సెప్టెంబర్ 2016 దాకా కొన సాగారు. 

యుఐడిఎఐ చైర్మన్

[మార్చు]

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) కి ప్రధమ ఛైర్మన్ నందన్ నీలేకని రాజీనామా తర్వాత, కేబినెట్ నియామకాల కమిటీ (ఎసిసి) ఆయన ను పార్ట్ టైమ్ ఛైర్మన్ గా 8 సెప్టెంబర్ 2016నుండి నియాయినచ్చింది . ఆ పదవిలో ఆయన 15 ఏప్రిల్ 2019 వరకు పనిచేశారు.[9][10][11][12]

రచనలు

[మార్చు]
  • Satyanarayana, J. (2004). e-Government: The Science of the Possible (1st ed.). Delhi: Prentice Hall India Learning. ISBN 978-81-203-2608-8.
  • Satyanarayana, J. (2012). Managing Transformation: Objectives to Outcomes. Delhi: Prentice Hall India Learning. ISBN 978-81-203-4537-9.

మూలాలు

[మార్చు]
  1. https://www.business-standard.com/companies/people/axis-bank-s-neelkanth-mishra-appointed-as-uidai-s-part-time-chairman-123082201029_1.html
  2. "SUPREMO". supremo.nic.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-06.
  3. 1 2 3 4 5 6 "J. Satyanarayana - Executive Record Sheet". Department of Personnel and Training, Government of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 January 2018.
  4. 1 2 3 4 5 "BOARD MEMBER - SHRI J SATYANARAYANA". National Institute for Smart Government. ఒరిజినల్ నుండి 21 January 2018 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 January 2018.
  5. Sasi (2010-08-25). "Satyanarayana to assume office in two or three days". cinejosh.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-06.
  6. GOI, Government (06 january 2025). "Indian dministrative Service Rules 1954" (PDF). DOPT, GOI. ఒరిజినల్ నుండి 2024-08-28 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 06January 2025. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help)CS1 maint: bot: original URL status unknown (link)
  7. "J. Satyanarayana transferred". The Hindu (in ఇంగ్లీష్). 2012-02-25. ISSN 0971-751X. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-06.
  8. "Retired IAS officer J Satyanarayana has been appointed as advisor to government of Andhra Pradesh (e-Governance, electronics and IT). He has been assigned status of cabinet minister". The Times of India. 2014-06-14. ISSN 0971-8257. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-06.
  9. Sharma, Aman (2016-09-07). "DEITY ex-secretary J Satyanarayana is new UIDAI chairperson". The Economic Times. ISSN 0013-0389. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-06.
  10. Gupta, Komal (2016-09-06). "Former IAS officer J. Satyanarayana appointed part-time UIDAI chairman". mint (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-06.
  11. "Ex IAS officer J Satyanarayana appointed part-time UIDAI chief". The Indian Express (in ఇంగ్లీష్). 2016-09-06. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-06.
  12. Business, Standard (06 September 2016). "UIDAI Chairman". Business Standard. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 06January 2026. {{cite web}}: |archive-date= requires |archive-url= (help); |last= has generic name (help); Check date values in: |access-date=, |date=, and |archive-date= (help)CS1 maint: url-status (link)

బాహ్య లింకులు

[మార్చు]