జీతేంద్ర
జీతేంద్ర | |
---|---|
![]() | |
జననం | రవి కపూర్ 1942 ఏప్రిల్ 7 అమృత్‌సర్ , పంజాబ్ , బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత పంజాబ్ , భారతదేశం) |
జాతీయత | ![]() |
ఇతర పేర్లు |
|
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1959–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | |
బంధువులు | అభిషేక్ కపూర్ (మేనల్లుడు) |
జీతేంద్ర (జననం రవి కపూర్ / ræ v i / RAV-ee ; 7 ఏప్రిల్ 1942) భారతదేశానికి చెందిన నటుడు. ఆయన ఆరు దశాబ్దాల సినిమా కెరీర్‌లో 200కి పైగా సినిమాలకు పని చేశాడు.[1]
జీతేంద్ర 1964లో గీత్ గయా పతరోన్ నే సినిమాతో తన నట జీవితాన్ని ప్రారంభించి 1967లో ఫర్జ్‌తో స్టార్‌డమ్‌ని సంపాదించి జీనే కి రాహ్, ఖిలోనా, కారవాన్, బిదాయి, ఉధర్ కా సిందూర్, ధరమ్ వీర్, స్వర్గ్ నరక్, మేరీ దుష్మన్ వంటి విజయవంతమైన సినిమాలో నటించాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]జీతేంద్ర తన భార్య శోభను ఆమె 14 సంవత్సరాల వయస్సులో కలిసాడు. ఆమె పాఠశాల పూర్తి చేసి, కళాశాలకు వెళ్లి, బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగం చేస్తోంది. జితేంద్ర 1960-66 మధ్య నటుడిగా స్థిరపడటానికి కష్టపడుతున్నప్పుడు శోభ అండగా నిలిచింది.[2] ఆమె 18 అక్టోబర్ 1974న జీతేంద్రను కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితులతో మధ్యలో వివాహం చేసుకున్నారు.[3][4] జీతేంద్ర శోభ దంపతులకు ఇద్దరు పిల్లలు కుమార్తె ఏక్తా కపూర్, కుమారుడు తుషార్ కపూర్ ఉన్నారు.[5]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]ప్రధాన వ్యాసం: జీతేంద్ర నటించిన సినిమాలు
అవార్డులు, సన్మానాలు
[మార్చు]- 1998 – 18వ ఉజాలా సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులలో గెస్ట్ ఆఫ్ హానర్ అవార్డు[6]
- 2002 – న్యూయార్క్‌లోని జీ గోల్డ్ బాలీవుడ్ మూవీ అవార్డ్స్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు.[7]
- 2003 – ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు[8]
- 2004 – అట్లాంటిక్ సిటీ (యునైటెడ్ స్టేట్స్)లో "లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా" అవార్డు.[9]
- 2005 – స్క్రీన్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
- 2008 – సాన్సుయ్ టెలివిజన్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు[10]
- 2012 – జీ సినీ జీవితకాల సాఫల్యా అవార్డు
- 2012 – లయన్స్ గోల్డ్ అవార్డ్స్: మోస్ట్ ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ హీరో[11]
మూలాలు
[మార్చు]- ↑ "Jeetendra". IMDb. Archived from the original on 25 January 2017. Retrieved 2016-04-07.
- ↑ "Jeetendra reveals how Karwa Chauth ritual saved him from plane crash, says he lost co-star in tragedy". 7 November 2021.
- ↑ "Jeetendra and Shobha Kapoor renew wedding vows as they celebrate 50 years of togetherness, Ektaa and Tusshar share heartwarming videos". The Times of India. 2024-12-16. ISSN 0971-8257. Retrieved 2024-12-17.
- ↑ "Biography reveals dream girl's love affairs". Paktribune.com. Archived from the original on 24 February 2012. Retrieved 9 May 2010.
- ↑ "Jeetendras hand imprint tile unveiled". IBNlive. Archived from the original on 1 November 2014. Retrieved 12 January 2014.
- ↑ "Cinema Express awards presented". Indianexpress.com. 24 August 1998. Archived from the original on 21 February 2019. Retrieved 21 February 2019.
- ↑ "Bollywood News: Bollywood Movies Reviews, Hindi Movies in India, Music & Gossip". Rediff.com. Archived from the original on 21 February 2019. Retrieved 21 February 2019.
- ↑ "Filmfare Awards (2003)".
- ↑ [1] Archived 8 మే 2006 at the Wayback Machine
- ↑ "Winners of Sansui Awards 2008 – RS Bollywood Online". Radiosargam.com. 30 March 2008. Archived from the original on 19 July 2011. Retrieved 9 May 2010.
- ↑ "19th Lions Gold Awards 2013 Winners". Pinkvilla. 17 January 2013. Archived from the original on 21 January 2013. Retrieved 18 January 2013.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జీతేంద్ర పేజీ