జీన్ టిరోల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీన్‌ టిరోల్‌ (Jean Tirole)
Jean Tirole 2019.jpg
2019 లో జీన్‌ టిరోల్‌
జననం (1953-08-09) 1953 ఆగస్టు 9 (వయసు 69)/ అక్టోబర్, 9 1953
ట్రోయ్స్, ఫ్రాన్స్
జాతీయతఫ్రాన్స్
సంస్థటోలస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్
రంగంసూక్ష్మ ఆర్థికశాస్త్రము
గేం ధియరి
పరిశ్రమల సమాఖ్య
పూర్వ విద్యార్థిమెసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ
పారిస్ డాఫిన్ విశ్వవిద్యాలయము
École nationale des ponts et chaussées
ఇకోల్ పాలిటెక్నిక్
పురస్కారములుజాన్ వాన్ న్యూమన్ పురస్కారము (1998)
నోబెల్ ఆర్థిక బహుమతి (2014)
Information at IDEAS/RePEc

జీన్‌ టిరోల్‌ ఒక ఫ్రెంచి ఆర్థిక శాస్త్రవేత్త. 2014 నోబెల్ ఆర్థిక బహుమతికి ఎంపికవడం ద్వారా వార్తలలో నిలిచాడు[1]

నేపధ్యము[మార్చు]

టిరోల్‌ ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని టోలోస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన మెసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో (మిట్‌) ఆయన పిహెచ్‌డి చేశారు. కొన్ని సంస్థల అధీనంలోనే కార్యకలాపాలు సాగించే పారిశ్రామిక విభాగాలను నియంత్రణలు లేకుండా వదిలివేసినట్టయితే ప్రతికూల ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయని, ధరలు పతాక స్థాయికి చేరిపోవడంతో పాటు మార్కెట్‌లో కొత్త కంపెనీల ప్రవేశాన్ని నిరోధించి తద్వారా గుత్తాధిపత్యానికి దోహదకారి అవుతాయని ఆయన సూత్రీకరించారు. ఇలాంటి మార్కెట్‌ వైఫల్యాలపై ఆయన 1980 దశకం మధ్య నుంచి ప్రత్యేకంగా దృష్టి సారించడం ద్వారా మార్కెట్‌ పరిశోధనలకు కొత్త కోణం ఆవిష్కరించారని స్వీడిష్‌ అకాడమీ తెలిపింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీల కొనుగోళ్ళు, విలీనాల పేరిట సాగే ముఠాతత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి, గుత్త వ్యాపార ధోరణులను ఎలా నియంత్రించాలి అన్న విషయంలో ప్రభుత్వాలు విధానాలు రూపొందించేందుకు టిరోల్‌ పరిశోధనాంశాలు ఎంతో సహాయకారిగా నిలిచాయని ప్రశంసించింది. పరిశోధనలో భాగంగా ఆయన రాసిన అనేక వ్యాసాలు, ప్రచురించిన పుస్తకాలు ప్రభుత్వ విధాన రూపకల్పనకు అవసరమైన మార్గదర్శకం ఇచ్చాయని, టెలికాం, బ్యాంకింగ్‌తో సహా భిన్న రంగాలకు వాటిని వర్తింపచేయడం ద్వారా సత్ఫలితాలు సాధించేందుకు మార్గం సుగమం చేశాయని ఆ ప్రకటనలో వివరించారు. 2008 సంక్షోభం అనంతరం బ్యాంకింగ్‌ రంగ సంస్థలను నియంత్రించడంలో టిరోల్‌ పరిశోధన ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు ఎంతో సహాయకారి అయిందని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌, ఆర్థికవేత్త ఫిలిప్‌ అఘియాన్‌ అన్నారు. ఈ విభాగంలో టిరోల్‌కు తిరుగులేదని ఆయన పేర్కొన్నారు. నియంత్రణాపరమైన వైఫల్యాలే 2008 ఆర్థిక సంక్షోభానికి మూల కారణమని టిరోల్‌ 2012 సంవత్సరంలో లెస్‌ ఎకోస్‌ ఫైనాన్షియల్‌ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు [2].

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.theguardian.com/business/2014/oct/13/jean-tirole-nobel-prize-economics
  2. http://www.economist.com/blogs/freeexchange/2014/10/economics