Jump to content

జీలకర్ర నూనె

వికీపీడియా నుండి

జీలకర్ర
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
కుమినమ్
Species:
C. cyminum
Binomial name
Cuminum cyminum

జీలకర్ర నూనె ఒక ఆవశ్యక నూనె.జీలకర్రను వంటింట్లో వుందు తప్పని సరి పోపు సామాను.జీలకర్రను వంటింల్లో ఉపయోగిస్తారు.అంతేకాదు జీలకర్ర చూర్ణాన్ని దేశీయ, ఆయుర్వేద వైద్యంలోఉపయోగిస్తారు.ఈజిప్టులు జీలకర్రను తలనొప్పి నివారణకై వాడేవారని తెలుస్తున్నది.

ఆవశ్యక నూనె అనగా

[మార్చు]

ఆవశ్యక నూనెలు (ఆంగ్లం: Essential Oils) అనేవి మొక్కల నుండి, చెట్లనుండి ఉత్పత్తిచేయు నూనెలు. ఆవశ్యక నూనెలలో అత్యధిక భాగం మొక్కల/చెట్ల భాగాలనుండి అనగా ఆకులు, వేర్లు, కాండం ల బెరడు, కాండం, పూమొగ్గలు, పూలరెమ్మలు,, పళ్ల పైనున్న తొక్కలు (peels/skins) వంటి వాటిలో లభించును [1]. అతితక్కువగా కొన్ని రకాల ఆవశ్యక నూనెలను విత్తానాల నుండి తీయుదురు. వీటిని నూనెలని వ్యవహరించినను వీటిలో కొవ్వు ఆమ్లాలు వుండవు. ఆవశ్యక నూనెలు జలవికర్షణ (hydrophobic) లక్షణం కలిగి, నూనెలలో, హైడ్రొకార్బను సాల్వెంట్ లలో కరుగు లక్షణాలు కలిగి వుండును. ఆవశ్యక నూనె లన్నియు సువాసన కలిగిన నూనెలే. ప్రతి ఆవశ్యక నూనె తనకంటూ ఇక ప్రత్యేక వాసన కలిగి వుండును. ఆవశ్యక నూనెలలో ఒకటి రెండు మినగా యించి మిగతా నూనెలన్నియు తక్కువ బాష్పికరణ/మరుగు ఉష్ణోగ్రత వున్న నూనెలే.తక్కువ ఉష్ణోగ్రత వద్దనే బాష్పీకరణ చెందు ద్రవాలను ఒలటైలులు (volatiles) అంటారు. ఆవశ్యకనూనెలను మొక్కల/చెట్ల యొక్క ఎసెన్సు (Essence=సారం) లు అని కూడా అంటారు

జీలకర్ర మొక్క

[మార్చు]

జీలకర్ర అంబేల్లే ఫెరా /అప్లసియే కుటుంబానికి చెందిన ఏకవార్షిక మొక్క.జీలకర్ర మొక్క వృక్షశాస్త్ర పేరు సినినమ్ సైమినమ్ (Cuminum cyminum) మరియొక పేరు సినినమ్ ఓడోరమ్ (C. odorum). జీలకర్ర మధ్యధర ప్రాంతానికి చెందిన మొక్క.ఇది ఏక వార్షికం.50 సెం.మీ వరకు ఎత్తు పెరుగును. మొక్కముదురు పచ్చనిఆకులను కల్గి వుండును. చిన్న పింకు రంగు పూలనుగుట్టులుగా పుష్పించును. జీలకర్ర మంచి జీర్ణకారిగా పనిచేయు ను. బిబ్లిక్ కాలంనుండి జీలకర్రను జీర్ణకారిగా వాడుచున్నట్లు తెలుస్తున్నది.[2]

జీలకర్ర జన్మ స్థానం దక్షీణ, నైరుతి ఆసియా.కానీ కొందరు ఇజ్రాయిల్, ఈజిప్ట్ అని భావిస్తారు.జీలకర్రను భారతదేశం, చైనా, పర్షియా,, మధ్యధరాప్రాంత దేశాల్లో ఎక్కువగా వాడుతారు.[2]

జీలకర్ర నూనె

[మార్చు]

నూనె ప్రత్యేకమైన ఘాటైన మసలా వాసన కల్గి ఉంది.జీలకర్ర నూనెలో వుండు ప్రధాన సమ్మేళనాలు కుమినిక్, సైమెన్ (cymene ), డై పెంటెన్, లిమోనెన్, పిల్లా ఆండ్రేన్ (phellandrene), పైనేన్ (pinene.) నూనె లేత పసుపు రంగులో లేదా బ్రౌన్ రంగులో వుండును.[2]

  • నూనె విశిష్ట గురుత్వం:0.9200-9300 /20 C వద్ద
  • వక్రీభవన సూచిక:1.468-1.4800 /20 C వద్ద

నూనె సంగ్రహణ విధానం

[మార్చు]

జీలకర్ర నూనెను స్టీము డిస్టీలేసను పద్ధతిలో జీలకర్రనుండి సంగ్రహిస్తారు. జీలకర్రనుండి నూనెను స్టీము డిస్టిలేసన్ (ఆవిరి స్వేదన క్రియ) పద్ధతి ద్వారా సంగ్రహిస్తారు.స్టిము అనగా నీటి ఆవిరి. డిస్టీలరు అను ఒక స్టీల్ పాత్రలో జీలకర్రను పొడిని తీసుకుని, ఆ పాత్ర అడుగునుండి స్టీమును పంపిస్తారు. జీలకర్ర గుండా వేడిగా వున్న (100 °C కన్న ఎక్కువ ఉష్ణోగ్రతవున్న) పయనించు సమయంలో, వాటిలోని నూనెను ఆవిరిగా మార్చును.అదే సమయంలో ఉష్ణనశ్హ్టంవలన కొంత స్టిము నీరుగా మారును, నీటి ఆవిరి,, నూనె ఆవిరులు డిస్టీలరు పైభాగాన వున్న ఒక గొట్టం ద్వారా కండెన్సరుకు వెళ్ళును. కండెన్సరులో ఆవిరి గొట్టం వెలుపలి భాగంలో చల్లని నీరు ప్రవహించు ఏర్పాటు వుండును. అక్కడ నీటి ఆవిరి, జీలకర్ర నూనె ద్రవీకరణ చెంది, సంగ్రహణ పాత్రలో చేరును. సంగ్రహణ పాత్రలో జమ అయిన నూనె, నీటి మిశ్రమాన్ని కొన్ని గంటలు కదప కుండా వుంచాలి. అప్పుడు నూనె, నీరు వేరు వేరు పొరలుగా/మట్టాలుగా ఏర్పడును. నూనె సాంద్రత నీటి కన్న తక్కువ కావున పైభాగాన నూనె, ఆడుగు భాగాన నీరు చేరును, నూనెను వేరు పరచి, వడబోసీ భద్ర పరుస్తారు. పాత్రలో తీసుకున్న పరిమాణాన్ని బట్టి సంగ్రహణకు 5-6 గంటల సమయం పట్టును.

ఉపయోగాలు[2]

[మార్చు]
  • జీలకర్ర నూనె జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది,
  • ఒక టానిక్ గా నాడీ వ్యవస్థ ఉపయోగకరంగా ఉంటుంది,
  • , కండరాల నొప్పులు, నొప్పులను ఉపశమనం కల్గిస్తుంది.
  • ఆవిరి చికిత్సలో జీలకర్ర నూనె జీర్ణ, నాడీ, కండరాల వ్యవస్థలకు ఉపయోగపడుతుంది .

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Cuminum cyminum information from NPGS/GRIN". www.ars-grin.gov. Archived from the original on 2009-01-20. Retrieved 2008-03-13.
  2. 2.0 2.1 2.2 2.3 "Cumin essential oil information". essentialoils.co.za. Archived from the original on 2018-01-31. Retrieved 2018-08-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)