జీవరసాయనవేత్త

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీవ రసాయన ప్రయోగశాలలో ప్రయోగాలు చేస్తున్న జీవ రసాయన శాస్త్రవేత్త

జీవరసాయనవేత్త ను జీవ రసాయన శాస్త్రవేత్త అని కూడా అంటారు. జీవరసాయనవేత్తను ఆంగ్లంలో బయోకెమిస్ట్ అంటారు. ఇతను సాధారణంగా ప్రయోగశాలలో తన బాధ్యతలను నిర్వర్తిస్తాడు. ఇతను ప్రత్యేక సాధనాలను ఉపయోగించి పదార్ధాలను పెంచడం, వడపోయడం, ఎండబెట్టడం, బరువును తూచడం, కొలత వేయడం వంటి పనులను చేస్తుంటాడు. అహార, మందుల యొక్క ప్రభావంపై అధ్యయనం చేస్తూ తన పరిశోధనను కొనసాగిస్తాడు. జీవించి ఉన్న కణజాలంపై పదార్ధాల ప్రతికూలతలను అంచనా వేస్తాడు. అనేక మంది జీవ రసాయన శాస్త్రవేత్తలు పరమాణు జీవశాస్త్రం పై కూడా ఆసక్తిని కలిగి ఉన్నారు. జన్యువులు, జన్యు వ్యక్తీకరణ పై పరమాణు స్థాయిలో అధ్యయనం చేయడం, వాటి జీవితంపై అధ్యయనం చేయడం వంటివి చేస్తారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

జీవ రసాయన శాస్త్రం

జీవ రసాయనాలు