జీవిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీవిత రాజశేఖర్
Jeevitha on October 26, 2015.jpg
2015లో జీవిత రాజశేఖర్
జననం
పద్మ

(1966-05-24) 1966 మే 24 (వయసు 57)
వృత్తి
 • నటి
 • దర్శకురాలు
 • నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1984–1990 (ప్రముఖ నటిగా); 2010-ప్రస్తుతం (రాజకీయాలు, రియాలిటీ టీవీ షోలు)
జీవిత భాగస్వామి
పిల్లలుశివాని రాజశేఖర్ (b. 1994)
శివాత్మిక (b. 1999)

జీవిత తెలుగు సినిమా నటి, దర్శకురాలు, రాజకీయ నాయకురాలు. అసలు పేరు పద్మ. స్వస్థలం శ్రీశైలం. నాన్న రామనాథం. హెల్త్ ఇన్స్‌పెక్టర్. అమ్మ శకుంతల నర్స్‌. ఒక అక్క, అన్న, చెల్లెలు. తాత ఎన్టీఆర్‌ వద్ద అకౌంటెంట్‌గా పనిచేసేవారు. తమిళ దర్శకుడు టి.రాజేందర్ 'ఉరవై కార్తకిలి' అనే తమిళ చిత్రంలో తొలిసారి హీరోయిన్‌గా నటించారు. 1991లో డా.రాజశేఖర్తో పెళ్ళి జరిగింది. 1996 లో మొదటి కూతురు శివానీ, 2000 లో రెండో పాప శివాత్మిక పుట్టారు.[1]

వార్తలలో జీవిత[మార్చు]

2013 చెక్ బౌన్స్ కేసు[మార్చు]

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జీవిత, రాజశేఖర్ కుటుంబం

చెక్ బౌన్స్ కేసులో సినీనటి జీవితా రాజశేఖర్ కు వారెంట్లు జారీ అయ్యాయి. చెక్ బౌన్స్ కేసులో విచారణకు హజరుకాకపోవడంతో నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. చిత్ర నిర్మాణం కోసం ఓ రిటైర్డ్ ఇంజినీర్ పరంధామ రెడ్డి వద్ద 36 లక్షల రూపాయలు తీసుకున్నారని.. అప్పు తీర్చడానికి జీవితా రాజశేఖర్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో బాధితుడు నాంపల్లి కేసులో పిటిషన్ దాఖలు చేశారు. బాధితుడి పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. జీవితా రాజశేఖర్ రెండుసార్లు కోర్టుకు గైర్హాజరవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. 2013 అక్టోబరు 29 తేదిలోగా జీవితా రాజశేఖర్ ను కోర్టులో హాజరుపర్చాలని జూబ్లీహిల్స్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.[2]

నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]

 1. తలంబ్రాలు (1986)
 2. ఆహుతి (1987)
 3. ఇదా ప్రపంచం (1987)
 4. డామిట్ కథ అడ్డం తిరిగింది (1987)
 5. రాక్షస సంహారం (1987)
 6. అన్నా చెల్లెలు (1988)
 7. ఇంద్రధనుస్సు (1988)
 8. జానకిరాముడు (1988)
 9. నవభారతం (1988)
 10. బావా మరదళ్ల సవాల్ (1988)
 11. స్టేషన్‌ మాస్టర్ (1988)
 12. మంచివారు మావారు (1989)
 13. అంకుశం (1990)

దర్శకత్వం వహించిన తెలుగు చిత్రాలు[మార్చు]

 1. శేషు (2002) [3]
 1. మహంకాళి (2013)
 2. సత్యమేవ జయతే

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-06-02. Retrieved 2020-02-19.
 2. http://www.business-standard.com/article/news-ians/non-bailable-warrant-against-actors-jeevitha-rajasekhar-113100700483_1.html
 3. BBC News తెలుగు (8 March 2021). "తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు... సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=జీవిత&oldid=3840968" నుండి వెలికితీశారు