జీవితం సప్తసాగర గీతం (పాట)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

జీవితం సప్తసాగర గీతం అనే పాట 1988 లో విడుదలైన చిన్ని కృష్ణుడు చిత్రం లోనిది. ఇందులో రమేష్ బాబు, కుష్బూ నటించారు. దీనికి సంగీతం ఆర్.డి.బర్మన్. గాత్రం: ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, ఆశా భోస్లే, రచన: వేటూరి సుందర రామమూర్తి

సాహిత్యం[మార్చు]

జీవితం సప్తసాగర గీతం
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం
కల ఇల కౌగిలించేచోట
కల ఇల కౌగిలించేచోట
||జీవితం||

ఏది భువనం ఏది గగనం తారాతోరణం
ఈ చికాగో సియర్స్ టవరే స్వర్గసోపానము
ఏది సత్యం ఏది స్వప్నం డిస్నీ జగతిలో
ఏది నిజమో ఏది మాయో తెలియని లోకము
హే
బ్రహ్మ మానస గీతం
మనిషి గీసిన చిత్రం
చేతనాత్మక శిల్పం
మతి కృతి పల్లవించేచోట
మతి కృతి పల్లవించేచోట
||జీవితం||

ఆ లిబర్టీ శిల్పశిలలలో స్వేచ్ఛాజ్యోతులు
ఐక్యరాజ్య సమితిలోన కలిసే జాతులు
ఆకాసాన సాగిపోయే అంతరిక్షాలు
ఈ మియామి బీచ్ కన్న ప్రేమ సామ్రాజ్యము
హే
సృష్టికే ఇది అందం
దృష్టికందని రూపం
కవులు రాయని కావ్యం

కృషి-ఖుషి సంగమించేచోట
కృషి-ఖుషి సంగమించేచోట
||జీవితం||

బయటి లంకెలు[మార్చు]