జీశాట్-10 ఉపగ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
GSAT-10
మిషన్ రకంCommunication
COSPAR ID2012-051B Edit this at Wikidata
SATCAT no.38779Edit this on Wikidata
మిషన్ వ్యవధి15 years (Planned)
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్I-3K
తయారీదారుడుISRO Satellite Centre
Space Applications Centre
లాంచ్ ద్రవ్యరాశి3,435 కిలోగ్రాములు (7,573 పౌ.)
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ29 September 2012 (2012-09-29)
రాకెట్Ariane 5ECA
లాంచ్ సైట్Guiana Space Centre ELA-3
కాంట్రాక్టర్Arianespace
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Geostationary
ట్రాన్స్‌పాండర్లు
బ్యాండ్12
Ku-band
12 C-band
6 Lower Extended C-band
బ్యాండ్ వెడల్పు36 megahertz
 

జీశాట్-10 అనునదిభారతదేశానికి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తయారు చేసి, ప్రయోగించి నసమాచార సేకరణ, ప్రసరణచెయ్యు ఉపహ్రాగం.దీనినిఫ్రెంచి గయానా లోని రాకెట్‌లాంచ్ కేంద్రం నుండి ఏరియన్ -5ECA అను ఉపగ్రహ వాహకనౌక ద్వారా అంతరిక్షములో కక్ష్యలో ప్రవేశపెట్టారు.

ఉపగ్రహ సమాచారం

[మార్చు]

జీశాట్–8 ప్రయోగం తరువాత INSAT/GSAT వరుసలో ప్రయోగించిన రెండవ ఉపగ్రహం ఇది. ఇస్రోవారు నిర్మించిన ఉపగ్రహాల్లో ఎక్కువ బరువుఉన్న ఉపగ్రహం జీశాట్-10. ప్రయోగసమయంలో ఉపగ్రహం బరువు 3400 కిలోలు.ఈ ఉపగ్రహంలో మొత్తం 30 ట్రాన్స్ పాండరులు అమర్చారు, KU బాండ్ ట్రాన్స్‌పాండరులు12, Cబాండ్ ట్రాన్స్‌పాండరులు12, లోపవర్ ఎక్స్‌టెండెడ్ C బాండ్ ట్రాన్స్‌పాండరులు 6 అమర్చారు.దీనితో పాటి గతంలో పనిచేయుచున్న GAGAN యొక్క సామర్ధ్యాన్ని బలోపేతం చెయ్యుపేలోడ్‌నుకూడా ఉపగ్రహంలో ఉంచారు.ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షములో భూసమస్థితి కక్ష్యలో తూర్పుకు 83.0°కోణంలో భూ ప్రదక్షణ చేసెలా ఉంచారు. ఈ కక్ష్యనుడి ఈ ఉపగ్రహం సమాచారాన్ని భారతదేశానికి చేరవేస్తున్నది. జీశాట్-10 ఉపగ్రహం 15 సంవత్సరాలు తన సేవలను అందిస్తుంది.

జీశాట్-10 పేలోడ్ వివరాలు

[మార్చు]
  • అధిక శక్తి వంతమైన,140 W TWTAకలిగిన, KU-బాండ్ ట్రాన్స్‌పాండరులు: 12.
  • 32 W TWTA కలిగిన C బాండ్ ట్రాన్స్‌పాండరులు:12,
  • 36 బాండ్‌విడ్త్ MHz తో 32 W TWTA కలిగిన లోపవర్ ఎక్స్‌టెండెడ్ C బాండ్ ట్రాన్స్‌పాండరులు: 6
  • L1, L2 బాండ్‌లో పనిచేయు GAGAN నావిగేసన్ పేలోడ్.

జీశాట్-10 ఉపగ్రహం ప్రయోగ వివరాలు

[మార్చు]

ఈ ఉపగ్రహాన్ని దక్షిణ అమెరికాలోని ఫ్రెంచి గయానాలోని కౌరౌ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుండి, ఏరియన్-5ECA అను ఉపగ్రహ వాహకనౌక సహాయంతో 2012 సెప్టెంబరు 29 సంవత్సరము, భారతీయ కాలమాన ప్రకారం ఉదయం 2:48 గంటలకు అంతరిక్షములోకి పంపారు.ఈ ఉపగ్రహ వాహకనౌక ప్రయోగకేంద్రం నుండి బయలుదేరిన 30 నిమిషాల తరువాత జీశాట్-10 ని కక్ష్యలో వదిలినది.ఏరియన్ -5ECA వాహక నౌక జీశాట్ -10 ని కక్ష్యలో ప్రవేశ పెట్టుటకు ముందు మరో యోరోపియన్ ఉపగ్రహం ASTRA 2F ని కూడాకక్ష్యలో వదిలినది.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]