జీశాట్-1 ఉపగ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
GSAT-1
GSAT-1.JPG
మిషన్ రకం Communications
Technology
నిర్వహించే సంస్థ ISRO
COSPAR ID 2001-015A
SATCAT № 26745
మిషన్ కాలము Launch failure
అంతరిక్షనౌక లక్షణాలు
ఉపగ్రహ బస్ I-2K
తయారీదారుడు ISRO
ప్రారంభ ద్రవ్యరాశి 1,540 kilograms (3,400 lb)
మిషన్ ప్రారంభం
ప్రారంభ తేదీ 18 April 2001, 10:13 (2001-04-18UTC10:13Z) UTC
రాకెట్ GSLV Mk.I
ప్రారంభించిన స్థలం Shiharikota FLP
Contractor ISRO
ఆర్బిటాల్ పరామితులు
నిర్దేశ వ్యవస్థ Geocentric
Regime Medium Earth
Geostationary planned
Longitude 73° west (2000)
99° west (2000—2006)
76.85° west (2006—2009)
Perigee 33,800 kilometres (21,000 mi)
Apogee 35,725 kilometres (22,198 mi)
Inclination 0.9 degrees
Period 1384.09 minutes
Epoch 25 April 2001[1]
Transponders
Band 3 C-band
2 S-band

జీశాట్-1 ఉపగ్రహం, తొలి GSLV రాకెట్ శ్రేణిలో ప్రయోగించిన ఒక ప్రయోగాత్మక సమాచార ఉపగ్రహం.ఈ ఉపగ్రహంలో S-బాండ్ మీద ట్రాన్స్‌మిట్ /ప్రసారం చెయ్యు పల్సుమోడ్ మోడులేసన్ పరీక్షించు పరికరాన్ని (PCM), C-బాండ్ లో పనిచేయు ట్రాన్స్‌ఫాండరులను అమర్చారు.అయితే అనుకున్న నిర్దేశిత కక్ష్యకన్న తక్కువ ఎత్తుకక్ష్యలో ఉపగ్రహం ప్రవేశపెట్టబడటం వలన, ఈ ఉపగ్రహం నుండి ఆశించిన విధంగా పూర్తి ఫలితాలను పొందటం సాధ్యపడలేదు. GSAT-1 అనుకున్న లక్ష్యకక్ష్యలో చేరకపోవటం వలన ప్రాథమిక సమాచార సేకరణ వ్యవస్థ వైఫల్యం చెందినది.1530 కిలోల బరువైనఈ ఉపగ్రహం అనుకున్న విధంగా భూ సమస్థితి కక్ష్యలో (geosynchronous orbit) 24 గంటకు ఒకసారి ప్రదక్షిణకు బదులుగా 23 గంటల రెండు నిమిషాలకు ఒక సారి భూప్రదక్షిణ చెయ్యడం వలన ఈ సమస్య ఉత్పన్నమైనది. అందువలన అనుకున్నవిధంగా కంప్రెస్డ్ డిజిటల్ TV సిగ్నల్స్ ప్రసారం, మరియు డిజిటల్ ఆడియో బ్రాడ్‌కాస్టింగ్ మరియు ప్రయోగాత్మకపరీక్షలు అనుకున్న విధంగా నిర్వహించలేకపోయారు.

GSLV ఉపగ్రహవాహక నౌక ఉపగ్రహాన్ని భూసమస్థితి కక్ష్యలో 19.2 డిగ్రీల కోణంలో 185 x 35.975 km కక్ష్యలో ప్రవేశపెట్టవలసి ఉండగా, అనుకున్న దాన్నికన్న తక్కువఎత్తులో ఉండటం వలన ప్రయోగ లక్ష్యం నెరవేరలేదు. ఉపగ్రహాన్ని నిర్దేశితకక్ష్య ఎత్తులోకి పంపుటకు ప్రయత్నించనప్పటికి చోదక ఇంజనులు సరిగా పనిచెయ్యక పోవడం వలన ఫలితం లేకపోయింది.

విఫలం అగుటకు కారణాలు[మార్చు]

12KRB క్రయోజెనిక్ ను రష్యా వారు సరాఫరాచేసారు.ఈ ఇంజన్, పైస్టేజిలో 710 సెకన్ల పాటు మండవలసి ఉండగా, అది కేవలం 698 సెకన్లు మాత్రమే మండటం వలన ఉపగ్రహము కక్ష్యలోకి వెళ్ళలేకపోయింది. పీఎస్ఎల్వీవాహకనౌకలో ఉపయోగించిన వాహాన నావిగేషన్ (వాహన మార్గదశ ) విధానాన్ని జీఎస్ఎల్వి వాహకనౌకలో వాడటంకూడా ఇందుకు కారణం కావోచ్చును.

ఉపగ్రహ ప్రయోగ వివరాలు[మార్చు]

మూడు సి-బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లు మరియు ఒక ఎస్-బ్యాండ్ ట్రాంస్‌పాండరు కలిగిన జీశాట్-1 ఉపగ్రహం, GSLV-D1 ఉపగ్రహ వాహకనౌక ద్వారా 2001 ఏప్రిల్ 18 అంతరిక్షంలోకి ప్రయోగింపబడింది.ఈ ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ లోని, నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ థావన్ అంతరిక్షప్రయోగ కేంద్రం నుండి 18వతేది, ఏప్రిల్ నెల 2001 సంవత్సరం 10.31 (UTC) గంటలకు ప్రయోగించారు .GSAT-1 ఉపగ్రహ ప్రయోగం, డిజిటల్ ఆడియో ప్రసారము, ఇంటర్నెట్ సేవలు మరియు కుదించబడిన డిజిటల్ టీవీ ప్రసారం వంటి కమ్యూనికేషన్ ప్రయోజనాలకోసం కోసం ఉద్దేశింపబడింది.మెరుగైన స్పందన నియంత్రణ త్రస్టరులు ఫాస్ట్‌రికవరీ స్టార్‌సెన్సార్లు మరియు వేడిపైపు రేడియేటర్ ప్యానెల్లు వంటి అనేక కొత్తఅంతరిక్షప్రయోగ పరికారాలు అమర్చారు.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. McDowell, Jonathan. "Satellite Catalog". Jonathan's Space Page. Retrieved 27 September 2013.