జీశాట్-8 ఉపగ్రహం
మిషన్ రకం | Communication |
---|---|
ఆపరేటర్ | ISRO |
COSPAR ID | 2011-022A |
SATCAT no. | 37605 |
మిషన్ వ్యవధి | 12 Years |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
బస్ | I-3K |
తయారీదారుడు | ISRO |
లాంచ్ ద్రవ్యరాశి | 3,093 కిలోగ్రాములు (6,819 పౌ.) |
డ్రై ద్రవ్యారాశి | 1,426 కిలోగ్రాములు (3,144 పౌ.) |
శక్తి | 6,242 watts |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 20 May 2011, 20:38 | UTC
రాకెట్ | Ariane 5ECA VA202 |
లాంచ్ సైట్ | Kourou ELA-3 |
కాంట్రాక్టర్ | Arianespace |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | Geocentric |
రెజిమ్ | Geostationary |
రేఖాంశం | 55° East |
ట్రాన్స్‌పాండర్లు | |
బ్యాండ్ | 24 Ku band |
జీశాట్-8 ఒక సమాచార ఉపగ్రహం.ఇస్రోవారు తయారు చేసిన జీశాట్ శ్రేణికి చెందిన ఉపగ్రహం.ఈ జీశాట్-8 ఒక సమాచార ఉపగ్రహన్ని ఇస్రోవారి ఇన్సాట్ ( INSAT) ప్రణాళికలో భాగంగా తయారు చేసింది.ఈ ఉపగ్రహాన్నిఫ్రెంచి గయానా (French Guiana) లోని కౌరౌ (Kourou) ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి 2011 సంవత్సరం, మేనెల 21 వ తేదిన ప్రయోగించారు.ఈ ఉపగ్రహాన్ని ఎరియన్5అనే ఉపగ్రహ వాహకం ద్వారా అంతరిక్షములో కక్ష్యలో ప్రవేశ పెట్టారు.ఆరియన్5 ఉపగ్రహ వాహనాన్ని యురోపియన్ అరియన్ స్పేస్ వారు తయారు చేసారు.
ప్రయోగం
[మార్చు]భారతదేశంలో ఇస్రో వారిచే తయారు చెయ్యబడిన జీశాట్-8 ని ఇండియానుండి ఫ్రెంచి గయానాలోని Cayenne–Rochambeau విమానాశ్రయానికి అంటోనోవ్ An-124 కార్గో విమానం ద్వారా రవాణా చేసారు.అంతకు ముందు ఇస్రో వారు దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన జీస్ఎల్‌వి వాహకనౌక ద్వారా ఉపగ్రహాన్నిఅంతరిక్షములో పెట్టుటకు రెండుసార్లు ప్రయత్నించి విఫలమైనప్పటికీ[1][2], ఫ్రెంచి గయానా నుండి చేసిన ప్రయోగం విజయవంతమైనది.ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షములో భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టారు. ప్రయోగ సమయంలో ఉపగ్రహం బరువు 3,093కిలోలు.ఇంధన బరువును మినహాయించగా ఉపగ్రహం బరువు 1,426 కిలోలు.ఉపగ్రహంలో విద్యుత్తు శక్తి 6,224 వాట్స్.తూర్పు అక్షాంశములో 55°కోణంలో ఉపగ్రహాన్ని ఉంచారు.
ఉపగ్రహం
[మార్చు]ప్రయోగ సమయంలో ఉపగ్రహం బరువు3,093కిలోలు.ఇందులో4 అత్యంత శక్తివంతమైనKu-బాండ్ ట్రాన్స్‌పాండరులు, L1మరియుL5 రెండు చానల్స్ కలిగిన, GPS మద్దతు కలిగిన జియో అగుమెంటెడ్ నావిగేసన్ (GAGAN) పేలొడలు అమర్చారు.ఉపగ్రహం పనిచెయ్యు జీవిత కాలం 12 సంవత్సరాలుగా భావిస్తున్నారు.Ku-బాండ్ ట్రాన్స్‌పాండరులు INSAT సిస్టాన్ని బలోపేతం చేస్తున్నది.[3]
ఉపగ్ర్హం గురించిన సాంకేతిక వివరాల పట్టిక[3]
బరువు | 3093 కిలోలు (అంతరిక్షంలో పంపేసమయంలో) |
పవర్ | Solar array providing 6242 watts three 100 Ah Lithium Ion batteries |
పరిమాణ కొలతలు | 2.0 x 1.77 x 3.1m cuboid |
Propulsion | 440 Newton Liquid Apogee Motors (LAM) with mono Methyl Hydrazine (MMH) as fuel and Mixed oxides of Nitrogen (MON-3) as oxidizer for orbit raising. |
Stabilisation | 3-axis body stabilised in orbit using Earth Sensors, Sun Sensors, Momentum and Reaction Wheels, Magnetic Torquers and eight 10 Newton and eight 22 Newton bipropellant thrusters |
అంటెన్నాలు | Two indigenously developed 2.2 m diameter transmit/receive polarisation sensitive dual grid shaped beam deployable reflectors with offset-fed feeds illumination for Ku-band; 0.6 m C-band and 0.8x0.8 sq m L-band helix antenna for GAGAN |
ప్రయోగ తేది | 2011 మే 21 |
ప్రయోగ వేదిక | Kourou, French Guiana |
ఉపగ్రహ వాహక నౌక | Ariane-5 VA-202 |
కక్ష్య | Geosynchronous (55° E) |
పనిచేయు జీవిత కాలం | 12 సంవత్సరాలకన్న ఎక్కువ |
మూలాలు
[మార్చు]- ↑ "GSAT-8 communication satellite launched successfully, India's advanced communication satellite". Indian Space Research Organisation. Archived from the original on 2011-09-09. Retrieved 2013-03-13.
- ↑ Naravane, Vaiju (21 May 2011). "Ariane 5 launches GSAT-8 from French Guiana, India's advanced communication satellite". Chennai, India: The Hindu.
- ↑ 3.0 3.1 "GSAT-8". Archived from the original on 2016-11-26. Retrieved 2015-09-04.