జుజ్జూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జుజ్జూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం వీరులపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 7,236
 - పురుషుల సంఖ్య 3,578
 - స్త్రీల సంఖ్య 3,658
 - గృహాల సంఖ్య 1,943
పిన్ కోడ్ 521181
ఎస్.టి.డి కోడ్ 08749

జుజ్జూరు (Juzzuru), కృష్ణా జిల్లా, వీరులపాడు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 181.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

[1] ఈ గ్రామానికి సమీపంలో నరసింహారావుపాలెం, చాత్తన్నవరం, అల్లూరు, జమ్మవరం, గొట్టుముక్కల గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

యెర్రుపాలెం, వీరులపాడు, జి.కొండూరు, నందిగామ.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కంచికచెర్ల, నందిగామ నుండి రోడ్దురవాణా సౌకర్య్హం ఉంది. రైల్వేస్టేషన్: చెరువుమాధవరం, విజయవాడ

గ్రామములోని విద్యా సౌకర్యాలు[మార్చు]

గౌతం జూనియర్ కాలేజి.

శ్రీ వినయ్ విద్యానికేతన్.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

ఉర్దూ పాఠశాల.

బి.సి.బాలుర వసతిగృహం.

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

ఇండియన్ బ్యాంక్. ఫోన్ నం. 08678/287228.

చౌకధరల దుకాణం[మార్చు]

గ్రామములో నూతనంగా ఏర్పాటైన ఈ దుకాణాన్ని, 2017, మార్చి-6న ప్రారంభించారు. [4]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013, జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో బాణావత్ భిక్షాలి సర్పంచ్‌గా ఎన్నికైనారు. [5]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

  1. శ్రీ యఙదత్తాత్రేయుని ఆలయం.
  2. శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో శ్రీ భద్రాద్రిరామ, వేంకటేశ్వరస్వామి, జంటనాగులవిగ్రహ, శిఖర, ధ్వజస్తంభ, పునఃప్రతిష్ఠా కార్యక్రమం, 2015, మే నెల-10వ తేదీ ఆదివారం ఉదయం 9-31 గంటలకు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు భారీగా అన్నసమారాధాన నిర్వహించారు. [2]
  3. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం.
  4. శ్రీ గుంటి వీరాంజనేయస్వామి మరియు శ్రీ పీఠాంజనేయస్వామివారల ఆలయం:- ఈ ఆలయాలలో విగ్రహ, ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా కార్యక్రమం, 2015, మే నెల-10వ తేదీ ఆదివారం ఉదయం 9-31 గంటలకు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు భారీగా అన్నసమారాధాన నిర్వహించారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ పారా చిన్నా, సామ్మ్రాజ్యం దంపతులది రెక్కాడితేగనీ డొక్కాడని కుటుంబం. వీరి కుమారుడు బాబు, చిన్నప్పటినుండి, ప్రభుత్వం అందించే ఉపకారవేతనాలతో, ప్రభుత్వ పాఠశాలలలోనే కష్టపడి చదివి, చిన్న వయస్సులోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై పలువురికి అదర్శంగా నిలిచారు. [3]

మహిళా చిల్లర వర్తకుల సంఘం[మార్చు]

ఈ గ్రామంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు అందరూ కలిసి తొలుత సహకార సంఘం గా ఏర్పడినారు. అనంతరం వీరు మహిళా చిల్లర వర్తకుల సంఘం పేరిట సహకార రిజిస్ట్రారు వద్ద నమోదు చేయించినారు. తమ వ్యాపార లావాదేవీలకు వాణిజ్యపన్నులశాఖ నుండి అనుమతి గూడా తీసుకున్నారు. వీరందరూ తమకు కావలసిన వస్తువులను, బ్రాండెడ్ వస్తువులను ఉత్పత్తి చేసే కంపెనీలతో నేరుగా ఒప్పందం కుదుర్చుకుని, వారినుండి వస్తువులను తీసికొని వచ్చి, అమ్మడంతో వీరి టర్నోవరూ మరియూ లాభాలు పెరిగినవి. వీరి నుండి స్పూర్తి పొందిన మిగాతా ప్రాంతాలవారు గూడా ఈ విధంగా చేసుకోవాలని ప్రయత్నించడం ముదావహం. [6]

ఈ గ్రామములో పమిడిమర్రి వెంకటరత్నమ్మ అను ఒక శతాధిక వృద్ధురాలు ఉన్నారు. ఈమె 102 సంవత్సరాల వయస్సులో, 2017,ఆగష్టు-11న త స్వగృహంలో కాలంచేసినారు. ఈమె భర్త కీ.శే.పమిడిమర్రి నరసింహయ్య స్వాతంత్ర సమరయోధులు. [7]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6639.[2] ఇందులో పురుషుల సంఖ్య 3351, స్త్రీల సంఖ్య 3288, గ్రామంలో నివాసగృహాలు 1662 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2559 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 7,236 - పురుషుల సంఖ్య 3,578 - స్త్రీల సంఖ్య 3,658 - గృహాల సంఖ్య 1,943

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Veerullapadu/Jujjuru". Retrieved 13 June 2016.  External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు అమరావతి; 2015,మే-11; 34వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2016,జనవరి-11; 21వపేజీ. [4] ఈనాడు అమరావతి/నందిగామ; 2017,మార్చి-7; 2వపేజీ. [5] ఈనాడు అమరావతి/నందిగామ; 2017,ఏప్రిల్-22; 1వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2017,జులై-11; 11వపేజీ. [7] ఈనాడు అమరావతి/నందిగామ; 2017,ఆగష్టు-12; 3వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=జుజ్జూరు&oldid=2223261" నుండి వెలికితీశారు