జునాగఢ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Junagadh district
Clockwise from top-left: Bahauddin Maqbara in Junagadh, Mul Dwarka temple in Visavadar, Shil beach, lions in Devalia Safari Park, Girnar Jain temples
పటం
Interactive Map Outlining Junagadh District
Location of district in Gujarat
Location of district in Gujarat
Coordinates: మూస:Wikidatacoord
దేశం India
రాష్ట్రంగుజరాత్
RegionSaurashtra
ముఖ్యపట్టణంJunagadh
Area
 • Total5,093 km2 (1,966 sq mi)
Population
 (2011)[1]
 • Total15,25,605
 • Density300/km2 (780/sq mi)
భాషలు
 • అధికారGujarati, Hindi
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్
362001
Vehicle registrationGJ 11

జునాగఢ్ జిల్లా, భారతదేశం, గుజరాత్ రాష్ట్రం లోని ఒక జిల్లా.దీని పరిపాలనా ప్రధాన కార్యాలయం జునాగఢ్ నగరం.

భౌగోళిక శాస్త్రం[మార్చు]

ఈ జిల్లా పశ్చిమ గుజరాత్‌లోని కతియావార్ ద్వీపకల్పంలో ఉంది. దీనికి ఉత్తరం రాజ్‌కోట్ జిల్లా, వాయువ్యంలో పోర్ బందర్ జిల్లా , తూర్పున అమ్రేలి జిల్లా ఉన్నాయి. దక్షిణ, పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది. జునాగఢ్ జిల్లా నుండి, పోర్ బందర్ జిల్లా ఏర్పడక ముందు పోర్ బందర్ నగరం ఈ జిల్లాలో భాగంగా ఉంది.  జునాగఢ్‌లో గిర్నార్ అనే పర్వతశ్రేణి ఉంది.ఇది హిందూ, జైన మతాలకు పుణ్యక్షేత్రం.

విభాగాలు[మార్చు]

జునాగఢ్ జిల్లాను, పరిపాలనా సౌలభ్యం కోసం జునాగఢ్ నగరం, భేసన్ ఉప జిల్లా, జునాగఢ్ గ్రామీణ, కేషోద్, మాలియా, మానవదర్, మంగ్రోల్, మెందార్డ, వంతాలి, విసవదర్ అనే తాలూకాలుగా విభజించారు.[2]

రవాణా[మార్చు]

జునాగఢ్ రోడ్డు, రైల్వే నెట్‌వర్క్‌ల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ఇది దాదాపు రాజ్‌కోట్ నుండి 100 కిమీ, అహ్మదాబాద్ నుండి 350 కి.మీ. దూరంలో ఉంది. జునాగఢ్ నుండి జెట్పూర్ మీదుగా రాజ్‌కోట్‌ను జాతీయ రహదారి 8డి కలుపుతుంది.

జునాగఢ్ రైల్వే స్టేషన్ రాజ్‌కోట్, అహ్మదాబాద్‌లతో బాగా అనుసంధానం ఉంది. ఇది నగర ప్రాంతంలో ఉంది. జునాగఢ్‌లోని కేశోడ్‌లో విమానాశ్రయం ఉంది. ఇది ముంబైతో పరిమిత అనుసంధానం కలిగి ఉంది. జిల్లాలో పొడవైన తీర రేఖ ఉంది. వెరావల్, మంగ్రోల్, చోర్వాడ్ మొదలైన ఓడరేవులు ఉన్నాయి.కానీ ఇది మత్స్య పరిశ్రమ కాకుండా పరిమిత ఉపయోగాలకు మాత్రమే కలిగి ఉంది.

2011 అక్టోబరు నాటికి, భారత ప్రభుత్వం మౌంట్‌పై రోప్‌వేకి ఆమోదం తెలిపింది. 2021లో ఇది పూర్తయింది. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీచే ప్రారంభించబడింది. గతంలో గిర్నార్ పర్వతానికి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉండేవి, కానీ ఇప్పుడు అవి నిలిపివేసారు.

జనాభా గణాంకాలు[మార్చు]

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19014,15,521—    
19114,58,829+1.00%
19214,91,969+0.70%
19315,79,792+1.66%
19417,29,508+2.32%
19518,29,760+1.30%
196110,51,074+2.39%
197114,08,342+2.97%
198118,13,780+2.56%
199120,91,182+1.43%
200124,48,173+1.59%
201127,43,082+1.14%
source:[3]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం జునాగఢ్ జిల్లాలో 27,43,082 జనాభా ఉంది.[1] దీని జనాభా జమైకా దేశం [4] లేదా యుఎస్ రాష్ట్రం లోని ఉటాతో సమానం.[5] ఇది భారతదేశం లోని 640 జిల్లాలలో దీనికి 142వ ర్యాంక్‌ ఇస్తుంది [1] జిల్లాలో చ.కి.మీ.కు 310 మంది జనసాంద్రత ఉంది.[1] 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 12.01% శాతం పెరుగదల ఉంది.[1] జునాగఢ్‌లో ప్రతి1000 మంది పురుషులకు 952 మంది స్త్రీల లింగ నిష్పత్తి ఉంది.[1] ఇది 2001లో 67.7% అక్షరాస్యత రేటు ఉంది.ఇది 2011లో 76.88%కి పెరిగింది [1]

జునాగఢ్ జిల్లా జనాభా మతాల ప్రకారం (2011)[6]
హిందూ
  
88.38%
ఇస్లాం
  
11.17%
మత వివరాలు తెలపనివారు
  
0.45%
మతాల ప్రకారం జనాభా

జిల్లా జనాభాలో హిందువులు 13,48,315 (88.38%), ముస్లింలు 1,70,338 (11.17%) మంది ఉన్నారు.[6]

97.44% జనాభా మాట్లాడే ప్రధానమైన భాష గుజరాతీ [7].

రాజకీయం[మార్చు]

జిల్లా నం. నియోజకవర్గం పేరు పార్టీ వ్యాఖ్యలు
జునాగర్ 85 మానవదర్ శాసనసభ నియోజకవర్గం అరవింద్ భాయ్ లడనీ భారత జాతీయ కాంగ్రెస్
86 జునాగఢ్ శాసనసభ నియోజకవర్గం సంజయ్ కొరాడియా భారతీయ జనతా పార్టీ
87 విశ్వదర్ శాసనసభ నియోజకవర్గం భూపేంద్ర భయాని ఆమ్ ఆద్మీ పార్టీ
88 కేశోద్ శాసనసభ నియోజకవర్గం దేవభాయ్ మలం భారతీయ జనతా పార్టీ
89 మంగ్రోల్ శాసనసభ నియోజకవర్గం భగ్వాన్జీభాయ్ కర్గతియా భారతీయ జనతా పార్టీ

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

  • నర్సింహ మెహతా (1414?–1481?), కవి-సన్యాసి, తలజా, భావ్‌నగర్‌లో జన్మించాడు.
  • పుత్లీబాయి గాంధీ - మహాత్మా గాంధీ తల్లి
  • కేశుభాయ్ పటేల్ (1928-2020), గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకుడు, జునాగఢ్‌లోని విసవదర్‌లో జన్మించాడు.
  • వజీర్ మహ్మద్ (1929-), జునాగఢ్‌లో జన్మించిన క్రికెటర్, తర్వాత పాకిస్థాన్‌లో స్థిరపడ్డాడు.
  • ధీరూభాయ్ అంబానీ (1932–2002), జునాగఢ్‌లోని చోర్వాడ్‌లో జన్మించిన వ్యాపారవేత్త, వ్యవస్థాపకుడు
  • హనీఫ్ మహ్మద్ (1934–2016), జునాగఢ్‌లో జన్మించిన క్రికెటర్, 1947 తర్వాత పాకిస్థాన్‌లో స్థిరపడ్డాడు.
  • రాజేంద్ర శుక్లా (1942–), కవి, బంట్వా, జునాగఢ్‌లో జన్మించాడు
  • ముస్తాక్ మొహమ్మద్ (1943–), జునాగఢ్‌లో జన్మించిన క్రికెటర్, తర్వాత పాకిస్థాన్‌లో స్థిరపడ్డాడు.
  • సాదిక్ మహ్మద్ (1945–), జునాగఢ్‌లో జన్మించిన క్రికెటర్, తర్వాత పాకిస్థాన్‌లో స్థిరపడ్డాడు.
  • పర్వీన్ బాబీ (1949–2005), బాలీవుడ్ నటి, జునాగఢ్‌లో జన్మించింది
  • సర్ ముహమ్మద్ మహాబత్ ఖాన్జీ III రసూల్ ఖాన్జీ, నైట్ గ్రాండ్ కమాండర్ (GCIE) , నైట్ కమాండర్ (KCIE) (2 ఆగష్టు 1898 ఆగష్టు 2 - 17 నవంబరు 1959 నవంబరు 17 ), 1911 నుండి 1948 వరకు భారతదేశంలోని జునాగఢ్ రాచరిక రాష్ట్రానికి చెందిన జునాగఢ్ చివరి పాలక నవాబ్. అతను ముహమ్మద్ దిలావర్ ఖాన్జీ తండ్రి - సింధ్ మాజీ గవర్నర్ అతని వారసుడు

చదువు[మార్చు]

జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. ఇతర విద్యా సంస్థలు:

  1. ఎన్.ఆర్. వెకారియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ స్టడీస్
  2. అమృత్ ఇన్స్టిట్యూట్, జునాగఢ్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census Hand Book – Junagadh" (PDF). Census of India. Registrar General and Census Commissioner of India.
  2. "Bhesan". 2011 Census of India. Government of India. Archived from the original on 28 November 2017. Retrieved 1 December 2017.
  3. Decadal Variation In Population Since 1901
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on June 13, 2007. Retrieved 2011-10-01. Jamaica 2,868,380 July 2011 est
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-01-01. Retrieved 2011-09-30. Utah 2,763,885
  6. 6.0 6.1 "Population by Religion - Gujarat". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
  7. "Table C-16 Population by Mother Tongue: Gujarat". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.

వెలుపలి లంకెలు[మార్చు]