Jump to content

జుల్ఫికర్ అలీ ఖాన్

వికీపీడియా నుండి
జుల్ఫికర్ అలీ ఖాన్

పదవీ కాలం
1980  1991
ముందు రాజేంద్ర కుమార్ శర్మ
తరువాత రాజేంద్ర కుమార్ శర్మ
పదవీ కాలం
1967  1977
ముందు ఎస్. అహ్మద్ మెహదీ
తరువాత రాజేంద్ర కుమార్ శర్మ
నియోజకవర్గం రాంపూర్

వ్యక్తిగత వివరాలు

జననం 1934 మార్చి 11
బ్రిటిష్ ఇండియా
మరణం 1992 ఏప్రిల్ 5(1992-04-05) (వయసు: 58)
జాతీయత భారతీయుడు
జీవిత భాగస్వామి బేగం నూర్ బానో[1][2]
బంధువులు హైదర్ అలీ ఖాన్ (మనవడు)[3]
సంతానం సయ్యద్ అలీ ముహమ్మద్ ఖాన్ బహదూర్, సమన్ బేగం, సాబా బేగం
నివాసం ఉత్తర ప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకుడు

మేజర్ నవాబ్ సయ్యద్ జుల్ఫికర్ అలీ ఖాన్ బహదూర్ (11 మార్చి 1934 - 5 ఏప్రిల్ 1992) భారతదేశానికి చెందిన భారత సైనిక అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

ఆయన తన అన్నయ్య ముర్తజా అలీ ఖాన్ బహదూర్ తరువాత 1982 నుండి 1992 వరకు రాంపూర్ నవాబుగా పరిపాలించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

జుల్ఫికర్ అలీ ఖాన్ భారత సైన్యం నుండి మేజర్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై మూడు సంవత్సరాలు పని చేసి 1967లో రాంపూర్ నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 1971లో రెండవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

జుల్ఫికర్ అలీ ఖాన్ 1977లో ఓడిపోయి ఆ తరువాత వరుసగా 1980 నుండి 1991 వరకు లోక్‌సభ సభ్యుడిగా పని చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. "रामपुर में नवाब जुल्फिकार अली खां-नूर बानो की मुहब्बत की मिसाल है 'नूरमहल'". Jagran. 10 February 2020. the original నుండి 11 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 June 2025.
  2. "legacy from Azhar may spoil Begum Noor Bano's chances" (in ఇంగ్లీష్). The Pioneer. 18 April 2014. the original నుండి 11 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 June 2025.
  3. "UP assembly polls: Congress veteran Noor Bano's grandson Haider Ali Khan is BJP ally's candidate from Suar". The Times of India. 23 January 2022. the original నుండి 3 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 June 2025.