జూలియన్ అసాంజే

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జూలియన్ అసాంజే
Julian Assange 20091117 Copenhagen 1 cropped to shoulders.jpg
జూలియన్ అసాంజే
జననం జూలియన్ పాల్ అసాంజే
(1971-07-03) 3 జూలై 1971 (వయస్సు: 46  సంవత్సరాలు)
టౌన్స్ విల్లే, క్వీన్స్ ల్యాండ్, ఆస్ట్రేలియా
వృత్తి వికీలీక్స్ ప్రధాన సంపాదకుడు

జూలియన్ పాల్ అసాంజే ( 1971 జూలై 3 జన్మించాడు), ఒక ఆస్ట్రేలియన్ ప్రచురణకర్త, పాత్రికేయుడు, మాద్యమ మరియు అంతర్జాల వ్యవస్థాపకుడు, మాద్యమ విమర్శకుడు, రచయిత, కంప్యూటర్ ప్రోగ్రామర్ మరియు రాజకీయ/అంతర్జాల కార్యకర్త. జూలియన్ అసాంజే ఆస్ట్రేలియా అంతర్జాల ఔత్సాహికుడు. వికీలీక్స్ వెబ్‌సైట్‌కు వ్యాఖ్యాత. ఈ వ్యాపకానికి ముందు ఈయన గణిత/ఫిజిక్స్ విద్యార్థి. అగ్రరాజ్యపు ఆగడాలను కాగడాలతో లోకానికి సత్యాన్ని చాటిచూపిన ధైర్యశీలి. ఈ జాలస్థలి బహిరంగ పాలనే ద్యేయంతో, ప్రపంచవ్యాప్తంగా అంతర్గత రహస్యాలను బహిరంగం చేయటంలో ఒక మధ్యవర్తిగా పనిచేస్తుంది.

ప్రారంభ జీవితం[మార్చు]

యవ్వనం[మార్చు]

వికిలీక్స్ వ్యవస్థాపన తరువాత[మార్చు]

అమెరికా దౌత్య తంతులు విడుదల[మార్చు]

2010 నవంబరు 28 న, వికిలీక్స్ వారి స్వాధీనంలో ఉన్న 251,000 అమెరికన్ దౌత్య తంతుల విడుదల ప్రారంభమైంది. అందులో 53 శాతం పైగా వర్గీకరించబడని జాబితాలో, 40 శాతం "గుప్తమైన"విగా మరియు కేవలం ఆరు శాతం "రహస్య"మైనవిగా వర్గీకరించబడ్డాయి. తరువాతి రోజు, రాబర్ట్ క్లేల్లాండ్, ఆస్ట్రేలియా అటార్నీ-జనరల్, ఆస్ట్రేలియా అస్సాంజే యొక్క కార్యకలాపాలు మరియు వికిలీక్స్ లపై విచారణ జరిపిస్తుందని పత్రికా ప్రతినిదుల సమక్షంలో చెప్పారు.

విమర్శలు[మార్చు]

మద్దతు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

లైంగిక వేధింపుల ఆరోపణలు[మార్చు]

2010 ఆగస్టు 20న, స్వీడిష్ పోలీసులు అస్సాంజేను ఇద్దరు మహిళలతో ఉన్న లైంగిక ఆరోపణలపై విచారణ ప్రారంభించారు. అస్సాంజే తనపై వచ్చిన ఆరోపణలు నిరాదారమైనవని, లైంగిక అనుభవాలన్నీ వారి సమ్మతితోనే జరిగాయని చెప్పారు. డిసెంబరు 2010 లో, అప్పుడు బ్రిటన్ లో ఉన్న అస్సాంజే, స్వీడిష్ అధికారులు తనను ప్రశ్నించటానికి స్వీడన్ కు అతన్ని అప్పగించమని ఒక యూరోపియన్ అరెస్ట్ వారంట్ (EAW) జారీ చేసినట్లు తెలుసుకున్నాడు.

2011 మార్చి 2 న, తన న్యాయవాదులు అసాంజేను స్వీడన్ కు అప్పగించటాన్ని సవాలు చేస్తూ హైకోర్ట్ ను సంప్రదించారు. వాదనలు విన్న తర్వాత హై కోర్ట్ తీర్పుని రిజర్వు చేసింది, అ తరువాత 2011 నవంబరు 2 న తన అప్పీల్ ని కొట్టివేయడం జరిగింది. 2011 డిసెంబరు 5 న, హై కోర్ట్ అస్సాంజే తరపు న్యాయవాదులకు సుప్రీం కోర్ట్ కు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. సుప్రీం కోర్ట్, 1 మరియు 2012 ఫిబ్రవరి 2 న అప్పీల్ వినడం జరిగింది. కోర్టు తీర్పుని రిజర్వు చేసింది, తన నిర్ణయాన్ని కొన్ని వారాలలో వెల్లడించవచ్చని భావిస్తున్నారు.ప్రస్తుతం అస్సాంజే షరతులతో కూడిన బెయిల్ మీద ఉన్నారు.

నివాసం[మార్చు]

అసాంజే ఆస్ట్రేలియన్ పౌరుడు అయినప్పటికీ, వికిలీక్స్ పని ప్రారంభించి తర్వాత ఆస్ట్రేలియాను వదిలి వెళ్లారు.