జూలూరి గౌరీశంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జూలూరి గౌరీశంకర్ తెలుగు రచయిత. ఈయన సృజనాత్మక సాహిత్యంలో ప్రసిద్ధుడు. ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'సృజనాత్మక సాహిత్యం' లో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.[1]

జూలూరి గౌరీశంకర్ ను 2016 అక్టోబరు 22న తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యునిగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియమించారు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

సిధారెడ్డి ఆధ్వర్యంలో ఆయనే అధ్యక్షుడుగా తెలంగాణ రచయితల వేదిక ఏర్పడింది. ఆ వేదికకు 2007లో జూకంటి జగన్నాధం, జూలూరి గౌరీశంకర్‌ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికై ఈ సంస్థ మరెన్నో కార్యక్రమాలు తీసుకుంది.[3][4]

సాహితీ సేవలు[మార్చు]

దళిత కవిత్వంలోను, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ వాదం కవిత్వంలోను, బీసివాద కవిత్వంలోను తనదైన ముద్ర వేసుకున్న బలమైన గొంతు జూలూరి గౌరీశంకర్ ది. తన తొలి దీర్ఘకవిత రాసిన ఎలియాస్ 2001 నుంచి 2007లో వచ్చిన తెలంగాణ మోదుగుల పొదుగు చెకుముకి రాయి వరకు మొత్తం 14 దీర్ఘకవితల్తో ఏ తెలుగు కవి ఇప్పటి వరకు చేయని, చెరిగిపోని దీర్ఘ సంతకం చేసింది గౌరీశంకరొక్కడే. తను 2005లో రాసిన నాలుగో కన్ను బిసి దీర్ఘకవిత ఒక రోజు, ఒకే సమయానికి దాదాపు 22 కేంద్రాల్లో ఆవిష్కరింపబడటం విశేషం.[5]

రచనలు[6][మార్చు]

 • పాదముద్ర
 • ఎలియాస్పొ
 • లికట్టె, వూరుచావు
 • నా తెలంగాణ
 • కాటు
 • సిలబస్‌లో లేని పాఠం
 • ఓ నమఃశవాయ
 • మూడవ గుణపాఠం
 • మాలకాకి
 • ముండ్లకర్ర (1995నుండి 2002 దాకా రాసిన కవితల సమాహారం)
 • నా తెలంగాణ” అనే దీర్ఘకవిత
 • ”పొక్కిలి” తెలంగాణ కవుల కవితా సంకలనం
 • ఆధునిక కవిత్వం

మూలాలు[మార్చు]

 1. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన
 2. నమస్తే తెలంగాణ (OCTOBER 22, 2016). "బీసీ కమీషన్ చైర్మన్‌గా బీఎస్ రాములు". Retrieved 22 October 2016. Check date values in: |date= (help)
 3. కవిత్వమై గెలిచిన తెలంగాణ
 4. Telangana poets, writers for ‘Yuddha Bheri’
 5. బిసీల నాలుగో కన్ను
 6. జూలురు లోకతప్త కవిత్వం ‘ముండ్లకర్ర’

ఇతర లింకులు[మార్చు]