జెనోఫోబియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విదేశీయులు లేదా అపరిచితుల పట్ల లేదా వారి రాజకీయాలు లేక సంస్కృతి పట్ల ద్వేషము లేదా భయము కలిగియుండటాన్ని జేనోఫోబియా (Xenophobia) అంటారు.[1] ఇది గ్రీక్ పదాలు ξένος (జెనోస్) మరియు φόβος (ఫోబోస్) నుండి ఏర్పడింది. ξένος (జెనోస్ ) అంటే "అపరిచితుడు", "విదేశీయుడు" అని మరియు φόβος (ఫోబోస్ ) అంటే "భయము" అని అర్థము.[2] మూస:Discrimination sidebar జెనోఫోబియా ఒక అంతర సమూహానికి మరొక బాహ్య సమూహం పట్ల ఉన్న సంబంధాలు మరియు అవగాతాలు వంటి ఎన్నో విధానాలలో అంకురించవచ్చు. వీటిలో గుర్తింపును పోగొట్టుకునే భయము, బాహ్య సమూహం యొక్క చర్యల విషయంలో అనుమానం, కోపం మరియు ప్రకల్పిత పవిత్రత కోసం బాహ్య సమూహాన్ని నిర్మూలించాలనే కోరిక, వంటివి ఉంటాయి.[3] జెనోఫోబియా ప్రదర్శించే మరొక రూపము "ఒక సంస్కృతి నిర్వివాదంగా ఔన్నత్యం కలియుందని" చెప్పడం, నిజానికి ఆ సంస్కృతి "అవాస్తవమైనది, అసహజమైనది మరియు విదేశీ లక్షణాలు కలిగినది"గా ఆరోపించబడినది అయి ఉంటుంది.[3]

నిర్వచనాలు[మార్చు]

జెనోఫోబియా యొక్క నిఘంటువు నిర్వచనాలు: విదేశీయుల పట్ల లోతుగా-నాటుకు పోయిన ద్వేషము (ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ; OED), అపరిచితుల పట్ల ముఖ్యంగా ఇతర జాతి ప్రజల పట్ల అసమంజసమైన భయము లేదా ద్వేషము (వెబ్స్టర్'స్)[4]

డిక్షనరీ ఆఫ్ సైకాలజీ దీనిని "అపరిచితుల పట్ల భయము"గా నిర్వచించింది.[5] OED నిర్వచించినట్లు, ఇది విదేశీయుల పట్ల మాత్రమే కాకుండా ఇతర సంస్కృతులు, ఉపసంస్కృతులు మరియు నమ్మకాల పట్ల కూడా భయము లేకా ద్వేషము అని అర్థము; సంక్షిప్తంగా దిగువ ఇచ్చిన జాబితాలోని విషయాలకు సంబంధించిన వారెవరి యెడల అయినా ఇది వర్తిస్తుంది: ఉద్భవము, మతము, వ్యక్తిగత నమ్మకాలు, అలవాట్లు, భాష, నిర్ణయాలు మరే ఇతర ప్రమాణాల విషయంలో కూడా వర్తిస్తుంది. కొంతమంది చెప్పిన ప్రకారము వ్యతిరేకించబడ్డ ప్రజల గుంపు సమాజము చేత ఆమోదింపబడలేకపోయింది. కాని నిజానికి భయము లేదా ద్వేషము ఉన్న వ్యక్తి మాత్రమే ఈ విధంగా నమ్ముతాడు. భయముతో ఉన్న వ్యక్తి, గురి చేయబడ్డ ఒక గుంపు పట్ల ఉన్న ఈ విరక్తి (ద్వేషము కూడా) గురించి తెలిసి ఉంటాడు కాని దాన్ని భయముగా గుర్తించరు లేదా ఆమోదించరు.

ఒక వైద్య సంబంధ నిర్వచనము:[clarification needed] ఒక జాతిలోని సభ్యునికి తమ జాతి యొక్క విదేశీయుని పట్ల ఉన్న ఒక అతార్కికమైన భయము, ఇది తరచుగా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ తో కలిసి ఉంటుంది లేదా తరువాత వస్తుంది. ఇంకా: అధికార చలాయింపు వ్యక్తిత్వము యొక్క ప్రవర్తనాపరమైన సామూహిక లక్షణము.[6] వియెత్ కాంగ్ తన తోటి సైనికుణ్ణి సజీవంగా తోలువలుస్తుండగా ఒక వియెత్నాం ముసలి బంటు చూసాడు. అతను మంగోల్ కనురెప్పలు ఉన్న వ్యక్తుల పట్ల ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఈ రెండు ఉదాహరణలలో కూడా జెనోఫోబియా PTSD తో కలిసి ఉంది.[7]

తన లక్ష్యం ఒక విదేశీయుడు అని జెనోఫోబిక్ వ్యక్తి ఏదో ఓక స్థాయిలో ఆలోచించవలసిన మరియు నమ్మవలసిన వాస్తవమైన విషయం. ఇది వివాదాత్మకంగా జెనోఫోబియాను జాత్యహంకారవాదము నుండి వేరుచేస్తుంది మరియు దాని ఫలితంగా జాతిలోని ఒక వ్యక్తి పట్ల ఉన్న సాధారణ దురభిమానము వేరే జాతీయత పట్ల ఉండనవసరములేదు. వివిధ సందర్భాలలో, "జెనోఫోబియా" మరియు "జాత్యహంకారవాదము" అను రెండు పదాలు పరస్పరము ఒకదాని స్థానంలో ఇంకొకటి ఉపయోగించినట్టు ఉండవచ్చు. అయితే ఆ రెండు పదాలు పూర్తిగా వైవిధ్యమైన అర్ధాలు కలిగి ఉన్నాయి. జెనోఫోబియా వేరువేరు విషయాల పై ఆధారపడి ఉంది కాని జాత్యహంకారవాదము మాత్రం జాతి, నైతికత మరియు పూర్వీకులు మొదలగు వాటి పై ఆధారపడి ఉంది. జెనోఫోబియా, ఒక సంస్కృతికి చెందని ఎవరి పైన అయినా దృష్టి పెట్టవచ్చును. ఇది కేవలం ఒక జాతి లేదా ప్రజలకు మాత్రమే సంబంధించినది కానవసరములేదు.

జెనోఫోబియాలో ముఖ్యంగా రెండు విషయాలు ఉంటాయి:

మొదటిది ఒక సమాజములో ఉన్నప్పటికీ ఆ సమాజము యొక్క భాగముగా పరిగణింపబడని ఒక జనాభా సమూహము. తరచూ వారు అప్పుడే వచ్చిన వలసదారులు అయి ఉంటారు, కాని జెనోఫోబియాని కొన్ని శతాబ్దాలుగా సమాజంలో ఉంటున్న లేదా ఆక్రమణ లేక సరిహద్దు విస్తరణ వల్ల ఆ సమాజములో ఒక భాగమైన సమూహాము పై ఉన్న వ్యతిరేకతగా చెప్పవచ్చు. ఇటువంటి రకమైన జెనోఫోబియా సామూహికంగా విదేశీయులను వెళ్ళగొట్టటము, దాడి చెయ్యటం లేడా ఇతర విషయాలలో వ్యూహాత్మక వినాశనం వంటి విరుద్ధమైన మరియు ప్రచండమైన చర్యలను ప్రోత్సహిస్తుంది.

రెండవ రకమైన జెనోఫోబియా ప్రాథమికంగా సాంస్కృతికమైనది. ఇటువంటి భయంలో సాంస్కృతికమైన విషయాలు పరాయి వాటిగా పరిగణింపబడతాయి. అన్ని సంస్కృతులు బాహ్య ప్రభావాలకు లోనవుతాయి కాని సాంస్కృతిక జెనోఫోబియా తరచుగా సంకుచితముగా సూచించబడుతుంది. ఉదాహరణకు, జాతీయ భాషలో విదేశాల నుండి తీసుకున్న పదాలు. ఇది అరుదుగా వ్యక్తుల పై కోపానికి కారణం అవుతుంది, కాని సాంస్కృతికంగా లేక భాషాపరమైన శుద్ధికి చేసే రాజకీయ ప్రచారాలకి దారి తీయవచ్చు. మొత్తము మీద, జెనోఫోబిక్ సమాజాలు "బాహ్య" ప్రపంచంతో అన్యోన్య చర్యలలో పాల్గొనవు. దీనివల్ల ఏకాంతవాదము పెరిగి జేనోపోబియా మరింతగా పెరుగుతుంది.

బాహ్య లింకులు[మార్చు]

 • జేనోఫోబ్లాగ్ - జెనోఫోబియా మరియు సంబంధిత విషయాల పై వార్తలు, సమాచారం మరియు వనరులను అందిస్తుంది.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • వివేకం
 • ఫోబియాల జాబితా
 • జెనోఫోబిక్ పదాల జాబితా
 • నేటివిజం
 • జాతీయవాదం
 • జాత్యహంకారవాదం
 • జెనోఫిలి
 • జెనోసెంట్రిజం (అభిజాత్యానికి వ్యతిరేక పదం)

సూచనలు[మార్చు]

 1. http://dictionary.reference.com/browse/xenophobia
 2. ఆక్స్ఫర్డ్ స్టాండర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ' (OED). ఆక్స్ఫర్డ్ ప్రెస్, 2004, CDROM వెర్షన్.
 3. 3.0 3.1 గైడో బొలఫ్ఫీ. డిక్షనరీ ఆఫ్ రేస్, ఎత్నిసిటి మరియు కల్చర్ . SAGE పబ్లికేషన్స్ లి., 2003. పేజీలు 332.
 4. వెబ్స్టర్ యొక్క న్యూ అనేబ్రిజ్ద్ డిక్షనరీ, డార్‌సెట్ మరియు బబెర్, సైమన్ మరియు శుష్టర్, 1983
 5. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ, చాప్‌మాన్, డెల్ పబ్లిషింగ్, 1975 ఐదవ ముద్రణ 1979.
 6. http://courses.ed.asu.edu/nelsen/edp530/pdf/Lect03Psychoanalysis.pdf
 7. 17 U.పుగేట్ సౌండ్ L. రె. 381 (1993-1994), అగోరఫోబియ తో జెనోఫోబియా: జాన్ యం.కాసే చే ది అమెరికన్స్ విత్ డిసెబిలిటీస్ ఆక్ట్ కింద ఫోబియలు మరియు ఇతర ఉద్వేగము యొక్క అస్తవ్యస్తములు

మూస:Segregation by type మూస:Discrimination మూస:Ethnicity