Jump to content

జెమిమా రోడ్రిగ్స్

వికీపీడియా నుండి
జెమిమా రోడ్రిగ్స్
2020 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ సందర్భంగా భారతదేశం తరపున బ్యాటింగ్ చేస్తున్న రోడ్రిగ్స్
2020 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ సందర్భంగా భారతదేశం తరపున బ్యాటింగ్ చేస్తున్న రోడ్రిగ్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జెమిమా జెస్సికా రోడ్రిగ్స్
పుట్టిన తేదీ (2000-09-05) 2000 సెప్టెంబరు 5 (వయసు 24)
ముంబై, మహారాష్ట్ర
మారుపేరుజెమి
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాటింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 123)2018 మార్చి 12 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2021 జూలై 3 - ఇంగ్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.5
తొలి T20I (క్యాప్ 56)2018 ఫిబ్రవరి 13 - దక్షిణాఫ్రికా తో
చివరి T20I2023 ఫిబ్రవరి 23 - ఆస్ట్రేలియా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.5
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2014/15–ప్రస్తుతంముంబయి
2018ట్రైల్‌బ్లేజర్స్
2019–2020సూపర్నోవాస్
2019యార్క్‌షైర్ డైమండ్స్
2021–ప్రస్తుతంఉత్తర సూపర్ ఛార్జర్స్
2021/22మెల్ బోర్న్ రెనెగేడ్స్
2022ట్రైల్‌బ్లేజర్స్
2022/23–presentమెల్ బోర్న్ రెనెగేడ్స్
2023–ప్రస్తుతంఢిల్లీ క్యాపిటల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే ట్వంటీ20
మ్యాచ్‌లు 21 80
చేసిన పరుగులు 394 1,704
బ్యాటింగు సగటు 19.70 29.89
100లు/50లు 0/3 0/10
అత్యధిక స్కోరు 81* 76
వేసిన బంతులు 12 18
వికెట్లు 1 0
బౌలింగు సగటు 6.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/1
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 20/–
మూలం: ESPNcricinfo, 23 ఫిబ్రవరి 2023

జెమిమా జెస్సికా రోడ్రిగ్స్[1] మహారాష్ట్రకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[2] భారత జాతీయ మహిళా క్రికెట్ జట్టు, ముంబై మహిళల క్రికెట్ జట్టు కోసం ఆడే ఆల్‌రౌండర్. అండర్-17 మహారాష్ట్ర హాకీ జట్టుకు కూడా ఆడింది.

2018 జూన్ లో జార్ఖండ్‌లోని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ద్వారా బెస్ట్ డొమెస్టిక్ జూనియర్ ఉమెన్స్ క్రికెటర్‌గా క్రికెటర్ ఎంఎస్ ధోని చేతులమీదుగా జగ్‌మోహన్ దాల్మియా అవార్డును అందుకున్నది.[3]

జననం

[మార్చు]

జెమిమా రోడ్రిగ్స్ 2000, సెప్టెంబరు 5న మహారాష్ట్ర, ముంబైలోని భాండప్‌లో జన్మించింది. తనకు ఇద్దరు సోదరులు ఎనోచ్, ఎలీ ఉన్నారు. క్రైస్తవ మతాన్ని ఆచరిస్తోంది.[4] నాలుగేళ్ళ వయస్సులో సీజన్ క్రికెట్ ఆడటం ప్రారంభించింది. మెరుగైన క్రీడా సౌకర్యాలను పొందేందుకు వారు చాలా చిన్న వయస్సులోనే బాంద్రా వెస్ట్‌లో ఉన్న నగరం మరొక మూలకు మారారు. తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్, ఆమె పాఠశాలలో జూనియర్ కోచ్, తన సోదరులకు బౌలింగ్ చేస్తూ పెరిగింది. మొదటి నుండి ఆమెకు శిక్షణ ఇస్తూ, ఆమె పాఠశాలలో బాలికల క్రికెట్ జట్టును ప్రారంభించాడు. జెమీమా తన యవ్వనంలో హాకీ, క్రికెట్ రెండింటినీ ఆడేది.[5][6]

జెమిమా రోడ్రిగ్స్ ముంబైలోని సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ హైస్కూల్‌లో, తరువాత రిజ్వీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్‌లో చదివింది.[7]

క్రికెట్ రంగం

[మార్చు]

జెమిమా రోడ్రిగ్స్ మహారాష్ట్ర అండర్-17, అండర్-19 హాకీ జట్లకు ఎంపికైంది. 2012-13 క్రికెట్ సీజన్‌లో 12 సంవత్సరాల వయస్సులో క్రికెట్ అండర్-19 అరంగేట్రం జరిగింది. కేవలం 13 ఏళ్ళ వయసులో అండర్-19 రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఎంపికైంది.[8]

2021-22 డబ్ల్యూబిబిఎల్ లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరపున రోడ్రిగ్స్ బ్యాటింగ్

స్మృతి మంధాన తర్వాత 50 ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన రెండో మహిళగా రోడ్రిగ్స్ రికార్డు సృష్టించింది. 2017 నవంబరులో సౌరాష్ట్ర జట్టుపై ఔరంగాబాద్‌లో కేవలం 163 బంతుల్లో 202* పరుగులు చేసింది. ఇందులో 21 బౌండరీలు ఉన్నాయి.[9] ఈ మ్యాచ్‌కు ముందు అండర్-19 టోర్నమెంట్‌లో గుజరాత్ జట్టుపై 142 బంతుల్లో 178 పరుగులు చేసింది.[10]

2018 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో[11] మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కి భారత జట్టుకి ఆమె ఎంపికైంది. 2018, ఫిబ్రవరి 13న దక్షిణాఫ్రికా మహిళలపై భారత మహిళలకు మహిళల ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసింది.[12] 2018, మార్చి 12న ఆస్ట్రేలియా మహిళలపై భారత మహిళలకు మహిళల వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[13]

2018 అక్టోబరులో వెస్టిండీస్‌లో జరిగిన 2018 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్‌లో భారత జట్టుకు ఎంపికైంది.[14][15] టోర్నమెంట్‌కు ముందు జట్టులో మంచి క్రీడాకారిణిగా పేరుపొందింది.[16] టోర్నమెంట్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చే జట్టులో అత్యుత్తమ క్రీడాకారిణిగా ఎంపికైంది.[17]

2018 అక్టోబరులో రోడ్రిగ్స్ తన అన్ని వాణిజ్య ప్రయోజనాలను నిర్వహించాల్సిన స్పోర్ట్స్ మార్కెటింగ్ సంస్థ బేస్‌లైన్ వెంచర్స్ ద్వారా సంతకం చేసింది. 2019, మార్చి 1న ఐసీసీ 2019 ప్రపంచ కప్ కోసం భారత క్రికెట్ జట్టు న్యూజెర్సీ లాంచ్ వేడుకకు హాజరయింది, ఇందులో హర్మన్‌ప్రీత్ కౌర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే,పృథ్వీ షాతో సహా ఇతర క్రికెటర్లు కూడా హాజరయ్యారు.[18] 2020 జనవరిలో ఆస్ట్రేలియాలో జరిగే 2020 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టులో చోటు దక్కించుకుంది.[19]

2021 మేలో ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన వన్-ఆఫ్ మ్యాచ్ కోసం భారత టెస్ట్ జట్టులో ఎంపికైంది.[20] 2021 వేసవిలో రోడ్రిగ్స్ నార్తర్న్ సూపర్‌చార్జర్స్ కోసం ప్రారంభ హండ్రెడ్ పోటీలో పాల్గొని బ్యాటింగ్ తో రాణించింది. సగటు 41.50, వెల్ష్ ఫైర్‌పై 92*తో మహిళల హండ్రెడ్‌లో అత్యధిక స్కోరును నమోదు చేసింది.[21] మహిళల హండ్రెడ్ టోర్నమెంట్‌లో 249 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన రెండో క్రీడాకారిణిగా నిలిచింది.[22] 2021 ఆగస్టులో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ కోసం భారతదేశం టెస్ట్ జట్టులో రోడ్రిగ్స్ కూడా ఎంపికయ్యాడు.[23]

2021 డబ్ల్యూబిబిఎల్ లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరపున కూడా ఆడుతుంది.[24] 2022 ఫిబ్రవరిలో హండ్రెడ్ 2022 ఎడిషన్ కోసం నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌చే నిలుపుకుంది.[25]

2022 జూలైలో ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ టోర్నమెంట్ కోసం ఆమె భారత జట్టులో ఎంపికైంది.[26]

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ప్రారంభ ఎడిషన్‌లో రూ. 2.20 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు విక్రయించబడింది.[27] తన వుమెన్ ప్రీమియర్ లీగ్ 2023 అరంగేట్రం మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేవలం 15 బంతుల్లో 22 పరుగులు చేసి ఆకట్టుకుంది.

మూలాలు

[మార్చు]
  1. "How to Pronounce Jemimah Rodrigues". YouTube (in ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
  2. "India's potential Test debutantes: Where were they in November 2014?". Women's CricZone. Retrieved 2023-08-09.
  3. "Kohli, Harmanpreet, Mandhana win top BCCI awards". ESPN Cricinfo. 7 June 2018. Retrieved 2023-08-09.
  4. "Christmas: I Spent The Night Waiting For Santa, Says Cricketer Jemimah Rodrigues". 23 December 2018. Retrieved 2023-08-09.
  5. "From Bhandup to Bleed Blue, the story of Jemimah Rodrigues". 17 March 2018.
  6. "Jemimah Rodrigues, 16, follows in Smriti Mandhana's footsteps, scores double ton". The Indian Express. 2017-11-06. Retrieved 2023-08-09.
  7. "Jemimah Rodrigues - a new star in the making". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
  8. "Mumbai girl slams double ton in 50-over game - Times of India". The Times of India. Retrieved 2023-08-09.
  9. "Only 17, Jemimah Rodrigues already spells double trouble". wisdenindia. 2017-11-06. Retrieved 2023-08-09.
  10. "Mumbai girl Jemimah Rodrigues slams double century in 50-over cricket". Zee News (in ఇంగ్లీష్). 2017-11-06. Retrieved 2023-08-09.
  11. "Mithali to lead, Jemimah named in Indian squad". The Hindu. 2018-01-10. ISSN 0971-751X. Retrieved 2023-08-09.
  12. "1st T20I, India Women tour of South Africa at Potchefstroom, Feb 13 2018". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
  13. "Australia Women require another 126 runs with 9 wickets and 38.2 overs remaining". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
  14. "Indian Women's Team for ICC Women's World Twenty20 announced". Board of Control for Cricket in India. Archived from the original on 28 September 2018. Retrieved 2023-08-09.
  15. "India Women bank on youth for WT20 campaign". International Cricket Council. Retrieved 2023-08-09.
  16. "Key Players: India". International Cricket Council. Retrieved 2023-08-09.
  17. "#WT20 report card: India". International Cricket Council. Retrieved 2023-08-09.
  18. "Women's World T20: Jemimah Rodrigues showed on debut that she belongs - Times of India". The Times of India.
  19. "Kaur, Mandhana, Verma part of full strength India squad for T20 World Cup". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
  20. "India's Senior Women squad for the only Test match, ODI & T20I series against England announced". Board of Control for Cricket in India. Retrieved 2023-08-09.
  21. "Jemimah Rodrigues dazzles with 92* as Superchargers charge to emphatic win". Retrieved 2023-08-09.
  22. "The Hundred Women's Competition, 2021 Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2023-08-09.
  23. "India Women call up Meghna Singh, Yastika Bhatia, Renuka Singh for Australia tour". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
  24. "Harmanpreet Kaur, Jemimah Rodrigues to play for Melbourne Renegades in Women's Big Bash League". India Today (in ఇంగ్లీష్). September 29, 2021. Retrieved 2023-08-09.
  25. "Mandhana, Rodrigues, Perry commit to Hundred as England players eye moves". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
  26. "Team India (Senior Women) squad for Birmingham 2022 Commonwealth Games announced". Board of Control for Cricket in India. Retrieved 2023-08-09.
  27. "wpl-2023-auction-live-jemimah-rodrigues-snatched-by-delhi-capitals-for-rs-2-20-crores-" (Press release). 16 February 2023. Retrieved 2023-08-09.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.