జెస్సికా సింప్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జెస్సికా సింప్సన్
Jessica Simpson Joining Forces with the Rockies April 2011.JPG
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంJessica Ann Simpson
రంగంPop, Dance-pop, R&B, Country pop, Adult contemporary
వృత్తిగాయని, నటి
క్రియాశీల కాలం1993–present
జీవిత భాగస్వామిNick Lachey (2002-2006) (divorced)
లేబుళ్ళుProclaim (1993-1994)
Columbia (1998–2005)
Epic (2005-present)
Columbia Nashville (2007–2009)[1]
సంబంధిత చర్యలుNick Lachey, Ashlee Simpson, 98 Degrees
వెబ్‌సైటువ్యక్తిగత వెబ్‌సైటు

జెస్సికా అన్ సింప్సన్ (1980 జూలై 10న జననం) ఒక అమెరికా గాయని, నటి మరియు బుల్లితెర ప్రముఖురాలు. ఆమె 1990 చివరి దశకాల్లో చక్కటి గుర్తింపు పొందింది. ఆమె ఏడు బిల్‌బోర్డ్ టాప్ 40 హిట్స్ సాధించింది. అంతేకాక ఆమె మూడు బంగారు మరియు రెండు మల్టీ-ప్లాటినం RIAA ధ్రువీకృత ఆల్బమ్‌‌లను రూపొందించింది. సింప్సన్ అప్పటి తన భర్త నిక్ లాచీతో కలిసి MTV రియాల్టీ షోలో పాల్గొందిNewlyweds: Nick and Jessica . ఆమె 2008లో దేశీయ సంగీత మార్కెట్‌లోకి ప్రవేశించి, డు యు నో అనే ఆల్బమ్‌ను విడుదల చేసింది.

విషయ సూచిక

ప్రారంభ జీవితం మరియు వృత్తి[మార్చు]

సింప్సన్ అబిలీన్, టెక్సాస్‌‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు టీనా మరియు జో ట్రూట్ సింప్సన్‌. ఆమె తండ్రి ఒక మంత్రి మరియు మనస్తత్వ నిపుణుడు.[2] ఆమె చిన్న వయసులో ఉండగానే స్థానిక బాప్టిస్టు చర్చిలో పాడటం ప్రారంభించింది. పన్నెండేళ్ల ప్రాయంలో,ది మైకీ మౌస్ క్లబ్‌ ఆడిషన్ (నటీనటుల ఎంపిక ప్రక్రియ)కు సింప్సన్ ఎంపికకాలేకపోయింది.[3] J.J. పియర్స్ హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు ఆమె ప్రొక్లెయిమ్ రికార్డ్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అది ఒక చిన్న గోస్పెల్ మ్యూజిక్ రికార్డ్ లేబుల్. తన సొంత పేరు "జెస్సికా"తోనే ఆమె ఒక ఆల్బమ్‌ను రికార్డు చేసింది. అయితే ప్రొక్లెయిమ్ సంస్థ దివాలా తీయడంతో ఆల్బమ్ అధికారికంగా విడుదలకు నోచుకోలేదు. కానీ, ఆమె అవ్వ మాత్రం ఆమెకు కొంత సొమ్మును అందించింది. ఆ సాయం ఆమెను కొంత వరకు ప్రోత్సహించింది. కిర్క్ ఫ్రాంక్లిన్, సిసి వినాన్స్ మరియు గాడ్స్ ప్రాపర్టీలతో కలిసి ఆమె పలు సంగీత కచేరీల్లో పాల్గొంది. పదహారేళ్ల వయసులో సింప్సన్ హైస్కూల్‌ను విడిచిపెట్టింది (తర్వాత ఆమె GEDని అందుకుంది). కొలంబియా రికార్డ్స్ అధికారి టామీ మొట్టోలా "జెస్సికా" గురించి విన్న తర్వాత ఆ లేబుల్ తరపున ఆల్బమ్‌లు చేయడానికి ఆమె ఒక ఒప్పందం కుదుర్చుకుంది.[4][5]

సంగీత జీవితం[మార్చు]

1999–2001: స్వీట్ కిసెస్ మరియు ఇర్‌రెసిస్టిబుల్ శకం[మార్చు]

"ఐ వన్నా లవ్ యు ఫర్‌ఎవర్" అనే తొలి పాటను సింప్సన్ విడుదల చేసింది. అది 1999లో బిల్‌బోర్డ్ హాట్ 100 జాబితాలో #3ను ఆక్రమించింది.[6] ఆ వెనువెంటనే ఆమె తొలి అతిపెద్ద లేబుల్ ఆల్బమ్ స్వీట్ కిసెస్‌‌ విడుదలయింది. ఈ ఆల్బమ్‌కు మద్దతు కోసం సింప్సన్ రికీ మార్టిన్ మరియు బాయ్ బ్యాండ్‌ 98 డిగ్రీస్‌లతో కలిసి విస్తృతంగా పర్యటించింది. తర్వాత ఆమె మరియు 98 డిగ్రీస్ గ్రూపు సభ్యుడు నిక్ లాచీ ఇద్దరూ కలిసి తిరగడం (డేటింగ్) మొదలుపెట్టారు.[7] అలా రెండేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత వారిద్దరి మధ్య బంధం తెగిపోయింది. సెప్టెంబరు 11 దాడులు అనంతరం వీరిద్దరూ తిరిగి ఒకటయ్యారు. సింప్సన్ ఈ విధంగా పేర్కొంది,"9/11 తర్వాత, నా జీవితకాలమంతా నిక్‌ను విడిచి ఉండరాదనే విషయాన్ని నేను గ్రహించాను."[5]

నవంబరు, 2001లో చేపట్టిన పర్యటన సందర్భంగా సింప్సన్ ప్రదర్శన

అంతలో, సింప్సన్ ఆల్బమ్ స్వీట్ కిసెస్‌ డబుల్ ప్లాటినం విడుదలయింది. "వేర్ యు ఆర్" మరియు "ఐ థింక్ అయామ్ ఇన్ లవ్ విత్ యు" వంటి పాటలు రెండూ 2000లో విడుదలయ్యాయి. వాటిలో రెండో పాట అప్పట్లో సింప్సన్ భారీ రేడియో హిట్‌గా నిలిచింది. అంతేకాక అది విడుదలైన ఆమె తొలి ఉర్రూతలూగించే పాట కావడం విశేషం. ఆమె తొలి ఆల్బమ్ 2 మిలియన్‌లు మరియు ప్రపంచవ్యాప్తంగా 4 మిలియన్ కాపీలు అమ్ముడైనప్పటికీ, బ్రిట్నీ స్పియర్స్ మరియు క్రిస్టినా అగులెరా ఆల్బమ్‌ల అమ్మకాల కంటే ఇవి తక్కువే. ఈ ఇద్దరు పాప్ రారాణుల మాదిరిగా కాక, సింప్సన్ ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధించలేకపోయింది. సింప్సన్ తన రెండో ఆల్బమ్ కోసం కొత్త పంధాను అనుసరించాలని కొలంబియా రికార్డ్స్ సంస్థ అధికారులు సూచించినట్లు తెలిసింది. మరుసటి ఏడాది అంటే సింప్సన్ తన రెండో ఆల్బమ్ రికార్డింగ్‌ కోసం వచ్చినప్పుడు మరింత శృంగార తార ఇమేజ్ కోసం ఆమెపై అధికారులు ఒత్తిడి చేశారు.

2001లో రేడియో శ్రోతలను ఆకర్షించేదిగా మరియు ఉర్రూతలూగించే పాటలుగా కొలంబియా సంస్థ భావించిన ఆల్బమ్‌ను సింప్సన్ రికార్డు చేసింది. ఫలితంగానే 2001 మధ్యకాలంలో ఇర్‌రెసిస్టిబుల్‌ ఆల్బమ్ విడుదలయింది. "ఇర్‌రెసిస్టిబుల్" ఆమె కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. హాట్ 100 జాబితాలో # 15ను ఆక్రమించిన ఆ ఆల్బమ్ అదే చార్టులో 20 వారాల పాటు కొనసాగింది. ఈ పాట బెల్జియంలో #2లోనూ మరియు UK, మెక్సికో, అర్జెంటీనా, కెనడా, నార్వే, స్వీడెన్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, ఫిలిప్పైన్స్ మరియు ఆస్ట్రేలియా దేశాల్లో టాప్ 20లో నిలిచింది.

ఇర్‌రెసిస్టిబుల్ ఆల్బమ్ బిల్‌బోర్డ్ 200 ఆల్బమ్ చార్ట్‌,[8]లో జూన్, 2001లో తొలిసారిగా #6లో నిలిచింది. తొలివారంలో 127,000[9] కాపీలు అమ్ముడయ్యాయి. ఐదో వారంలో 500,000 కాపీలు అమ్ముడైనందుకు దీనికి బంగారు[10] ధ్రువీకరణ (మ్యూజిక్ రికార్డింగ్ అమ్మకాలకు సంబంధించిన సర్టిఫికేట్) ఇచ్చారు.

అమెరికాలో ఇప్పటివరకు ఇర్‌రెసిస్టిబుల్ 825,000 కాపీలు విక్రయించబడ్డాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 3.2 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. అయితే ఆల్బమ్ రెండో పాటగా విడుదలయిన "ఎ లిటిల్ బిట్" చార్టులో స్థానం సంపాదించలేకపోయింది.

ఆల్బమ్‌కు మద్దతుగా, సింప్సన్ ఆగస్టు మధ్యకాలంలో పర్యటించింది. ఇది డ్రీమ్‌చేజర్ టూర్‌గా పేర్కొనబడింది. అయితే సెప్టెంబరు 11 దాడుల కారణంగా షెడ్యూలు సంపూర్ణం కాలేదు.[11]

2002–2005: మలుపు మరియు ఇన్ దిస్ స్కిన్[మార్చు]

2004లో నిర్వహించిన MTV వీడియో మ్యూజిక్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ప్రచార కార్యక్రమానికి ఫోజులిస్తున్న సింప్సన్ మరియు అప్పటి ఆమె భర్త నిక్ లాచీ

ఇన్ దిస్ స్కిన్ బిల్‌బోర్డ్ 200 ఆల్బమ్ చార్టులో తొలిసారిగా #10లో నిలిచింది. తొలివారంలో 64,000 కాపీలు అమ్ముడయ్యాయి. ఏప్రిల్, 2004లో ఒక స్పెషల్ కలెక్టర్స్ ఎడిషన్ విడుదలవడంతో ఇది తిరిగి పుంజుకుంది. తర్వాత 157,000 కాపీలు అమ్ముడవడం ద్వారా ఇది #2[8]ని ఆక్రమించింది. ఇందులోని "స్వీటెస్ట్ సిన్" అనే పాట బబ్లింగ్ అండర్ హాట్ 100 జాబితాలో చోటు సంపాదించడంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే, ఈ ఆల్బమ్‌లో "విత్ యు" (#14, 2004) మరియు ప్రధానమైన బెర్లిన్ పాట "టేక్ మై బ్రీత్ అవే" (#20, 2004) అనే హిట్ పాటలున్నాయి. అలాగే స్వల్ప విజయం సాధించిన రాబీ విలియమ్స్ పాట "ఏంజిల్స్‌" కూడా ఉంది. ఇది బిల్‌బోర్డ్ హాట్ 100 జాబితాలో చోటు సంపాదించలేకపోయింది.[6] డిసెంబరు, 2004లో ఈ ఆల్బమ్ RIAA నుంచి 3x బహుళ-ప్లాటినం సర్టిఫికేట్ అందుకుంది.[12]

2004 ఆఖర్లో సింప్సన్ విడుదలయిందిRejoyce: The Christmas Album, ఆల్బమ్ చార్టులో అది #14లో నిలిచింది. అది తర్వాత బంగారు సర్టిఫికేట్ అందుకుంది.[13] ది డ్యూక్స్ ఆప్ హజార్డ్ పాటలో కనిపించిన సింప్సన్ 1996 నాన్సీ సినాట్రా యొక్క ప్రధాన హిట్ "దీస్ బూట్స్ ఆర్ మేడ్ ఫర్ వాకిన్"ను విడుదల చేసింది. ఈ పాట బిల్‌బోర్డ్ హాట్ 100లో #14ని ఆక్రమించింది. అలాగే 2006లో ఒక చిత్రంలో ఫేవరిట్ పాటకు పీపుల్స్ చాయిస్ అవార్డును గెలుచుకుంది.[6][14] ఈ పాట వీడియోలో డైసీ డ్యూక్‌గా సింప్సన్ నటించింది. ఇందులో ఒక బార్‌లో ఆమె పాటలు పాడుతూ, రసికులను ఆకర్షించే విధంగా వయ్యారాలు పోతుంది. తర్వాత బిగుతుగా ఉండే లేత ఎరుపు రంగు బికినీ ధరించి, జనరల్ లీ కారును శుభ్రం చేస్తుంటుంది. అయితే శృంగార పాళ్లు అధికంగా ఉన్నందున ఈ వీడియోను కొన్ని దేశాల్లో నిషేధించారు.[15]

2006–2007: ఎ పబ్లిక్ ఎఫైర్[మార్చు]

ఆగస్టు, 2006లో సింప్సన్

2006లో సింప్సన్ తిరిగి రికార్డింగ్ స్టూడియోకు వచ్చింది. తన లేబుల్స్‌ను కొలంబియా సంస్థ నుంచి ఎపిక్ రికార్డ్స్‌కు మార్చుకుంది. 29 ఆగస్టు 2006న ఆమె తన నాలుగో ఆల్బమ్ ఎ పబ్లిక్ ఎఫైర్‌ ను విడుదల చేసింది. అది బిల్‌బోర్డ్ 200 చార్టులో #5లో నిలిచింది. విడుదలైన తొలివారంలో 101,000 కాపీలు అమ్ముడయ్యాయి. 10 వారాల పాటు #5లోనే కొనసాగింది.

ఆల్బమ్‌లోని తొలి పాట "ఎ పబ్లిక్ ఎఫైర్‌" పేరుతోనే రూపొందించబడింది. ఇది తొలిసారిగా 39వ స్థానాన్ని ఆక్రమించింది. హాట్ 100 జాబితాలో #14లో నిలిచిన "దీస్ బూట్స్ ఆర్ మేడ్ ఫర్ వాకిన్'" పాట తర్వాత ఇది ఆమె నుంచి విడుదలైన అత్యధిక స్థానం ఆక్రమించిన అరంగేట్ర పాటగా నిలిచింది. అంతేకాక ఈ పాట హాట్ డాన్స్ క్లబ్ ప్లేలో నంబర్ 1 స్థానాన్ని కూడా ఆక్రమించింది. అంతర్జాతీయంగా, కెనడా, ఐర్లాండ్ మరియు ఫిలిప్పైన్స్ దేశాల్లో ఈ పాట టాప్ 10లో చోటు సంపాదించింది. దీనికి సంబంధించిన వీడియోలో ఎవా లాంగోరియా, క్రిస్టినా యాపిల్‌గేట్, క్రిస్టినా మిలియన్, మరియా మినౌనస్, ఆండీ డిక్ మరియు రియాన్ సీక్రెస్ట్ దర్శనమిచ్చారు. ఈ వీడియో TRLలో ఆమె యొక్క అత్యంత ఘనవిజయం సాధించినదిగా నిలిచింది. తద్వారా 28 రోజుల పాటు రెండో స్థానంలో కొనసాగింది. ఈ ఆల్బమ్‌లోని రెండోది మరియు ఆఖరిదైన "ఐ బిలాంగ్ టు మి" అనే పాటకు దానికి సంబంధించిన వెబ్‌సైటులో నిర్వహించిన పోల్‌ (అభిప్రాయ సేకరణ)లో చక్కటి ఆదరణను చూరగొంది. ఇది సెప్టెంబరు 26న విడుదలై, U.S.లో #110లో నిలిచింది. TRL కౌంట్‌డౌన్స్‌లో దీనికి సంబంధించిన వీడియో కన్పించింది. అయితే తర్వాత దానికి ఆదరణ అనూహ్యంగా తగ్గింది.

ఈ ఆల్బమ్ U.S.లో 300,000 కాపీలు మరియు ప్రపంచవ్యాప్తంగా 800,000 కాపీలు విక్రయించబడ్డాయి. అయితే ఆమె గత ఆల్బమ్ విక్రయాలతో పోల్చితే ఇది తక్కువే.

డిసెంబరు, 2006లో డాలీ పార్టన్‌కు నివాళిగా కెన్నెడీ సెంటర్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సింప్సన్ పాల్గొంది. అయితే స్టీవెన్ స్పీల్‌బర్గ్, షానియా త్వాయిన్ మరియు అధ్యక్షుడు జార్జ్ W. బుష్‌ వంటి అతిరథమహారథులు హాజరైన ఆ కార్యక్రమంలో తడబాటుకు గురైన ఆమె పాటలను అసంపూర్ణంగా ముగించింది. ఫోటోగ్రాఫర్ల కోసం ఆ పాటను తిరిగి చేసే అవకాశాన్ని సింప్సన్‌కు కల్పించడం జరిగింది. అయితే చివరకు ఆమె భాగాన్ని CBS ప్రసారం నుంచి తొలగించారు.[16][17]

2008–2009: స్వదేశీ పయణం మరియు డు యు నో[మార్చు]

లోవీస్ మోటార్ స్పీడ్‌వే 2008లో రేసుకు ముందు జెస్సికా సింప్సన్ ప్రదర్శన

సింప్సన్ దేశీ ఆల్బమ్‌ను తయారు చేసేందుకు యోచిస్తోందని సెప్టెంబరు, 2007లో ఆమె తండ్రి జో సింప్సన్ పీపుల్ సంచిక (మేగజైన్)తో అన్నాడు. అలాగే జో సింప్సన్ పీపుల్‌ తో ఈ విధంగా చెప్పాడు, ఆమె "దేశీ రికార్డు గురించి ప్రస్తావిస్తోంది. టెక్సాస్ నుంచే మళ్లీ ఆమె ప్రస్థానం మొదలుకావొచ్చు."[18]

"కమ్ ఆన్ ఓవర్" అనేది 2008 మే 27న ఇంటర్నెట్‌లో బహిర్గతమైన తొలి పాట. దాంతో ఆ దేశంలోని పలు రేడియో ప్రసార కేంద్రాలు ఆ పాటను వినిపించడం మొదలుపెట్టేశాయి. అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో "కమ్ ఆన్ ఓవర్" పాట 2008 జూన్ 6తో ముగిసిన వారానికి దేశీయ రేడియోలో అత్యంత ఆదరణ పొందినదిగా నిలిచింది. తద్వారా బిల్‌బోర్డ్ హాట్ కంట్రీ సాంగ్స్ చార్టులో తొలిసారిగా 41వ స్థానాన్ని అధిష్టించింది. మిరాండా లాంబెర్ట్ ("మి అండ్ చార్లీ టాకింగ్") మరియు బ్రాడ్ కాటర్ ("ఐ మెంట్ టు") నెలకొల్పిన రికార్డులను ఇది బద్దలుకొట్టింది. ఏకైక కళాకారిణి ద్వారా చార్టులో అరంగేట్రంతోనే అత్యధిక స్థానాన్ని ఆక్రమించడం ద్వారా ఈ ఘనతను సాధించినట్లయింది. వారిద్దరూ కళాకారిణులు అదే చార్టులో తొలిసారి 42వ స్థానాన్ని సంపాదించారు.[19] తొలి పాట "కమ్ ఆన్ ఓవర్"కు సంబంధించిన వీడియో జులై, 2008లో సింప్సన్ యొక్క అధికారిక వెబ్‌సైటులో ప్రదర్శించబడింది.[20] ఈ పాట బిల్‌బోర్డ్ హాట్ కంట్రీ సాంగ్స్ నందు #18ని ఆక్రమించింది. ఆల్బమ్‌ల విడుదలకు ముందు దాని ప్రచారం కోసం సింప్సన్ ఎంపిక చేసిన స్టేట్ ఫెయిర్స్‌లో ప్రదర్శనలు ఇవ్వడం మరియు అనేక దేశీయ సంగీత రేడియో కేంద్రాలను సందర్శించేది. డు యు నో పేరుతో రూపొందించిన దేశీయ ఆల్బమ్ 9 సెప్టెంబరు 2008[21] న విడుదలయింది. 28 ఆగస్టు 2008న ఈ ఆల్బమ్ పూర్తిగా ఇంటర్నెట్‌లో లీకైంది. ఈ ఆల్బమ్ US మరియు కెనడా దేశాల్లోని బిల్‌బోర్డ్ టాప్ కంట్రీ ఆల్బమ్స్ చార్టులో తొలిసారిగా #1ని ఆక్రమించింది. సింప్సన్ కెరీర్‌లోనే ఇది #1 ఆల్బమ్‌గా రికార్డు సృష్టించింది. మ్యూజిక్ బ్యాండ్ రాస్కల్ ఫ్లాట్స్ యొక్క "బాబ్ దట్ హెడ్ టూర్" కోసం ఆమె 2009లో జనవరి, 17 నుంచి మార్చి, 14 వరకు పనిచేసింది. ఆల్బమ్ రెండో పాట "రిమంబర్ దట్" 2008 సెప్టెంబరు 29న దేశీయ రేడియోలో విడుదలయింది. ఈ పాట బిల్‌బోర్డ్ హాట్ కంట్రీ సాంగ్స్ చార్టులో #42లో నిలిచింది. డిసెంబరు, 2008 ఆఖరు నాటికి తిరిగి కిందకు పడిపోయింది. ఆల్బమ్ యొక్క మూడో పాట "ప్రే అవుట్ లౌడ్" చార్టులో స్థానం సంపాదించలేకపోయింది. 2009 ఏప్రిల్ 7న సింప్సన్ ప్రతినిధి Us వీక్లీతో ఈ విధంగా అన్నాడు, ఆమె మరియు లేబుల్ కంపెనీ సోనీ నాష్‌విల్లే తెగదెంపులు చేసుకున్నారు.[22]

కొత్త ఆల్బమ్[మార్చు]

అల్యూర్ మేగజైన్ యొక్క మార్చి 2010 విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వూలో, కొత్త ఆల్బమ్‌పై తాను పనిచేస్తున్నట్లు సింప్సన్ తెలిపింది. ఈ ఆల్బమ్ ద్వారా తన లేబుల్‌తో కుదుర్చుకున్న కాంట్రాక్టు ముగుస్తుందని చెప్పింది. అయితే భవిష్యత్ ఆల్బమ్‌ల కోసం ప్రస్తుత సంస్థతోనే ఆమె తన కాంట్రాక్టును పునరుద్ధరించుకుంటుందా లేక కొత్త లేబుల్‌కు మారుతుందా అనేది స్పష్టంగా తెలీదు. ఈ ఆల్బమ్‌లోని కొన్ని పాటలను తాను నిర్మించబోతున్నట్లు కూడా ఆమె ప్రకటించింది.[23]

చలనచిత్రం మరియు బుల్లితెర[మార్చు]

2002–2004: న్యూలీవెడ్స్[మార్చు]

2003 వసంతంలో సింప్సన్ మరియు ఆమె అప్పటి కొత్త భర్త నిక్ లాచీ నటించిన రియాలిటీ షో,Newlyweds: Nick and Jessica MTVలో ప్రసారమైంది. న్యూలీవెడ్స్ అనే బుల్లితెర కార్యక్రమం సమయంలోనే సింప్సన్ మూడో ఆల్బమ్ ఇన్ దిస్ స్కిన్ ఆగస్టు, 2003లో విడుదలయింది.

ఈ కార్యక్రమం ఒక పాప్ సంస్కృతి యొక్క దృగ్విషయంగా మారింది. అంతేకాక పాప్ మ్యూజిక్ లేదా MTVని అనుసరించని వారి కంటే ఆమెకు ఇది ప్రముఖ వ్యక్తి హోదాను సాధించిపెట్టింది.“ఈ కార్యక్రమం చేయడం ద్వారా నాకు వేదికపైకి అడుగుపెట్టే అవకాశమొస్తుందని తెలీదు” అని మార్చి, 2004లో విడుదలైన బ్లెండర్‌ మేగజైన్‌కు సింప్సన్ తెలిపింది.[24]

ది నిక్ అండ్ జెస్సికా వెరైటీ అవర్ అనే బుల్లితెర ప్రత్యేక కార్యక్రమంలో ఈ జంట నటించింది. ఇది 2004లో ప్రసారమైంది. అప్పట్లో ఇది ది సోనీ & చెర్ షోతో పోల్చబడింది.[25] 2005లో ఫేవరిట్ రియాలిటీ షోగా న్యూలీవెడ్స్‌ కార్యక్రమం ముగింపుకు కొద్దికాలం ముందు పీపుల్స్ చాయిస్ అవార్డును గెలుచుకుంది.[26]

2005–2008: చలనచిత్రం[మార్చు]

2005 వసంతంలో ది డ్యూక్స్ ఆఫ్ హజార్డ్ అనే బుల్లితెర కార్యక్రమం ఆధారంగా తెరకెక్కించిన చలనచిత్రంలో సింప్సన్ డైసీ డ్యూక్‌ పాత్ర ద్వారా తెరంగేట్రం చేసింది.[27] విడుదలైన తొలి వారాంతానికి ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద #1 స్థానాన్ని ఆక్రమించింది. దీనికి కొద్దిపాటి లేదా అసలు పోటీ లేకపోయినా (అదే వారాంతంలో విడుదలైన మరో ఏకైక చిత్రం తక్కువ వ్యయంతో నిర్మించిన ఒక స్వతంత్ర చిత్రం) 3,785 థియేటర్లలో ప్రదర్శించడం ద్వారా $30.7 మిలియన్లను వసూలు చేసింది. ఆగస్టులో విడుదలైన చిత్రాల పరంగా ఈ చిత్రం రికార్డు స్థాయిలో సర్దుబాటు-డాలర్ ర్యాంకు #14ను పొందింది. ఈ చిత్రం U.S. వెలుపల పెద్దగా కాసుల వర్షం కురిపించకపోయినా, ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా $110.5 మిలియన్లను వసూలు చేసింది.[28]

సింప్సన్ రెండో చిత్రం ఎంప్లాయీ ఆఫ్ ది మంత్ 2006 అక్టోబరు 6న విడుదలయింది. పేలవమైన సమీక్షల నేపథ్యంలో ఈ చిత్రం విడుదలైన వారాంతానికి $11.8 మిలియన్లు మాత్రమే వసూలు చేసింది. తద్వారా ఓపెన్ సీజన్‌ చిత్రం తర్వాత #4లో నిలిచింది.[29] ఆక్వామెరీన్, కేసినో రాయల్, ది డెవిల్ వేర్స్ ప్రాడా మరియు సిన్ సిటీ చిత్రాల్లో నటించే అవకాశాలను ఆమె తోసిపుచ్చినట్లు తెలిసింది.

డిసెంబరు, 2007లో సింప్సన్ మూడో చిత్రం బ్లాండ్ ఆంబిషన్‌లో ల్యూక్ విల్సన్ ఆమెతో పాటు నటించాడు. ఈ చిత్రం టెక్సాస్‌ (సింప్సన్ మరియు విల్సన్‌ల సొంత రాష్ట్రం)లోని మొత్తం ఎనిమిది థియేటర్లలో విడుదలయింది. మొత్తం US$6,422ను వసూలు చేసింది. ఈ చిత్రం DVD జనవరి, 2008లో విడుదలయింది.[30] బ్లాండ్ ఆంబిషన్ చిత్రానికి విదేశాల్లో చక్కటి ఆదరణ లభించింది. ఉక్రెయిన్‌లో విడుదలైన వారాంతానికి $253,008ను వసూలు చేసింది.[31] సింప్సన్ తదుపరి చిత్రం మేజర్ మూవీ స్టార్ (తర్వాత ప్రైవేట్ వేలంటైన్: బ్లాండ్ అండ్ డేంజరస్‌గా పేరు మార్చారు) నేరుగా DVD రూపంలో 2009 ఫిబ్రవరి 3న విడుదలయింది.[32]

2009–ఇప్పటివరకు: రియాలిటీ టెలివిజన్‌కు పునరాగమనం[మార్చు]

2009 జూలై 1న బితెస్దా, MDలోని కాంగ్రెస్ కంట్రీ క్లబ్‌లో నిర్వహించిన 2009 AT&T నేషనల్ ప్రారంభ కార్యక్రమాల్లో సింప్సన్

మహిళల శరీరాలపై సమాజం యొక్క నిశిత పరీక్ష గురించి ఒక రియాలిటీ కార్యక్రమాన్ని రూపొందించడానికి సింప్సన్ ఇటీవల కొన్ని TV నెట్‌వర్క్‌లను సందర్శించినట్లు Us వీక్లీ వెల్లడించింది. ఈ కార్యక్రమం యొక్క ఆధార వాక్యాన్ని "ది ప్రైస్ ఆఫ్ బ్యూటీ"గా పేర్కొన్నారు: "ఎలాంటి వారు అందంగా ఉంటారు మరియు ఎందుకు అనే దానిపై ఆమె మరియు ఒక మిత్రురాలు ప్రపంచవ్యాప్త రోడ్డు పర్యటనకు శ్రీకారంచుట్టారు". ఈ కార్యక్రమంలో సింప్సన్ క్రియాశీలిగా వ్యవహరించనుంది. అంతేకాక "మహిళలు అందంగా తయారవడానికి వారు అనుసరించే దిగ్భ్రాంతికి గురిచేసే కొన్నింటిని కూడా ఆమె ప్రయత్నిస్తుంది."[33] సింప్సన్ మరియు ఆమె తండ్రి జో సింప్సన్‌లు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించనున్నారు.[34] ఈ కార్యక్రమం యొక్క ప్రసారం 2010 మార్చి 15న VH1లో మొదలైంది.[35]

భవిష్యత్ ప్రాజెక్టులు[మార్చు]

అల్యూర్ మేగజైన్ యొక్క మార్చి, 2010 విడుదల సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వూలో ఉద్విగ్నమైన, మరింత మేధావంతమైన పాత్రలపై తాను దృష్టి సారించినట్లు సింప్సన్ తెలిపింది.[23]

ఇతర ప్రాజెక్టులు[మార్చు]

చెర్ మరియు ప్యాటీ లాబెల్లీ వంటి ఇతర మహిళా సంగీత స్వరకర్తల స్ఫూర్తితో సింప్సన్ మరియు స్టైలిస్ట్ కెన్ పావీస్ ఇద్దరూ కలిసి హోమ్ షాపింగ్ నెట్‌వర్క్ ద్వారా కేశాలు మరియు అందానికి సంబంధించిన పలు ఉత్పత్తులను విడుదల చేశారు.[36] అంతేకాక సింప్సన్ పలు రకాల హ్యాండ్‌బ్యాగులు (ప్రాథమికంగా ఎత్తు మడమల) పాదరక్షలు మరియు కాలిజోళ్ల రూపకల్పనతో పాటు వ్యాపారం కూడా చేపట్టింది.[37] అలాగే బ్రాలు, ప్యాంటీలు, స్లీప్‌వేర్ మరియు డేవేర్‌ వంటి మహిళల లోదుస్తుల రూపకల్పనకు కూడా ఆమె యోచిస్తోంది. జెస్సికా సింప్సన్ యొక్క లోదుస్తులు అతిపెద్ద డిపార్ట్‌మెంట్ స్టోర్లు మరియు ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లలో 2009, వసంతం నుంచి అందుబాటులోకి వచ్చాయి.[38]

సింప్సన్‌ ప్రధానంగా పిజ్జా హట్ మరియు ప్రోయాక్టివ్ సొల్యూషన్ వంటి సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉంది. అంతేకాక ఆమె తన సోదరి యాష్లీతో కలిసి ఐస్ బ్రేకర్స్ వాణిజ్య ప్రకటనలోనూ నటించింది. ఆమె సుమారు మూడు పిజ్జా హట్ వాణిజ్య ప్రకటనల్లో నటించింది. వాటిలో తొలి ప్రకటన 2004లో రూపొందించబడింది. ఈ ప్రకటనలు కొత్త బఫెలో వింగ్ పిజ్జా (ది మప్పెట్స్‌ సహ భాగస్వామ్యంతో) ప్రచారానికి ఉద్దేశించినవి. 2005లో నొప్పి నివారిణి ప్రోయాక్టివ్ సొల్యూషన్ వాణిజ్య ప్రకటనలో ఆమె నటించింది. 2006లో సూపర్ బౌల్ XL ప్రసారం కోసం ఆమె మరో పిజ్జా హట్ వాణిజ్య ప్రకటనలోనూ నటించింది. "దీస్ బూట్స్ ఆర్ మేడ్ ఫర్ వాకిన్," అనే పాటను తెలిపే విధంగా ఆమె "దీస్ బైట్స్ ఆర్ మేడ్ ఫర్ పాపిన్" అనే పాటను ఆలపించింది. ఇది చీసీ బైట్స్ పిజ్జా ప్రచారానికి ఉద్దేశించింది.[39] 2007లో సూపర్ బౌల్ ఆమెను మూడో పిజ్జా హట్ వాణిజ్య ప్రకటనలో నటింపజేసింది. అది చీసీ బైట్స్ పిజ్జాకు ప్రచారం కల్పించింది.[40] అంతేకాక ఆమె డైసీ డ్యూక్ పాత్రధారిణిగా DirecTVకి ప్రచారం చేసింది.[41]

సుగంధ ఉత్పత్తులను కూడా సింప్సన్ ఆవిష్కరించింది. పార్లక్స్ ఫ్రాగ్రెన్సెస్ కంపెనీ ఆమె సుగంధ పరిమళాన్ని తయారు చేసింది. ఆమె తొలి సుగంధం ఫ్యాన్సీ 2008లో విడుదలయింది.[42]

మంత్రవిద్య పట్ల విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్న సింప్సన్ ఇంద్రజాలికుడి సహాయకురాలిగా మాయా విద్యకు సంబంధించిన అనేక ప్రదర్శనల్లో పాల్గొంది. ది డ్యూక్స్ ఆఫ్ హజార్డ్ ప్రచారంలో భాగంగా ఐరోపా పర్యటనకు వెళ్లినప్పుడు డచ్ TV చర్చా కార్యక్రమం ముగింపు సందర్భంగా ఇంద్రజాలికుడు హన్స్ క్లాక్‌ సహాయకురాలిగా సింప్సన్ వ్యవహరించింది. క్లియర్లీ ఇంపాజిబుల్‌గా పిలిచే "ఒక మహిళను సగ భాగం మాయగా చూడడం" అనే వివరణ ద్వారా ఆమె సహాయక పాత్రను పోషించింది.

నిర్వహణ[మార్చు]

తన తండ్రి మరియు మేనేజర్ జో సింప్సన్‌తో జెస్సికా సింప్సన్

జెస్సికా యొక్క బాధ్యతలను ఆమె తండ్రి జో ట్రూయెట్ సింప్సన్ చూసుకునేవాడు. అతని జీతం ఆమె ఆదాయంలో 10 నుంచి 20 శాతం మధ్య ఉండొచ్చని తెలిసింది.[ఆధారం కోరబడింది] అతను తన కుమార్తెల ఆర్థిక వ్యవహారాల నుంచి తప్పుకున్నాడు. వారి బ్యాంకు ఖాతాల్లో అతను జోక్యం చేసుకోడు. అవి ప్రస్తుతం వారి యొక్క భాగస్వామ్య మరియు దీర్ఘకాల వ్యాపార మేనేజర్ డేవిడ్ లెవిన్ పర్యవేక్షణలో ఉన్నాయి. మిస్టర్ సింప్సన్ తన పిల్లలు తన గురించి ఇలా అనుకోవాలని అభిప్రాయపడ్డాడు, "మా తండ్రి ఎప్పుడూ మా సొమ్మును ఆశించలేదు. నా పట్ల వారు ఎప్పుడూ గౌరవం చూపాలని కోరుకుంటాను."[43]

విమర్శ మరియు వివాదం[మార్చు]

"దీస్ బూట్స్ ఆర్ మేడ్ ఫర్ వాకిన్" అనే మ్యూజిక్ వీడియో కోసం అశ్లీలంగా నటించినందుకు "నిరోధం"గా చెప్పుకునే ఒక క్రైస్తవ గ్రూపు నుంచి సింప్సన్ తీవ్ర విమర్శను ఎదుర్కొంది.[44] దానికి సింప్సన్ ఇలా ప్రతిస్పందించింది, "ఇది నన్ను ఆశ్చర్యానికి గురిచేయలేదు. ఎందుకంటే అలాంటి ఎన్నో ఎదురుదెబ్బలను తట్టుకునే నేను ఎదిగాను. అందువల్లే క్రైస్తవ సంగీత రంగంలోకి ప్రవేశించడాన్ని నేను కొనసాగిస్తున్నాను. వారు గనుక నిజమైన క్రైస్తవులైతే తీర్పు అనేది అలా ఉండదని నా అభిప్రాయం."[45]

2004,[46]లో అధ్యక్షుడు జార్జ్ W. బుష్ తరపున ప్రచారం చేసిన సింప్సన్ వాషింగ్టన్, D.C.లో 2006లో చేపట్టిన రిపబ్లికన్ నిధుల సమీకరణ కార్యక్రమంలో పాల్గొనకుండా అతను "అవమానించాడని" ఆ తర్వాత ఆమె వెల్లడించింది. మేనేజర్ జో సింప్సన్ ఈ విధంగా పేర్కొన్నాడు, తాను మరియు జెస్సికా తమను ఆహ్వానించిన అధ్యక్షుడికి "బలమైన మద్దతుదారు"లైనప్పటికీ, ఒక రాజకీయపరమైన నిధుల సమీకరణ కార్యక్రమానికి హాజరవడం సమంజసం కాదని భావించాం.[47]

జూన్, 2008లో ప్రియుడు టోనీ రోమోతో "రియల్ గర్ల్స్ ఈట్ మీట్" అని రాసిన టి-షర్టు వేసుకుని సింప్సన్ దర్శనమిచ్చింది. ఇది శాకాహారియైన రోమో మాజీ ప్రియురాలు క్యారీ అండర్‌వుడ్ ధ్వజమెత్తడానికి కారణమైంది. PETA సింప్సన్‌ను ఈ విధంగా విమర్శించింది, "మాంసాహారాన్ని ప్రచారం చేస్తూ జెస్సికా సింప్సన్ ధరించిన దుస్తులకు మేము ఒక విధంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే, ఆహార సలహాల కోసం ఇక ఎవ్వరూ ఆమెను ఆశ్రయించరు. చికెన్ ఆఫ్ ది సీ (ఒక రకమైన ఆహార)పదార్థాన్ని ఎవరైనా తింటారా? బఫెలో 'వింగ్స్' అనే ఆహార పదార్థం దున్నపోతుల (గేదెల) నుంచి వస్తుందనుకునే ఆమె కొంత మంచి శాకాహార ఆహారం ద్వారా ప్రయోజనం పొందగలుగుతుంది."[48]

PETA ప్రతినిధి పమేలా అండర్సన్ కూడా ఈ విధంగా వ్యాఖ్యానించింది.[49]

2008 జూలై 19న విస్‌కాన్సిన్‌లో జరిగిన కంట్రీ థండర్ ఫెస్టివల్‌లో సింప్సన్ పాల్గొంది. అయితే ఆమె ప్రదర్శనకు అక్కడికి వచ్చిన వారి నుంచి పెద్దగా స్పందన రాలేదు. అలాగే దేశీయ సంగీత విమర్శకులు సైతం ఆమెను తూర్పారబట్టారు.[50] దానికి ఆమె ఈ విధంగా ప్రతిస్పందించింది, "జెస్సికా సింప్సన్ గురించి మీ అభిప్రాయం ఏమిటనేది నాకు తెలీదు లేదా ఏ టాబ్లాయిడ్ (సంచిక) మీకు కొంటున్నారో అదీ నాకు తెలీదు, అయితే నేను టెక్సాస్‌కు చెందిన అమ్మాయినని మరియు మీ లాగా ఒక సాధారణ మనిషినని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇష్టపడిందే నేను చేస్తున్నాను. అది ఒక అబ్బాయితో కలిసి తిరగడమైనా సరే."[51]

వ్యక్తిగత జీవితం[మార్చు]

నిక్ లాచీతో వివాహం[మార్చు]

2002 అక్టోబరు 26న 22 ఏళ్ల వయసులో నిక్ లాచీతో సింప్సన్ వివాహమైంది.[52] పెళ్లయ్యే వరకు తాను కన్యగానే ఉన్నానని సింప్సన్ ప్రకటించింది.[53] నవంబరు, 2005లో ఒక వార్తాపత్రిక (టాబ్లాయిడ్) ఊహాజనిత వార్తలు ప్రచురించిన కొద్ది నెలల తర్వాత తాము విడిపోతున్నట్లు సింప్సన్ మరియు లాచీ ప్రకటించారు. 2005 డిసెంబరు 16న విడాకుల కోసం సింప్సన్ దరఖాస్తు పెట్టుకుంది. అందుకు "అసాధ్యమైన విభేదాలు" కారణమని ఆమె తెలిపింది.[54][55] ఈ జంట విడాకుల వివాదం ప్రపంచవ్యాప్తంగా ప్రచారమైంది. మొత్తానికి 2006 జూన్ 30న వారిద్దరికి విడాకులు మంజూరైనట్లు సమాచారం.[56]

ఆఫ్రికా ఛారిటీ పర్యటనకు తనతో కలిసి రావడానికి లాచీ తిరస్కరించినప్పుడే అతనితో వివాహ బంధం తెగిపోయిందన్న విషయం తనకు తెలుసునని అక్టోబరు, 2006లో జానే మేగజైన్‌కు సింప్సన్ తెలిపింది. అప్పుడు వారిద్దరూ మూడో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటుండటం గమనార్హం.[57]

ఈ జంట తమ కెలాబాసస్ భవనాన్ని మాల్కమ్ ఇన్ ది మిడిల్ నటుడు జస్టిన్ బెర్‌ఫీల్డ్‌కు కొంత మొత్తానికి విక్రయించారు. అక్కడే న్యూలీవెడ్స్ చిత్రీకరణ జరిగింది.[58] విడాకుల నేపథ్యంలో సింప్సన్ మరింత ప్రచారం పొందింది. ప్రత్యేకించి, ఎంప్లాయి ఆఫ్ ది మంత్ సహనటుడు డానే కూక్‌ మరియు మరూన్ 5 ప్రధాన పాత్రధారి ఆడమ్ లెవిన్‌లతో ముచ్చట్ల ద్వారా ఆమె మరింతగా ప్రచారమైంది. 2007 ఫిబ్రవరి 6న అసోసియేటెడ్ ప్రెస్ ఈ విధంగా పేర్కొంది, సింప్సన్ మరియు ఆమె భర్త మధ్య బంధం తెగిపోయాక, అతను తిరిగి ప్రేమ కార్యకలాపాలు ప్రారంభించడంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురైంది. "ఇది నన్ను చాలా బాధించింది," అని ఎల్లీ సంచిక మార్చి విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వూలో 26 ఏళ్ల గాయని-నటి సింప్సన్ వెల్లడించింది. "రెండు లేదా మూడు వారాల తర్వాత? అవును, ఇది ఒక విధంగా నన్ను బాధించిందని చెప్పాను."[59]

ఇతర సంబంధాలు[మార్చు]

విడాకుల నేపథ్యంలో స్వరకర్త జాన్ మేయర్‌తో సింప్సన్ అడపాదడపా ప్రేమ కార్యకలాపాలు సాగించింది. దాంతో వారిద్దరు డేటింగ్ (కలిసి తిరగడం) చేస్తున్నట్లు ఆగస్టు, 2006లో పీపుల్ సంచిక కథనం ద్వారా పుకార్లు షికార్లు చేశాయి. అయితే న్యూయార్క్ నగరంలో క్రిస్టినా అగులెరా ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలకు సింప్సన్ మరియు మేయర్ ఇద్దరూ హాజరై, అక్కడే గడపడం ద్వారా ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చినట్లయింది.[60] ఈ జంట మే, 2007లో శాశ్వతంగా విడిపోయారు.[61]

తర్వాత నవంబరు, 2007లో డల్లాస్ కౌబాయ్స్ యొక్క క్వార్టర్‌బ్యాక్ సభ్యుడు టోనీ రోమోతో సింప్సన్ కలిసి తిరగడం ప్రారంభించింది. వీరిద్దరి మధ్య బంధం కొందరు డల్లాస్ కౌబాయ్స్ అభిమానుల్లో వివాదాస్పదంగా మారింది. రోమో పేలవమైన రీతిలో ఫుట్‌బాల్ ప్రదర్శనలు ఇచ్చినప్పుడల్లా ఆమె విమర్శలు ఎదుర్కొంది. కౌబాయ్స్‌కు చెందిన కొందరు అభిమానులు జాన్ లెనాన్‌ను "నాశనం" చేసిందంటూ పలువురు బీటిల్స్ అభిమానులు నిందించిన యోకో ఓనోతో సింప్సన్‌ను పోల్చి, ఆమెను యోకో రోమో అనే మారుపేరుతో ఎగతాళి చేశారు.[62] కౌబాయ్స్ సన్నాహక మ్యాచ్‌ల సమయంలో రోమో మరియు సింప్సన్ పర్యటనకు వెళ్లడంతో లీగ్ మ్యాచ్‌లలో జియాంట్స్ చేతిలో కౌబాయ్స్ ఓడింది. దాంతో ఈ వివాదం మరింత రాజుకుంది. సింప్సన్ మరియు రోమో మెక్సికోలో విహారయాత్రకు వెళ్లడంపై FOX ప్రసారకుడు టెర్రీ బ్రాడ్‌షా ప్రశ్నలు లేవనెత్తాడు.

"టోనీ మాత్రమే నన్ను పిలిచి, ఈ విధంగా చెప్పాడు, 'టెర్రీ, జెస్సికా [సింప్సన్] మరియు నేను మెక్సికోకు వెళ్లబోతున్నాం,' అప్పుడు నేను ఈ విధంగా అన్నాను: 'నీకేమైనా పిచ్చా? అలా చేయొద్దు! ఓ మహానుభావా...చుట్టుపక్కల ఉన్న వారు నిన్ను గుర్తుపడుతారు. నువ్వు ఒక ప్రముఖ వ్యక్తివి. ఆమె కూడా ప్రముఖురాలే. ఇది ఇలా జరిగే అవకాశముంది,'" అని పోర్త్ వర్త్ స్టార్-టెలిగ్రామ్‌తో ఇంటర్వూ సందర్భంగా బ్రాడ్‌షా అన్నాడు.[63]

2008లో జియాంట్స్ టీమ్ సూపర్ బౌల్‌ను గెలుచుకునే దిశగా ఆధిక్యాన్ని సాధించిన తర్వాత అధ్యక్షుడు బుష్ సైతం "జెస్సికా అపశకునం"ను తమాషాగా ఉపయోగించుకున్నాడు. గెలిచిన టీమ్‌ను అభినందించడానికి శ్వేతసౌధం సంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా, అధ్యక్షుడు ఈ విధంగా వ్యాఖ్యానించాడు, "ప్రజాస్వామ్య జాతీయ సదస్సుకు జెస్సికా సింప్సన్‌ను పంపబోతున్నాం."[64]

13 జులై 2009న పీపుల్ మేగజైన్ రోమో మరియు సింప్సన్ తెగదెంపులు చేసుకున్నారని ప్రకటించింది. ఆమెకు సన్నిహితుడొకరు మేగజైన్‌తో ఈ విధంగా అన్నాడు, సింప్సన్ 29వ పుట్టినరోజు ముందు రాత్రి అంటే జులై 9న రోమోతో ఆమె విడిపోయింది.[65] "ఆమె గుండెపగిలిపోయింది," అని ఒకరు తెలిపారు. "ఆమె టోనీని ప్రేమిస్తోంది. అయితే ఆఖరుకు ఇది చాలా క్లిష్టమైంది. అతను తన వృత్తిలో బాగా నిమగ్నమై ఉన్నాడు, ఆమె కూడా తన కార్యక్రమం (ది ప్రైస్ ఆఫ్ బ్యూటీ) చిత్రీకరణకు సమాయత్తమవుతోంది. అందువల్ల విడిపోవాలని వారు నిర్ణయించుకున్నారు."

దాతృత్వం[మార్చు]

సింప్సన్ ఆపరేషన్ స్మైల్ యొక్క అంతర్జాతీయ యువ ప్రచారకర్త.[66][67]

మార్చి, 2007లో న్యూవో లారెడోలో ఉన్న ఎలిమ్ అనాథ శరణాలయానికి సింప్సన్ ఒక కొత్త క్రిస్లర్ వ్యానును విరాళంగా ఇచ్చింది. 2006 MTV వీడియో మ్యూజిక్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా క్రిస్లర్ క్రాస్‌ఫైర్ స్పోర్ట్స్ కారును సింప్సన్ గెలుచుకుంది. అయితే అనాథ శరణాలయానికి ఒక చిన్నవ్యానును ఇవ్వడానికి $50,000 విలువ చేసే లగ్జరీ కారును ఆమె వదులుకుంది.[68]

డిస్కోగ్రఫీ[మార్చు]

స్టూడియో ఆల్బమ్‌లు[మార్చు]

ఇతర ఆల్బమ్‌లు[మార్చు]

పర్యటనలు[మార్చు]

 • హీట్ ఇట్ అప్ టూర్ (2000)
 • MTV TRL పర్యటన - ఆమె ప్రచార పర్యటనకు ముందు తేదీలు ఖరారు చేయబడ్డాయి (2001)
 • డ్రీమ్‌చేజర్ పర్యటన (2001)
 • రియాలిటీ టూర్ (2004)
 • టూర్ ఆఫ్ డ్యూటీ (2005)
 • బాబ్ దట్ హెడ్ టూర్ (2009) (రాస్కల్ ఫ్లాట్స్ మ్యూజిక్ బ్యాండ్ కోసం ప్రారంభ ప్రదర్శన)

ఫిల్మోగ్రఫీ[మార్చు]

2006
చిత్రం
సంవత్సరం చిత్రం పాత్ర గమనికలు
2005 ది డ్యూక్స్ ఆఫ్ హజార్డ్ డైసీ డ్యూక్
ఎంప్లాయి ఆఫ్ ది మంత్ అమీ రెన్‌ఫ్రో
2007 బ్లాండ్ ఆంబిషన్ క్యాటీ గ్రెగర్‌స్టిచ్
2008 ది లవ్ గురు జెస్సికా అతిధి పాత్ర
Private Valentine: Blonde & Dangerous మేగన్ వేలంటైన్
బుల్లితెర
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2003—2005 Newlyweds: Nick and Jessica జెస్సికా రియాలిటీ టెలివిజన్
2004 జెస్సికా జెస్సికా సింప్సన్ పైలట్ - అసలు ప్రసారం కాలేదు[69]
వాస్తవానినికి ఈ కార్యక్రమాన్ని ABC ఫిబ్రవరి, 2004లో చేజిక్కించుకుంది. అయితే మే, 2004లో ఉపసంహరించుకుంది.
2010 ది ప్రైస్ ఆఫ్ బ్యూటీ జెస్సికా రియాలిటీ టెలివిజన్
బుల్లితెర అతిథి పాత్రలు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2002 దట్ '70s షో అన్నెట్టీ "గోయింగ్ టు కాలిఫోర్నియా" (ఘట్టం 1, సీజన్ 5)
2003 "యువర్ టైమ్ ఈజ్ గొన్నా కమ్" (ఘట్టం 13, సీజన్ 5)
"బేబ్ అయామ్ గొన్నా లీవ్ యు" (ఘట్టం 14, సీజన్ 5)
ది ట్విలైట్ జోన్ మిరాండా ఎవాస్ "ది కలెక్షన్" (సీజన్ 1, ఘట్టం 38)
2009 ఐ గెట్ దట్ ఎ లాట్ కంప్యూటర్ టెక్నీషియన్ బుల్లితెర ప్రత్యేకం (1 ఘట్టం)

పురస్కారాలు మరియు ప్రతిపాదనలు[మార్చు]

సంవత్సరం ఫలితం అవార్డు విభాగం చలనచిత్రం లేదా కార్యక్రమం
2004 ఎంపికైంది టీన్ ఛాయిస్ అవార్డులు ఛాయిస్ TV పర్శనాలిటీ
-
గెలుచుకుంది ఛాయిస్ రియాలిటీ/వెరైటీ TV స్టార్ - ఫిమేల్ న్యూలీవెడ్స్
2005 గెలుచుకుంది ఛాయిస్ TV పర్శనాలిటీ: ఫిమేల్ న్యూలీవెడ్స్
2006 గెలుచుకుంది మూవీస్ - ఛాయిస్ బ్రేకవుట్ (ఫిమేల్) ది డ్యూక్స్ ఆఫ్ హజార్డ్
2007 ఎంపికైంది ఛాయిస్ మూవీ యాక్ట్రెస్: కామెడీ ఎంప్లాయి ఆఫ్ ది మంత్
2006 ఎంపికైంది రజ్జీ అవార్డులు చెత్త సహాయక నటి ది డ్యూక్స్ ఆఫ్ హజార్డ్
చెత్త వెండితెర జంట (సింప్సన్ మరియు ఆమె డైసీ డ్యూక్స్) ది డ్యూక్స్ ఆఫ్ హజార్డ్
మోస్ట్ టైర్‌సమ్ టాబ్లాయిడ్ టార్గెట్స్ (యాష్లీ సింప్సన్ మరియు నిక్ లాచీతో కలిసి పంచుకోబడింది)
-
2007 చెత్త నటి ఎంప్లాయి ఆఫ్ ది మంత్
2006 గెలుచుకుంది పీపుల్స్ ఛాయిస్ అవార్డులు ఒక చిత్రంలో నచ్చిన పాట ది డ్యూక్స్ ఆఫ్ హజార్డ్ ("దీస్ బూట్స్ ఆర్ మేడ్ ఫర్ వాకిన్'" పాటకు)
2006 ఎంపికైంది MTV మూవీ అవార్డులు శృంగారభరితమైన ప్రదర్శన ది డ్యూక్స్ ఆఫ్ హజార్డ్
బెస్ట్ ఆన్-స్క్రీన్ టీమ్ ది డ్యూక్స్ ఆఫ్ హజార్డ్ ( జానీ నాక్స్‌విల్లే & సీన్ విలియం స్కాట్‌తో పంచుకోబడింది)

సూచనలు[మార్చు]

 1. http://www.ok-magazine.com/news/view/13193
 2. "Jessica Simpson Biography (1980-)". filmreference.com.
 3. "Jessica Simpson Biography". people.com. Retrieved 2008-08-07.
 4. http://www.mtv.com/music/artist/simpson_jessica/artist.jhtml#bio
 5. 5.0 5.1 "Jessica Simpson Biography". foxnews.com. 2008-01-03. Retrieved 2008-08-07.
 6. 6.0 6.1 6.2 "Jessica Simpson: "I Wanna Love You Forever" Chart History". billboard.com. Retrieved 2010-02-02.
 7. Rogers, Ray (1999-12). "Jessica Simpson - singer - Interview". Interview. Retrieved 2008-08-07. Check date values in: |date= (help)
 8. 8.0 8.1 "Jessica Simpson: Album Chart History". billboard.com. Archived from the original on 2008-04-23. Retrieved 2008-08-07.
 9. Hitsdailydouble (2001). "Staind, Radiohead and St. Lunatics All Score In The 200k Range, With Jessica Simpson at 125k-130k". Retrieved November 27, 2009.
 10. Recording Industry Association of America (July 17, 2001). "U.S. Certification". Retrieved November 18, 2009.
 11. [1]
 12. ""RIAA Charts - Accreditations"". Retrieved September 10, 2009.
 13. "Jessica Simpson: Rejoyce: The Christmas Album". billboard.com. Archived from the original on 2008-06-01. Retrieved 2008-08-07.
 14. "People's Choice Award winners". usatoday.com. 2006-01-11. Retrieved 2008-08-07.
 15. దీస్ బూట్స్ ఆర్ మేడ్ ఫర్ వాకిన్ వీడియో బై జెస్సికా సింప్సన్
 16. "'Nervous' Jessica Simpson Tearful After Dolly Folly". nbc5.com. 2006-12-04. Retrieved 2008-08-07.
 17. "Jessica Simpson Out Of Parton Tribute". cbsnews.com. 2006-12-21. Retrieved 2008-08-07.
 18. Gray, Mark (2007-09-11). "Jessica Simpson Is Going Country". people.com. Retrieved 2008-08-07.
 19. జెస్సికా సింప్సన్ మేక్స్ చార్ట్ హిస్టరీ
 20. Mascia, Kristen (2008-07-11). "Jessica Simpson: New Country Video 'So Much Fun'". people.com. Retrieved 2008-08-07.
 21. "Jessica Simpson's New Album Cover". People Magazine. 2008-07-28. Retrieved 2008-08-07.
 22. "Rep: Jessica Simpson No Longer on Country Label". Us Weekly. 2009-04-07. Retrieved 2009-04-07.
 23. 23.0 23.1 http://hollywoodcrush.mtv.com/2010/02/16/జెస్సికా సింప్సన్ టాక్స్ జాన్ మేయర్ మామ్ జీన్స్ బ్యాక్‌లాష్ అండ్ ఎ న్యూ ఆల్బమ్ ఇన్ అల్యూర్ కవర్ స్టోరీ/
 24. లెవీ, ఏరియల్ (2004). "క్వీన్ ఆఫ్ ది బూబ్ ట్యూబ్" Blender.com (జనవరి 30, 2007 నుంచి అందుబాటులోకి)
 25. Himes, Stephen. "The Nick and Jessica Variety Hour". Flak. Retrieved 2008-08-07.
 26. Kuntzman, Gersh (2005-01-10). "Moore Controversy at People's Choice Awards". foxnews.com. Retrieved 2008-08-07.
 27. Silverman, Stephen M. (2004-09-14). "Jessica Simpson Nabs Daisy Duke Role". people.com. Retrieved 2008-08-07.
 28. "Dukes of Hazzard". boxofficemojo.com. Retrieved 2008-08-07.
 29. "Employee of the Month". boxofficemojo.com. Retrieved 2008-08-07.
 30. Tucker, Ken (2008-01-25). "Blonde Ambition (2008)". ew.com. Retrieved 2008-08-07.
 31. Orloff, Brian (2008-02-28). "Jessica Simpson Rules the Box Office – in Ukraine". people.com. Retrieved 2008-08-07.
 32. జెస్సికా సింప్సన్స్ మూవీ రిలీజ్డ్ స్ట్రెయిట్ టు DVD US మేగజైన్, ఫిబ్రవరి 3, 2009
 33. http://omg.yahoo.com/news/జెస్సికా సింప్సన్ వర్కింగ్ ఆన్ న్యూ రియాలిటీ షో/23035
 34. http://omg.yahoo.com/news/ఇట్స్ అఫీషియల్-జెస్సికా సింప్సన్ ల్యాండ్స్ అనదర్ రియాలిటీ షో/24172;_ylt=ArvcMgO6sg80YKX0LYdKKi6Vpxx.;_ylv=3
 35. http://omg.yahoo.com/news/జెస్సికా సింప్సన్ హైదిస్ ప్లాస్టిక్ సర్జిరీస్ ఆర్ నథింగ్ కంపేర్డ్ టు బ్రెజీలియన్ విమెన్/34392
 36. Edgar, Michelle (2006-03-26). "Simpson and Pavés Doing Hair". Women's Wear Daily. |access-date= requires |url= (help)
 37. Kaplan, Julee (2008-07-23). "Jessica Simpson Signs Deal for Dresses". wwd.com. Retrieved 2008-08-07.
 38. Monget, Karyn (2008-06-09). "Jessica Simpson Sets Intimates Launch for '09". wwd.com. Retrieved 2008-08-07.
 39. Cebrzynski, Gregg (2006-06-26). "Little Caesars' ambitious growth plans add tension in battle for pizza market share". Nation's Restaurant News. Archived from the original on 2012-06-29. Retrieved 2008-08-07.
 40. "Jessica's Super Bowl Secrets!". etonline.com. 2007-01-25. Retrieved 2008-08-07.
 41. "DirecTV goes for the guys' eyes as HD media-buying dollars 'spent more efficiently'". usatoday.com. 2007-03-27. Retrieved 2008-08-07.
 42. "Jessica Simpson's New Perfume". Hollyscoop. Retrieved 2009-09-01.
 43. జెఫ్ లీడ్స్, అక్టోబరు 3, 2004. హూ వాంట్స్ టు బి ఎ సింప్సన్?. న్యూయార్క్ టైమ్స్
 44. ది రెసిస్టెన్స్ మేనిఫెస్టో - కంటెంట్
 45. Walls, Jeannette (2005-07-27). "Has Sienna Miller found love in Bloom?". msnbc.msn.com. Retrieved 2008-08-07.
 46. న్యూయార్క్ టైమ్స్, రాక్ స్టార్స్ అనౌన్స్ స్వింగ్-స్టేట్ టూర్, ఆగస్టు 5, 2004
 47. CBS న్యూస్, జెస్సికా సింప్సన్ స్నబ్స్ బుష్, మార్చి 16, 2006
 48. "PETA Slams Jessica Simpson for 'Real Girls Eat Meat' T-Shirt". foxnews.com. 2008-06-18. Retrieved 2008-08-07.
 49. "Pamela Anderson Slams Jessica Simpson for Meat T-Shirt". foxnews.com. 2008-06-30. Retrieved 2008-08-07.
 50. Kaufman, Gil (2008-07-21). "Jessica Simpson Booed By Country Fans, Who Don't Buy That She's 'Just A Girl From Texas'". mtv.com. Retrieved 2008-08-07.
 51. "Jessica Simpson tries to go country". msnbc.msn.com. 2008-07-20. Retrieved 2008-08-07.
 52. Silverman, Stephen M. (2002-10-28). "Lachey and Simpson Become Mr. and Mrs". people.com. Retrieved 2008-08-07.
 53. Beggs, C. Spencer (2005-03-21). "Fashion Takes a Vow of Chastity". foxnews.com. Retrieved 2008-08-07.
 54. Borzillo-Vrenna, Carrie (2005-07-20). "Joe Simpson: Nick & Jessica's Marriage Is Solid". people.com. Retrieved 2008-08-07.
 55. "Nick Lachey, Jessica Simpson Split". people.com. 2005-11-25. Retrieved 2008-08-07.
 56. "Jessica Simpson, Lachey divorce final". USAToday.com. 2006-06-30. Retrieved 2008-08-07.
 57. Silverman, Stephen M. (2006-10-21). "Jessica Simpson Pinpoints When Marriage Ended". people.com. Retrieved 2008-08-07.
 58. "Nick Wants Bling Back From Jessica". cbsnews.com. 2006-02-18. Retrieved 2008-08-07.
 59. "The Unnewlywed". elle.com. Retrieved 2007-03-15.
 60. "Simpson, Mayer Ring In New Year Together". cbs3.com. 2007-01-03. Retrieved 2008-08-07.
 61. "Jessica Simpson & John Mayer Split – For Now". people.com. 2007-05-18. Retrieved 2008-08-07.
 62. Dahlberg, Tim (2007-12-22). "Yoko Romo: Jessica Simpson cast in the role of villain". USAToday.com. Retrieved 2008-08-07.
 63. "Bradshaw says he would not have taken trip during season". espn.com. 2008-01-11.
 64. US వీక్లీ, బుష్: "సెండ్ జెస్సికా సింప్సన్" టు డెమొక్రాటిక్ కన్వెన్షన్, ఏప్రిల్ 30, 2008
 65. Gina DiNunno (13 July 2009). "Tony Romo and Jessica Simpson Call It Quits?". TVGuide.com. Retrieved 2009-07-13.
 66. జెస్సికా సింప్సన్ బయాగ్రఫీ | జెస్సికా సింప్సన్ అధికారిక వెబ్‌సైటు
 67. జెస్సికా సింప్సన్
 68. "Jessica Simpson Donates Van to Mexican Orphanage". newsmax.com. 2007-03-28. Retrieved 2008-08-07.
 69. http://www.imdb.com/title/tt0826087/

బాహ్య వలయాలు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.