జె. డి. చక్రవర్తి

వికీపీడియా నుండి
(జె.డి.చక్రవర్తి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జె. డి. చక్రవర్తి
జననం
నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి

1972 ఏప్రిల్ 16
ఇతర పేర్లుజె. డి. , గడ్డం చక్రవర్తి
వృత్తినటుడు,
దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1989–ఇప్పటివరకు
జీవిత భాగస్వామిఅనుకృతి గోవింద్ శర్మ

జె. డి. చక్రవర్తి ఒక భారతీయ సినీ నటుడు, దర్శకుడు. అసలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. రామ్ గోపాల్ వర్మ మొదటి చిత్రం శివ సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు.[1] శివ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు తెలుగుతోను తమిళంతో పాటు హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి. కొన్నాళ్ళు ప్రతినాయకుడిగా, సహనటుడిగా నటించాడు. వన్ బై టూ, మనీ మనీ, గులాబీ చిత్రాలతో కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత వచ్చిన మృగం, దెయ్యం, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా చిత్రాలతో మరిన్ని విజయాలు అందుకున్నాడు.[2]

నేపథ్యము

[మార్చు]

హైదరాబాదు లోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో కర్ణాటక సంగీత విద్వాంసురాలైన డాక్టర్ శాంత కోవెల నాగులపాటి, నాగులపాటి సూర్యనారాయణ దంపతులకు జన్మించాడు. పాఠశాల విద్యను హైదరాబాదులోని సెయింట్ జార్జ్స్ గ్రామర్ పాఠశాల లో, ఇంజనీరింగ్ విద్యను చైతన్య భారతి కళాశాల లో పూర్తి చేశాడు.[3][4][5][6]

సినీ ప్రస్థానం

[మార్చు]

1989లో రాంగోపాల్ వర్మ చిత్రం శివ చిత్రంలో ప్రతినాయక పాత్ర అయిన విద్యార్థి నాయకుడు జె. డి. పాత్రను పోషించడంతో ఇతని సినీ నట ప్రస్థానము ప్రారంభమైంది. తర్వాత ఒక మలయాళ చిత్రం ఎన్నొందిష్టం కూడమో లో సహాయక పాత్రను పోషించాడు. 1998 జూలై 3 న తెలుగు, హిందీ భాషలలో విడుదలైన సత్య చిత్రం ఇతనికి మంచి పేరును తీసుకువచ్చింది.[7]

నటుడు

[మార్చు]

దర్శకుడు

[మార్చు]

వెబ్ సిరీస్

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "'శివ'తో పరిచయమై." సితార. Retrieved 2020-05-07.[permanent dead link]
  2. "వరుస చిత్రాలతో జె.డి.చక్రవర్తి బిజీబిజీ!". www.andhrajyothy.com. Archived from the original on 2022-06-13. Retrieved 2022-04-16.
  3. "NATIONAL / ANDHRA PRADESH : When old memories came alive". The Hindu. 2010-12-24. Retrieved 2012-07-12.
  4. "Chakravarthi - Interviews in Telugu Movies". Totaltollywood.com. Archived from the original on 2012-05-04. Retrieved 2012-07-12.
  5. "J.D. Chakravarthy Profile". Telugu Movie Talkies. Archived from the original on 2012-08-28. Retrieved 2012-09-15.
  6. "Mee Star : J D Chakravarthy". YouTube. 2012-07-02. Retrieved 2012-09-15.
  7. "Metro Plus Delhi / Entertainment : Some chill, some frill". The Hindu. 2004-10-25. Archived from the original on 2006-06-29. Retrieved 2012-07-12.

బయటి లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జె. డి. చక్రవర్తి పేజీ