జె.వెంకటరామన్
జె.వెంకటరామన్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | తిరుచిరాపల్లి, తమిళనాడు | 1934 జూలై 5
మరణం | 2020 జూలై 30 | (వయసు 86)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | గాయకుడు, గురువు |
వాయిద్యాలు | గాత్రం |
జె.వెంకటరామన్ కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు.
విశేషాలు
[మార్చు]ఇతడు 1934, జూలై 5వ తేదీన తమిళనాడు, తిరుచిరాపల్లిలో జన్మించాడు[1]. ఇతడు కర్ణాటక సంగీతాన్ని మొదట తన తండ్రి కె.వి.జయరామ అయ్యంగార్ వద్ద నేర్చుకున్నాడు. ఆ తర్వాత అలత్తూర్ వెంకటేశ అయ్యర్, ఎం.ఎ.వేణుగోపాలన్‌ల వద్ద తన సంగీతాన్ని మెరుగు పరచుకున్నాడు. ఇతడు దేశవిదేశాలలో జరిగిన సంగీతోత్సవాలలో పాల్గొని కర్ణాటక గాత్ర విద్వాంసునిగా తన సత్తా చాటాడు. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో అనేక కచేరీలను చేశాడు. ఆకాశవాణి తిరుచురాపల్లి కేంద్రం నిలయ విద్వాంసునిగా పనిచేశాడు. ఇతను మంచి గురువు కూడా. సీతాలక్ష్మి రామస్వామి కాలేజి, తిరుచిరాపల్లి వంటి అనేక విద్యాసంస్థలలో విజిటింగ్ ఫ్యాకల్టీగా సంగీత పాఠాలు చెప్పాడు. కర్ణాటక సంగీతంపై అనేక సంస్థలు నిర్వహించిన కార్యశాలలకు ఇతడు హాజరయ్యాడు. ఇతడు అనేక పాటలను రికార్డు చేశాడు.
సంగీత రంగంలో ఇతడి కృషిని గుర్తించి అనేక సంగీత సభలు ఇతడిని సన్మానించాయి. చెన్నైలోని నారద గానసభ ఇతడిని సంగీత శ్రేష్ఠ బిరుదుతో సత్కరించింది. కొయంబత్తూరుకు చెందిన భారతీయ విద్యాభవన్ ఇతడిని సంగీత సమ్రాట్ బిరుదుతో గౌరవించింది. 1998లో మద్రాసు సంగీత అకాడమీ వారిచే పల్లవిని ఆలపించడంలో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.[2] అమెరికా క్లీవ్‌లాండులో జరిగిన త్యాగరాజ సంగీత ఉత్సవాలలో "సంగీత కళాసాగరం" బిరుదుతో సత్కరించబడ్డాడు[3]. 2010లో శ్రీరంగం గురుగుహ గానసభ వారు "స్వరలయ శిఖామణి" బిరుదుతో సత్కరించారు. 2011లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతడికి కర్ణాటక సంగీతం గాత్రం విభాగంలో అవార్డును ప్రకటించింది. 2013లో నాదద్వీపం ట్రస్ట్ వారు ఇతడిని "నాదద్వీప కళానిధి" బిరుదుతో సత్కరించారు.[4] 2013లో మద్రాసు సంగీత అకాడమీ ఇతడిని సంగీత కళాచార్య అవార్డుతో సత్కరించింది.[3]
ఇతడు 2020, జూలై 30వ తేదీన తన 86వ యేట మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ web master. "J. Venkataraman". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 9 మార్చి 2021. Retrieved 27 February 2021.
- ↑ Aruna Chandaraju (28 October 2005). "Holding on to a grand form". The Hindu. Retrieved 27 February 2021.
- ↑ 3.0 3.1 Staff Reporter (30 November 2012). "Life dedicated to music". The Hindu. Retrieved 27 February 2021.
- ↑ Staff Reporter (25 July 2013). "J. Venkataraman feted". The Hindu. Retrieved 27 February 2021.