Jump to content

జె. సి. మధుస్వామి

వికీపీడియా నుండి
జె. సి. మధుస్వామి

న్యాయ & పార్లమెంటరీ, అసెంబ్లీ వ్యవహారాల
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 ఆగష్టు 2021
ముందు బసవరాజు బొమ్మై
పదవీ కాలం
20 ఆగష్టు 2019  21 జనవరి 2021
ముందు జి. పరమేశ్వర
తరువాత బసవరాజు బొమ్మై

చిన్న నీటిపారుదల శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
20 ఆగష్టు 2019
ముందు సి .ఎస్. పుట్టరాజు

పదవీ కాలం
2018  2023
ముందు సి.బి. సురేష్ బాబు
తరువాత సి.బి. సురేష్ బాబు
నియోజకవర్గం చిక్కనాయకనహళ్లి
పదవీ కాలం
2004  2008
ముందు సి.బి. సురేష్ బాబు
తరువాత సి.బి. సురేష్ బాబు
నియోజకవర్గం చిక్కనాయకనహళ్లి
పదవీ కాలం
1997  1999
ముందు ఎన్. బసవయ్య
తరువాత సి.బి. సురేష్ బాబు
నియోజకవర్గం చిక్కనాయకనహళ్లి
పదవీ కాలం
1989  1994
ముందు బి. లక్కప్ప
తరువాత ఎన్. బసవయ్య
నియోజకవర్గం చిక్కనాయకనహళ్లి

వ్యక్తిగత వివరాలు

జననం (1953-02-04) 1953 ఫిబ్రవరి 4 (వయసు: 73)
చిక్కనాయకనహళ్లి,
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు *కర్ణాటక జనతా పక్ష (2013-2018)
  • జనతా దళ్ (యునైటెడ్) (1999-2013)
  • స్వతంత్ర (1997–1999)
  • జనతా దళ్ (1988–1997)
  • జనతా పార్టీ (Till 1988)
నివాసం జయచామరాజపుర

జె. సి. మధుస్వామి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చిక్కనాయకనహళ్లి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, బి.ఎస్.యడ్యూరప్ప, బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో న్యాయ, అసెంబ్లీ వ్యవహారాల, చిన్న నీటిపారుదల శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

జె. సి. మధుస్వామి బీజేపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున మల్లేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1994లో ఓడిపోయి, 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. జె. సి. మధుస్వామి 1999 ఎన్నికల్లో జనతా దళ్ (యునైటెడ్) తరపున పోటీ చేసి ఓడిపోయి, 2004లో జరిగిన ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

జె. సి. మధుస్వామి 2008, 2013లో జరిగిన ఎన్నికల్లో జనతా దళ్ (సెక్యూలర్) తరపున పోటీ చేసి ఓడిపోయి, [2] 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి నాలుగువసారి ఎమ్మెల్యేగా గెలిచి బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసి ఆ తరువాత 4 ఆగష్టు 2021 నుండి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో చిన్న నీటిపారుదల, న్యాయ & పార్లమెంటరీ, అసెంబ్లీ వ్యవహారాల శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  2. Elections in India (2013). "Chikkanayakanahalli Election and Results 2018, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
  3. Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.