Jump to content

జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్

వికీపీడియా నుండి
జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జేక్ మాథ్యూ ఫ్రేజర్-మెక్‌గుర్క్
పుట్టిన తేదీ (2002-04-11) 2002 April 11 (age 23)
బాక్స్ హిల్, విక్టోరియా, ఆస్ట్రేలియా
బ్యాటింగుకుడిచేతి
బౌలింగుకుడిచేతి లెగ్ స్పిన్
పాత్రబ్యాట్స్‌మన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 246)2024 4 ఫిబ్రవరి - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2024 10 నవంబర్ - పాకిస్తాన్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.23
తొలి T20I (క్యాప్ 110)2024 4 సెప్టెంబర్ - స్కాట్లాండ్ తో
చివరి T20I2024 18 నవంబర్ - పాకిస్తాన్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.23
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019/20విక్టోరియా (స్క్వాడ్ నం. 23)
2020/21–ప్రస్తుతంమెల్‌బోర్న్ రెనిగేడ్స్ (స్క్వాడ్ నం. 23)
2023/24–ప్రస్తుతందక్షిణ ఆస్ట్రేలియా (స్క్వాడ్ నం. 23)
2023/24దుబాయ్ క్యాపిటల్స్ (స్క్వాడ్ నం. 23)
2024-ప్రస్తుతంఢిల్లీ క్యాపిటల్స్ (స్క్వాడ్ నం. 33)
2024శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే టీ20ఐ ఎఫ్‌సి లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 5 7 17 25
చేసిన పరుగులు 87 113 594 563
బ్యాటింగు సగటు 17.40 16.14 19.16 28.15
100లు/50లు 0/0 0/1 1/1 1/1
అత్యుత్తమ స్కోరు 41 50 101 125
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 7/– 11/– 6/–
మూలం: [1]

జేక్ మాథ్యూ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (జననం 11 ఏప్రిల్ 2002) ఆస్ట్రేలియన్ అంతర్జాతీయ క్రికెటర్. ఆయన వన్డే, టి 20 ఐ క్రికెట్‌లో ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. మెక్‌గుర్క్ సౌత్ ఆస్ట్రేలియా, మెల్‌బోర్న్ రెనెగేడ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ తరపున ఆడుతున్నాడు.[1]

మెక్‌గుర్క్ గతంలో విక్టోరియా, దుబాయ్ క్యాపిటల్స్ తరపున ఆడాడు. ఆయన తన ఫస్ట్-క్లాస్, లిస్ట్ ఏ, ఐపీఎల్‌ అరంగేట్రంలో అర్ధశతకం సాధించాడు.[2][3]

దేశీయ కెరీర్

[మార్చు]

ఫ్రేజర్-మెక్‌గుర్క్ 2019–20 షెఫీల్డ్ షీల్డ్‌లో విక్టోరియా తరపున 2019 నవంబర్ 12న ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[4] ఆయన 2019–20 మార్ష్ వన్డే కప్‌లో విక్టోరియా తరపున నవంబర్ 17న లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[5]

ఫ్రేజర్-మెక్‌గుర్క్ 2020–21 బిగ్ బాష్ లీగ్ సీజన్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరపున 2020 డిసెంబర్ 12న తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[6] ఆయన 2023 అక్టోబర్ 8న 29 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన లిస్ట్-ఏ సెంచరీ సాధించి ఎబి డివిలియర్స్ పేరిట 31 బంతుల రికార్డును అధిగమించాడు.[7][8] మెక్‌గుర్క్ 2024 ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడి అరంగేట్రంలో లక్నో సూపర్ జెయింట్స్‌పై 35 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఆయన సీజన్‌లో 9 ఇన్నింగ్స్‌లలో 234 స్ట్రైక్ రేట్‌తో 32 ఫోర్లు & 28 సిక్సర్లతో 330 పరుగులతో చేశాడు.[9]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

ఫ్రేజర్-మెక్‌గుర్క్ డిసెంబర్ 2019లో 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్నాడు.[10] అయితే జట్టు పర్యటన సందర్భంగా కోతి గోకడంతో అతను టోర్నమెంట్ నుండి ముందుగానే నిష్క్రమించాల్సి వచ్చింది.[11]

ఫ్రేజర్-మెక్‌గుర్క్ మే 2024లో 2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం ఆస్ట్రేలియా జట్టులో రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.[12] ఆయన 2024 జూలై 15న సెప్టెంబర్‌లో జరిగిన ఇంగ్లాండ్, స్కాట్లాండ్‌లలో వైట్-బాల్ పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికయ్యాడు.[13][14] ఆయన 2024 సెప్టెంబర్ 4న స్కాట్లాండ్‌పై ఆస్ట్రేలియా తరపున తన టీ20ఐ అరంగేట్రం చేసి అరంగేట్రంలో 0 పరుగులకు ఔటై చేసి టీ20ఐ అరంగేట్రంలో డకౌట్ అయిన ఆస్ట్రేలియా తరపున మొదటి టాప్ 6 బ్యాటర్ అయ్యాడు.[15][16] ఆయన సెప్టెంబర్ 2024లో ఇంగ్లాండ్‌పై తన తొలి అంతర్జాతీయ అర్ధ సెంచరీని సాధించాడు.[17]

మూలాలు

[మార్చు]
  1. "Jake Fraser-McGurk". ESPN Cricinfo. Retrieved 12 November 2019.
  2. "20 cricketers for the 2020s". The Cricketer Monthly. Retrieved 6 July 2020.
  3. bcc-admin (2019-11-11). "Jake Fraser-McGurk Sheffield Shield Debut". Boroondara Cricket Club. Archived from the original on 11 March 2020. Retrieved 2023-12-23.
  4. "12th Match, Marsh Sheffield Shield at Melbourne, Nov 12-15 2019". ESPN Cricinfo. Retrieved 12 November 2019.
  5. "17th Match (D/N), The Marsh Cup at Melbourne, Nov 17 2019". ESPN Cricinfo. Retrieved 17 November 2019.
  6. "4th Match (N), Hobart, Dec 12 2020, Big Bash League". ESPN Cricinfo. Retrieved 12 December 2020.
  7. "Meet Jake Fraser-McGurk, Australian batter who broke AB de Villiers' record for fastest one-day century" (in ఇంగ్లీష్). The Week. 9 October 2023. Archived from the original on 24 March 2025. Retrieved 24 March 2025.
  8. "7th Match, Adelaide, October 8 2023, The Marsh Cup". ESPN Cricinfo. Retrieved 8 October 2023.
  9. "Kuldeep, Fraser-McGurk and Pant join forces to lift Capitals out of last spot". Cricinfo. Retrieved 24 April 2024.
  10. "Next generation: Australia reveal U19 World Cup squad". Cricket Australia. Retrieved 13 December 2019.
  11. Cherny, Daniel (29 January 2020). "Aussie cricketer Jake Fraser-McGurk attacked by monkey". The Sydney Morning Herald (in ఇంగ్లీష్). Retrieved 21 November 2024.
  12. "Australia's squad for ICC Men's T20I World Cup 2024 Updates". ScoreWaves (in ఇంగ్లీష్). Retrieved 2024-06-11.
  13. "Fraser-McGurk replaces Warner for Australia's UK tour". BBC Sport. Retrieved 15 July 2024.
  14. "Jake-Fraser McGurk, Cooper Connolly picked for England, Scotland T20Is". Cricbuzz. Retrieved 15 July 2024.
  15. "Fraser-McGurk debuts as Aussies bowl in Scotland opener | cricket.com.au". www.cricket.com.au (in ఇంగ్లీష్). 2024-09-04. Retrieved 2024-09-05.
  16. "Jake Fraser-McGurk becomes first Aussie 'batter' to register a duck on T20I debut | Australia tour of Scotland, 2024". www.cricket.com (in ఇంగ్లీష్). 2024-09-04. Retrieved 2024-09-05.
  17. "Livingstone and Bethell star as England level T20I series". ESPNcricinfo (in ఇంగ్లీష్). 13 September 2024. Retrieved 15 September 2024.