జేడెన్ సీల్స్
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | జేడెన్ నైజెల్ ట్రిస్టెన్ సీల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 2001 సెప్టెంబరు 10 ట్రినిడాడ్ అండ్ టొబాగో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 326) | 2021 జూన్ 10 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి టెస్టు | 2025 డిసెంబరు 18 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 212) | 2022 జూన్ 4 - నెదర్లాండ్స్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 2025 నవంబరు 22 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 100) | 2024 డిసెంబరు 19 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి T20I | 2025 నవంబరు 13 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2020–2024 | ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2020/21–present | ట్రినిడాడ్ అండ్ టొబాగో క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2021 | జాఫ్నా కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2024–2025 | సస్సెక్స్ (స్క్వాడ్ నం. 14) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2025 | ఆంటిగ్వా అండ్ బార్బడా ఫాల్కన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2025 డిసెంబరు 29 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జేడెన్ నిగెల్ ట్రిస్టెన్ సీల్స్ (జననం 2001 సెప్టెంబరు 10) ట్రినిడాడ్‌కు చెందిన క్రికెటరు. అతను ప్రధానంగా కుడిచేతి వాటం ఫాస్ట్ మీడియం బౌలరు. [1] సీల్స్ 2021 జూన్లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ రంగప్రవేశం చేశాడు [2]
కెరీర్
[మార్చు]అతను 2020 కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున 2020 ఆగస్టు 18న ట్వంటీ20ల్లో అడుగుపెట్టాడు.[3] ఆ మ్యాచ్‌లో ఒక వికెట్ తీసుకున్నాడు.[4] T20 రంగప్రవేశానికి ముందు అతను, 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం వెస్టిండీస్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. [5] 2020 డిసెంబరు 11న వెస్టిండీస్ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా న్యూజిలాండ్ Aతో జరిగిన వెస్టిండీస్ A తరపున ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేసాడు.[6] 2021 ఫిబ్రవరి 17న లిస్ట్ A లో 2020–21 సూపర్50 కప్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరపున రంగప్రవేశం చేసాడు.[7]
2021 మార్చిలో, క్రికెట్ వెస్టిండీస్ (CWI) శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం సీల్స్‌ను అభివృద్ధి చెందుతున్న ఆటగాడిగా ఎంపిక చేసింది. [8] 2021 జూన్లో, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ కోసం సీల్స్ 17 మందితో కూడిన తాత్కాలిక జట్టులో చోటు దక్కించుకున్నాడు.[9] దానికి ఎంపికవడానికి ముందు సీల్స్, పది ప్రొఫెషనల్ మ్యాచ్‌లలో మాత్రమే ఆడాడు. వాటిలో ఫస్ట్-క్లాస్ మ్యాచ్ కేవలం ఒక్కటే. [10] 2021 జూన్ 8న, CWI దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ కోసం సీల్స్‌ను జట్టులో చేర్చింది. [11] జట్టులో చోటు దక్కించుకున్న తర్వాత, సీల్స్ మాట్లాడుతూ, "ఒక కల నిజమైంది" అన్నాడు. తాను ఈ మ్యాచ్‌కు ఎంపికవుతానని ఆశిస్తున్నట్లు చెప్పాడు. [12] సీల్స్ 2021 జూన్ 6న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తన తొలి టెస్టు ఆడాడు.[13] ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు భారీ ఓటమి ఎదురైనప్పటికీ, సీల్స్ తాను బౌలింగ్ చేసిన మొదటి ఓవర్‌లో ఒక వికెట్ సహా మొత్తం మూడు వికెట్లు పడగొట్టాడు.[14]
2021 ఆగస్టులో, పాకిస్థాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో సీల్స్, రెండవ ఇన్నింగ్స్‌లో 5/55 గణాంకాలతో, టెస్ట్ క్రికెట్‌లో తన తొలి ఐదు వికెట్ల పంట సాధించాడు. [15] వెస్టిండీస్ తరఫున టెస్ట్‌లలో ఐదు వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన క్రికెటరయ్యాడు, 1950లో ఆల్ఫ్ వాలెంటైన్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు.[16]
2021 నవంబరులో, 2021 లంక ప్రీమియర్ లీగ్లో సీల్స్, జాఫ్నా కింగ్స్ తరపున ఆడటానికి ఎంపికయ్యాడు.[17]
2021 డిసెంబరులో, అతను ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్ కోసం వెస్టిండీస్ వన్డే ఇంటర్నేషనల్ (ODI) జట్టులో చోటు దక్కించుకున్నాడు. [18] 2022 మేలో, అతను నెదర్లాండ్స్, పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్ కోసం వెస్టిండీస్ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. [19] 2022 జూన్ 4న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ తరపున వన్డేల్లో ప్రవేశించాడు.[20]
మూలాలు
[మార్చు]- ↑ "20 cricketers for the 2020s". The Cricket Monthly. Retrieved 18 August 2020.
- ↑ "Jayden Seales". ESPN Cricinfo. Retrieved 18 August 2020.
- ↑ "1st Match, Tarouba, Aug 18 2020, Caribbean Premier League". ESPN Cricinfo. Retrieved 18 August 2020.
- ↑ "20 cricketers for the 2020s". The Cricket Monthly. Retrieved 18 August 2020.
- ↑ "West Indies Squad announced for ICC U19 Cricket World Cup". Cricket West Indies. Retrieved 25 November 2019.
- ↑ "2nd unofficial Test, Nelson, Dec 11 - Dec 14 2020, West Indies A tour of New Zealand". ESPN Cricinfo. Retrieved 11 December 2020.
- ↑ "10th Match (D/N), Coolidge, Feb 17 2021, Super50 Cup". ESPN Cricinfo. Retrieved 18 February 2021.
- ↑ "20 cricketers for the 2020s". The Cricket Monthly. Retrieved 18 August 2020.
- ↑ "20 cricketers for the 2020s". The Cricket Monthly. Retrieved 18 August 2020.
- ↑ "West Indies Squad announced for ICC U19 Cricket World Cup". Cricket West Indies. Retrieved 25 November 2019.
- ↑ "Squad announced for 1st Betway Test Match against South Africa". Cricket West Indies. Retrieved 8 June 2021.
- ↑ "Fast-tracked into 13-man shortlist, Jayden Seales hopes to build on 'dream come true'". ESPN Cricinfo. Retrieved 9 June 2021.
- ↑ "1st Test, Gros Islet, Jun 10 - 14 2021, South Africa tour of West Indies". ESPN Cricinfo. Retrieved 10 June 2021.
- ↑ "Jayden Seales provides silver lining as Kraigg Brathwaite rues collapse". ESPN Cricinfo. Retrieved 13 June 2021.
- ↑ "20 cricketers for the 2020s". The Cricket Monthly. Retrieved 18 August 2020.
- ↑ "20 cricketers for the 2020s". The Cricket Monthly. Retrieved 18 August 2020.
- ↑ "20 cricketers for the 2020s". The Cricket Monthly. Retrieved 18 August 2020.
- ↑ "20 cricketers for the 2020s". The Cricket Monthly. Retrieved 18 August 2020.
- ↑ "20 cricketers for the 2020s". The Cricket Monthly. Retrieved 18 August 2020.
- ↑ "West Indies Squad announced for ICC U19 Cricket World Cup". Cricket West Indies. Retrieved 25 November 2019.