జేమ్స్ బుకానన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జేమ్స్ బుకానన్
జేమ్స్ బుకానన్

1860లో మీడ్ సోదరులు తీసిన బుకానన్ ఛాయాచిత్రం


పదవీ కాలము
మార్చి 4, 1857 – మార్చి 4, 1861
ఉపరాష్ట్రపతి జాన్ సి. బ్రెకెన్‌రిడ్జ్
ముందు ఫ్రాంక్లిన్ పియర్స్
తరువాత అబ్రహాం లింకన్

పదవీ కాలము
March 10, 1845 – March 7, 1849
అధ్యక్షుడు James K. Polk
ముందు John C. Calhoun
తరువాత John M. Clayton

పదవీ కాలము
December 6, 1834 – March 5, 1845
ముందు William Wilkins
తరువాత Simon Cameron

పదవీ కాలము
January 4, 1832 – August 5, 1833
అధ్యక్షుడు Andrew Jackson
ముందు John Randolph
తరువాత Mahlon Dickerson

పదవీ కాలము
1853 – 1856
అధ్యక్షుడు Franklin Pierce
ముందు Joseph R. Ingersoll
తరువాత George M. Dallas

Member of the U.S. House of Representatives from Pennsylvania's 4th district
పదవీ కాలము
March 4, 1823 – March 3, 1831
Alongside: Samuel Edwards, Isaac Wayne, Charles Miner, Samuel Anderson, Joshua Evans, Jr. and George G. Leiper
ముందు James S. Mitchell
తరువాత William Hiester
David Potts, Jr.
Joshua Evans, Jr.

Member of the U.S. House of Representatives from Pennsylvania's 3rd district
పదవీ కాలము
March 4, 1821 – March 3, 1823
Alongside: John Phillips
ముందు Jacob Hibshman
James M. Wallace
తరువాత Daniel H. Miller

పదవీ కాలము
March 4, 1829 – March 3, 1831
ముందు Philip P. Barbour
తరువాత Warren R. Davis

వ్యక్తిగత వివరాలు

జననం (1791-04-23) 1791 ఏప్రిల్ 23
మెర్సర్స్‌బర్గ్, పెన్సిల్వేనియా
మరణం 1868 జూన్ 1 (1868-06-01)(వయసు 77)
లాంకాస్టర్, పెన్సిల్వేనియా
రాజకీయ పార్టీ Democratic
జీవిత భాగస్వామి అవివాహితుడు
పూర్వ విద్యార్థి డికిన్సన్ కళాశాల
వృత్తి న్యాయవాది, దౌత్యవేత్త
మతం ప్రెస్బెటేరియనిజం
సంతకం జేమ్స్ బుకానన్'s signature

జేమ్స్ బుకానన్, జూ. (ఏప్రిల్ 23, 1791జూన్ 1, 1868) 15వ అమెరికా సంయుక్తరాష్ట్రాల అధ్యక్షుడు. 1857-1861 మధ్యకాలంలో పరిపాలించిన అతను 18వ శతాబ్దంలో జన్మించిన చివరివాడు. అతను ఇప్పటివరకు పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన ఏకైక అధ్యక్షుడు మరియు ఏకైక బ్రహ్మచారి అధ్యక్షుడు.

అధ్యక్ష పదవి చేపట్టక ముందు ఒక ప్రముఖ, అనుభవజ్ఞుడైన రాజకీయవేత్తగా బుకానన్ ప్రతినిధుల సభ మరియు ఆ తర్వాత సెనేట్‌లోనూ పెన్సిల్వేనియాకు ప్రాతినిధ్యం వహించాడు. అధ్యక్షుడు జేమ్స్ కె. పోల్క్ హయాంలో విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశాడు. అత్యున్నత న్యాయస్థానంలో పదవి చేపట్టే అవకాశాన్ని తిరస్కరించి, అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ పియర్స్‌ ఆధ్వర్యంలో యునైటెడ్ కింగ్‌డమ్ మంత్రిగా పనిచేశాడు. ఆ హోదాతోనే రెచ్చగొట్టే ఓస్టెండ్ మేనిఫెస్టో ముసాయిదా రూపకల్పనకు సాయపడ్డాడు. క్యూబాను స్పెయిన్ వదులుకోకుంటే అమెరికా తప్పకుండా యుద్ధం ప్రకటించాలనేది దాని సారాంశం. ఓస్టెండ్ మేనిఫెస్టో ఆచరణలోకి రాలేదు. అయితే అది పియర్స్ ప్రభుత్వాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.

బుకానన్ 1844, 1848 మరియు 1852లలో డెమొక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి నామినేషన్ పొందలేకపోయినా, 1856 ఎన్నికలలో, బానిసత్వ వివాదమునకు సంబంధించిన ఇరుపక్షాల మధ్య రాజీ సభ్యునిగా, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వానికి ఎంపికయ్యాడు. వ్యాపార పనుల మీద అతను బయటకు వెళ్లినప్పుడు ఈ తంతు జరిగింది. అయితే తదనంతర ఎన్నికలో బుకానన్ గెలవటానికి ముఖ్యంగా డెమొక్రాటిక్ పార్టీతో పోల్చుకుంటే విపక్షం మరింతగా చీలిపోయి ఉంటమమే కారణము. అధ్యక్షుడిగా అతను ఒక "పిండి కవచం". దక్షిణాదిపై సానుభూతి భావాలున్న ఉత్తరవాసిగా అతను డెమొక్రాటిక్ పార్టీపై పట్టుకై స్టీఫెన్ ఏ. డగ్లస్‌‌తో నిరంతరం పోటీపడేవాడు. ఉత్తరాదికి మరియు దక్షిణాదికి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు బుకానన్ ను రెండిటికీ చెడ్డ రేవడిని చేశాయి. దక్షిణాది రాష్ట్రాలు తమ వేర్పాటును ప్రకటించడం అమెరికా అంతర్యుద్ధం మొదలవడానికి నాంది పలికింది. వేర్పాటు చట్టవిరుద్ధమని, అయితే వేర్పాటును ఆపడం కొరకు యుద్ధానికి పూనుకోవడం కూడా చట్టవిరుద్ధమేనని బుకానన్ భావించాడు. అందువల్ల అతను నిష్క్రియాత్మకంగా ఉండిపోయాడు. అతను కార్యాలయాన్ని వీడే సమయానికి, ప్రజల్లో బలమైన బుకానన్ వ్యతిరేక అభిప్రాయం ఏర్పడింది. ఫలితంగా డెమొక్రాటిక్ పార్టీ రెండుగా చీలిపోయింది. తన అధ్యక్షత జార్జ్ వాషింగ్టన్‌ తరహాలో చరిత్రలో నిలిచిపోగలదని బుకానన్ ఒకసారి భావించాడు.[1] అయితే అంతర్యుద్ధానికి ముందు తలెత్తిన సంక్షోభాన్ని అధిగమించడంలో అనుసరించిన విధానం, ఈయన్ను చెత్త అధ్యక్షులలో ఒకడుగా చరిత్రకారులు అభివర్ణించేందుకు దోహదం చేసింది.

బాల్యం[మార్చు]

జేమ్స్ బుకానన్, జూనియర్., 1791 ఏప్రిల్ 23న ఫ్రాంక్లిన్ కౌంటీ, పెన్సిల్వేనియాలో హ్యారిస్‌బర్గ్‌ (ప్రస్తుతం జేమ్స్ బుకానన్ జన్మస్థల స్టేట్ పార్క్‌గా పిలవబడుతోంది) సమీపంలోని కోవ్ గ్యాప్‌లో చెక్కలతో నిర్మించిన ఇంటిలో జేమ్స్ బుకానన్ Sr. (1761–1833) మరియు ఎలిజబెత్ స్పీర్ (1767–1833) దంపతులకు జన్మించాడు. అతని తల్లిదండ్రులిద్దరూ స్కాట్లాండ్-ఐర్లాండ్‌ సంతతికి చెందినవారు. అతని తండ్రి 1783లో ఉత్తర ఐర్లాండ్‌ నుంచి వలస వచ్చిన వాడు. మొత్తం పదకొండు మంది పిల్లల్లో అతను రెండోవాడు. వారిలో ముగ్గురు చిన్నతనంలోనే మరణించారు. బుకానన్‌కు ఆరుగురు సోదరీమణులు మరియు నలుగురు సోదరులు. వారిలో ఒకరు మాత్రమే 1840 వరకు జీవించారు.[2]

అతను తన బాల్య జీవితాన్ని జేమ్స్ బుకానన్ హోటల్‌లో గడిపాడు.[3]

బుకానన్ పల్లెటూరులో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత కార్లిస్లే, పెన్సిల్వేనియాలోని డికిన్సన్ కళాశాల‌లో ప్రవేశించాడు. దుష్ప్రవర్తన కారణంగా ఒక సందర్భంలో బహిష్కరణకు గురైన బుకాకన్ రెండో అవకాశం కోసం అభ్యర్థించి, ఎట్టకేలకు 1809 సెప్టెంబరు 19న హానర్స్‌తో పట్టభద్రుడయ్యాడు.[4] ఆ ఏడాది తర్వాత, అతను లాంకాస్టర్‌ వెళ్లాడు. అక్కడ అతను న్యాయశాస్త్రం అభ్యసించి, 1812లో న్యాయవాదుల సంఘంలో చేరాడు. అంకితభావమున్న న్యాయవాదిగా, అనవసరమైన యుద్ధమని భావించి 1812 యుద్ధంను అతను తీవ్రంగా వ్యతిరేకించాడు. అయితే, పొరుగున ఉన్న మేరీల్యాండ్‌పై బ్రిటీష్ దాడి చేయడంతో అతను స్వచ్ఛంద సేవా దళంలో చేరి, బాల్టిమోర్‌ రక్షణ కోసం పోరాడాడు.[5]

క్రియాశీలక ఫ్రీమాసన్‌గా బుకానన్ తన జీవితంలో పెన్సిల్వేనియాలోని లాంకెస్టర్‌లో ఉన్న ఫ్రీమాసన్‌లకు సంబంధించిన లాడ్జ్ #43కి మాస్టర్‌గా మరియు పెన్సిల్వేనియాలోని గ్రాండ్ లాడ్జి యొక్క డిస్ట్రిక్ట్ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్‌గా పనిచేశాడు.[6]

రాజకీయ జీవితం[మార్చు]

ఒక సమాఖ్యవాదిగా బుకానన్ 1814-1816 మధ్యకాలంలో పెన్సిల్వేనియా ప్రతినిధుల సభలో తన రాజకీయ జీవితం మొదలుపెట్టాడు.[7] అతను 17వ అమెరికా సంయుక్తరాష్ట్రాల కాంగ్రెస్‌ మరియు నాలుగు పర్యాయాలు వరుసగా కాంగ్రెస్‌ (1821 మార్చి 4-1831 మార్చి 4)కు ఎన్నికయ్యాడు. అలాగే 21వ అమెరికా సంయుక్తరాష్ట్రాల కాంగ్రెస్‌లోని U.S. న్యాయవ్యవస్థపై వేసిన సభా కమిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు. 1830లో జేమ్స్ హెచ్. పెక్‌పై అభిశంసనకు సభ నియమించిన సభ్యుల్లో అతను కూడా ఉన్నాడు. మిస్సోరి జిల్లా యొక్క అమెరికా సంయుక్తరాష్ట్రాల జిల్లా కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన అతను ఎట్టకేలకు నిర్దోషిగా విముక్తి పొందాడు.[8] తిరిగి ఎన్నికవడం కోసం బుకానన్ ఎదురుచూడలేదు. 1832 నుంచి 1834 వరకు అతను రష్యా దౌత్యవేత్తగా పనిచేశాడు.

ఫెడరలిస్ట్ పార్టీ (సమాఖ్యవాది పార్టీ) నిష్క్రియాత్మకంగా మారడంతో ఖాళీని భర్తీ చేయడానికి బుకానన్ అమెరికా సంయుక్తరాష్ట్రాల సెనేట్‌కు డెమొక్రాట్‌ (ప్రజాస్వామ్యవాది)గా ఎన్నికయ్యాడు. డిసెంబరు 1834 నుంచి పనిచేసిన అతను 1837 మరియు 1843లలో తిరిగి ఎన్నికయ్యాడు. అయితే, 1845లో రాజీనామా చేశాడు. అతను విదేశీ సంబంధాల కమిటీ (24వ కాంగ్రెస్ మొదలుకుని 26వ కాంగ్రెస్ ముగింపు వరకు) ఛైర్మన్‌గా పనిచేశాడు.

1844లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి హెన్రీ బాల్డ్‌విన్‌ మరణానంతరం అధ్యక్షుడు పోల్క్‌ ఆ పదవిని బుకానన్ ద్వారా భర్తీ చేశాడు. అయితే అతను దానికి ఇష్టపడకపోవడంతో ఆ సీటు రాబర్ట్ కూపర్ గ్రీర్‌ చేత తిరిగి భర్తీ చేయబడింది.

బుకానన్ ప్రత్యర్థి, ఉపాధ్యక్షుడు జార్జ్ డల్లాస్‌ నుంచి అభ్యంతరాలు వచ్చినప్పటికీ, 1845-1849 మధ్యకాలంలో జేమ్స్ K. పోల్క్ ఆధ్వర్యంలో అతను విదేశాంగ మంత్రిగా పనిచేశాడు.[9] ఆ హోదాలో పశ్చిమ U.S. యొక్క ఉత్తర సరిహద్దుగా 49వ సమాంతరాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన 1849 ఓరేగాన్ ఒప్పంద సంప్రదింపులకు అతను సహకరించాడు.[10] అమెరికా సంయుక్తరాష్ట్రాల 27వ అధ్యక్షుడు విలియం హోవార్డ్ ట్రాఫ్ట్‌ తాత్కాలిక విదేశాంగ మంత్రిగా థియోడర్ రూస్‌వెల్ట్‌ హయాంలో తరచూ పనిచేసినప్పటికీ, జేమ్స్ బుకానన్ తర్వాత ఒక విదేశాంగ మంత్రి అధ్యక్షుడు కాలేదు.

1852లో తన స్వస్థలమైన పెన్సిల్వేనియాలోని లాంకెస్టర్‌లో ఫ్రాంక్లిన్ అండ్ మార్షల్ కాలేజ్ ధర్మకర్తల మండలి అధ్యక్షుడుగా బుకానన్ ఎంపికయ్యాడు. ఒక తప్పుడు నివేదికతో అతను తొలగించబడినప్పటికీ, అదే హోదాలో అతను 1866 వరకు కొనసాగాడు.[11]

అతను St. జేమ్స్ కోర్ట్ మంత్రి (బ్రిటన్‌)గా 1853-1856 మధ్యకాలంలో పనిచేశాడు. ఆ సమయంలో ఓస్టెండ్ మేనిఫెస్టో ముసాయిదా రూపకల్పనకు అతను సహకరించాడు. బానిసత్వంను మరింత విస్తరించే దిశగా స్పెయిన్‌ నుంచి క్యూబాను కొనుగోలు చేయడం దాని ఉద్దేశం. ఆ మేనిఫెస్టో పియర్స్ యంత్రాంగం చేసిన అతిపెద్ద పొరపాటైంది. ఫలితంగా సామ్రాజ్యవాదానికి మద్దతు గణనీయంగా తగ్గింది.

1856 ఎన్నికలు[మార్చు]

1856 ఎన్నికల్లో బుకానన్ వ్యతిరేక రాజకీయ వ్యంగ్య చిత్రం పలువురు ఉత్తరాది ప్రజల మనోభావాల్ని తెలుపుతోంది. ఒక బానిసత్వ యజమాని ("ఫైర్ ఈటర్") మరియు బానిస కింద ఉన్న బుకానన్ ఈ విధంగా అన్నాడు, "నేను ఇక ఎంతమాత్రం జేమ్స్ బుకానన్ కాదు, నా పార్టీకి వేదికను మాత్రమే."

1856లో డెమొక్రాట్లు బుకానన్‌ను అధ్యక్షపదవికి తమ అభ్యర్థిగాఎంపిక చేశారు. అందుకు కారణం కాన్సస్-నెబ్రాస్కా చర్చల సమయంలో అతను ఇంగ్లాండ్‌లో ఉండటం వలన చర్చలలో ఏ పక్షమూ వహించక వివాదరహితుడై ఉండటమే. బుకానన్ అభ్యర్థిత్వ బరిలో లేనప్పటికీ, అతను 17వ బ్యాలెట్లో ప్రతిపాదింపబడి, ఎంపికయ్యాడు.[ఉల్లేఖన అవసరం]

మాజీ అధ్యక్షుడు మిల్లర్డ్ ఫిల్‌మోర్‌ నో-నథింగ్ పార్టీ తరఫున అధ్యక్షపదవి మూడవ ముఖ్య అభ్యర్థిగా పోటీ చేయడంతో, త్రిముఖ పోటీలో జాన్ సి. ఫ్రీమాంట్‌ను బుకానన్ ఓడించడానికి దోహదపడింది. జాన్ 1856లో అధ్యక్ష పదవికి పోటీచేసిన తొలి రిపబ్లికన్‌ (రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి). అలా బుకానన్ 1857 మార్చి 4 నుంచి 1861 మార్చి 4 వరకు అధ్యక్షునిగా పనిచేశాడు. ఒక డెమక్రాటిక్ అధ్యక్షుని పదవీ కాలం తర్వాత అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్న ఇద్దరే ఇద్దరు డెమాక్రాటిక్ అధ్యక్షులలో బుకానన్ ఒకడు, ఈ విధంగా ఎన్నికైన మరో అధ్యక్షుడు మార్టిన్ వ్యాన్ బ్యూరెన్‌. బుకానన్ ఎన్నిక తర్వాత ఇప్పటిదాకా ఇలాంటి సందర్భం మళ్ళీ రాలేదు.

దేశంలో పెచ్చుమీరుతున్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని, ఎన్నికైన తర్వాత కాబోయే అధ్యక్షుడిగా (అమెరికాలో ఎన్నికైన వెంటనే అభ్యర్థి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చెయ్యడు), బుకానన్ తన నియామకాల్లో తరగతి వారీ తుల్యతను సాధించడం మరియు అత్యున్నత న్యాయస్థానం అర్థ వివరణ ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన చట్టాన్ని ఆమోదించే విధంగా ప్రజలను ఒప్పించడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దడానికి నిర్ణయించుకున్నాడు. కొన్ని ప్రాంతాల్లో బానిసత్వాన్ని రద్దుచేయడం యొక్క చట్టబద్ధతను న్యాయస్థానం యోచిస్తోంది. న్యాయస్థానం ఎటువైపు మొగ్గబోతుందనే విషయంపై ఇద్దరు న్యాయమూర్తులు బుకానన్‌కు చూచాయగా సూచనలిచ్చారు.

1857-1861 అధ్యక్షత[మార్చు]

1857 మార్చి 4న జేమ్స్ బుకానన్ పదవీప్రమాణం, జాన్ వుడ్ తీసిన ఛాయాచిత్రం. బుకానన్ పదవీప్రమాణం అప్పట్లో అత్యధిక ఛాయాచిత్రాల కార్యక్రమంగా రికార్డు సృష్టించింది

డ్రెడ్ స్కాట్ కేసు[మార్చు]

తన ప్రారంభ ఉపన్యాసంలో అధ్యక్షపదవికి మళ్ళీ పొటీచేయనని హామీ ఇవ్వడమే కాక, ప్రాదేశిక సమస్యను తనకు అందిన అంతర్గత సమాచారం ప్రకారం, సుప్రీంకోర్టు శరవేగంగా, సమూలంగా పరిష్కరిస్తుందని భావించి, ఆచరణలో అంత ప్రాముఖ్యతలేని సమస్యగా బుకానన్ కొట్ట్టివేశాడు. రెండు రోజుల అనంతరం, ప్రధాన న్యాయమూర్తి రాజర్ బి. టానీ (డికిన్సన్ కాలేజీ సహచర పూర్వ విద్యార్థి) ఆయా ప్రాంతాల్లోని బానిసత్వాన్ని రూపుమాపడానికి కాంగ్రెస్‌కు రాజ్యాంగబద్ధమైన అధికారం లేదని స్పష్టం చేస్తూ డ్రెడ్ స్కాట్ నిర్ణయంను వెల్లడించాడు. టానీ వెల్లడించిన లిఖితపూర్వక తీర్పు ఎక్కువగా ప్రాసంగిక కథనంగా అర్థం చేసుకోబడింది. అంటే కేసు పరిష్కారానికి అనవసరమైన రీతిలో న్యాయమూర్తి చేసే వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు ఉత్తరాదిన దుమారం రేపగా, దక్షిణ ప్రాంతం వారు హర్షం వ్యక్తపరచారు. ఈ నిర్ణయం వెనుక బుకానన్ వ్యక్తిగతంగా జోక్యం కల్పించుకుని ఉంటాడని చాలావరకు విశ్వసించబడింది. ఆవిష్కరణోత్సవం సందర్భంగా బుకానన్‌తో టానీ గుసగుసలాడటం పలువురు ఉత్తరవాసులు గుర్తు చేసుకున్నారు. ప్రాదేశిక సమస్యను సుప్రీంకోర్టు పరిష్కరించాలని బుకానన్ కోరుకున్నాడు. అంతేకాక, బానిసత్వ ఆస్తిని సొంతం చేసుకునే హక్కును సమర్థించేలా ఓటు వేయడం కోసం అతను తన సహచర పెన్సిల్వేనియా న్యాయమూర్తి రాబర్ట్ కూపర్ గ్రీర్‌‌ని వ్యక్తిగతంగా ఒప్పించే ప్రయత్నాలు చేశాడు. అబ్రహాం లింకన్‌, బుకానన్ను బానిసత్వ అధికారం యొక్క తొత్తుగా దుమ్మెత్తిపోశాడు. బానిసత్వ యజమానులు సమాఖ్య ప్రభుత్వం (ఫెడరల్ గవర్నమెంట్)పై పట్టు సాధించి, బానిసత్వాన్ని జాతీయం చేయడానికి కుట్ర పన్నినట్లు లింకన్ భావించాడు.

కాన్సస్‌పై భిన్నాభిప్రాయాలు[మార్చు]

ప్రాదేశిక సమస్యపై బుకానన్ మరిన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. అతను తన యంత్రాంగం యొక్క పూర్తి పలుకుబడిని కొత్తగా ఏర్పడిన కాన్సస్‌ రాష్ట్రంలో లేకాంప్టన్ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఆమోదించడం కోసం ఉపయోగించాడు. ఇది కాన్సస్‌ను ఒక బానిసత్వ రాష్ట్రంగా ఆమోదిస్తుంది. ఈ బిల్లుపై మెజారిటీ ఓట్లు సాధించడం కోసం అతను వివిధ పదవులకు నియామకాలను ఎరగా చూపడంతో పాటు లంచాలు కూడా ఇచ్చాడు. లేకాంప్టన్ ప్రభుత్వంలో బానిసయజమానుల ప్రాబల్యం ఎక్కువై, బానిసయజమానేతర వర్గం యొక్క హక్కులను హరించే విధంగా చట్టాలు రూపొందించబడడంతో, సహజంగానే లేకాంప్టన్ ప్రభుత్వం ఉత్తరవాసుల్లో ఆదరణ కోల్పోయింది. కాన్సస్ ఓటర్లు లేకాంప్టన్ రాజ్యాంగాన్ని తిరస్కరించినప్పటికీ, ఆ బిల్లును ప్రతినిధుల సభ ఆమోదించే విధంగా బుకానన్ చేయగలిగాడు. అయితే, స్టీఫెన్ ఏ. డగ్లస్ నాయకత్వంలోని ఉత్తరవాసులు సెనేట్‌లో ఈ బిల్లును అడ్డుకున్నారు. చివరకు, లీకాంప్టన్ రాజ్యాంగంపై కొత్తగా ఓటు వేయడానికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఈ చర్య దక్షిణాది ప్రజలను తీవ్ర కోపానికి గురిచేసింది. బుకానన్ మరియు డగ్లస్‌లు 1859-60 మధ్యకాలంలో పార్టీపై పట్టు సాధించేందుకు తీవ్రస్థాయిలో తలపడ్డారు. బుకానన్ తన అధికార ప్రాబల్యాన్ని వినియోగించగా, డగ్లస్ పార్టీలో అట్టగుడు స్థాయి కార్యకర్తలను ఉసిగొల్పాడు. ఇరువర్గాల మధ్య పరస్పర ఘర్షణతో బలహీనపడిన పార్టీపై బుకానన్ పట్టు కోల్పోయాడు.

బుకానన్ వ్యక్తిగత ఆలోచనలు[మార్చు]

అధ్యక్షుడు బుకానన్ మరియు అతని మంత్రివర్గం ఎడమ నుంచి కుడకి: జేకబ్ థాంప్సన్, లెవిస్ కాస్, జాన్ బి. ఫ్లాయిడ్, జేమ్స్ బుకానన్, హోవెల్ కాబ్, ఐజాక్ టౌసీ, జోసెఫ్ హోల్ట్ మరియు జెరెమాయా ఎస్. బ్లాక్, (c. 1859)

బుకానన్ వ్యక్తిగతంగా బానిస యజమానుల హక్కులకు మద్దతిచ్చేవాడు మరియు క్యూబాను సొంతంచేసుకోవాలనుకునే బానిసత్వ సామ్రాజ్యవాదుల మనోభావాలకు విలువ ఇచ్చేవాడు. బానిసత్వ నిర్మూలనవాదులు మరియు బానిసత్వ నిషేధిత రిపబ్లికన్లు ఇద్దరినీ ఒకే గాటిన కట్టి, బుకానన్ నిరసన భావంతో చూసేవాడు. బానిసత్వ అధికార వ్యతిరేకులతో అతను పోరాడేవాడు. తన మూడో వార్షిక ప్రసంగంలో బుకానన్ ఈ విధంగా అన్నాడు, బానిసలు "కరుణ మరియు మానవత్వంతో చూడబడుతున్నారని"... యజమాని దాతృత్వం మరియు స్వీయ ఆసక్తి రెండూ కూడా ఈ మానవత్వంతో కూడిన ఫలితం దిశగా పనిచేస్తాయి" [12]. చరిత్రకారుడు కెన్నెత్ స్టాంప్ ఇలా అన్నాడు,

Shortly after his election, he assured a southern Senator that the "great object" of his administration would be "to arrest, if possible, the agitation of the Slavery question in the North and to destroy sectional parties. Should a kind Providence enable me to succeed in my efforts to restore harmony to the Union, I shall feel that I have not lived in vain." In short, in the northern anti-slavery idiom of his day Buchanan was the consummate "doughface," a northern man with southern principles.[13]

అతని నిష్క్రియాత్మకత చాలా గొప్పది, మరిన్ని కళాశాలల ఏర్పాటుకు కాంగ్రెస్ ఆమోదించిన బిల్లును సైతం, ఇప్పటికే చదువుకున్న వారు అధికంగా ఉన్నారని భావించి, వీటో అధికారం ద్వారా ఆ బిల్లును అడ్డుకున్నాడు.[14]

1857 భయాందోళన[మార్చు]

1857 భయాందోళన అకస్మాత్తుగా చెలరేగడంతో బుకానన్ యంత్రాంగాన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ప్రభుత్వానికి హఠాత్తుగా నిధుల కొరతను ఎదుర్కొంది. సుంకం తగ్గింపునకు డెమొక్రాట్లు విజయవంతంగా ఒత్తిడి తీసుకురావడం ఈ పరిణామానికి కొంత వరకు కారణం. కోశాగార కార్యదర్శి హోవెల్ కాబ్‌ విజ్ఞప్తి మేరకు, బుకానన్ యంత్రాంగం ప్రభుత్వానికి లోటు బడ్జెట్‌‌ను జారీ చేయడం ప్రారంభించింది. ఈ చర్యలు మునుపటి రెండు దశాబ్దాలపాటు డెమక్రాట్లు అవలంబించిన కఠినమైన ఆర్థిక విధానాలకు పూర్తిగా వ్యతిరేక దిశలో ఉండటం వలన, రిపబ్లికన్లు ఆర్థిక అవకతవకల ఆరోపణలతో బుకానన్‌పై దాడి చేశారు.

యూఠా యుద్ధం[మార్చు]

మార్చి, 1857లో మోర్మన్‌ ప్రాబల్యం కలిగిన యూఠా సంస్థానం యొక్క గవర్నర్ బ్రిఘామ్ యంగ్‌ తిరుగుబాటుకు యోచిస్తున్నాడనే తప్పుడు సమాచారాన్ని బుకానన్ అందుకున్నాడు. అదే ఏడాది నవంబరులో, యంగ్‌ను తప్పించి, అతని స్థానంలో మోర్మనేతర అల్ఫ్రెడ్ కమింగ్‌ను గవర్నర్‌గా నియమించడానికి బుకానన్ సైన్యాన్ని పంపాడు. తనకు అందిన సమాచారాన్ని ధ్రువీకరించుకోకుండా మరియు పదవి నుంచి తప్పిస్తున్న విషయాన్ని యంగ్‌కు తెలపకుండా బుకానన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. వాషింగ్టన్‌లో ఏళ్ల తరబడి కొనసాగిన మోర్మన్ వ్యతిరేక ధోరణి మరియు తూర్పు ప్రాంత వార్తాపత్రికల్లో మోర్మన్ యొక్క బహుభార్యత్వ ఆచారంపై బహిరంగ దూషణలు మరియ సంచలనాత్మక వివరణలతో పాటు అధ్యక్షుడు మరియు సైన్యం యొక్క అభిప్రాయాలను వెల్లడించడం ద్వారా మోర్మన్‌లు అనూహ్య రీతిలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. సంస్థానాన్ని రక్షించడానికి వేలాది మంది పురుషులతో కూడిన పౌరసైన్యంకు యంగ్ పిలుపునిచ్చాడు. లోపలికి చొచ్చుకురాకుండా సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టించడం మరియు ఆలస్యం చేయడానికి ఒక చిన్న బృందాన్ని కూడా పంపాడు. దైవాధీనంగా, ప్రారంభ శీతాకాలం సమకాలీన వయోమింగ్‌లో సైన్యం మకాం వేసే విధంగా చేసింది. ఫలితంగా సంస్థానం మరియు సమాఖ్య ప్రభుత్వ (ఫెడరల్ గవర్నమెంట్) మధ్య చర్చలకు అవకాశం ఏర్పడింది. చెత్త వ్యూహం, సైన్యానికి నిత్యావసరాల కొరత మరియు తిరుగుబాటు సమాచారాల సమీక్ష మరియు తన అభిమతాలకు సంబంధించి సంస్థాన ప్రభుత్వాన్ని హెచ్చరించడం పరంగా అధ్యక్షుడు వైఫల్యం చెందడం కారణంగా బుకానన్ అటు కాంగ్రెస్ నుంచే కాక ఇటు మీడియా నుంచి కూడా తీవ్రమైన నిందారోపణలకు గురయ్యాడు. యుద్ధాన్ని "బుకానన్ ఘోర తప్పిదం"గా అవి అభివర్ణిచాయి. తన స్థానాన్ని కమింగ్‌తో భర్తీ చేయడానికి మరియు ఉతా సంస్థానం (భూభాగం)లోకి సైన్యాన్ని అనుమతించడానికి మరియు స్థావరం ఏర్పాటుకు యంగ్ అంగీకరించాడు. దాంతో "తిరుగుబాటుదారుల"ను దయతో క్షమిస్తున్నట్లు వివరించే ప్రకటనలను జారీ చేయడం ద్వారా బుకానన్ తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నాలను కాంగ్రెస్ మరియు ఉతా వాసులు తేలికగా తీసుకున్నారు. పౌర యుద్ధం సంభవిస్తే, దళాలను ఏ సమయంలోనైనా తూర్పుకు తిరిగి పిలిచే అవకాశముంది.

పక్షపాత ప్రతిష్ఠంభన[మార్చు]

బుకానన్ విధానాల కారణంగా ఉత్తర మరియు దక్షిణ డెమొక్రాట్ల మధ్య వేర్పాటు మరింత తీవ్రతరమైంది. ఫలితంగా 1858 ఎన్నికలలో ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు బహుళత్వం పొందడానికి దారితీసింది. చాంబర్‌లో మరింత పట్టు సాధించిన రిపబ్లికన్లు బుకానన్ యొక్క అజెండాలోని పలు అంశాలు (మెక్సికో మరియు పరాగ్వేపై దాడి మరియు క్యూబా కొనుగోలు సహా) ఓటుకు రాకుండానే అడ్డుకున్నారు. అందుకు ప్రతిగా బుకానన్ రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన ఆరు చట్టాలను వీటో ద్వారా రద్దు చేశాడు. ఫలితంగా కాంగ్రెస్ మరియు శ్వేతసౌధం మధ్య శత్రుభావం మరింతగా పెరిగింది.

పరిస్థితులను మరింత దిగజార్చే విధంగా, 1860 మార్చిలో, ప్రతినిధుల సభ, ప్రభుత్వ యంత్రాంగం లీకాంప్టన్ రాజ్యాంగం ఆమోదింపజేసేందుకు లంచాలివ్వటం మరియు కాంగ్రెస్ సభ్యులపై బెదిరింపు చర్యలు తీసుకోవడం వంటి పదవీచ్యుతకు అర్హణీయమైన అనైతిక చర్యలకు పాల్పడిందన్న ఆరోపణలను విచారించటానికి, వాటిపై ఆధారాలను సేకరించడానికి కోవోడ్ కమిటీని నియమించింది. ముగ్గురు రిపబ్లికన్లు మరియు ఒక డెమొక్రాట్ తో కూడుకున్న ఈ కమిటీ బహిరంగంగానే పక్షపాత ధోరణితో వ్యవహరించింది. అధ్యక్షుడికి సంబంధించిన అప్రతిష్ఠ సమాచారాన్ని, నిరూపించుకోవడానికి లేదా అధికారికంగా స్పందించడానికి అతనికి అవకాశమివ్వకుండానే బయటపెట్టింది. అయితే బుకానన్‌ అభిశంసన దిశగా కమిటీ ఎలాంటి పరిస్థితులను ఏర్పరచలేకపోయింది. అయితే అతని కేబినెట్‌ సభ్యులు అసాధారణ స్థాయిలో అధికార దుర్వినియోగం మరియు లంచగొండితనానికి పాల్పడినట్లు జూన్‌లో విడుదల చేసిన తన తుది నివేదికలో వెల్లడైంది. రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు కోవోడ్ కమిటీ నివేదిక ప్రతులను దేశవ్యాప్తంగా పంచారు. ఆ ఏడాది అధ్యక్ష ఎన్నికలకు అది ఒక ప్రచారాస్త్రంగా ఉపయోగపడింది.[15]

రద్దు: 1860 ఎన్నికలు[మార్చు]

జాన్ C. బ్రెకిన్‌రిడ్జ్, బుకానన్ హయాంలో అమెరికా సంయుక్తరాష్ట్రాల ఉపాధ్యక్షుడు

డెమొక్రాటిక్ పార్టీలో వర్గ పోరాటం ఊపందుకుని, 1860లో జరిగిన జాతీయ సమావేశంలో, పార్టీలో ప్రత్యక్ష విభజన ఏర్పడింది. చార్లెస్టన్, దక్షిణ కరోలినాలో జరిగిన జాతీయ సమావేశం స్తంభించిపోవడంతో బుకానన్ సాదాసీదా పాత్రను మాత్రమే పోషించాడు. పార్టీ దక్షిణాది విభాగం సమావేశం నుంచి వైదొలిగి, అప్పట్లో ఉపాధ్యక్షుడుగా పనిచేస్తున్న జాన్ సి. బ్రెకెన్‌రిడ్జ్ను అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిగా ప్రకటించింది. దక్షిణాదివారు పార్టీలోనుండి విడివడగా మిగిలిన వారు బుకానన్ యొక్క బద్ధశత్రువైన డగ్లస్‌ను అధ్యక్షపదవికి అభ్యర్థిగా ఎంపిక చేశారు. తదనుగుణంగా రిపబ్లికన్లు అబ్రహాం లింకన్‌ను ఎంపిక చేశారు. డెలావేర్ మరియు జనాభా తక్కువగా ఉండే ఇతర సరిహద్దు రాష్ట్రాలు వంటి స్వేచ్ఛా రాష్ట్రాల్లో మాత్రమే అతని పేరు బ్యాలెట్‌పై కనిపించినప్పటికీ, అతని ఎన్నికవుతాడన్నది ముందుగా అంటే 1860 నవంబరు 6న తీసుకున్న నిర్ణయమే.

అక్టోబరు మొదట్లో, సైన్యం కమాండింగ్ జనరల్‌ విన్‌ఫీల్డ్ స్కాట్‌, లింకన్ ఎన్నికైతే కనీసం ఏడు రాష్ట్రాలు సమాఖ్యనుండి విడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని, అందువల్ల ఆయా రాష్ట్రాల్లో సమాఖ్య ప్రభుత్వ ఆస్తి పరిరక్షణకు, సమాఖ్య దళాలను మరియు ఫిరంగిదళాన్ని భారీగా మొహరించాలని, బుకానన్‌ను హెచ్చరించాడు. బుకానన్ తన దక్షిణ ప్రాంత సానుభూతి భావాలతో పాటు స్కాట్‌ పై ఉన్న చీదరింపుతో, ఆ ముందస్తు హెచ్చరింపుపై ఎలాంటి చర్యా తీసుకోలేదు. ఈ విధంగా సమాఖ్య జోక్యం లేకుండా రాష్ట్రాలు యూనియన్‌ను విడిచిపెట్టేందుకు మార్గం సుగమం చేశాడు.

లింకన్ విజయం సాధించడంతో సమాఖ్య విభజన మరియు విచ్ఛేదంపై చర్చ తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికలు ముగిసిన నెల రోజులకు కాంగ్రేసును ఉద్దేశించి బుకానన్ ఇచ్చిన సందేశంలో ఈ విషయం యొక్క ప్రస్తావను దాటవేయలేనంతగా సమస్య ముదిరిపోయింది. సమస్యను అధిగమించే విధంగా బుకానన్ ఎలా వ్యవహరిస్తాడనే దానిపై ఇరు వర్గాలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశాయి. తన సందేశంలో (1860 డిసెంబరు 3), రాష్ట్రాలకు చట్టపరంగా విడిపోయే హక్కులేదని, అయితే సమాఖ్య ప్రభుత్వం వాటిని చట్టబద్ధంగా అడ్డుకోలేదని స్పష్టం చేశాడు. అంతేకాక, మొత్తం సంక్షోభానికి కారణం "దక్షిణాది రాష్ట్రాల్లోని బానిసత్వ సమస్యపై ఉత్తరాది ప్రజలు ఎక్కువగా కలగజేసుకోవడమే" అని అతను అన్నాడు.[16]. బుకానన్ దక్షిణాది రాష్ట్రాలతో రాజీపై ఆశలు పెట్టుకున్నాడు. అయితే వేర్పాటువాద నేతలు మాత్రం అందుకు ససేమిరా అన్నారు. వేర్పాటును అడ్డుకునే అధికారం తనకు లేదని బుకానన్ చేసిన ప్రకటన, వేర్పాటువాదులకు మరింత ఊతమిచ్చింది. అలాగే ఆయన ద్వైదీభావంతో రాష్ట్రాలకు విడిపోయే హక్కులేదని చేసిన ప్రకటన, తనకు దక్షిణాది ప్రజలలో మిగిలి ఉన్న అరకొర మద్దతును కూడా పోగొట్టుకున్నాడు.

ఈ నేపథ్యంలో బుకానన్ తటస్థంగా ఉంటూ, జరుగుతున్న విషయాలను పరిశీలిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు డిసెంబరు 20న దక్షిణ కరోలియా రాష్ట్ర విభజన జరిగింది. ఆ తర్వాత మరో ఆరు పత్తి రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి. ఫిబ్రవరి కల్లా, అవి అమెరికా రాష్ట్రాల సమాఖ్యను ఏర్పాటు చేశాయి. స్కాట్ అనుమానాస్పదంగా మారడంతో, వేర్పాటువాద ప్రభుత్వాలు తమ రాష్ట్రాల పరిధిలోని సమాఖ్య ఆస్తిపై చట్టపరమైన అధికారం లేదా హక్కును ప్రకటించాయి. అంటే వాటిని తిరిగి దక్కించుకోవడానికి యంత్రాంగం తరపు నుంచి ఎలాంటి ప్రయత్నం లేకుండా.

డిసెంబరు ఆఖర్లో బుకానన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం ప్రారంభించాడు. సమాఖ్య సానుభూతిపరులను తొలగించి, వారి స్థానంలో అతివాద జాతీయవాదులు జెరీమియా ఎస్. బ్లాక్, ఎడ్విన్ M. స్టాంటన్‌, జోసెఫ్ హాల్ట్‌ మరియు జాన్ ఏ. డిక్స్‌లను నియమించాడు. ఈ సంప్రదాయవాది డెమొక్రాట్లు అమెరికా జాతీయవాదాన్ని గట్టిగా విశ్వసించారు. అందువల్ల వేర్పాటు ఆమోదానికి తిరస్కరించారు. ఒక సందర్భంలో, కోశాగార కార్యదర్శి డిక్స్ న్యూ ఆర్లీన్స్‌లోని కోశాగార అధికారులను ఈ విధంగా ఆదేశించాడు, "ఎవరైనా మగాడు అమెరికా పతాకంను కిందకు దించితే, అతన్ని అక్కడికక్కడే కాల్చివేయండి." పౌర సైన్యాలను పిలిపించే అధికారం మరియు అత్యవసర సైనికాధికారాలకు కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేయమని బుకానన్‌కు కొత్త మంత్రివర్గం సలహా ఇచ్చింది. అయితే ఆ సమయానికి కాంగ్రెస్‌తో బుకానన్ సంబంధాలు అంత సానుకూలంగా లేకపోవడం మరియు అతని నాయకత్వంపై విశ్వాసం కూడా సన్నగిల్లింది. అందువల్ల అతని వినతులు తిరస్కరించబడ్డాయి.

కార్యాలయాన్ని బుకానన్ విడిచిపెట్టడానికి ముందు విభజన రాష్ట్రాల్లోని ఆయుధ సామగ్రి మరియు స్థావరాలు నాశనమైపోయాయి (ఫోర్ట్ సమ్‌టర్‌ మరియు ప్లోరిడాలోని మూడు ద్వీప స్థావరాలు మినహా) మరియు సమాఖ్య సైనికుల్లో నాలుగో వంతు టెక్సాస్‌ దళాలకు లొంగిపోయాయి. (రాజ్యాల)కూటమిలో స్పష్టంగా కనిపించే ప్రదేశమైన చార్లెస్టన్‌ నౌకాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన ఫోర్ట్ సమ్‌టర్‌పై ప్రభుత్వం తిరిగి నియంత్రణ సాధించింది. జనవరి 5న ఫోర్ట్ సమ్‌టర్‌కు సహాయక బలగాలు మరియు సరకుల పంపిణీని తీసుకెళ్లే విధంగా స్టార్ ఆఫ్ ది వెస్ట్‌ అనే పౌర స్టీమర్‌ను బుకానన్ పంపాడు. 1861 జనవరి 9న దక్షిణ కరోలినా రాష్ట్ర సాయుధ బలగాలు స్టార్ ఆఫ్ ది వెస్ట్‌ పై కాల్పులు జరిపాయి. అది తిరిగి న్యూయార్క్‌ చేరుకుంది. దాంతో కంగుతిన్న బుకానన్ యుద్ధ ప్రయత్నాలను కొనసాగించడానికి సాహసించలేదు.

అధ్యక్షుడిగా బుకానన్ ఆఖరి రోజున అంటే 1861 మార్చి 4న తదుపరి పగ్గాలు చేపట్టబోతున్న లింకన్‌ను ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యానించాడు, "శ్వేతసౌధంలో అడుగుపెట్టడానికి నువ్వు సంతోషంగా ఉన్నట్లయితే, వీట్‌ల్యాండ్‌కు తిరిగి వెళ్లడానికి నేను అంత బాధ పడతాను, నువ్వు సుఖ పురుషుడివి."[17]

జేమ్స్ బుకానన్ యొక్క అధ్యక్ష మంత్రివర్గం[మార్చు]

న్యాయమూర్తుల నియామకాలు[మార్చు]

జేమ్స్ బుకానన్ యొక్క అధ్యక్ష నాణెం

అత్యున్నత న్యాయస్థానం[మార్చు]

బుకానన్ దిగువ తెలిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించాడు:

న్యాయమూర్తి సీటు రాష్ట్రం ప్రారంభం
సేవ
ముగింపు
సేవ
నేథన్ క్లిఫోర్డ్ సీటు 2 మెయిన్ 1858 జనవరి 12 జులై 25, 1881

ఇతర న్యాయస్థానాలు[మార్చు]

బుకానన్ మరో ఏడుగురు మూడవ అధికరణపు సమాఖ్య న్యాయమూర్తులను కూడా నియమించాడు, వారంతా కూడా అమెరికా సంయుక్తరాష్ట్రాల జిల్లా కోర్టులకు నియమితులైన వారే.

న్యాయమూర్తి న్యాయస్థానం ప్రారంభం
సేవ
ముగింపు
సేవ
ఆసా బిగ్స్ D. N.C. 01858-05-13 మే 13, 1858 01861-04-03 ఏప్రిల్ 3, 1861
జాన్ క్యాడ్‌వాలాడర్ E.D. Pa. 01858-04-24 ఏప్రిల్ 24, 1858 01879-01-26 జనవరి 26, 1879
మాథ్యూ డెడీ D. Or. 01859-03-09 మార్చి 9, 1859 01893-03-24 మార్చి 24, 1893
విలియం గైల్స్ జోన్స్ N.D. విభాగం.
S.D. విభాగం.
01859-09-29 సెప్టెంబరు 29, 1859[18] 01861-01-12 జనవరి 12, 1861
విల్సన్ మెక్‌క్యాండిలెస్ W.D. పెన్సిల్వేనియా. 01859-02-08 ఫిబ్రవరి 8, 1859 01876-07-24 జూలై 24, 1876
రెన్సీలాయర్ రస్సెల్ నెల్సన్ D. మిన్నసోటా. 01858-05-20 మే 20, 1858 01896-05-16 మే 16, 1896
విలియం డేవిడ్ షిమ్‌మన్ D. కనెక్టికట్. 01860-03-12 మార్చి 12, 1860 01873-04-16 ఏప్రిల్ 16, 1873

అమెరికా సంయుక్తరాష్ట్రాల హక్కుల న్యాయస్థానం[మార్చు]

న్యాయమూర్తి ప్రారంభం
సేవ
ముగింపు
సేవ
జాన్ జేమ్స్ గిల్‌క్రిస్ట్ 1855 1858
జార్జ్ పార్కర్ స్కార్‌బర్గ్ 1855 1861

యూనియన్‌లో చేరిన రాష్ట్రాలు[మార్చు]

వ్యక్తిగత సంబంధాలు[మార్చు]

అమెరికా సంయుక్తరాష్ట్రాల పదమూడో ఉపాధ్యక్షుడు విలియం రుఫస్ డివానే కింగ్జేమ్స్ బుకానన్ ఇంట్లో అతనితో పాటు కలిసి ఉండిన అతని మిత్రుడు

1819లో బుకానన్ యాన్ కరోలిన్ కోలోమన్‌‌తో నిశ్చితార్థమైంది. ఆమె ఒక సంపన్నుడైన ఇనుము తయారీ వ్యాపారి కుమార్తె మరియు ఫిలడల్ఫియా న్యాయమూర్తి జోసెఫ్ హెంఫిల్‌ మరదలు. జోసెఫ్ ప్రతినిధుల సభలో బుకానన్ యొక్క సహచరుడు. అయితే అనురంజన సమయంలో బుకానన్ ఆమెతో కొద్దికాలం మాత్రమే గడిపాడు. అతను తన న్యాయ విభాగం మరియు 1819 భయానక సమయంలో రాజకీయ కార్యక్రమాలతో తీరికలేక ఉండేవాడు. ఆ సమయంలో అతను కోలోమన్‌కు కొద్ది వారాల పాటు దూరంగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో బుకానన్‌ మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడని, అతనిది ఆర్థిక పరిపుష్టి లేని కుటుంబమని అందుకే డబ్బు కోసమే ఆమెను పెళ్ళి చేసుకుంటున్నాడంటూ పలు పుకార్లు వచ్చాయి. బుకానన్ తన అభిమతాలు లేదా మనోభావాల గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. అయితే పుకార్లకు కోలోమన్ కారణమని ఆమె రాసిన లేఖల ద్వారా బహిర్గతమైంది. ఇలా ఉండగా, తన మిత్రుడి భార్యను బుకానన్ పరామర్శించడానికి వెళ్లడంతో కోలోమన్ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. తర్వాత కొద్ది రోజులకు అంటే 1819 డిసెంబరు 9న ఆమె మరణించింది. చివరి గడియల్లో ఆమెను చూసుకున్న Dr. చాప్‌మన్ ఆమె చనిపోయిన తర్వాత "తనకు తెలిసినంత వరకు మూర్ఛ ద్వారా మరణం సంభవించడం ఇదే ప్రప్రథమైన ఉదాహరణ" అని అన్నాడు. అతని నివేదికలు ఇలా పేర్కొన్నాయి, నల్లమందు ద్రావకం అతిమాత్ర వల్లనే ఆమె మరణించిందని భావించబడింది.[19] తాను పెళ్ళి చేసుకోబోయే వ్యక్తి చనిపోవడంతో బుకానన్ తీవ్ర వేధనకు గురయ్యాడు. ఏఆమె తండ్రి–కి రాసిన లేఖలో "ఇప్పుడు వివరించడానికి సమయం లేదు. అయితే ఆమె మరియు నేను ఎక్కువగా దూషణకు గురైన విషయాన్ని నువ్వు గుర్తించినప్పుడు తెలుస్తుంది" అని బుకానన్ పేర్కొన్నాడు. దాని రచయితలను దేవుడు క్షమిస్తాడు.... ఆమె మరణం కలిగించిన షాకు (మనోఘాతం)ను నేను తట్టుకోగలను. అయితే సంతోషమనేది మాత్రం నా నుంచి ఎప్పటికీ దూరమైపోయింది."[19] అయితే బుకానన్ పట్ల కోలోమన్ కుటుంబం తీవ్రమైన వ్యతిరేకతను పెంచుకుంది. ఆమె అంత్యక్రియలకు అతనిని అనుమతించలేదు.[20] బుకానన్ సరససల్లాపాలు కొనసాగించినప్పటికీ, తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోబోనని ప్రతినబూనాడు. భార్య ఉంటే మంచిదని మరికొందరు పెళ్లి చేసుకోమంటూ అతనిపై ఒత్తిడి చేశారు. అందుకు అతను ఇలా స్పందించాడు, "పెళ్లి చేసుకోలేను, ప్రేమానురాగాలు సమాధి చేయబడ్డాయి." యాన్ కోలోమన్ రాసిన లేఖలను అతను తన వద్దే జీవితమంతా అట్టిపెట్టుకున్నాడు, అతని కోరిక మేరకు మరణానంతరం అతనితో పాటే వాటిని కూడా దహనం చేశారు.[19] అధ్యక్ష పగ్గాలు చేపట్టక ముందు బుకానన్ వాషింగ్టన్, D.C.లో 15 ఏళ్ల పాటు తన ఆప్తమిత్రుడు అలాబామా సెనేటర్ విలియం రఫస్ కింగ్‌తో కలిసి ఉన్నాడు.[21][22] ఫ్రాంక్లిన్ పియర్స్‌ హయాంలో కింగ్ ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించాడు. అయితే పియర్స్ పగ్గాలు చేపట్టిన కొద్దికాలానికే అనారోగ్యం కారణంగా అతను కన్నుమూశాడు. అంటే బుకానన్ అధ్యక్షుడు కావడానికి నాలుగేళ్ల ముందు. బుకానన్ మరియు కింగ్ మధ్య దగ్గరి సంబంధం కింగ్‌ను "మిస్ నాన్సీ" మరియు "ఆంటీ ఫ్యాన్సీ" అని తెలిపే విధంగా ఆండ్రూ జాక్సన్‌ను ప్రేరేపించింది. అదే విధంగా, ఆరాన్ V. బ్రౌన్‌ వారిద్దరి గురించి "బుకానన్ మరియు అతని భార్య" అని సంబోధించాడు.[23] అంతేకాక, సమకాలీన మీడియా కూడా బుకానన్ మరియు కింగ్ సంబంధం గురించి పలు ఊహాగానాలు చేసింది. బుకానన్ మరియు కింగ్ యొక్క మేనకోడళ్లు వారి మామల ఉత్తరప్రత్యుత్తరాలను అడ్డుకున్నారు. ఆ ఇద్దరు పురుషులు ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉన్నారంటూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఉనికిలో ఉన్న లేఖల నిడివి మరియు ఆత్మీయత "ప్రత్యేక స్నేహం యొక్క అనుబంధం"[23]ను తెలియజేస్తోంది. బుకానన్ తనతో పాటే నివసించిన వ్యక్తితో ఉన్న "సంబంధం" గురించి రాశాడు.[24] అయితే అలాంటి వ్యక్తీకరణ ఆ సమయంలో పురుషుల మధ్య సాధ్యమైనంత వరకు అసాధారణమేమీ కాదు. బుకానన్ మరియు కింగ్ యొక్క సన్నిహితమైన భావోద్వేగ సంబంధాలను ఆవరించిన పరిస్థితుల వల్ల బుకానన్ ఒక స్వలింగ సంపర్కుడు అనే ప్రచారం మొదలయింది.[23] లైస్ ఎక్రాస్ అమెరికా అనే పుస్తకంలో జేమ్స్ W. లోవెన్‌ ఈ విధంగా గుర్తు చేశాడు, మే, 1844లో ఫ్రాన్స్ మంత్రిగా కింగ్‌ను నియమించడం వల్ల బుకానన్ మరియు కింగ్ మధ్య బంధానికి సంబంధించి తలెత్తిన ఒకానొక అభ్యంతరాల (ఆటంకాల) సమయంలో బుకానన్ తన సామాజిక జీవితం గురించి Mrs.రూస్‌వెల్ట్‌కు ఈ విధంగా రాశాడు, "నేను ప్రస్తుతం 'ఏకాంతవాసి మరియు ఒంటరి', ఇంటిలో నాకు ఎలాంటి తోడు లేదు. అనేక మంది పురుషులను నేను ఊరించాను. అయితే వారిలో ఒక్కరితోనైనా బంధం ఏర్పరుచుకోవడంలో సఫలీకృతుడు కాలేదు. పురుషుడు ఏకాకిగా ఉండటం మంచిది కాదని నేను భావిస్తున్నాను మరియు [నేను] అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో నాకు పరిచర్యలు చేసిన వృద్ధ పనిమనిషిని నేను పెళ్లి చేసుకోవడం ద్వారా నేను ఆశ్చర్యానికి గురై ఉండకూడదు. నేను కోలుకున్నప్పుడు ఆమె నాకు మంచి మంచి విందులు ఏర్పాటు చేసింది, నా నుంచి ఎలాంటి మోహభరిత లేదా శృంగార పరమైన అనుబంధాన్ని ఆమె ఆశించలేదు."[25][26][27] పెళ్ళి చేసుకోని ఏకైక అధ్యక్షుడైన బుకానన్ అంతకుముందు తాను దత్తత చేసుకున్న అనాథ మేనకోడలు హ్యారియట్ లేన్‌ను తన తొలి మహిళగా వ్యవహరించమని కోరాడు.

ఉత్తరదాయిత్వం[మార్చు]

అధ్యక్షుడు జేమ్స్ బుకానన్

1866లో మిస్టర్ బుకానన్స్ అడ్మినిస్ట్రేషన్ ఆన్ ది ఈవ్ ఆఫ్ ది రెబల్లియన్‌ను బుకానన్ ప్రచురించాడు. అది తొలి అధ్యక్ష స్వీయచరిత్ర. అందులో అతను తన చర్యల గురించి వివరించాడు, చనిపోయే ముందు రోజు " నా చర్యలను చరిత్ర నిరూపిస్తుంది" అని జోస్యం చెప్పుకున్నాడు.[28] 1868 జూన్ 1న 77 ఏళ్ల వయసులో బుకానన్ వీట్‌ల్యాండ్‌లో కన్నుమూశాడు. లాంకాస్టర్‌లోని వుడ్‌వర్డ్ హిల్ శ్మశాన వాటికలో అతను సమాధి చేయబడ్డాడు.

సుమారు 1860 ప్రాంతంలోని బుకానన్

అయితే, వేర్పాటును అడ్డుకోవడంలో బుకానన్ ప్రదర్శించిన అసమర్థత, చేతకానితనాన్ని చరిత్రకారులు నేటికీ దుయ్యబడుతూనే ఉన్నారు. 2006 మరియు 2009లలో చరిత్రకారులు, బుకానన్ దేశ విభజనను అడ్డుకునే ప్రయత్నం చేయకపోవటం, అమెరికా అధ్యక్ష చరిత్రలో ఇప్పటివరకు అధ్యక్షులు చేసిన తప్పిదాలన్నింటికెళ్ళా అత్యంత ఘోరమైన తప్పిదంగా ఎన్నుకున్నారు.[29] అధ్యక్షపరమైన విజయాలు, నాయకత్వ లక్షణాలు, పరాజయాలు మరియు పొరపాట్లపై మేధావులు అమెరికా సంయుక్తరాష్ట్రాల అధ్యక్షుల చారిత్రక ర్యాంకులు తయారు చేశారు. అందులో బుకానన్‌ను వారు అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రలోనే చెత్త అధ్యక్షుల జాబితాలో చేర్చారు. బుకానన్ ఈ ర్యాంకులలో చివరివాడు కాకపోయినా, ఎప్పుడూ చివరికి దగ్గరగానే ఉన్నాడు.[30][31]

బుకానన్ స్మారకస్థూపం, వాషింగ్టన్, డి.సి.

వాషింగ్టన్, డి.సి యొక్క మెరిడియన్ హిల్ పార్క్‌కు ఆగ్నేయ దిశలో ఒక కాంస్య మరియు గ్రానైట్ స్మారకస్థూపాన్ని వాస్తుశిల్పి విలియం గోర్డెన్ బీచర్ రూపొందించాడు. దానిని మేరీల్యాండ్‌కు చెందిన శిల్పి హాన్స్ షూలర్‌ చెక్కాడు. దీనికి 1916లోనే అనుమతి లభించినప్పటికీ, అమెరికా సంయుక్తరాష్ట్రాల కాంగ్రెస్‌ 1918 వరకు ఆమోదించలేదు. ఫలితంగా, 1930 జూన్ 26 వరకు అది పూర్తి అయ్యి ఆవిష్కరణకు నోచుకోలేదు. చట్టం మరియు దౌత్యాన్ని తెలిపే ఉదాత్తమైన పురుష మరియు మహిళా శిల్పాలను బుకానన్ విగ్రహానికి దన్నుగా ఉంచారు. దానిపై బుకానన్ మంత్రివర్గంలోని జెరెమియా ఎస్. బ్లాక్‌ వ్యాఖ్య "చట్టపు ఉన్నత శిఖరాలపై పయనించిన నిష్కళంక నేత". అని చెక్కబడింది. అంతకుముందు స్మారకస్థూపంను సంపూరకం చేసిన దేశ రాజధానిలోని అతని స్మారకం 1907-08 మధ్యకాలంలో నిర్మించబడి, 1911లో అంకితం చేయబడింది. స్టోనీ బ్యాటర్, పెన్సిల్వేనియాలోని బుకానన్ స్వస్థలంలో దీనిని నిర్మించారు. స్మారక ప్రదేశంలోని భాగం18.5-acre (75,000 మీ2), అంతకుముందు స్మారకస్థూపం 250 టన్నుల బరువుతో పిరమిడ్ ఆకృతిలో ఉండేది. స్థానికంగా ఉండే రాళ్లూ రప్పలు వంటి శిథిలాలు మరియు రాతి సున్నంతో కూడిన నిజమైన వాతావరణ ఉపరితాన్ని తెలిపే విధంగా అది రూపొందించబడింది. బుకానన్ గౌరవార్థం మూడు కౌంటీలకు అతని పేరు పెట్టారు - అయోవా, మిస్సోరి మరియు వర్జీనియా లలోని బుకానన్ కౌంటీలు. 1858లో టెక్సాస్‌లోని మరోదానికి కూడా అతని పేరు పెట్టారు. అయితే 1861లో అమెరికా సంయుక్త రాష్ట్రాల ఉపాధ్యక్షుడిగా అలెగ్జాండర్ స్టీఫెన్స్‌ ఎన్నికైన తర్వాత దాని పేరును స్టీఫెన్స్ కౌంటీగా మార్చారు.[32]

గ్రంథ పట్టిక[మార్చు]

 • Baker, Jean H. (2004). James Buchanan. New York: Times Books. ISBN 0805069461.
 • బుకానన్, జేమ్స్. ఫోర్త్ ఏన్యువల్ మెసేజ్ టు కాంగ్రెస్. (1860, డిసెంబరు 3).Empty citation (help)
 • బుకానన్, జేమ్స్. మిస్టర్ బుకానన్స్ అడ్మినిస్ట్రేషన్ ఆన్ ది ఈవ్ ఆఫ్ ది రెబెల్లన్ (1866)
 • Curtis, George Ticknor (1883). Life of James Buchanan. Harper & Brothers. Retrieved 2009-04-15.
 • Seigenthaler, John (2004). James K. Polk. New York: Times Books. ISBN 0805069429.
 • Klein, Philip S. (1962). President James Buchanan: A Biography (1995 సంపాదకులు.). Newtown, CT: American Political Biography Press. ISBN 0945707118.
 • స్టాంప్, కెన్నెత్ M. అమెరికా ఇన్ 1857: ఎ నేషన్ ఆన్ ది బ్రింక్ (1990). ISBN 0-19-503902-5 ఆన్‌లైన్ వెర్షన్

సూచనలు[మార్చు]

 1. క్లీన్ (1962), పేజీలు. xviii.
 2. [1]
 3. [2]
 4. క్లీన్ (1962), పేజీలు. 9-12.
 5. బాకర్ (2004), పేజీ. 18.
 6. క్లీన్ (1962), పేజీ. 27.
 7. కర్టిస్ (1883), పేజీ. 22.
 8. కర్టిస్ (1883), పేజీలు. 107-109.
 9. సీజంతాలర్ (2004), పేజీలు. 107-108.
 10. క్లీన్ (1962), పేజీలు. 181-183.
 11. క్లీన్ (1962), పేజీ. 415.
 12. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2012-01-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-05-20. Cite web requires |website= (help)
 13. Stampp (1990) p. 48
 14. హకీమ్, జాయ్. ది న్యూ నేషన్: 1789-1850 ఎ హిస్టరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ బుక్ 4
 15. బాకర్ (2004), పేజీలు.114-118.
 16. బుకానన్ (1860)
 17. బాకర్ (2004), పేజీ. 140.
 18. రీసెస్ నియామకం; లాంఛనప్రాయంగా 23 జనవరి 1860న ఎంపిక చేసినట్లు 30 జనవరి 1860న అమెరికా సంయుక్తరాష్ట్రాల సెనేట్ ధ్రువీకరించబడింది. 30 జనవరి 1860న అనుమతి పొందింది.
 19. 19.0 19.1 19.2 Klein, Philip Shriver (December 1955). "The Lost Love of a Bachelor President". American Heritage Magazine. 7 (1). మూలం నుండి 2007-05-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-06-18.
 20. యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియా: మిల్లర్ సెంటర్ ఆఫ్ పబ్లిక్ ఎఫైర్స్ : జేమ్స్ బుకానన్: లైఫ్ బిఫోర్ ది ప్రెసిడెన్సీ.
 21. క్లీన్ (1962), పేజీ. 111.
 22. Katz, Jonathan (1976). Gay American History: Lesbians and Gay Men in the U.S.A. : A Documentary. Crowell. p. 647. ISBN 9780690011654.
 23. 23.0 23.1 23.2 బాకర్ (2004), పేజీ. 75.
 24. కింగ్ మరియు బుకానన్ మధ్య సంబంధం గురించి టాలీ తన బ్లాండ్ యాంబిషన్: ఫ్రమ్ ఆడమ్స్ టు క్వాలీ--ది క్రాంక్స్, క్రిమినల్స్, టాక్స్ చీట్స్, అండ్ గోల్ఫర్స్ హూ మేడ్ ఇట్ టు వైస్ ప్రెసిడెంట్ అనే పుస్తకంలో విపులంగా వివరించాడు.
 25. జేమ్స్ W. లోవెన్. లైస్ అక్రాస్ అమెరికా . పేజీ 367 ది న్యూ ప్రెస్ 1999
 26. క్లీన్ (1962), పేజీ. 156.
 27. కర్టిస్ (1883), పేజీలు. 188, 519.
 28. "Buchanan's Birthplace State Park". Pennsylvania State Parks. Pennsylvania Department of Conservation and Natural Resources. Retrieved 2009-03-28.
 29. "U.S. historians pick top 10 presidential errors". Associated Press. CTV. 2006-02-18.
 30. Tolson, Jay (2007-02-16). "The 10 Worst Presidents". U.S. News & World Report. మూలం నుండి 2009-04-02 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-03-26. Cite web requires |website= (help)
 31. Hines, Nico (2008-10-28). "The 10 worst presidents to have held office". London: The Times. Retrieved 2009-03-26. Cite web requires |website= (help)
 32. Beatty, Michael A. (2001). County Name Origins of the United States. Jefferson, N.C.: McFarland. p. 310. ISBN 0786410256.

మరింత చదవడానికి[మార్చు]

 • బిందర్, ఫ్రెడ్రిక్ మూర్. "జేమ్స్ బుకానన్: జాక్సోనియన్ ఎక్స్‌పాన్షనిస్ట్" హిస్టారియన్ 1992 55 (1): 69–84. Issn: 0018-2370 ఎబ్స్‌కోలో పూర్తిపాఠం
 • బిందర్, ఫ్రెడ్రిక్ మూర్ జేమ్స్ బుకానన్ అండ్ ది అమెరికన్ ఎంపైర్ సుస్‌క్వీహనా U. ప్రెస్, 1994. 318 పేజీలు.
 • బిర్క్‌నర్, మైఖేల్ J., సంపాదకుడు. జేమ్స్ బుకానన్ అండ్ ది పొలిటికల్ క్రైసిస్ ఆఫ్ ది 1850s సుస్‌క్వీహనా U. ప్రెస్, 1996. 215 పేజీలు.
 • మీర్సీ, డేవిడ్ "బుకానన్, ది ప్యాట్రనేజ్, అండ్ ది లీకాంప్టన్ కాన్‌స్టిట్యూషన్: ఎ కేజ్ స్టడీ" సివిల్ వార్ హిస్టరీ 1995 41 (4): 291–312. Issn: 0009-8078
 • నెవిన్స్, అలాన్. ది ఎమర్జెన్స్ ఆఫ్ లింకన్ 2 వాల్యూమ్స్. (1960) అతని అధ్యక్షత గురించి సవివరంగా రాయబడింది.
 • నికోలస్, రాయ్ ఫ్రాంక్లిన్; ది డెమొక్రాటిక్ మెషీన్, 1850–1854 (1923), వివరణాత్మక కథనం; ఆన్‌లైన్
 • పాటర్, డేవిడ్ మోరిస్ ది ఇంపెండింగ్ క్రైసిస్, 1848–1861 (1976). ISBN 0-06-013403-8 పుల్టిజర్ ప్రైజు.
 • రోడ్స్, జేమ్స్ ఫోర్డ్ హస్టరీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఫ్రమ్ ది కాంప్రమైజ్ ఆఫ్ 1850 టు ది మెక్‌కిన్లీ-బ్రియాన్ క్యాంపైన్ ఆఫ్ 1896 వాల్యూమ్ 2. (1892)
 • స్మిత్, ఎల్బర్ట్ B. ది ప్రెసిడెన్సీ ఆఫ్ జేమ్స్ బుకానన్ (1975). ISBN 0-7006-0132-5, అతని యంత్రాంగం యొక్క ప్రామాణిక చరిత్ర
 • అప్‌డైక్, జాన్ బుకానన్ డైయింగ్ (1974). ISBN 0-439-56827-7.

బయటి లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

ప్రాథమిక ఆధారాలు[మార్చు]