Jump to content

జేమ్స్ మిల్

వికీపీడియా నుండి
James Mill

జేమ్స్ మిల్ (ఏప్రిల్ 6, 1773 - జూన్ 23, 1836) స్ఖాట్లెండుకు చెందిన చరిత్రకారుడు, ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతి సిద్దాంతకర్త, తత్వ వేత్త.
పన్నెండు సంవత్సరాలు పనిచేసి వివాదాస్పదమైన భారత చరిత్ర/ (హిస్టరీ అఫ్ బ్రిటిష్ ఇండియా) -- అరు వాల్యూములు (నాలుగు వేల పేజీలు, ఈనాడు అమెజాన్.కామ్లో వెల కళ్ళు తిరిగి పోయే రెండు వేల డాలర్లు/వెయ్యి పౌండ్లు) ను 1818 లో పూర్తి చేశాడు. ఇది ఈ నాటికి (2007) కూడా సింధియా టేల్బోట్ లాంటి విదేశీయులకు మార్గదర్శిగా అమార్త్య సేన్ లాంటి భారతీయులకు కంట్లో నలుసుగా పనిచేస్తాంది. జేమ్స్ మిల్ ఒక్క సారి కూడా భారతదేశములో అడుగు పెట్టక పోవడము దీనికి ఒక కారణము. ఆ కాలములో ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్న భారతదేశము పాలనలో మార్పునుభారత చరిత్ర ప్రభావితం చేసింది.

అమార్త్య సేన్ విమర్శలు

[మార్చు]
  • మిల్ తొలి బ్రిటిష్ పాలకులు (విలియమ్ జోన్స్) ను భారతీయులను ఉన్నత నాగరికులు అన్నందుకు దూషించి 'నాగరికత మొదలవడానికి కొన్ని చర్యలు తీసుకున్నపటికీ భారతీయులు సహజముగా తెలివైన వారు కాదు' అన్నాడు. . వాడికి తెలిసిన నాగరికతలు చైనీస్, పర్షియన్, అరబ్ లతో పోల్చాడు. --ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్, పేజీ 147
  • భారత ఖగోళ శాస్త్రం ప్రత్యేకముగా తిరిగే భూమి, గురుత్వాకర్షణ సిద్దాంతము (క్రీ.పూ. 476లో జన్మించిన ఆర్యభట్టు ప్రతిపాదించగా వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు బలపరిచారు). ఇవి అరబ్ ప్రపంచములో కూడా సుపరిచితాలు. బ్రహ్మగుప్తుని పుస్తకము 8 వశతాబ్దములో అల్ బెరూని ద్వారా 11వ శతాబ్దములో అరబికి లోకి అనువదించబడింది. విలియమ్ జోన్స్కు ఈ విషయము తెలియగా వాడు అలాగే నివేదించాడు. దీనికి మిల్ ప్రతిచర్య (రియాక్షన్) 'సర్ విలియమ్ జోన్స్, ఎవడికైతే విశ్వము యూరోపియన్ పండితులు/తత్త్వవేత్తలు చెప్పిన నిజాలు, వాడు భారత పండితులు తమ పుస్తకాల లోవని చెపుతున్నపటికీ వింటున్నాడు. --ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్, పేజీ 148