Jump to content

జైనల్ అబేదిన్

వికీపీడియా నుండి
అబుల్ హస్నత్ ఖాన్

పదవీ కాలం
1980  1996
ముందు మహ్మద్ ఇద్రిస్ అలీ
తరువాత శశాంక శేఖర్ సన్యాల్
నియోజకవర్గం జాంగీపూర్

వ్యక్తిగత వివరాలు

జననం 1938 అక్టోబర్ 29
కబిల్‌పూర్, బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా
మరణం 2014
కబిల్‌పూర్, ముర్షిదాబాద్ , పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)
జీవిత భాగస్వామి రుబేదా బేగం
సంతానం 5 కుమారులు
నివాసం కబిల్‌పూర్, ముర్షిదాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు

జైనల్ అబేదిన్ (29 అక్టోబర్ 1938 - 2014) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు జాంగీపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

జైనల్ అబేదిన్ 1938 అక్టోబర్ 29న ముర్షిదాబాద్ జిల్లాలోని కాబిల్‌పూర్‌లో జన్మించాడు. ఆయన బహరంపూర్‌లోని జంగిపూర్ కళాశాల & యూనియన్ క్రిస్టియన్ శిక్షణ కళాశాలలో విద్యను ఆ తరువాత మానవీయ శాస్త్రాలు & విద్యలో పట్టభద్రుడైయ్యాడు.

జైనల్ అబేదిన్ 1957లో రుబేదా బేగంను వివాహం చేసుకున్నాడు, వారికి ఐదుగురు కుమారులు ఉన్నారు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

జైనల్ అబేదిన్ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1977 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో లాల్గోలా నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 1980, 1984, 1989 & 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జాంగీపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "Jangipur lok sabha election results 1967 - 2024" (in ఇంగ్లీష్). India Today. 4 June 2024. Archived from the original on 8 July 2025. Retrieved 8 July 2025.
  2. "Members of Parliament – Lok Sabha – Profile". Zainal, Shri Abedin. reFocusindia. Archived from the original on 28 July 2014. Retrieved 28 July 2014.