Coordinates: 18°51′55″N 82°34′23″E / 18.86528°N 82.57306°E / 18.86528; 82.57306

జైపూర్ (ఒడిశా)

వికీపీడియా నుండి
(జైపూరు (ఒరిస్సా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జైపూర్
జైపూర్ is located in Odisha
జైపూర్
జైపూర్
భారతదేశంలో ఒడిశా స్థానం
జైపూర్ is located in India
జైపూర్
జైపూర్
జైపూర్ (India)
Coordinates: 18°51′55″N 82°34′23″E / 18.86528°N 82.57306°E / 18.86528; 82.57306
దేశం భారతదేశం
రాష్ట్రం ఒడిశా
జిల్లాకోరాపుట్
Founded byమహారాజా వీర విక్రమ్ దేవ్
Government
 • Typeనగరపాలక సంస్థ
 • Bodyజైపూర్ పురపాలక సంఘం
 • జై పూర్ శాసనసభ నియోజకవర్గంభహినపాతి తారా ప్రసాద్ (భారత జాతీయ కాంగ్రెస్)
Elevation
659 మీ (2,162 అ.)
Population
 (2011)[1]
 • Total84,830
Demonymజైపూరియా
భాషలు
 • అధికారకఒడియా
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
764001
ప్రాంతీయ ఫోన్‌కోడ్06854
Vehicle registrationOD-10

జైపూర్, భారతదేశం, ఒడిశా రాష్ట్రం, కొరాపుట్ జిల్లా లోని అతిపెద్ద పట్టణాలలో ఒకటి.[2] ఇది చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం.ఈ పట్టణం సా.శ. 1648-49 లో మహారాజా వీర్ విక్రమ దేవ్ రాజ్యానికి, రాజధానిగా స్థాపించబడింది. బలరామ్ దేవ్ III తిరుగుబాటు వరకు ఇది కళింగ అతిపెద్ద రాజ్యం. తరువాత ఈ రాజ్యాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడించింది. 1780 లో బారోనియల్ ఎస్టేట్ లేదా జమీందారీగా 1947 మార్చిలో బ్రిటీష్ పాలన రద్దు అయ్యేవరకు ఎస్టేట్ గానే ఉంది.చారిత్రాత్మకంగా పూర్వపు రాజ్యం ఆధునిక ఆంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాలలో విస్తరించింది. జైపూర్ చుట్టూ తూర్పు కనుమల కొండలు, మూడు వైపులా అరకు కొండలు గుర్రపుడెక్కలాగా మధ్య భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ వరకు విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్థలాన్ని దాని వ్యూహాత్మక చిత్యం కారణంగా మహారాజా వీర్ విక్రమ దేవ్ ఎంచుకున్నాడు.

చరిత్ర[మార్చు]

సూర్యవంశీ రాజులు 'జైపూర్' అనే పేరు పొందే ముందు,ఈ భూమిని శాతవాహనులు, ఇక్ష్వాకులు, నాలాస్, గంగాస్, శీలా వంశీయులు వంటి వివిధ రాజవంశాలు పరిపాలించాయి. 1443 లో, ఉత్తర కాశ్మీర్ యువరాజు వినాయక్ దేవ్, శిలావంశీయుల రాజు ఏకైక కుమార్తెను వివాహం చేసుకుని, నందపూర్ రాజ్యాన్ని వారసత్వంగా పొందాడు. సాశ.1571లో, సూర్యవంశీ రాజు, మహారాజాధిరాజ్ మహారాజా విశ్వనాథ్ దేవ్ గజపతి మరణం తరువాత, అతని కుమారుడు మహారాజా బలరామ్ దేవ్ బంధుత్వంలో ఉన్న రాజ్యం, గోల్కొండలోని కుతుబ్ షాహితో తరుచూ జరిగిన యుద్ధాలలో రాజ్యం కోల్పోయి, చివరకు ఉప రాజ్యంగా మారింది.1649 లో, మహారాజా వీర్ విక్రమ్ దేవ్, పాత రాజధాని నందాపూర్ ను విడిచిపెట్టి, కొండ శ్రేణులు, దట్టమైన అడవుల మధ్యఉన్న జైపూర్ ను స్థాపించాడు. నందపూర్ పరిపాలనను బలహీనపరుస్తున్న కుతుబ్ షాహి గవర్నర్, అతని మిలిటరీ నిరంతర చొరబాట్ల కారణంగా, రాజు తన రాజధానిని వ్యూహాత్మకంగా ఆచరణీయమైన భూమికి మార్చటానికి బలమైన కారణంగా నమ్ముతారు.ఇది ఒక శతాబ్దానికి పైగా ఉపరాజ్యంగా ఉంది.1674 లో, మహారాజా విశ్వంభర్ దేవ్ చికాకోల్ కుతుబ్ షాహి గవర్నర్‌ను ఓడించి, గోల్కొండ సుల్తాన్ తరపున సార్వభౌమాధికారాన్ని ప్రకటించి, పరిపాలించాడు.ఈ రాజును జైపూర్ భూస్వామ్య వ్యవస్థకు పితామహుడిగా పిలుస్తారు.అతను ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాలలో అనేక జమీందారీలను స్థాపించాడు. ఏదేమైనా, 1710 లో తన సోదరుడు మహారాజా రామ్‌చంద్ర దేవ్‌పై, బలరామ్ దేవ్ III చేసిన సైనిక తిరుగుబాటు, రాజ్య పతనానికి భరోసా ఇచ్చింది.ఆంధ్రప్రాంతం లోని చాలా మంది భూస్వామ్యవాదులు జైపూర్ నుండి స్వాతంత్ర్యం పొందారు. రాజ్యం పెద్ద మొత్తంలో భూభాగాన్ని కోల్పోయింది.

ఈ రాజ్యం అనేక సవాళ్లను ఎదుర్కొంది, కానీ 1777 లో బ్రిటిష్ వారు వచ్చేవరకు సార్వభౌమత్వంగా ఉంది.మహారాజా విక్రమ్ దేవ్, రెండు రంగాల్లో శత్రువులతో పోరాడాడు,కానీ రెండు సందర్భాలలోనూ ఓడిపోయాడు.బ్రిటిష్ వారిపట్ల శత్రు వైఖరి కోసం జమీందారీ హోదాకు అతని రాజ్యం తగ్గించబడింది. మహారాజా రామ్‌చంద్ర దేవ్ III, మహారాజా విక్రమ్ దేవ్ III, మహారాజా రామ్‌చంద్ర దేవ్ IV, చివరి అధికారిక పాలకుడు మహారాజా విక్రమ్ దేవ్ వర్మ (విక్రమ్ దేవ్ IV) పాలనలో జైపూర్ అభివృద్ధి జమీందారీగా అభివృద్ధి చెందింది. 2013 లో 570 వ వార్షికోత్సవం సందర్భంగా విశ్వేశ్వర్ దేవ్ రాజవంశస్తులు జైపూర్ సింహాసనం ఇరవై ఏడవ మహారాజుగా పట్టాభిషేకం చేశాడు [3]

భౌగోళికం, వాతావరణం[మార్చు]

జైపూర్ పట్టణం 18°51′N 82°35′E / 18.85°N 82.58°E / 18.85; 82.58 అక్షాంశ, రేఖాంశాల వద్ద ఉది.ఇది సముద్రమట్టానికి 659 మీటర్లు (2165 అడుగులు) సగటు ఎత్తులో ఉంది. జైపూర్ పట్టణం మిగిలిన ఒడిశా మాదిరిగా ఉష్ణమండల రుతుపవనాల వాతావరణం కలిగి ఉంటుంది. జైపూర్ పట్టణంలో వేసవికాలం కొద్దిగా వేడిగా ఉంటుంది. ఈ రుతువు మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలలో సాగుతుంది. వేసవి నెలల్లో గరిష్ఠంగా నలభై ఐదు డిగ్రీల (45 °C) ఉష్ణోగ్రత ఉంటుంది. పంతొమ్మిది డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత (19 °C) ఉంటుంది.జైపూర్‌లో రుతుపవనాలు తరచుగా భారీ తుఫానులతో కూడిన వర్షపాతం ఉంటుంది.ఈ రుతువు ప్రధానంగా జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల కాలంలో సాగుతుంది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. జైపూర్‌ను సందర్శించే పర్యాటకులకు ఈ సమయం అనుకూలమైంది. జైపూర్‌లో శీతాకాలం నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో ఉంటుంది. ఈ నెలల్లో గరిష్ఠంగా ఇరవై రెండు డిగ్రీల (22 °C) ఉష్ణోగ్రత ఉంటుంది.కనిష్ఠ ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల (4 °C) ఉంటుంది.

జనాభా[మార్చు]

జైపూర్ ఒరిస్సాలోని కొరాపుట్ జిల్లాలోని మునిసిపాలిటీ నగరం. జైపూర్ నగరాన్ని 28 వార్డులుగా విభజించారు. దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2011 భారత జనాభా లెక్కలు ప్రకారం జైపూర్ మునిసిపాలిటీ పరిధిలోని మొత్తం 84,830 మంది జనాభా ఉన్నారు. అందులో 42,602 మంది పురుషులు కాగా, 42,228 మంది మహిళలు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 9378, ఇది జైపూర్ (ఎం) మొత్తం జనాభాలో 11.06%. జైపూర్ మునిసిపాలిటీలో, జిల్లా లింగ నిష్పత్తి 979 సగటుతో పోలిస్తే, 991 గా ఉంది. అంతేకాక, ఒరిస్సా రాష్ట్ర సగటు 941 తో పోలిస్తే జైపూర్‌లో బాలల లైంగిక నిష్పత్తి 953 గా ఉంది. జైపూర్ నగర అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 72.87% కంటే 82.38% ఎక్కువ. జైపూర్‌లో పురుషుల అక్షరాస్యత 88.32% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 76.41%.జైపూర్ మునిసిపాలిటీలో మొత్తం 19,973 ఇళ్లకు పైగా పరిపాలన ఉంది. దీనికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను స్థానిక మున్సిపాలిటీ సరఫరా చేస్తుంది. మున్సిపాలిటీ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి మున్సిపాలిటీకి అధికారం ఉంది.

చదువు[మార్చు]

జైపూర్ పట్టణంలో ఒడియా భాషకు చెందిన ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, పురపాలక సంఘ బాలికల ఉన్నత పాఠశాల, పురపాలకసంఘ ఉన్నత పాఠశాలలు I,II,III (బాలికలు), ఎగువ కొలాబ్ ప్రాజెక్ట్ ఉన్నత పాఠశాల, సరస్వతి శిసు విద్యా మందిర్ మొదలైనవి ఉన్నాయి.ఆంగ్ల మాధ్యమం పాఠశాలలు, మోడరన్ ఆంగ్ల పాఠశాల, జైపూర్ పబ్లిక్ స్కూల్, దీప్తి కాన్వెంట్ స్కూల్, డిఎవి మోడల్ సీనియర్ సెకండరీ స్కూల్, రెడ్‌వుడ్స్ ఆంగ్ల పాఠశాల, నోవల్ సిద్ధార్థ్ ఆంగ్ల మాధ్యమం పాఠశాల మొదలైనవి పట్టణంలో ఉన్నాయి.

ప్రభుత్వ కళాశాలలలో విక్రమ్ దేవ్ కాలేజ్, జైపూర్, అనే కళాశాలను ఉంది.ఇది 1947 లో స్థాపించబడిన ఒడిశా ప్రభుత్వ పురాతన కళాశాలలలో ఒకటి. పీజీ స్థాయినుండి ప్రారంభమైన ఈకళాశాలను 1947 జూలై 1 నుండి 'జైపూర్ కశాశాల' అని పిలవబడుతుంది. పరోపకారి రాజు రాజర్షి విక్రమ్ దేబ్ వర్మకు నివాళిగా, ఈ కళాశాల పేరు 1961లో "విక్రమ్ దేబ్ కాలేజీ"గా మార్చబడింది. హానర్స్ సబ్జెక్టుల బోధన 1968–73 మధ్యకాలంలో ఇవ్వబడింది.1979 నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రారంభించబడ్డాయి.ఇతర కళాశాలలు ప్రభుత్వ ఉమెన్స్ కాలేజ్, లా కళాశాలతో పాటు మొదలైనవి పట్టణంలో చాలా ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి.

1989 లో స్థాపించబడిన గోపాల్ కృష్ణా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ వంటి వృత్తివిద్యా కోర్సులను అందించే కళాశాలలు జైపూర్‌లో ఉన్నాయి.జైపూర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ [4] ఫార్మసీ ఇన్‌స్టిట్యూట్ దానితో పాటు వివిధ ఇంజనీరింగ్ డిప్లొమా కళాశాలలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్,[5] హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ [6] జైపూర్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్ ఉన్నాయి.

వ్యాపారం, ఆర్థిక వ్యవస్థ[మార్చు]

జైపూర్‌లో మల్టీప్లెక్స్

సాంప్రదాయకంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ, జైపూర్ దక్షిణ ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు పట్టణాలకు వ్యాపార కేంద్రంగా ఉంది. జైపూర్ చుట్టుపక్కల అనేక పరిశ్రమలు ఉన్నాయి.వ్యాపార యూనిట్లలో సేవా కాగితం మిల్లు,[7] బియ్యం, జీడిపప్పు తయారీ పరిశ్రమలు ఉన్నాయి. పిఎస్‌యు కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, తూర్పు గ్రిడ్ నుండి దక్షిణ గ్రిడ్‌కు విద్యుత్తు తరలింపు కోసం కాలిగావ్‌లో 400/220 కెవి సబ్‌స్టేషన్‌ను కలిగి ఉంది.కొండలపై భారీ గ్రానైట్ నిక్షేపాలు,అటవీ ఆధారిత ఉత్పత్తులుకు మూలమైన అడవులు జైపూర్ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన కారణాలు.

పండుగలు, సంస్కృతి[మార్చు]

దుర్గా పూజ పండల్, జైపూర్

వార్షిక రథయాత్రతో పాటు, పట్టణంలో జరుపుకునే మరో పండుగ వేసవిలో సాధారణంగా జరిగే 'ఘటా పర్బా' లేదా 'ఠాకురాణి యాత్ర' (దేవత ఊరేగింపు). పండుగ సందర్భంగా, ప్రతి సమాజానికి దాని దేవతలను దేవాలయాల నుండి బయటకు తీసుకెళ్ళడానికి, ఇతర ప్రాంతాలన్నింటినీ సందర్శించే అవకాశం ఉంది. ఊరేగింపు ఉత్సవాలు వారం రోజులుపాటు ఉంటాయి. రాత్రులలో నాటకాలు, ఇతర వినోద కార్యక్రమాలు జరుగుతాయి. 'డోంబో బైడా', 'సింఘ బైదా' వంటి స్థానిక సంగీత వాయిద్యాలు ఈఊరేగింపులతో పాటు ఉంటాయి.

పర్యాటక[మార్చు]

'బాగరా' ఇది జలపాతాలకు చెందింది.ఈస్థలం కుచా రహదారిపై ఖొండగుడ నుండి 3 మైళ్ళ దూరంలో, కొరాపుట్ నుండి 10 మైళ్ళు,జైపూర్ నుండి 6 మైళ్ళ దూరంలో ఉంది.సుమారు 30 అడుగులు ఎత్తునుండి ప్రవహించే మూడు చిన్న జలపాతాలు కోలాబ్ నదిపై ఉన్నాయి.సందర్శకుల కోసం జలపాతం ఉన్న ప్రదేశంలో విశ్రాంతి గృహం ఉంది. 

రవాణా[మార్చు]

ఎయిర్‌వేస్[మార్చు]

1962 లో ప్రారంభించచిన జైపూర్ విమానాశ్రయం కొన్ని సంవత్సరాల పనిచేసిన తరువాత నిలిపివేయబడింది.కొత్త విమానాశ్రయం నిర్మించినప్పటికి అది ఇంకా పనిచేయటలేదు. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం 221 కి.మీ.దూరంలో ఉన్నవిశాఖపట్నం వద్ద ఉంది.1980 వ దశకంలో, ఒక ప్రైవేట్ విమానయాన సంస్థ జైపూర్ నుండి విమానాలను నడపడం ప్రారంభించింది, అయితే ఒక విమానం కూలిపోయిన తరువాత ఈ సేవలు ఆగిపోయాయి.

రైల్వేలు[మార్చు]

విశాఖపట్నం నుండి కిరాండూల్ ప్యాసింజర్ రైలు ద్వారా జైపూర్ చేరుకోవచ్చు. బెర్హంపూర్, విశాఖపట్నం, విజయనగరం ఆర్టీసీ బస్ స్టేషన్ల నుండి బస్సుల ద్వారా జైపూర్ చేరుకోవడానికి అవకాశం ఉంది. హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు సుమారు 14 గంటల్లో జైపూర్‌కు తీసుకువెళుతుంది. ఈ రైలు ప్రతిరోజూ జగదల్పూర్ నుండి భువనేశ్వర్ వరకు జైపూర్ మీదుగా నడుస్తుంది. జైపూర్ పట్టణం చుట్టూ చాలా చిన్న, పెద్ద జీడిపప్పు పరిశ్రమలు ఉన్నాయి.ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ జీడిపప్పు బోర్డు కార్యాలయం జైపూర్ పట్టణంలో కలిగి ఉంది.

రాజకీయాలు[మార్చు]

స్వాతంత్ర్యం తరువాత,1952 లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో, దివంగత లైచన్ నాయక్ జైపూర్ మొదటి శాసనసభ్యడుగా ఎన్నికయ్యాడు.1957లో పదవికి తిరిగి ఎన్నికయ్యాడు. రఘునాథ్ పట్నాయక్ ఆరు పర్యాయాలు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు.రబీ నారాయణ నందా 2000 లో శాసనసభ ఎన్నికల నుండి వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికయ్యాడు.తారా ప్రసాద్ బాహినిపతి శాసనసభ్యడు కొనసాగుచున్నాడు.[8] కోరాపుట్ లోక్‌సభ నియోజకవర్గంలో జైపూర్ ఒక భాగం.

బాహ్య లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Population by religion community – 2011". Census of India, 2011. The Registrar General & Census Commissioner, India. Archived from the original on 25 August 2015.
  2. "Jeypur City Population - Koraput, Odisha". Censusindia2011.com. Retrieved 2021-05-31.
  3. Pattnaik, Satyanarayan. "Jeypore hails its new lord". Times of India. Times of India. Retrieved 12 September 2019.
  4. "Jeypore College of Pharmacy | Jeypore College of Pharmacy".
  5. "Archived copy". Archived from the original on 25 March 2018. Retrieved 3 February 2020.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  6. http://www.hiitjeypore.org Archived 2012-11-20 at the Wayback Machine www.hiitjeypore.org
  7. "Archived copy". Archived from the original on 22 March 2012. Retrieved 16 November 2012.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  8. "Odisha Legislative Assembly". odishaassembly.nic.in. Retrieved 2020-07-01.

వెలుపలి లంకెలు[మార్చు]