Jump to content

జైశెట్టి రమణయ్య

వికీపీడియా నుండి

జైశెట్టి రమణయ్య
జననం1939
జగిత్యాల, తెలంగాణ
మరణం2026 మార్చి 27
జగిత్యాల, తెలంగాణ
వృత్తిచరిత్రకారుడు, ఉపాధ్యాయుడు
పేరుపడ్డదికేసీఆర్‌కు గురువు

డాక్టర్ జైశెట్టి రమణయ్య (1939 – 27 మార్చి 2026) తెలంగాణకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, ఉపాధ్యాయుడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్‌) కు ఇంటర్మీడియట్ స్థాయిలో గురువుగా ప్రసిద్ధి చెందారు. బోధనారంగంలో సుమారు నలభై సంవత్సరాలపాటు సేవలందించారు.

ప్రారంభ జీవితం

[మార్చు]

జైశెట్టి రమణయ్య 1939 లో తెలంగాణ లోని జగిత్యాల లో జన్మించారు. ప్రాథమిక విద్య, మెట్రిక్యులేషన్‌ను జగిత్యాల లోనే పూర్తి చేశారు. అనంతరం ఉపాధ్యాయ శిక్షణ పొందారు.

ఉపాధ్యాయ జీవితం

[మార్చు]

రమణయ్య 1955లో వెల్గటూర్ మండలం కిషన్‌రావుపేట పాఠశాలలో ఉపాధ్యాయుడిగా తన సేవలను ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఇన్‌స్పెక్టర్‌గా, జగిత్యాల మల్టీపర్పస్ హైస్కూల్‌లో సాంఘిక, ఇంగ్లిష్ ఉపాధ్యాయుడి గా పనిచేశారు.

చరిత్రలో పీజీ పూర్తి చేసిన తరువాత 1970లో లెక్చరర్‌ గా పదోన్నతి పొంది సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేశారు. ఆ సమయంలోనే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు చరిత్ర బోధించారు. 1974లో జగిత్యాల ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కాలేజీకి బదిలీ అయ్యారు.

1985లో సెంట్రల్ యూనివర్సిటీ నుండి పీహెచ్‌డీ పట్టా పొందారు. 1996లో ఉద్యోగ విరమణ చేశారు.

పురస్కారాలు

[మార్చు]
  • జాతీయ స్థాయిలో ఉత్తమ ఎన్యూమరేటర్‌గా ఎంపికై రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

మరణం

[మార్చు]

రమణయ్య 27 మార్చి 2026న జగిత్యాల లో తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు 87 సంవత్సరాలు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.[1][2][3]

సంతాపం

[మార్చు]

రమణయ్య మరణంపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. తన గురువుగా, ఆత్మీయుడిగా ఉన్న రమణయ్యతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (28 మార్చి 2026). "జైశెట్టి రమణయ్య సార్‌ ఇక లేరు". www.ntnews.com. Retrieved 28 మార్చి 2026.
  2. Velugu, V6 (28 మార్చి 2026). "ప్రముఖ చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య కన్నుమూత". V6 Velugu. Retrieved 28 మార్చి 2026.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "ప్రముఖ చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య కన్నుమూత". EENADU. Retrieved 28 మార్చి 2026.