Jump to content

జై భగవాన్ అగర్వాల్

వికీపీడియా నుండి
జై భగవాన్ అగర్వాల్

పదవీ కాలం
2008 – 2013
తరువాత రాజేష్ గార్గ్
నియోజకవర్గం రోహిణి

పదవీ కాలం
1993 – 2008
తరువాత దేవేందర్ యాదవ్
నియోజకవర్గం బద్లీ

వ్యక్తిగత వివరాలు

జననం (1952-04-04) 1952 ఏప్రిల్ 4 (age 72)
ఢిల్లీ , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు శివ్ నారాయణ్ అగర్వాల్
జీవిత భాగస్వామి కృష్ణ అగర్వాల్
సంతానం ముగ్గురు కుమారులు
నివాసం సెక్టార్-9, రోహిణి, ఢిల్లీ
పూర్వ విద్యార్థి శివాజీ కళాశాల , ఢిల్లీ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైట్

జై భగవాన్ అగర్వాల్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన ఢిల్లీ శాసనసభకు బద్లీ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

జై భగవాన్ అగర్వాల్ భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1993 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బద్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి రాజేష్ యాదవ్‌పై 9,836 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1998 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి నరైన్ సింగ్ యాదవ్‌పై 4,437 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

జై భగవాన్ అగర్వాల్ 2003 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బద్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ధరమ్ వీర్ యాదవ్‌పై 16,564 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2008 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో రోహిణి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి దేవేందర్ యాదవ్ చేతిలో 26,774 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

జై భగవాన్ అగర్వాల్ 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో రోహిణి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి రాజేష్ గార్గ్ చేతిలో 1,872 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Know Your MLA – Jai Bhagwan Aggarwal, BJP". Hindustan Times. New Delhi. 25 October 2013. Archived from the original on 10 June 2014. Retrieved 16 November 2013.
  2. "Delhi BJP MLA comes under Lokayukta scanner for amassing disproportionate assets" (in ఇంగ్లీష్). India Today. 17 November 2012. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  3. "Why most rural areas in Delhi showered their votes on BJP". The Times of India. 10 February 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  4. "Power game on safe seats for BJP leaders". Hindustan Times. 21 September 2013. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  5. "Constituency Wise Result Status – NCT of Delhi – Rohini". Eciresults.ap.nic.in. Election Commission of India. 8 December 2013. Archived from the original on 10 December 2013. Retrieved 10 December 2013.