Jump to content

జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

వికీపీడియా నుండి
జొన్న విత్తుల శ్రీరామచంద్రమూర్తి
జొన్న విత్తుల శ్రీరామచంద్రమూర్తి
జననం
జొన్న విత్తుల శ్రీరామచంద్రమూర్తి

ఇతర పేర్లుజొన్న విత్తుల శ్రీరామచంద్రమూర్తి
వృత్తిస్టార్ మా తెలుగు ఛానెల్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్
క్రియాశీల సంవత్సరాలు2013 నుండి ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, రచయిత, అనువాదకుడు
తల్లిదండ్రులురామకృష్ణ శర్మ
లక్ష్మీనరసమ్మ
జొన్నవిత్తుల రామకృష్ణశర్మ, లక్ష్మీనరసమ్మ
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ద్వారా పురస్కారం అందుకుంటున్న శ్రీరామచంద్రమూర్తి
ఈ కథకు శిల్పం లేదు - పుస్తకావిష్కరణ సభ

జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి తెలుగు రచయిత, అనువాదకుడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

జొన్న విత్తుల శ్రీరామచంద్ర మూర్తి జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకాలోని కోపల్లె గ్రామం. అతని తల్లిదండ్రులు లక్ష్మీనరసమ్మ, రామకృష్ణశర్మ. అతని తండ్రి జొన్నవిత్తుల రామకృష్ణశర్మ సంస్కృత, ఆంగ్ల, ఆంధ్ర భాషల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సాహితీవేత్త. రామకృష్ణశర్మ సాంప్రదాయ సాహిత్య విమర్శకులుగా ఎన్నో విమర్శాగ్రంథాలు, భాషాశాస్త్రవేత్తగా తెనుగువ్రాతలో ప్రణవాక్షర మహిమ, తెలుగు పలుకు తెల, ఆంధ్రాక్షర తత్త్వోపాసన వంటి ఎన్నో వ్యాసాలు, కావ్యాలు, శతకాలు రచించాడు. శ్రీరామచంద్రమూర్తి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లోణి శ్రీ చింతలపాటి బాపిరాజు మెమోరియల్ స్కూల్ లో 10వ తరగతి చదివాడు.

చదువు ఒంటబట్టలేదన్న మిషతో ఏదో తప్పుకు తండ్రి మందలించారనే సాకుతో చిత్తూరు జిల్లాకు వెళ్లాడు. అక్కడ మెట్ట ప్రాంతపు రైతుల జీవితాలతో జూదమాడే టమాటా పళ్ళ వ్యాపారంలోకి చేరాడు. 1987 నుండి 1995 వరకూ చిత్తూరు జిల్లాలోని పాపిరెడ్డిగారి పల్లె, కోన, కలకడలలో స్వంత పాఠశాల నడిపాడు. అక్కడ ఉన్నప్పుడు అతను విద్యావిధానం గూర్చి రాసిన వ్యాసాలు ప్రముఖ దిన పత్రికలలో ప్రచురితమయ్యాయి.[2] 1998 నుండి 2000వరకూ ఉషాకిరణ్ మూవీస్ ఫిలిమ్స్ డివిజన్ లో సినిమా రచయితగా చేరాడు. 2001 నుండి 2010 వరకూ ఈటీవీ కన్నడ వాహినిలో కన్నడ రచయితగా కొన్ని వందల కార్యక్రమాలకి కథ, మాటలు,  నిరూపణా సాహిత్యం, పాటలు రాశాడు. మరెన్నో కార్యక్రమాలకి దర్శకత్వం వహించాడు. 2011 నుండి స్టార్ మా తెలుగు ఛానెల్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా భాద్యతలు నిర్వర్తిస్తున్నాడు.


సాహితీ ప్రస్థానం

[మార్చు]

అతను పాఠశాఅన నిర్వహిస్తున్న కాలంలో ఒక పత్రిక నిర్వహించిన కథల పోటీ అతనిలోని సృజనాత్మకతను తట్టిలేపింది. రాసిన మూడో కథ (పంజె), తొలి నవల (వలస దేవర) కు బహుమతులు రావటంతో తనకు సాహిత్య ప్రపంచంలో గొప్ప పౌరసత్వం మాత్రమే దొరికిందని అనుకున్నాడు. అయితే అతని ప్రతిభ తనను హైదరాబాదులోని దిల్‌ఖుష్ నగర్ కు తీసుకుపోయింది. అంతటితో ఆగకుండా కన్నడంలో కూడా రచనలు చేసాడు. తన జీవితంలో చీకటి కాలమని ఆయన అనుకున్న ఇరవై యేళ్ల జీవితం ఆయన రచనల్లో వ్యక్తీకరించబడి సాహిత్య గౌరవాన్ని అందుకుంటుంది. [2] అతను రాసిన "పంజె" అనే కథకు ఆంధ్రప్రభ వారపత్రిక పోటీలో బహుమతి వచ్చింది. ఇతని కథలన్నింటికీ చిత్తూరు జిల్లాలోని కలకడ మండలంలోని ముష్టూరు వేదిక. అతను రాసిన వలసదేవర నవలకూ అదే భూమిక. ముష్టూరు కల్పిత పట్టణం కాదు. ఇది ప్రస్తుతం పాపిరెడ్డిపల్లెగా పిలువబడుతుంది.

నవలలు

[మార్చు]
  • వలస దేవర[3] (1998)- 'ఆటా' తొలి నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన రచన.[4]
  • జంగమదేవర (2013)
  • అంతర్యామి(1998-200 ఆంధ్రభూమి వారపత్రికలో ధారావాహిక)
  • సాక్షాత్కారం(2017 ఆంధ్రభూమి నవలలపోటీలో ఎంపికైంది.)

కథాసంపుటాలు

[మార్చు]
  • ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్ [5] (2008)
  • ఈ కథకి శిల్పం లేదు (2014)[6][7]
  • జొన్నవిత్తుల చదువు కథలు (ప్రచురణలో ఉంది)

అనువాదాలు

[మార్చు]
  • జ్ఞానపీఠ పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార నాటకం గుళ్ళకాయజ్జి, కేంద్ర సాహిత్య అకాడెమీ బాల సాహిత్య పురస్కారం పొందిన బోళువారు మహమ్మద్ కుణ్హి "పాపుగాంధి-గాంధి బాపు ఆద కథె" ను భలేతాత మన బాపూజీ, పేరుతోనూ తెలుగులోకి అనువదించాడు.
  • "మాతే ఇల్లదాగ" అనే పలమనేరు బాలాజీ కవితా సంపుటం, పెరుగు రామకృష్ణ కవితా సంపుటుల్ని కన్నడంలోకి అనువదించాడు.

పురస్కారాలు

[మార్చు]
  • "వలసదేవర" కి అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించిన తొలి నవలల పోటీలో ప్రథమ బహుమతి
  • "జంగమదేవర"కి సంయుక్త ఆంధ్రప్రదేశ్ భాషాసాంస్కృతికశాఖ నిర్వహించిన తొలి నవలల పోటీలో బహుమతి.
  •  "ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్" కథాసంపుటానికి ఆంధ్రసారస్వత సమితి, మచిలీపట్నం వారి ఉత్తమ కథాసంపుటం పురస్కారం, కాకినాడవారి మాకినీడి సాహిత్య పురస్కారం, ఒంగోలు ఫాతిమా సాహిత్యపీఠం పురస్కారం.
  • వంజె కథకి అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ ఉత్తమ కథా పురస్కారం లభించింది. దీనిని గత శతాబ్దపు 100 ఉత్తమ కథల్లో ఒకటిగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రకటించింది. గత శతాబ్దపు 100 ఉత్తమ కథల సంపుటి కథా  సాగర్ లోనూ అపురూప కథాప్రభలోనూ ఈ కథ సంకలితం అయింది.
  • రాసిన యాభై కథల్లో ఇరవై నాలుగు కథలకు అజొ విభొ, ఆటా, అమెరికా భారతి, కథామహల్, ఆంధ్రప్రదేశ్,  రంజని, గురజాడ స్మారక సాహిత్య పురస్కారం వంటి ఉత్తమ కథా పురస్కారాలు లభించాయి.  

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "రండి... మళ్ళీ పుడదాం - జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి".
  2. 2.0 2.1 "ద డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్ నవల - మధురాంతకం రాజారాం ముందు మాటలో అంశాలు" (PDF).[permanent dead link]
  3. "రెండు నవలల ఆవిష్కరణ". Archived from the original on 2017-04-15. Retrieved 2018-12-31.
  4. "తెలుగు బుక్స్ డాట్ ఇన్ లో పుస్తక పరిచయం".[permanent dead link]
  5. "కినిగె లో పుస్తక పరిచయం". Archived from the original on 2019-01-14. Retrieved 2018-12-31.
  6. "ఈ కథకి శిల్పం లేదు".[permanent dead link]
  7. "EE KATHAKI SHILPAM LEDU" (PDF).[permanent dead link]

బయటి లంకెలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.