జొహ్రా సెహ్గల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జొహ్రా సెహ్గల్
2010 లో సెహ్గాల్
జననం
సాహిబ్జాదీ జోహ్రా ముంతాజుల్లా ఖాన్ బేగం

(1912-04-27)1912 ఏప్రిల్ 27
మరణం2014 జూలై 10(2014-07-10) (వయసు 102)
న్యూఢిల్లీ
వృత్తినటి, నృత్యకారిణి, కొరియోగ్రాఫర్
క్రియాశీల సంవత్సరాలు1935–2007
జీవిత భాగస్వామికామేశ్వర్ నాథ్ సెహగల్

జొహ్రా సెహ్గల్ ( ఏప్రిల్ 27, 1912జూలై 10, 2014 ) ఒక నటి, నర్తకి, కొరియోగ్రాఫర్. ఈమె పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

ఈమె 1912, ఏప్రిల్ 27న ముంతాజుల్లా ఖాన్, నాటికా బేగం దంపతులకు ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ లోని ఒక సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈమె ఏడుగురు పిల్లలలో మూడవ సంతానంగా జన్మించింది. వాళ్ళు జకుల్లా, హజ్రా, ఇక్రముల్లా, ఉజ్రా (ఉజ్రా బట్), అన్నా, సబీరా -, చక్రతలో పెరిగారు. ఈమె తన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. తన తల్లి కోరికలకు అనుగుణంగా ఈమె, తన సోదరి లాహోర్లోని క్వీన్ మేరీ కాలేజీకి చదివారు. తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తరువాత ఎడిన్బర్గ్లో ఉన్న తన మామ సాహెబ్జాదా సయీదుజ్జాఫర్ ఖాన్ ఒక బ్రిటిష్ నటుడి దగ్గర అప్రెంటిస్ చేసింది.

కెరీర్

[మార్చు]

ఈమె ఆగస్టు 8, 1935 న ఉదయ్ శంకర్ బృందంలో  జపాన్, ఈజిప్ట్, యూరప్, యుఎస్ లో ఫ్రెంచ్ నర్తకి సిమ్కీతో కలిసి నృత్యం చేసింది. ఈమె 1940 అల్మోరాలోని ఉదయ్ శంకర్ ఇండియా సాంస్కృతిక కేంద్రంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. ఇక్కడే తన కాబోయే భర్త యువ శాస్త్రవేత్త, చిత్రకారుడు కామేశ్వర్ సెగల్ ను కలుసున్నారు. ఈ జంట అల్మోరాలోని ఉదయ్ డాన్స్ ఇన్స్టిట్యూట్లో పనిచేసి ఇద్దరూ నిష్ణాతులైన నృత్యకారులు, కొరియోగ్రాఫర్లు అయ్యారు. ఇది తరువాత మూసివేయబడినప్పుడు, వారు సమీప పశ్చిమ భారతదేశంలోని లాహోర్కు వలస వెళ్లి వారి స్వంత జోహ్రేష్ డాన్స్ ఇన్స్టిట్యూట్ ను స్థాపించారు. తన భర్త 1959 లో తన భర్త మరణించిన తరువాత ఢిల్లీలో స్థిరపడి, అక్కడ ఉన్న నాట్యా అకాడమీకి డైరెక్టర్ అయ్యారు. ఈమె 1962 లో డ్రామా స్కాలర్‌షిప్ కోసం లండన్‌కు వెళ్లి అక్కడ భారతదేశంలో జన్మించిన భరతనాట్యం నర్తకి రామ్ గోపాల్‌ను కలుసుకొని, 1963 లో ప్రారంభించిన  చెల్సియాలోని నృత్యపాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 1982 లో జేమ్స్ ఐవరీ దర్శకత్వం వహించిన ది కోర్ట్సన్స్ ఆఫ్ బొంబాయి లో పనిచేసింది. టెలివిజన్ అనుసరణ ది జ్యువెల్ ఇన్ ది క్రౌన్ (ITV, 1984) లో లేడీ ఛటర్జీగా పాత్రకు ఈ చిత్రం మార్గం సుగమం చేసింది. ఈమె ది రాజ్ క్వార్టెట్, ది జ్యువెల్ ఇన్ ది క్రౌన్, తాండూరి నైట్స్, మై బ్యూటిఫుల్ లాండ్రేట్ వంటి వాటిలో కనిపించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈమె ఆగష్టు 14, 1942 న కామేశ్వర్ సెహగల్ అనే హిందువును వివాహం చేసుకుంది. మొదట్లో తన తల్లిదండ్రుల విముఖత చూపారు కానీ చివర్లో ఈ వివాహానికి అంగీకరించారు.[1][2] వీళ్లకు కు ఇద్దరు పిల్లలు కిరణ్ సెగల్, పవన్ సెహగల్. పవన్ సెహగల్ WHO కోసం పనిచేస్తుంది. కిరణ్ సెగల్ ఒడిస్సి నర్తకి. 2012 లో, ఈమె జీవిత చరిత్రను తన కుమార్తె కిరణ్ సెగల్ "జోహ్రా సెహగల్: ఫ్యాటీ" పేరుతో రాశారు.[2]

పురస్కారాలు

[మార్చు]
  • 1963 - సంగీత నాటక్ అకాడమీ పురస్కారం
  • 1998 - పద్మశ్రీ పురస్కారం
  • 2001 - కాళిదాస్ సమ్మన్ పురస్కారం
  • 2002 - పద్మ భూషణ్ పురస్కారం
  • 2004 - సంగీత నాటక్ అకాడమీ ఫెలోషిప్
  • 2010 - పద్మవిభూషన్

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఈమె ఉదయ్ శంకర్ బృందంలో నర్తకిగా తన వృత్తిని ప్రారంభించింది. ఈమె 60 ఏళ్ళకు పైగా కెరీర్ వ్యవధిలో క్యారెక్టర్ నటిగా అనేక బాలీవుడ్ చిత్రాలలో నటించింది. ఈమె యునైటెడ్ స్టేట్స్, జపాన్ వంటి దేశాలలో ప్రదర్శనలు చేసింది.

మరణం

[మార్చు]

ఈమె జూలై 10, 2014 న తన 102 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించింది.

మూలాలు

[మార్చు]
  1. "Zohra Sehgal, doyenne of Indian theatre, dies at 102". The Hindu (in Indian English). PTI. 2014-07-10. ISSN 0971-751X. Retrieved 2019-10-30.{{cite news}}: CS1 maint: others (link)
  2. 2.0 2.1 Pillai, Surya S. (2012-06-02). "Fatty, funny and fine". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-10-30.