జోగి రమేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జోగి రమేష్
జోగి రమేష్


గృహనిర్మాణ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2022 ఏప్రిల్ 11
ముందు కాగిత వెంకటరావు

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2014
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం పెడన నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1970
ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లా ( ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు జోగి మోహనరావు, పుష్పవతి
జీవిత భాగస్వామి శకుంతల దేవి
సంతానం జోగి రాజీవ్, జోగి రోహిత్‌కుమార్, జోగి రేష్మాప్రియాంక
నివాసం ఇబ్రహీంపట్నం

జోగి రమేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన ఆమె 2019లో పెడన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై, 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా గృహనిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

జోగి రమేష్ 1970లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కృష్ణా జిల్లా , ఇబ్రహీంపట్నం లో జన్మించాడు. ఆయన విజయవాడలోని సర్దార్ గౌతు లచ్చన్న నేషనల్ కాలేజీ నుండి 1990లో బిఎస్సి పూర్తి చేశాడు.[3]

రాజకీయ జీవితం[మార్చు]

జోగి రమేష్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి యూత్‌కాంగ్రెస్‌ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆయన కృష్ణాజిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, రైల్వే బోర్డు సభ్యుడిగా, ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌గా పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాగిత వెంకట్రావు పై 1192 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4] జోగి రమేష్ 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, 2014లో జరిగిన ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు చేతిలో 7569 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.ఆయన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేశాడు.[5] [6]

జోగి రమేష్ 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పై 7839 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[7] ఆయన 2022 ఏప్రిల్ 11న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[8]

మూలాలు[మార్చు]

  1. Sakshi (10 April 2022). "ముక్కు సూటితత్వం.. నిలదీసే లక్షణం." Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  2. 10TV (11 April 2022). "ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు" (in telugu). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  3. Sakshi (18 March 2019). "కృష్ణా జిల్లా ...వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వివరాలు". Archived from the original on 21 March 2019. Retrieved 22 December 2021.
  4. I & PR - 1999 Election Results (1999). "1999 Election Results" (PDF). Archived from the original (PDF) on 8 June 2022. Retrieved 8 June 2022.
  5. Deccan Chronicle (7 November 2018). "Jogi Ramesh asked to appear on November 15" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2021. Retrieved 24 July 2021.
  6. Sakshi (7 November 2018). "'నోటి మాట'కే నోటీసులు". Archived from the original on 24 July 2021. Retrieved 24 July 2021.
  7. Sakshi (2019). "Pedana Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 24 July 2021. Retrieved 24 July 2021.
  8. Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.

బయటి లింకులు[మార్చు]