జోగులాంబ హాల్ట్ రైల్వేస్టేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల నుండి కర్నూల్కు వెళ్ళు మార్గంలో ఈ రైల్వేస్టేషను ఉంటుంది. 44 వ జాతీయ రహదారిపై గల అలంపూర్ చౌరస్తా నుండి అలంపూర్కు వెళ్ళు మార్గంలో 2 కిలోమీటర్ల దూరంలో ఈ స్టేషను ఉంటుంది. మానోపాడ్, అలంపూర్ రోడ్ రైల్వే స్టేషనును ఈ స్టేషను కలుపుతుంది. ఈ స్టేషనుకు అతి సమీప గ్రామం ఉండవెల్లి. మొదట్లో ఈ స్టేషనుకు ఆ ఊరి పేరే ఉండేది. తరువాత అలంపూర్ లో శ్రీజోగులాంబ ఆలయం పునర్నిర్మాణం అయ్యాక అలంపూర్ కి వచ్చే భక్తుల సౌకర్యార్థం దీనిని రోడ్డు రహదారికి మరింత దగ్గరగా మార్చి మెరుగుపర్చి, ఆ దేవత పేరు మీదుగా మార్చారు. నిజానికి అలంపూర్ కు అలంపూర్ రోడ్డు స్టేషనే దగ్గరైనా, స్టేషనుకు రోడ్డు మార్గానికి దూరం ఉండటం, అలంపూర్ రోడ్డు స్టేషను మొత్తం సమీప రాయలసీమ ప్రాంతపు పరిశ్రమల అవసరార్థం దిగుమతి చేసే బొగ్గు డంప్ యార్డ్ గా మారడం ప్రయాణికులకు అసౌకర్యంగా మారింది. దీని ఫలితమే మానోపాడ్, అలంపూర్ రోడ్ స్టేషను ల మధ్య నూతనంగా జోగులాంబ హాల్ట్ ను నిర్మించవలసి వచ్చింది. ఉండవెల్లి, తక్కశిల, లింగనవాయి, క్యాతూర్, మారమునగాల తదితర సమీప గ్రామాల ప్రజలకు ఈ స్టేషను అందుబాటులో ఉంది. మరి ముఖ్యంగా అన్ని పాసింజర్ రైళ్ళతో పాటు, ఎక్స్ ప్రెస్ రైళ్ళు కూడా ఇక్కడ నిలపడం ద్వారా సుదూర ప్రాంతాల నుండి అలంపూర్కు వచ్చే భక్తులకు, యాత్రికులకు ఈ స్టేషను బాగా ఉపయోగపడుతుంది.

చిత్రమాలిక[మార్చు]