అక్షాంశ రేఖాంశాలు: 34°16′44″N 75°28′19″E / 34.27889°N 75.47194°E / 34.27889; 75.47194

జోజి లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జోజి లా
జోజి లా నుండి దృశ్యం
సముద్ర మట్టం
నుండి ఎత్తు
3,528 m (11,575 ft)
ఇక్కడ ఉన్న
రహదారి పేరు
శ్రీనగర్ లేహ్ హైవే
ప్రదేశంలడఖ్, భారత్
శ్రేణిహిమాలయాలు
Coordinates34°16′44″N 75°28′19″E / 34.27889°N 75.47194°E / 34.27889; 75.47194
జోజి లా is located in Ladakh
జోజి లా
లడఖ్ లో స్థానం
జోజి లా is located in India
జోజి లా
జోజి లా (India)
జూన్, 2004 లో జోజి లా

జోజి లా, హిమాలయాల్లో భారత కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఉన్న ఎత్తైన పర్వత కనుమ. ఈ కనుమ పశ్చిమాన ఉన్న కాశ్మీరు లోయను, ఈశాన్యాన ఉన్న ద్రాస్, సురు లోయల తోను, మరింత తూర్పున ఉన్న సింధు లోయనూ కలుపుతుంది

హిమాలయాల పశ్చిమ విభాగంలో, శ్రీనగర్, లేహ్ మధ్య గల జాతీయ రహదారి 1 ఈ కనుమ గుండా వెళుతుంది. భారీ హిమపాతం కారణంగా ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఈ కనుమ మూసుకుపోతుంది కాబట్టి, దీనిని నివారించడానికి జోజి-లా సొరంగాన్ని నిర్మిస్తున్నారు.

శబ్దవ్యుత్పత్తి

[మార్చు]

జోజి లా అంటే "మంచు తుఫానుల పర్వతం" అని అర్థం. [1] దీన్ని"జోజిలా కనుమ" అని ఎక్కువగా అంటూంటారు. "లా" అంటే టిబెటన్ భాషలోను, లడాఖీ భాష లోను, హిమాలయాల్లో మాట్లాడే అనేక ఇతర భాషల్లోనూ అర్థం "కనుమ" అని. జోజిలా కనుమ అంటే "కనుమ" అనే మాట పునరావృతమైనట్లే. ఇతర ఉదాహరణలు ఉన్నాయి. సిక్కిం-టిబెట్ సరిహద్దు మీద ఉన్న నాథు లా, ఖార్దుంగ్ లా, సెలా మొదలైనవి దీనికి ఉదాహరణలు.

స్థానం

[మార్చు]

జోజి లా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీరు రాజధాని శ్రీనగర్ నుండి సుమారు 100 కి.మీ. దూరంలో ఉంది. సోన్మార్గ్ నుండి 15 కి.మీ. దూరంలో ఉంది. లడఖ్కు, కాశ్మీర్ లోయకూ మధ్య ఉన్న కీలకమైన రహదారి ఈ కనుమ గుండానే పోతుంది. ఇది సముద్రమట్టం నుండి సుమారు 3,528 మీటర్ల ఎత్తున ఉంది. ఫోటు లా తరువాత, శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై నున్న కనుమల్లో ఇది రెండవ అత్యంత ఎత్తైన కనుమ. కనుమను ఎక్కువ రోజుల పాటు తెరిచి ఉంచేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) కృషి చేస్తున్నప్పటికీ, శీతాకాలంలో దీన్ని తరచుగా మూసివేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. రహదారిపై మంచునుతొలగించడానికి, నిర్వహించడానికీ BRO కు చెందిన బీకన్ ఫోర్స్ దళం బాధ్యత వహిస్తుంది. శీతాకాలంలో కనుమ ద్వారా డ్రైవింగ్ చెయ్యడమంటే రెండు వైపులా మందపాటి ఐసు గోడల మధ్య నడపడమే.

భారత-పాకిస్తాన్ యుద్ధం 1947-1948

[మార్చు]

1947-1948 ఇండో-పాకిస్తాన్ యుద్ధ సమయంలో, 1948 లో, పాకిస్తాన్ ఆక్రమణ దారులు లడఖ్‌ను ఆక్రమించే ప్రయత్నంలో జోజి లాను స్వాధీనం చేసుకున్నారు. భారత సైన్యం ఆపరేషన్ బైసన్ అనే సంకేతనామంతో నవంబరు 1 న ఈ కనుమను తిరిగి స్వాధీనం చేసుకుంది. శత్రువును ఆశ్చర్యపరుస్తూ భారత సైన్యం ఇక్కడ ట్యాంకులను నియోగించి విజయాన్ని సాధించింది.[2] ఆనాటికి, ట్యాంకులు పనిచేసిన యుద్ధ క్షేత్రాల్లో ప్రపంచంలో కెల్లా అత్యంత ఎత్తైనది ఇది. [3]

జోజి లా సొరంగం

[మార్చు]

జోజి లా సొరంగం ప్రాజెక్టును 2018 జనవరిలో భారత ప్రభుత్వం ఆమోదించింది. దాని నిర్మాణాన్ని 2018 మే లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించాడు. [4] 14 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం వలన, జోజి లాను దాటేందుకు పట్టే సమయం ప్రస్తుతమున్న 3 గంటల నుండి కేవలం 15 నిమిషాలకు తగ్గిపోతుంది. సొరంగం అంచనా వ్యయం రూ 6800 కోట్లు.[5] పూర్తయినప్పుడు, ఇది ఆసియాలోకెల్లా అత్యంత పొడవైన రెండు దిశల సొరంగం అవుతుంది. [6] [7]

చిత్ర మాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Zojila battle of 1948 — when Indians surprised Pakistan with tanks at 11,553 ft, The Print, 1 November 2019.
  2. Philip, Snehesh Alex (2019-11-01). "Zojila battle of 1948 — when Indians surprised Pakistan with tanks at 11,553 ft". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-10-27. Retrieved 2020-10-27.
  3. Sinha, Lt. Gen. S.K. (1977). Operation Rescue:Military Operations in Jammu & Kashmir 1947-49. New Delhi: Vision Books. pp. 103–127. ISBN 81-7094-012-5. Retrieved 4 August 2010.
  4. http://indianexpress.com/article/india/j-k-pm-modi-inaugurates-zojila-tunnel-project-in-leh-all-you-need-to-know-about-indias-longest-tunnel-5182934/
  5. "Vaartha Online Edition". Vaartha (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-05-19. Archived from the original on 2020-10-27. Retrieved 2020-10-27.
  6. "Cabinet approves Zojila Pass tunnel project - Times of India". The Times of India. Retrieved 2018-04-07.
  7. "Cabinet nod for Rs 6,809-crore Zojila tunnel project connecting Jammu and Kashmir with Ladakh". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-01-04. Retrieved 2018-04-07.
"https://te.wikipedia.org/w/index.php?title=జోజి_లా&oldid=4271924" నుండి వెలికితీశారు