జోధా అక్బర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జోధా అక్బర్
Jodhaaakbar poster.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వము అశుతోష్ గోవారికర్
నిర్మాత రోనీ స్కౄవాలా
అశుతోష్ గోవారికర్
రచన హ్రితిక్ రోషన్
అశుతోష్ గోవారికర్
తారాగణం హ్రితిక్ రోషన్
ఐశ్వర్యా రాయ్
కుల్ భూషణ్ ఖర్బందా
సోనూ సూద్
Ila Arun
సంగీతం ఏ.ఆర్.రహమాన్
సినిమెటోగ్రఫీ Kiran Deohans
కూర్పు Ballu Saluja
డిస్ట్రిబ్యూటరు UTV Motion Pictures
విడుదలైన తేదీలు ఫిబ్రవరి 15, 2008
నిడివి 213 నిమిషాలు
దేశము భారతదేశం
భాష హిందీ / ఉర్దూ
బడ్జెట్ Rs 400,000,000 (estimated)[1]
మొత్తం వ్యయం Rs 590,300,000 (estimated)[2]

జోధా-అక్బర్ (హిందీ: जोधा-अकबर, ఉర్దూ: |دھا اکبر}}) ఇది ఒక భారతదేశవీరచరిత్ర సినిమా, దీనిని ఫిబ్రవరి 15, 2008 న విడుదల చేసారు.[3] ఈ సినిమాకు దర్శకత్వం మరియు నిర్మాత అశుతోష్ గోవరికేర్, ఈ దర్శకుడు లగాన్ సినిమాకి అకాడమీ అవార్డుకు నామినేట్ అయినాడు. ముఖ్య పాత్రలలో హ్రితిక్ రోషన్ మరియు ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించారు. ఈ సినిమాలో కొత్తగా వచ్చిన అబిర్ అబ్రార్ తొలిసారిగా నటించారు.. ఈ సినిమా తీయటానికి విస్తారంగా పరిశోధన చేసిన తర్వాత, కర్జాట్ లో సినిమా తీయటం ఆరంభించారు.[6]

ముస్లింమొఘల్ చక్రవర్తి అక్బర్ ది గ్రేట్ , పాత్రలో హ్రితిక్ రోషన్, ఇంకా అతని భార్య హిందువు యైన జోధాబాయి పాత్రలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించిన ఈ సినిమా వీరిరువురి మధ్య ఉన్న ప్రేమచుట్టూ తిరుగుతుంది. సంగీతము, అందరితో మెచ్చుకోలు పొందిన సంగీత దర్శకుడు ఏ.ఆర్. రహమాన్ అందించారు . ఈ సినిమా సౌండ్ ట్రాక్ ను జనవరి 19, 2008 లో విడుదల చేసారు. [8] సావో పావో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ [9] లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ప్రేక్షకుల అవార్డును గెలుచుకుంది, గోల్డెన్ మిమ్బార్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ [11] లో రెండు అవార్డులు, స్టార్ స్క్రీన్ అవార్డులు ఏడు ఇంకా ఐదు ఫిలిం ఫేర్ అవార్డులు, మరియు మూడవ ఆసియన్ ఫిలిం అవార్డుల[13] లో రెండు నామినషన్లు పొందింది. ది చర్లోట్టే అబ్జర్వర్ 2008 లో ప్రకటించిన ప్రపంచ వ్యాప్తముగా ఉత్తమమైన పది సినిమాలలో జోధా అక్బర్ రెండవ స్థానంలో నిలిచింది.[14]

విషయ సంగ్రహము[మార్చు]

జోధా అక్బర్ పదహారవ శతాబ్దానికి చెందిన ప్రేమ కథ, రాజకీయ సౌకర్యము కోసము చేసుకున్న ఈ వివాహం గొప్ప మొఘల్ చక్రవర్తి అక్బర్ ,ఇంకా రాజపుత్ర యువరాణి జోధా కు పుట్టిన ప్రేమ గురించి చెపుతుంది.

చక్రవర్తి అక్బర్ (హ్రితిక్ రోషన్ ) రాజకీయ విజయాలకు హద్దులు లేవు. హిందూ కుష్ పొందిన తర్వాత, సామ్రాజ్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి అరేబియా సముద్రము దాకా, ఇంకా హిమాలయాలు నుండి నర్మదా నది దాకా విస్తరించే వరకు రాజ్యాలను జయిస్తూనే ఉన్నాడు. వివేకమంతమైన రాజతంత్ర వ్యవహారములో, బెదిరింపుల ద్వారా ఇంకా విపరీతమైన బలం ఉండటం వల్ల అక్బర్ రాజపుత్రుల విశ్వాసాన్ని పొందగలిగారు. కానీ ఈ విశ్వాసం విశ్వవ్యాప్తం అవ్వలేకపోయింది. మహారాణా ప్రతాప్ ఇంకా చాలామంది రాజపుత్రులు ఎప్పుడూ అక్బరును విదేశీ దండయాత్రకుడిగా భావించారు. మహారాణా ప్రతాప్, రాజపుత్ర స్త్రీలు వివాహమాడిన మొఘలులతో మిగిలిన రాజపుత్రులు వివాహమాడటాన్ని రద్దు చేసాడు. అక్బర్ , అతి ధైర్యశాలి ఐన జోదా (ఐశ్వర్య రాయ్ ను వివాహం చేసుకున్నది రాజపుత్రులతో సంబందాలని మరింత బలవంతం చేయడానికే అనుకున్నాడు కాని, అది ఇంకొక కొత్త ప్రయాణం దిశగా వెళుతుందని అనుకోలేదు, అదే నిజమైన ప్రేమ ప్రయాణం.

అమెర్ రాజు భార్మల్ కుమార్తె ఐన జోదా, ఈ పెళ్లి ద్వారా తనను రాజకీయ పావుగా ఉపయోగించటాన్ని ఇష్టపడలేదు. ఇప్పుడిక అక్బర్ కు అతిపెద్ద సవాలు యుద్దములో గెలవటమే కాదు, బయటకి ఈర్ష్యతో, మరియు కోపము లోపల దాగిఉన్న జోదా ప్రేమను గెలవటము అతిపెద్ద సవాలు. జోదా-అక్బర్ ఒక బహిర్గతం చేయని ప్రేమకథ..[4]

చారిత్రాత్మక నిర్దిష్టత[మార్చు]

దర్శకుడు 70% సినిమా తన కల్పన మీదే ఆధారబడి ఉన్నదని పేర్కొన్నారు. ఐనప్పటికీ, సినిమాలోని చాలా ఘటనలు నిజమైన వాటిని పోలి ఉన్నాయి. కొన్ని రాజపుత్ర గ్రూపులు జోదా అక్బర్ కొడుకు, జహంగీర్ ను పెళ్లి చేసుకుందని అక్బర్ను కాదని వాదించాయి. అశుతోష్ గోవరికేర్ ప్రజల సమక్షంలో క్షమాపణ చెప్పాలని కూడా గట్టిగా అడిగారు. రాజస్తాన్ లోని 30 సినిమా హాళ్ళలో ఈ సినిమాను విడుదల చేయలేదు.[5]

చాలామంది చరిత్రకారులు మొఘలుల కాలంలో అక్బర్ రాజ్పుత్ భార్య "జోధా బాయి" గా తెలపలేదని వాదించారు. ప్రొఫెసర్ శిరిన్ మూస్వి , అలీఘర్ ముస్లిం యునివర్సిటీ చరిత్రకారుడి ప్రకారం, అక్బర్నామా (అక్బర్ చేత స్వయంగా వ్రాయబడిన అక్బర్ జీవితచరిత్ర) లో కాని లేక ఇంకా ఆ కాలం లో ఏవిధమైన సంధర్బములోకాని జోదా బాయి గా చెప్పలేదు అని పేర్కొన్నారు.[6] మూస్వి వివరణ ప్రకారం, 18 ఇంకా 19 వ శతాబ్దముల వ్రాతలలో "జోధ బాయి " ను అక్బర్ భార్యగా సూచించేవారు.[6] తుజ్క్ -ఇ-జహాన్గిరి లో ఆమె పేరుని మరియం జామాని గా చెప్పబడింది.[6]

చరిత్రకారుడు ఇంతియాజ్ అహ్మద్, పాట్నాలోని ది ఖుదా బక్ష్ ఓరియెంటల్ పబ్లిక్ లైబ్రరీ డైరెక్టర్ చెప్పిన ప్రకారం, అక్బర్ భార్య జోధాగా మొదటిసారి లేఫ్ట్నంట్-కలోనల్ జేమ్స్ టోడ్ పుస్తకం అన్నల్స్ అండ్ యాంటిక్విటీస్ అఫ్ రాజస్థాన్ లో పేర్కొనబడింది. అహ్మద్ ప్రకారం, టోడ్ వృత్తిపరముగా చరిత్రకారుడు కాడు.[7] N R ఫరూకి ప్రకారం జోధా బాయి, రాజపుత్ర రాణి అక్బర్ భార్య కాదని వాదించారు; అది జహంగీర్ రాజపుత్ర భార్య పేరు.[8]

అశుతోష్ గోవారికర్ ప్రతిక్రియ

While making the film I did my best to go by the book. I consulted the best historians and went through the most rigorous research. And there are different names used for Akbar's wife, Jodhaa being one of them. In fact, there's a disclaimer about the Rajput queen's name at the beginning of the film. But to see that, the protesters have to see the film.

అసమ్మతులు మరియు న్యాయపరమైన వాదనలు[మార్చు]

రాజపుత్ర ప్రజల చిత్తరువును తప్పుద్రోవ పట్టేవిధముగా, రాజకీయంగా ప్రోత్సహించే విధంగా, చరిత్రను తిరగరాయటం వల్ల వారి చరిత్ర తగ్గిపోయిందని మరియు చెడ్డతనానికి వారిని బలి పశువులు చేసారని రాజపుత్ర వర్గము విమర్శించారు http://www.ibosnetwork.com/newsmanager/templates/template1.aspx?articleid=21147&zoneid= 4. ఈ వర్గము అసమ్మతులు సినిమాకు వ్యతిరేకముగా కొన్ని రాష్ట్రాలలో రేకెత్తాయి ఇంకా ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, హర్యానా మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఈ సినిమాను రద్దు చేసారు. ఐనప్పటికీ, దీనిని సవాలు చేస్తూ నిర్మాత సుప్రీం కోర్టుకు వెళ్ళారు.[9][10] తర్వాత సుప్రీం కోర్ట్ అఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్ లో ఇంకా ఉత్తరాఖండ్ మరియు హర్యానా లోని కొన్ని పట్టణాలలో ఈ సినిమాను చూపించటానికి ఉన్న రద్దును ఎత్తివేసింది. కోర్ట్, ఉత్తర ప్రదేశ్ గవర్నమెంట్ రద్దును అలాగే ఉత్తరాఖండ్ లోని డెహ్రాడున్ లో, అంబాల లో, సోనిపట్ ఇంకా హర్యానా లోని రెవారిలో అధికారులిచ్చిన సమానమైన ఉత్తర్వులను ఎత్తివేసింది.[11]

పాత్రధారులు[మార్చు]

బృందము[మార్చు]

 • కథ  : హైదర్ అలీ
 • దర్శకత్వము  : హైదర్ అలీ & అశుతోష్ గోవరికేర్
 • డైలాగులు  : K.P.సక్సేనా
 • మేకప్ ఆర్టిస్ట్  : జమీ విల్సన్
 • ప్రొడక్షన్ డిజైన్  : నితిన్ చంద్రకాంత్ దేశాయ్
 • విజువల్ ఎఫ్ఫెక్ట్స్  : పంకజ్ ఖండ్పూర్ (టాటా ఎలేక్సి -విజువల్ కంప్యూటింగ్ ల్యాబ్స్ )
 • చీఫ్ అసిస్టెంట్ దర్శకుడు  : కరం మల్హోత్రా
 • సినిమాటోగ్రఫీ  : కిరణ్ డిఒహన్స్

నిర్మాణం[మార్చు]

అశుతోష్ గోవరికేర్ న్యూ ఢిల్లీ, ఆలీఘర్, లక్నో, ఆగ్రా ఇంకా జైపూర్ ల నుండి, చరిత్రకారులు ఇంకా విద్వాంసుల బృందాన్ని, తనకు ఈ సినిమా తీయటానికి మార్గదర్శకులుగా మరియు చారిత్రాత్మకంగా నిర్దిష్టత ఉండటానికి నియమించాడు.ప్రసార సాధనాలు చెప్పిన విధముగా సినిమా పేరు అక్బర్ - జోదా కాదని సినిమా పేరు జోదా - అక్బర్ గానే ఉంటుందని విశదీకరించారు. 80 కు పైగా ఏనుగులు, 100 గుర్రాలు ఇంకా 55 ఒంటెలు ఈ సినిమా కోసం ఉపయోగించారు. “అజీం ఓ షాన్ , షహన్శ”, పాటకు సంప్రదాయ దుస్తులలో వెయ్యి మంది నాట్యము చేయగా, ఖడ్గములు త్రిప్పుతూ ఇంకా డాలులతో వైభవముగా కర్జత్ లోని ఒక ప్రదేశంలో చేశారు. దీని బడ్జెట్ 37 కోట్ల రూపాయలు (ఇంచుమించు 7.42 మిలియన్ USD).

మొదటిసారి టెలివిజన్ లో దీని గురించి 2007 డిసెంబరు 9 లో ప్రసారం చేసారు. ఈ సినిమాలో తనిష్క్ వారిచే చేయబడిన 400 kg ల బంగారు నగలు ఉపయోగించారు.[12]

స్వీకారము[మార్చు]

బాక్స్ ఆఫీసు[మార్చు]

ఈ సినిమాకు యుఎస్ ఇంకా యుకె బాక్స్ ఆఫీసుల వద్ద అసాధారణమైన స్పందన లభించింది. ఉత్తర అమెరికా బాక్స్ ఆఫీసు చివరి వారాంతము లోనే మొత్తము మీద 1.3 మిలియన్ల డాలర్లు సంపాదించింది . http://www.rediff.com/movies/2008/feb/19jodhaa.htm ఈ సినిమా ఆరంభము ఇండియన్ బాక్స్ ఆఫీసు వద్ద కొంత బలహీనముగా ఉన్నప్పటికీ నోటి ద్వారా జరిగిన మంచి ప్రచారము వల్ల, బాగా వ్యాపారము చేసి 62 కోట్లతో ఘన విజయము సాధించింది.[13][14]

విమర్శాత్మక స్వీకారము[మార్చు]

ది చర్లోట్టే అబ్జర్వర్ సినిమా విమర్శకుడు లారెన్స్ టాప్మన్ 2008 లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పది సినిమాలు ఎంపిక చేసి, దాన్లో జోదా అక్బర్ కు రెండవ స్థానాన్ని కేటాయించాడు.[15] ఈ సినిమాకు రాటెన్ టమేటాస్ 75% రేటింగ్ తో పాటు 8 కొత్త ఇంకా 2 రాటెన్ అభిప్రాయాలు ఇచ్చారు.[16]

ది టైమ్స్ నుండి అనిల్ సిననన్ ఈ సినిమాకు ఐదు స్టార్లకు గాను నాలుగు స్టార్లను ఇస్తూ, "ఆస్కార్ కు -నామినేట్ ఐనలగాన్ సినిమా దర్శకుడు అశుతోష్ గోవరికేర్ తీసిన ఉన్నతమైన కాలంనాటి కావ్యము సిసిల్ B. డిమిల్లెవినోదము లాగా అన్ని సమానముగా కుదిరాయి...భారతదేశం లోని అన్ని మతాల సమ్మతమును ఆగ్రహముతో కూడిన అభ్యర్ధనతో ఈ సినిమా ముగుస్తుంది, నవ భారత దేశానికి ఇది ప్రతిధ్వనించిన సందేశము."[17] సి యెన్ యెన్ - ఐబియెన్లోని రాజీవ్ మసండ్ కూడా ఈ సినిమాకు ఐదుకు గాను నాలుగు స్టార్లను ఇచ్చి, దీని గురించి చెప్తూ," ఈ సినిమాకు కలిగిన అనుభూతి ఏ సినిమాకు కలగలేదు, నా సీటులో కూర్చొని జోదా అక్బర్ చూడటము సినిమాలు చూసే నాకు ఒక అదృష్టముగా భావించాను. ఇలాంటి సినిమా తీయటమే ఒక అదృష్టము, అది కూడా మన తరం లో రావటం మన అదృష్టము, మన అభిప్రాయాలను మనం ఏర్పరుచుకోవచ్చు, లేదంటే వెనక తరాల వారి అభిప్రాయాలను ఆచరణ పెట్టాల్సి వచ్చేది, పాత సినిమాలు చూస్తూ ఉంటే పాత కాలం అభిప్రాయాలే వస్తాయి ." [18] బిబిసి లోని తజ్పాల్ రాథోర్ ఐదు స్టార్లకు గాను నాలుగు ఇచ్చారు, అంతే కాకుండా, "16 వ శతాబ్దపు ప్రేమ కథ చాల కాలం క్రితమే మర్చిపోయినా, ఈ సినిమా తీసిన విధానము మన జ్ఞాపకాలలో ఎల్లప్పుడూ ఉంటుంది. -[...] ఇంత పెద్ద సినిమా కోసం సమయాన్ని వ్రుదాచేస్తున్నామని అనుకోకుండా ఈ కావ్యాన్ని తప్పక చూడండి."[19]

ది టైమ్స్ అఫ్ ఇండియా నిఖత్ కాజ్మి మూడు స్టార్లను ఇచ్చారు,, మరియు దీని గురించి చెప్తూ, "జోదా అక్బర్ బావుంది ఎందుకంటె దాని హృదయము సరిఐన చోట ఉంది.ఈ సినిమా, ప్రేమ అన్ని అడ్డంకుల్ని అతిక్రమించినట్టుగా చెప్పబడింది- లింగము, మతము, సంప్రదాయము- మరియు భారత దేశం కల ఏమంటే మతప్రమేయము లేకపోవటము ఇంకా ఓర్పు అనే ఈ రెండు గోపురాలు , ఇవి ఎప్పటికి కూలిపోవు.ఇంకా అక్బర్ మరియు జోదా ఈ కలకు ఆశలు రేకెత్తించే ప్రతినిధులు." కాజ్మి చెప్తూ, "చరిత్ర సరిగ్గా చూపించారా లేదా అనే విషయాన్ని వదిలేస్తే జోదా అక్బర్ మీకు నచ్చుతుంది."[20] మరియు సూచనలిస్తూ ఈ సినిమా "చాలా పెద్దది" ఇంకా ఇది " చరిత్ర పాటము కాదు", ది న్యూ యార్క్ టైమ్స్ నుండి రాచెల్ సాల్త్జ్ వివరిస్తూ, "Mr. గోవరికేర్ ఎంచుకొని చెప్పిన ఈ చక్రవర్తి కథ మరియు ముస్లిం-హిందూ ప్రేమ కథా ఖచ్చితముగా ఉంది. అక్బర్ చెప్పినట్టుగా,'ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవటం వల్ల భారతదేశం వ్రుద్దిచెందుతుంది.'"[21] హిందూస్తాన్ టైమ్స్లోని ఖాలిద్ మహమ్మద్ ఈ సినిమాకు రెండు స్టార్లు ఇచ్చారు.అతను సూచిస్తూ, " అశుతోష్ గోవరికేర్ ఎప్పుడు అన్ని వివరాలతో చక్కగా చేసే అతను, నచ్చినా నచ్చకపోయినా ఈ సినిమాకు మాత్రం సాంకేతికంగా మరియు ఆ కాలం భావోద్రేకాలను చూపించటంలో విఫలమైనాడు. ముఖ్యమైన వివరాలు పట్టించుకోలేదు ."[22]

అవార్డులు [23][మార్చు]

ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు[మార్చు]

స్టార్ స్క్రీన్ అవార్డులు[మార్చు]

స్టార్ డస్ట్ అవార్డులు[మార్చు]

ఐఐయఫ్ఎ అవార్డులు[మార్చు]

V శాంతారాం అవార్డులు[మార్చు]

[25]

అంతర్జాతీయం[మార్చు]

గోల్డెన్ మింబార్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ముస్లిం సినిమా (కజాన్, రష్యా)[26]
32nd São Paulo International Film Festival (Brazil, South America)[27]
ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డులు
 • సినిమాటోగ్రఫీలో సాధించినది, నామినేటెడ్ - కిరణ్ డిఒహన్స్
3 వ ఆసియన్ ఫిలిం అవార్డ్స్
 • ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ నామినేషన్- నితిన్ చంద్రకాంత్ దేశాయ్
 • ఉత్తమ కంపోజర్ - A. R.రెహమాన్

సంగీతం[మార్చు]

అధికారిక సౌండ్ ట్రాక్ ఐదు పాటలని ఇంకా రెండు ఇన్స్ట్ట్రుమెన్టెల్ ను కలిగి ఉంది. ఈ సంగీతాన్ని 2008 జనవరి 18 లో విడుదల చేశారు.

పాట పాడింది/పాడినవారు సమయం గమనిక
అజీం -ఓ -షాన్ శాహేన్ష మొహ్ద్. అస్లం, బోన్నీ చక్రబోర్తి& బృందం 5:54 హ్రితిక్ రోషన్ ఇంకా ఐశ్వర్య రాయ్ మీద తీశారు
జశ్న్ -ఎ -బహార జావేద్ అలీ 5:15 హ్రితిక్ రోషన్ ఇంకా ఐశ్వర్య రాయ్ మీద తీశారు
{౦ క్వాజా మేరె క్వాజా A.R.రహమాన్ (రచన : కషిఫ్) 6:56 హైదర్ అలీ[అమిన్ హాజీ ] [కరీం హాజీ ] హ్రితిక్ రోషన్ ఇంకా ఐశ్వర్య రాయ్ మీద తీశారు.
ఇన్ లంహోన్ కే దామన్ మే సోను నిగం& మధుశ్రీ 6:37 హ్రితిక్ రోషన్ ఇంకా ఐశ్వర్య రాయ్ మీద తీశారు
మన్ మోహన బేల శేండే 6:50 హ్రితిక్ రోషన్ ఇంకా ఐశ్వర్య రాయ్ మీద తీశారు
జశ్న్ -ఎ -బహరా ఇన్స్ట్ట్రుమెన్టెల్- ఫ్లూట్ 5:15 ఇన్స్ట్ట్రుమెన్టెల్
ఖ్వాజా మేరె ఖవాజా ఇన్స్ట్ట్రుమెన్టెల్ - ఒబోయి 2:53 ఇన్స్ట్ట్రుమెన్టెల్

సూచనలు /రేఫెరెన్సెస్[మార్చు]

 1. Business data for Jodhaa Akbar from IMDb
 2. "Box Office earnings in 2008". మూలం నుండి 2012-05-25 న ఆర్కైవు చేసారు. Cite web requires |website= (help)
 3. "January 25, 2008". IndiaFM. 2007-09-12. Retrieved 2008-01-09.
 4. "Jodhaa Akbar :: Official Website". Jodhaaakbar.com. మూలం నుండి 2009-05-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-10-27. Cite web requires |website= (help)
 5. "Jodhaa Akbar not being screened in Rajasthan". IndiaFM. 2008-02-16. Retrieved 2008-02-20.
 6. 6.0 6.1 6.2 Ashley D'Mello (2005-12-10). "Fact, myth blend in re-look at Akbar-Jodha Bai". The Times of India. Retrieved 2008-02-15. Cite news requires |newspaper= (help)
 7. Syed Firdaus Ashraf (2008-02-05). "Did Jodhabai really exist?". Rediff.com. Retrieved 2008-02-15. Cite web requires |website= (help)
 8. Atul Sethi (2007-06-24). "'Trade, not invasion brought Islam to India'". The Times of India. Retrieved 2008-02-15. Cite news requires |newspaper= (help)
 9. "UP bans screening of Jodhaa Akbar". NDTV. 2008-03-02. Retrieved 2008-03-02.
 10. "Court moved against ban on film". The Hindu. 2008-03-02. Retrieved 2008-03-02.
 11. "Supreme Court lifts ban on Jodhaa Akbar, for now". Reuters. 2008-03-03. Retrieved 2008-03-04.
 12. [javascript:void(0); Oneindia.in][dead link]
 13. "BoxOffice India.com". Boxofficeindia.com. మూలం నుండి 2012-07-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-10-27. Cite web requires |website= (help)
 14. "And the rest isn't history- Hindustan Times". Hindustantimes.com. మూలం నుండి 2013-01-03 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-10-27. Cite web requires |website= (help)
 15. "Film Critic Top Ten Lists: 2008 Critics' Picks". Metacritic. Retrieved 2009-04-25. Cite web requires |website= (help)
 16. Jodhaa Akbar @ Rotten Tomatoes
 17. Jodhaa Akbar
 18. Masand's Verdict: Jodhaa Akbar
 19. Jodhaa Akbar
 20. Jodhaa Akbar
 21. Rachel Saltz (Published: February 16, 2008). "Jodhaa Akbar - Movie - Review - The New York Times". Movies.nytimes.com. Retrieved 2008-10-27. Cite news requires |newspaper= (help); Check date values in: |date= (help)
 22. And the rest isn’t history
 23. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; IMDB అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 24. http://www.bollywoodhungama.com/features/2009/02/16/4855/index.html
 25. http://www.indiantelevision.com/aac/y2k8/aac796.php
 26. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; bollywoodhungama అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 27. "Jodhaa Akbar wins Audience Award at Sao Paulo International Film Fest". Business of Cinema. 2008-11-03. Unknown parameter |accesdsate= ignored (help); Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]