Jump to content

జోనాస్ గహర్ స్టోర్

వికీపీడియా నుండి
జోనాస్ గహర్ స్టోర్
2022 లో స్టోర్
నార్వే ప్రధానమంత్రి
Assumed office
2021 అక్టోబరు 14
చక్రవర్తిహెరాల్డ్ V
అంతకు ముందు వారుఎర్నా సోల్బెర్గ్
Leader of the Opposition
In office
2014 జూన్ 14 – 2021 అక్టోబరు 21
చక్రవర్తిహెరాల్డ్ V
ప్రధాన మంత్రిఎర్నా సోల్బెర్గ్
అంతకు ముందు వారుజెన్స్ స్టోల్టెన్‌బెర్గ్
తరువాత వారుఎర్నా సోల్బెర్గ్
లేబర్ పార్టీ (నార్వే)
Assumed office
2014 జూన్ 14
First DeputyHelga Pedersen
Hadia Tajik
Tonje Brenna
Second DeputyTrond Giske
Bjørnar Skjæran
Jan Christian Vestre
అంతకు ముందు వారుజెన్స్ స్టోల్టెన్‌బెర్గ్
వ్యక్తిగత వివరాలు
జననం (1960-08-25) 1960 ఆగస్టు 25 (age 64)
ఓస్లో, నార్వే
రాజకీయ పార్టీలేబర్ పార్టీ (నార్వే) (1995 నుండి)
ఇతర రాజకీయ
పదవులు
Conservative (before 1989)[1]
జీవిత భాగస్వామి
(m. 1988)
సంతానం3
కళాశాలRoyal Norwegian Naval Academy
Sciences Po
London School of Economics
సంతకం
Military service
Allegiance Norway
Branch/service Navy

జోనాస్ గహర్ స్టోర్ (జననం 25 ఆగస్టు 1960) నార్వేజియన్ రాజకీయ నాయకుడు, 2021 నుండి నార్వే ప్రధాన మంత్రి. ఆయన 2014 నుండి లేబరు పార్టీ నాయకుడిగా ఉన్నాడు. 2005 నుండి 2012 వరకు ప్రధాన మంత్రి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఆధ్వర్యంలో విదేశాంగ మంత్రిగా, 2012 నుండి 2013 వరకు ఆరోగ్య సంరక్షణ సేవల మంత్రిగా పనిచేశారు. స్టోర్ 2009 నుండి ఓస్లో స్టోర్టింగ్‌లో సభ్యుడు.

స్టోర్ ఓస్లోలో జన్మించాడు. వెస్ట్ ఎండ్ ఓస్లోలో పెరిగాడు. రాయల్ నార్వేజియన్ నావల్ అకాడమీలో నావికా అధికారి శిక్షణ పొందాడు. 1981 నుండి 1985 వరకు పారిస్‌లోని సైన్సెస్ పో లో పొలిటికల్ సైన్స్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అంతర్జాతీయ సంబంధాలను అభ్యసించాడు. పారిస్‌లో విద్యార్థిగా, సోవియట్ యూనియన్‌లోని యూదు తిరస్కారవాదులకు మద్దతు ఇచ్చే ప్రయత్నాలలో అతను చురుకుగా ఉన్నాడు. అతను 1989 నుండి 1997 వరకు ప్రధాన మంత్రి కార్యాలయంలో ప్రత్యేక సలహాదారుగా, డైరెక్టర్ జనరల్‌గా పనిచేశాడు. ప్రధాన మంత్రులు జాన్ సిస్, గ్రో హార్లెం బ్రండ్ట్‌ల్యాండ్, థోర్బ్‌జోర్న్ జాగ్లాండ్‌ల ఆధ్వర్యంలో పనిచేశాడు. అతను 1990 లలో బ్రండ్ట్‌ల్యాండ్ శిష్యుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆమె ప్రభావంతో 1995 లో లేబరు పార్టీ సభ్యుడిగా మారాడు. 1998 లో అతను బ్రండ్ట్‌ల్యాండ్‌ను అనుసరించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు వెళ్ళాడు. అక్కడ అతను ఆమెకు చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయ్యాడు. జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ మొదటి ప్రభుత్వంలో స్టోర్ ప్రధాన మంత్రి కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి, చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్నాడు; ప్రభుత్వం బ్రిటిష్ న్యూ లేబరు ప్రాజెక్ట్ నుండి ప్రేరణ పొందింది. తరువాత ఆయన 2003 నుండి 2005 వరకు నార్వేజియన్ రెడ్ క్రాస్ సెక్రటరీ జనరల్‌గా పనిచేశాడు. [2] తన రాజకీయ గురువులు బ్రండ్ట్‌ల్యాండ్, స్టోల్టెన్‌బర్గ్ లాగే, స్టోర్‌కు కూడా ఎక్కువగా లేబరు పార్టీకి చెందిన వ్యాపార-స్నేహపూర్వక రైట్‌వింగ్‌తో సంబంధాలు ఉన్నాయి. విదేశాంగ మంత్రిగా ఉన్న కాలంలో, ఆయన అనేకసార్లు మంత్రివర్గంలో అత్యంత ప్రజాదరణ పొందిన సభ్యుడిగా ఉంటూ, నార్వేజియన్లలో ప్రఖ్యాతి పొందాడు. [3]


2021 నార్వేజియన్ పార్లమెంటరీ ఎన్నికల్లో లేబరు పార్టీకి 1% తక్కువ ఓట్లు వచ్చి, ఒక సీటు కోల్పోయినప్పటికీ, మధ్య-వామ పక్షం మెజారిటీని గెలుచుకుంది. అతిపెద్ద పార్టీ నాయకుడిగా, ప్రధానమంత్రి పదవికి స్టోర్ స్పష్టమైన అభ్యర్థి. 2021 అక్టోబరు 12 న ఎర్నా సోల్బర్గ్, ఆమె ప్రభుత్వం రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత కింగ్ హెరాల్డ్ V, సెంటర్ పార్టీతో కలిసి మైనారిటీ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన స్టోర్‌ను ప్రధానమంత్రిగా నియమించారు. [4]

నేపథ్యం

[మార్చు]

కుటుంబం

[మార్చు]

ఓస్లోలో జన్మించిన స్టోర్, సంపన్న ఓడ బ్రోకర్ ఉల్ఫ్ జోనాస్ స్టోర్ (1925–2017), లైబ్రేరియన్ ఉన్ని గహర్ (1931–2021)ల కుమారుడు. అతను వెస్ట్ ఎండ్ ఓస్లోలోని రిస్ పరిసరాల్లో పెరిగాడు. స్టోర్ ఒక బహుళ-మిలియనీర్, దాదాపు NOK 60 million సంపద (2016లో సుమారు US$7.1M) అతని సొత్తు. [5] కుటుంబ సంస్థ ఫెమ్‌స్టోలో మేజర్‌ షేరు ఉంది. కుటుంబ సంపదలో ఎక్కువ భాగం 1977లో నార్వేజియన్ కంపెనీ జోతుల్‌ను అమ్మగా వచ్చినది. దీనిని అతని తల్లి తరపు తాత జోహన్నెస్ గహర్ నడిపేవారు.[6] స్టోర్ తాత ప్రముఖ జోనాస్ హెన్రీ స్టోర్, వ్యాపార కార్యనిర్వాహకుడు, పేలుడు పదార్థాల తయారీదారు. నార్స్క్ స్ప్రాంగ్‌స్టోఫిండస్ట్రీ కి CEO, ఛైర్మన్. స్టోర్ ముత్తాత పాల్ ఎడ్వర్ట్ స్టోర్ లెవాంజర్ నుండి కన్జర్వేటివ్ పార్టీ మేయర్, నార్వేజియన్ పార్లమెంట్ డిప్యూటీ సభ్యుడు. ఆ కుటుంబం 19వ శతాబ్దంలో ట్రాండెలాగ్‌లో సంపన్న రైతులు.[7]

1988 లో నార్వే చర్చిలో సామాజిక శాస్త్రవేత్త, మంత్రి అయిన మారిట్ స్లాగ్స్‌వోల్డ్‌ను స్టోర్ పెళ్ళి చేసుకున్నాడు. [8] వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు, వారు ఓస్లో వాల్డోర్ఫ్ పాఠశాలలో చదివారు. [9] [10] స్టోర్ ఒక క్రైస్తవుడు, స్టేట్‌ చర్చి సభ్యుడు. [11]

విద్య, ప్రారంభ వృత్తి

[మార్చు]

స్టోర్ ఓస్లోలోని బెర్గ్ స్కూల్‌లో చదివాడు, తర్వాత రాయల్ నార్వేజియన్ నావల్ అకాడమీలో నావికా అధికారి శిక్షణ పొందాడు. తరువాత పారిస్‌లోని సైన్సెస్ పోలో ఐదు సంవత్సరాలు పొలిటికల్ సైన్స్ చదివాడు. అతను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ కోసం చదవడం ప్రారంభించాడు గానీ కొన్ని వారాల తర్వాత మానేశాడు.

1986 లో స్టోర్ కొంతకాలం హార్వర్డ్ లా స్కూల్‌లో హార్వర్డ్ నెగోషియేషన్ ప్రాజెక్ట్‌లో టీచింగ్ ఫెలోగా ఉన్నారు.[12] 1986 నుండి 1989 వరకు అతను నార్వేజియన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో పరిశోధకుడిగా ఉంటూ, సామాజిక శాస్త్రవేత్త ఆండ్రియాస్ హాంప్‌ల్యాండ్, ఆర్థికవేత్త పీటర్ నోర్‌లతో కలిసి సీనేరియర్ 2000 ప్రాజెక్టుపై పనిచేశాడు.

ప్రజా పరిపాలనలో కెరీర్

[మార్చు]

1988 లో కన్జర్వేటివ్ పార్టీకి విదేశీ వ్యవహారాలపై రాజకీయ సలహాదారు పదవికి స్టోర్ దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి ఆ ఉద్యోగం ఇవ్వజూపారు గానీ ఆ తరువాత వెనక్కి తీసుకున్నారు.[13] 1989 లో స్టోర్, ప్రధాన మంత్రి గ్రో హార్లెం బ్రండ్ట్‌ల్యాండ్ కార్యాలయంలో ప్రత్యేక సలహాదారు అయ్యాడు.[13] బ్రండ్ట్‌ల్యాండ్ మార్గదర్శకత్వం అతన్ని 1995లో లేబరు పార్టీ సభ్యుడిగా మార్చడానికి ప్రేరేపించింది. ఆ సమయంలో అతను ప్రధాన మంత్రి కార్యాలయంలో డైరెక్టర్ జనరల్ ( ekspedisjonssjef ) కూడా అయ్యాడు. 1998 నుండి, ఆయన గ్రో హార్లెం బ్రండ్ట్‌ల్యాండ్ నాయకత్వంలో ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (చీఫ్ ఆఫ్ స్టాఫ్)గా పనిచేసాడు.

స్టోర్ 2002 నుండి 2003 వరకు ECON అనాలిసిస్ థింక్ ట్యాంక్‌కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, 2003 నుండి 2005 వరకు నార్వేజియన్ రెడ్‌క్రాస్ సెక్రటరీ జనరల్‌గా పనిచేసాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

చీఫ్ ఆఫ్ స్టాఫ్

[మార్చు]

2000 నుండి 2001 వరకు జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ మొదటి ప్రభుత్వంలో స్టోర్ ప్రధాన మంత్రి కార్యాలయంలో స్టేట్ సెక్రెటరీగా, చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసాడు. బ్రిటిష్ లేబరు పార్టీ న్యూ లేబరు ఎజెండా నుండి ప్రభుత్వం ప్రేరణ పొంది, నార్వేజియన్ చరిత్రలో అత్యంత విస్తృతమైన ప్రైవేటీకరణ చేసింది.[14][15]

విదేశాంగ మంత్రి

[మార్చు]
ఏప్రిల్ 2008లో నాటో సమ్మిట్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్‌తో స్టోర్, జెన్స్ స్టోల్టెన్‌బర్గ్

2005 పార్లమెంటరీ ఎన్నికల తర్వాత, స్టోర్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా నియమితుడై, 2012 వరకు ఆ పదవిలో పనిచేసాడు. ఆయన మంత్రివర్గంలో చేరినప్పుడు, ఆయన "వెస్ట్ ఎండ్ కార్యనిర్వాహకులు", స్టోల్టెన్‌బర్గ్ విశ్వాసుల బృందంలో భాగంగా భావించబడ్డారు. ఇది అతను కుడి వైపుకు జరగడాన్ని సూచిస్తుంది. [16] అయినప్పటికీ, స్టోల్టెన్‌బర్గ్ ప్రభుత్వంలో స్టోర్ అత్యంత ప్రజాదరణ పొందిన సభ్యుడని అనేక పోల్స్ చూపించాయి. [17] అయితే, 2010లో ఆయన, ఆరోగ్య మంత్రి అన్నే-గ్రేట్ స్ట్రోమ్-ఎరిచ్సెన్ ఆఫ్ఘన్ రాజకీయ నాయకుల నుండి ఖరీదైన రగ్గులను స్వీకరించడంతో ఆయన విమర్శలకు గురయ్యాడు.[18]

2006 లో 2006 లెబనాన్ యుద్ధంపై స్టోర్ ఆందోళన వ్యక్తం చేసాడు. ఇజ్రాయెల్ ప్రతిచర్యను "పూర్తిగా ఆమోదయోగ్యం కాదు" అని స్టోర్ అభివర్ణించాడు. దానిని "ప్రమాదకరమైన తీవ్రతరం"గా పేర్కొన్నాడు, అదే సమయంలో ఇజ్రాయెల్ సైనికులపై హిజ్బుల్లా దాడిని కూడా ఖండించాడు. [19]

2007-2008 ఆర్థిక సంక్షోభానికి ప్రతిస్పందనగా G20 ప్రభావం విస్తరించడాన్ని స్టోర్ విమర్శించారు, దీనిని "చట్టబద్ధత లేకపోవడం" అని అభివర్ణించాడు. దానిని వియన్నా కాంగ్రెస్‌తో పోల్చాడు.[20]

హత్యాయత్నాలు

[మార్చు]

2008 జనవరి 14 న ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో స్టోర్ బస చేసిన సెరెనా హోటల్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. నార్వేజియన్ జర్నలిస్ట్ కార్స్టెన్ థామస్సెన్ సహా ఆరుగురు మృతి చెందిన ఈ సంఘటనలో స్టోర్ గాయపడలేదు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ-మూన్ ఈ దాడికి లక్ష్యం స్టోర్ అని పేర్కొన్నాడు. కానీ ఈ వాదనను తాలిబాన్ ప్రతినిధి తిరస్కరించాడు. దాడి జరిగిన మరుసటి రోజు స్టోర్ తన మిగిలిన ఆఫ్ఘనిస్తాన్ పర్యటనను రద్దు చేసుకున్నాడు. [21]

2011 జూలై 22 న, ఆండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్ దాడుల ప్రధాన లక్ష్యాలలో స్టోర్ ఒకరు.[22]

ఆరోగ్య మంత్రి

[మార్చు]

2012 సెప్టెంబరు 21 న, జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తూ, స్టోర్‌ను ఆరోగ్య, సంరక్షణ సేవల మంత్రిత్వ శాఖ అధిపతిగా నియమించాడు. ఆయన తర్వాత ఎస్పెన్ బార్త్ ఐడే విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

పార్లమెంటు సభ్యుడు

[మార్చు]

2009 లో నార్వేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, స్టోర్ ఓస్లో నుండి ప్రాతినిధ్యం వహిస్తూ నార్వేజియన్ పార్లమెంటైన స్టోర్టింగెట్‌కు ఎన్నికయ్యారు. అప్పటి నుండి ఆయన మళ్ళీమళ్ళీ ఎన్నికౌతూ వచ్చాడు.

పార్లమెంటు సభ్యుడిగా స్టోర్, 2021 నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలలో ఒకరైన మరియా రెస్సాను నామినేట్ చేశాడు. [23] [24]

2014 జూన్ 14 న ఆయన నాటో సెక్రటరీ జనరల్‌గా నియమితుడైన జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ స్థానంలో లేబరు పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా అయ్యాడు. 2017 నార్వేజియన్ పార్లమెంటరీ ఎన్నికల్లో స్టోర్ పార్టీని నడిపించాడు, కానీ రెడ్-గ్రీన్ సంకీర్ణం మెజారిటీకి అవసరమైన 85 సీట్లకు నాలుగు సీట్ల తేడాతో ఓడిపోయింది. విజయాన్ని ఆయన పార్టీ తేలికగా తీసుకున్నందుకు విమర్శలు వచ్చాయి.[25]

2017 చివరలో పార్టీ డిప్యూటీ లీడర్ ట్రోండ్ గిస్కే తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని అనేక మంది మహిళలు ఆరోపించారు. ప్రారంభంలో, ఈ విషయంపై అంతర్గత చర్చ తర్వాత గిస్కే అలా ప్రవర్తించలేదని స్టోర్ పేర్కొన్నాడు. 2018 జనవరి ప్రారంభంలో, ఆరోపణల ఫలితంగా గిస్కే డిప్యూటీ లీడర్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే పార్టీ నుండి కూడా అతను లైంగిక దుష్ప్రవర్తన నియమాలను ఉల్లంఘించాడని కారణం ఇవ్వబడింది. [26] [27] గిస్కే వారసుడుగా బ్జోర్నార్ స్క్జారాన్ 2019 మార్చి 19 న నామినేటయ్యాడు. నామినేషన్ తర్వాత స్టోర్, స్క్జారన్‌ను ప్రశంసించాడు, అతను ఉత్తరాది నుండి స్పష్టమైన స్వరం అవుతాడని చెప్పాడు.[28]

2021 నార్వేజియన్ పార్లమెంటరీ ఎన్నికల్లో స్టోర్ పార్టీని నడిపించాడు, ఈసారి ఎరుపు-ఆకుపచ్చ సంకీర్ణానికి 89 సీట్లతో (మెజారిటీకి 85 సీట్లు అవసరం) మెజారిటీని సాధించి, ప్రస్తుత ప్రధాన మంత్రి ఎర్నా సోల్బర్గ్ నేతృత్వంలోని నీలం-నీలం సంకీర్ణాన్ని ఓడించాడు.[29] సోషలిస్ట్ లెఫ్ట్ పార్టీతో కలిసి పనిచేయడానికి సెంటర్ పార్టీ ఓపెన్ అయిన తర్వాత, సెప్టెంబరు 23న హర్దాల్‌లో ప్రభుత్వ పూర్వ చర్చలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబరు 29 న పెట్రోలియం, సంక్షేమం వంటి అంశాలపై భిన్నాభిప్రాయాలను పేర్కొంటూ, సోషలిస్ట్ లెఫ్ట్ పార్టీ చర్చల నుండి వైదొలిగింది. స్టోర్ నిరాశ వ్యక్తం చేస్తూ, వేరే ఫలితం వస్తుందని ఆశించానని, కానీ పార్టీ నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని అన్నారు.[30][31] లేబరు పార్టీ, సెంటర్ పార్టీ అదే రోజు తరువాత ప్రభుత్వ చర్చలు ప్రారంభించాయి. [32] అక్టోబరు 8న, స్టోర్, వేడుమ్ కొత్త ప్రభుత్వ వేదికను అక్టోబరు 13న సమర్పిస్తామని, ఆ మరుసటి రోజు, అక్టోబరు 14న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.[33] ఎవా క్రిస్టిన్ హాన్సెన్ లేబరు పార్టీ స్టోర్టింగ్ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయిన తర్వాత, స్టోర్ అక్టోబరు 9న స్టోర్టింగ్‌లో ప్రతిపాదనను సమర్పించారు. ఆమె ఎన్నికను నిర్ధారించడానికి ఓటు వ్రాతపూర్వకంగా జరిగింది. హాన్సెన్ కు అనుకూలంగా 160 ఓట్లు రాగా, 8 మంది గైర్హాజరయ్యారు.[34]

ప్రధానమంత్రి (2021–ప్రస్తుతం)

[మార్చు]
2022 జనవరిలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జేక్ సుల్లివన్‌లతో స్టోర్
2022 మేలో ఫిన్నిష్ ప్రధాన మంత్రి సన్నా మారిన్‌తో స్టోర్

సెప్టెంబర్‌లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో తన పార్టీ విజయం సాధించిన తర్వాత, స్టోర్ 2021 అక్టోబరు 14న ప్రధానమంత్రిగా నియమితుడయ్యాడు. ఆయన లేబరు పార్టీ, సెంటర్ పార్టీలతో కలిసి మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. 2025 జనవరి చివరిలో సెంటర్ పార్టీ ప్రభుత్వం నుండి వైదొలిగింది. దాంతో 25 సంవత్సరాలలో మొదటి లేబరు మైనారిటీ ప్రభుత్వానికి స్టోర్ నాయకత్వం వహించాడు.[35][36]



రాజకీయ పదవులు

[మార్చు]

తన రాజకీయ గురువులు గ్రో హార్లెం బ్రుండ్ట్‌ల్యాండ్, జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ లాగానే, స్టోర్ కూడా లేబరు పార్టీకి చెందిన వ్యాపార-మిత్ర, కుడి-వామ పక్షాలతో సంబంధాలున్నాయి.[16]

విదేశాంగ విధానం

[మార్చు]

మధ్యప్రాచ్య ప్రాంతం

[మార్చు]

స్టోర్ విదేశాంగ మంత్రిగా ఉన్న కాలంలో, పాలస్తీనా ప్రభుత్వాన్ని గుర్తించిన పాశ్చాత్య ప్రపంచంలోని మొదటి ప్రభుత్వాలలో నార్వే ఒకటి.[37] 2011 లో స్టోర్ హమాస్ నాయకుడు ఖలీద్ మెషాల్ తో ప్రత్యక్ష సంబంధంలో ఉన్నాడని తెలిసింది. [38] [39] [40] [41] [42] మాజీ కన్జర్వేటివ్ ప్రధాన మంత్రి కోరే విల్లోచ్ కూడా హమాస్‌తో సంభాషణ ముఖ్యమని నొక్కి చెప్పారు.[43] గాజా స్ట్రిప్‌లో మాడ్స్ గిల్బర్ట్, ఎరిక్ ఫోస్సే చేసిన మానవతావాద కృషిని స్టోర్ ప్రశంసించాడు. స్టోర్, మాజీ కన్జర్వేటివ్ ప్రధాన మంత్రి కోరే విల్లోచ్ ఇద్దరూ తమ ఐస్ ఇన్ గాజా ఆన్ ది గాజా వార్ అనే పుస్తకానికి ఎండార్స్‌మెంట్‌లు రాశారు. గిల్బర్ట్, ఫోస్సేలు "గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారు. అణగారిన వారికి సహాయం చేయడం ద్వారా ఉత్తమ వైద్య సంప్రదాయాలకు అనుగుణంగా వ్యవహరించారు" అని స్టోర్ రాశారు. [44] [45] అంతర్జాతీయ చట్టానికి విరుద్ధంగా పాలస్తీనా భూమిని ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని స్టోర్ ఖండించాడు. [46] 2015లో, లేబరు ప్రభుత్వం పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తిస్తుందని స్టోర్ చెప్పాడు.[47]

చైనా

[మార్చు]

బీజింగ్‌తో నార్వే వ్యాపార సంబంధాన్ని దెబ్బతీస్తుందనే భయంతో, 2010 లో చైనా అసమ్మతివాది లియు జియాబోకు నార్వేజియన్ నోబెల్ కమిటీ బహుమతిని ప్రదానం చేయకుండా నిరోధించడానికి ప్రయత్నించినందుకు, నోబెల్ బహుమతి కమిటీ కార్యదర్శి గీర్ లుండెస్టాడ్ 2015 BBC ఇంటర్వ్యూలో స్టోర్‌ను విమర్శించాడు. మాజీ ప్రధాని థోర్బ్జోర్న్ జాగ్లాండ్ అధ్యక్షతన నోబెల్ కమిటీ ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా లియును గౌరవించింది.[48] తదనంతరం, ఈ అవార్డుపై చైనాకు క్షమాపణ చెప్పడానికి స్టోర్ నిరాకరించాడు.[49]

లిబియా

[మార్చు]

విదేశాంగ మంత్రిగా, 2011లో లిబియాలో నాటో నేతృత్వంలోని సైనిక జోక్యంలో నార్వే భాగస్వామ్యాన్ని స్టోర్ పర్యవేక్షించారు. ఈ జోక్యంలో నార్వే పాల్గొనడం తీవ్ర వామపక్షాలలో వివాదాస్పదమైంది. కమ్యూనిస్ట్ పార్టీ రెడ్ అతనిపై యుద్ధ నేరాల ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. [50]

విమర్శ

[మార్చు]

2017 ఆగస్టులో స్టోర్, తన హాలిడే హోమ్‌లో పని చేయడానికి నియమించబడిన భవన నిర్మాణ సంస్థలోని కార్మికులు పన్నులు లేదా VAT చెల్లించలేదని వెల్లడైన సందర్భంలో విమర్శలు ఎదుర్కొన్నాడు. [51] [52] [53] [54]

ఇతర కార్యకలాపాలు

[మార్చు]

ఆయన ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ కు ట్రస్టీల బోర్డు సభ్యుడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Hasselgård, Maria; Ginés, Patricia (17 September 2008). "Støre var Høyre-mann" [Støre was a Conservative man]. NRK (in నార్వేజియన్ బొక్మాల్). Retrieved 5 May 2024.
  2. Støre, Jonas Gahr ( 1960- ) Stortinget.no. Retrieved 7 November 2013. (in Norwegian)
  3. "Slik var Støres sju år som utenriksminister". TV2. Retrieved 15 September 2021.
  4. "Norge har fått ny regjering" (in Norwegian). NRK. 14 October 2021. Retrieved 14 October 2021.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  5. "Erna tjener mest og er rikest i regjeringen". 14 October 2016.
  6. "Slik ble Ap-leder Jonas Gahr Støre søkkrik". Nettavisen. Retrieved 13 September 2021.
  7. "Støre, Paul Edvart". Levanger kommune. Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.
  8. "Norges neste førstedame – nå er hun prest" [Norway's next first lady – now she is a minister]. Nettavisen. Retrieved 19 September 2021.
  9. Moen, Elisabeth Skarsbø. "Støres verdivalg". VG. Retrieved 14 September 2021.
  10. "Langer ut mot kronprinsparets privatskolevalg". TV2. Retrieved 15 September 2021.
  11. "– Vi er ikke alene". 28 September 2009. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 24 ఏప్రిల్ 2025.
  12. "Jonas Gahr Støre" (PDF). European Parliament. Retrieved 14 September 2021.
  13. 13.0 13.1 "Jonas Gahr Støre var Høyre-mann". 17 September 2008. Archived from the original on 30 September 2017. Retrieved 12 April 2012.
  14. "Har solgt ut mest". Aftenposten. Retrieved 14 September 2021.
  15. "Jagland mener Ap nå slår inn på en riktig politisk linje: Mer stat og styring". Aftenposten. 28 October 2020.
  16. 16.0 16.1 "Jens måtte droppe"direktørvennene"". Dagsavisen. Retrieved 14 September 2021. På rekke og rad advarte talerne Jens Stoltenberg mot å velge «blåruss» og «vestkantdirektører» som ikke hadde deltatt i valgkampen og partiarbeidet. Kritikken var rettet mot Grete Faremo Hanne Harlem og Jonas Gahr Støre og den bunnet i en frykt for at de skulle lede partiets kurs til høyre."Jens måtte droppe"direktørvennene"".
  17. "Jonas fortsatt best likt". 4 June 2010.
  18. Lars Nord; Gunn Enli; Elisabeth Stúr (2012). "Pundits and Political Scandals". In Sigurd Allern; Ester Pollack (eds.). Scandalous!: The Mediated Construction of Political Scandals in Four Nordic Countries. Gothenburg: Nordicom, University of Gothenburg. pp. 93–94. ISBN 978-91-86523-27-5.
  19. Norway condemns Israeli attacks on Lebanon Archived 29 జూన్ 2011 at the Wayback Machine
  20. Tooze, Adam (2018). Crashed: How a Decade of Financial Crises Changed the World. New York, New York: Viking. ISBN 978-0-670-02493-3. OCLC 1039188461.
  21. VG: Støre trolig hjem til Norge etter terrorangrepet, published 14 January 2008 (in Norwegian)
  22. Line Brustad (18 November 2011). "Breiviks hovedmål: Gro, Jonas og Eskil". Dagbladet (in నార్వేజియన్). Retrieved 23 February 2013.
  23. "Hektisk nomineringsaktivitet før fredsprisfrist". Dagsavisen. 31 January 2021.
  24. "Støre nominerte Ressa: – Jeg blir berørt av mennesker med så stort mot". NRK. Retrieved 9 October 2021.
  25. "Ni ting du bør vite om stortingsvalget 2017" (in Norwegian). Aftenposten. 12 September 2017. Retrieved 14 September 2021.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  26. "Støre: Giske har opptrådt på kritikkverdig måte" (in Norwegian). NRK. 21 December 2017. Retrieved 14 September 2021.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  27. "Anniken Huitfeldt (Ap): – Det jeg trodde var hersketeknikker, ser jeg nå at var seksuell trakassering" (in Norwegian). VG. 1 January 2018. Retrieved 14 September 2021.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  28. "Skjæran blir ny Ap-nestleder. En sterk og klar stemme fra nord" (in Norwegian). NRK Nordland. 19 March 2019. Retrieved 4 September 2021.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  29. "Slik stemte vi – spesial" (in Norwegian). NRK. 14 September 2021. Retrieved 14 September 2021.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  30. "Støre: Regjeringssonderinger starter torsdag på Hurdalsjøen Hotell" (in Norwegian). Vårt Land. 20 September 2021. Retrieved 29 September 2021.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  31. "SV bryter sonderingene på Hurdal: − Stor skuffelse" (in Norwegian). VG. 29 September 2021. Retrieved 29 September 2021.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  32. "Ap og Sp går i regjeringsforhandlinger: − Nå utvider jeg alfabetet" (in Norwegian). VG. 29 September 2021. Retrieved 29 September 2021.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  33. "Støre: – Vi er enige om å danne regjering" (in Norwegian). NRK. 8 October 2021. Retrieved 8 October 2021.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  34. "Eva Kristin (48) er vår nye stortingspresident" (in Norwegian). NRK. 9 October 2021. Retrieved 9 October 2021.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  35. Litland, Karoline Johannessen; Skårdalsmo, Kristian; Rønning, Mats; Svaar, Peter (30 January 2025). "Ap og Sp enige om regjeringsbrudd" (in నార్వేజియన్ బొక్మాల్). NRK. Retrieved 30 January 2025.
  36. Skårdalsmo, Kristian; Rønning, Mats; Tomter, Line; Hjetland, Geir Bjarte; Grasmo, Julie (4 February 2025). "Nye statsråder: Stenseng inn i regjering – Skjæran får toppjobb på Stortinget" (in నార్వేజియన్ బొక్మాల్). NRK. Retrieved 4 February 2025.
  37. "Støre har bestemt seg om Palestina". Dagsavisen. Retrieved 15 September 2021.
  38. "Støre innrømmer direkte kontakt med Hamas-leder". 27 January 2011.
  39. "Snakket direkte med Hamas-leder". 27 January 2011.
  40. "Støre har hatt hemmelige samtaler med Hamas". 27 January 2011.
  41. "Støre har hatt hemmelige samtaler med Hamas". 27 January 2011.
  42. "Støre talked with Hamas' leader". Newsinenglish.no. 28 January 2011. Retrieved 21 August 2022.
  43. Spence, Thomas (16 May 2006). "Jeg taler med hvem jeg vil". Aftenposten (in నార్వేజియన్). Archived from the original on 7 November 2008. Retrieved 28 May 2009.
  44. Støre: – Legeutspill en skamplett 9 January 2009, VG (in Norwegian)
  45. "Refser Jensens Gilbert-kritikk" (in నార్వేజియన్). 8 January 2009. Retrieved 17 January 2009.
  46. "Støre angriper Trumps kursendring overfor Israel: "Historisk urett av USA"". Nettavisen. Retrieved 15 September 2021.
  47. "Ap vil anerkjenne palestinsk stat". Aftenposten. Retrieved 15 September 2021.
  48. "Nobel secretary regrets Obama peace prize". BBC News. 17 September 2015.
  49. "Støre: Uaktuelt å beklage overfor Kina". E24. Retrieved 15 September 2021.
  50. "Anmelder Jens, Jonas og Grete for krigsforbrytelser". Nettavisen. Retrieved 15 September 2021.
  51. "Jonas Gahr Støre's cabin-dock was fixed by workers who paid no tax or VAT". 23 August 2017.
  52. "Finansavisen: Jobbet svart på Jonas Gahr Støres brygge". 22 August 2017. Archived from the original on 20 సెప్టెంబర్ 2019. Retrieved 24 ఏప్రిల్ 2025. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  53. "Arbeidere jobbet svart på Støres brygge". 22 August 2017.
  54. "Slik forklarer Støre brygge-saken". 23 August 2017.